barampuram
-
తెలుగు–ఒడియా అనువాద వారధి
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు. ‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) – పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు -
కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’
తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది. అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు. ‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది. ‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. ‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్’ (హిందీ అనువాదం), ఇన్నర్ విజన్ (ఇంగ్లిష్ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్ అనువాదం ‘విండ్స్ ఆర్ అలైవ్’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి. – పన్యాల జగన్నాథ దాసు, సీనియర్ జర్నలిస్ట్ -
లాడ్జ్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముగ్గురు యువతులు, 12మంది..
ఒడిశా(బరంపురం): నగరంలో గత కొద్ది రోజులుగా రహస్యంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను ఎస్పీ శరవన్ వివేక్ భగ్నం చేశారు. దీనిని నిర్వహిస్తున్న కేంద్రంపై ఆయనే స్వయంగా మఫ్టీలో దాడి చేయడంతో ముగ్గురు యువతులతో 12మంది విటులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం బరంపురం పోలీసు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి తానే స్వయంగా మఫ్టీలో బుల్లెట్‌పై బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బరంపురం టాటా బెంజ్ జంక్షన్లో ఉన్న తులసీ గెస్ట్‌హౌస్(లాడ్జి) వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నరు. నిందితులను మంగళవారం బరంపురం సబ్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వివరించారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..) -
న్యాయ పోరాటం! .. గ్రామంలో 144 సెక్షన్..
బరంపురం (ఒడిశా): యువతి తపస్విని దాస్, వైద్యుడు సుమిత్ సాహుల వివాహబంధం రోజురోజుకూ జటిలమవుతోంది. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంట్లో కొంతకాలం కలసిమెలసి జీవించారు. ఉన్నట్టుండి తపస్వినిని ఉన్నచోటనే ఉంచి సుమిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భర్త రాక కోసం కొన్నాళ్ల పాటు వేచి చూసినా ఆమెకు నిరాశ తప్పలేదు. దీంతో మోసం చేశాడని భావించిన యువతి, బరంపురంలోని బ్రాహ్మనగర్ రెండో లైన్‌లోని భర్త ఇంటిని చేరుకుని ధర్నాకి దిగింది. తన భర్త తనకు కావాలని అభ్యర్థిస్తూ పెళ్లి బట్టలతో నిరసన చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బాధితురాలు కోర్టుని ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల విచారణ చేపట్టిన బరంపురం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టు భార్యతో కలిసి ఉండాలని సుమిత్‌ని ఆదేశించింది. వారి వైవాహిక జీవితంలో వేరొకరు జోక్యం చేసుకోరాదని, భార్యాభర్తలిద్దరూ వేరేచోట ఒకే ఇంట్లో కలిసి ఉండాలని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు సుమిత్ భార్యతో కలిసి ఉండేందుకు అంగీకరించాడు. చదవండి: (ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..) గ్రామంలో 144 సెక్షన్.. మళ్లీ 6 రోజుల క్రితం భార్యని వదిలి సుమిత్ వెళ్లిపోవడంతో యువతి తన అత్తవారింటి ఎదుట మళ్లీ నిరసనకు దిగింది. తీవ్రమైన చలిలో వంటా వార్పు అక్కడే చేసుకుని, ఉంటున్న ఆమె పడుతున్న కష్టం చూసి, స్థానికులు చలించిపోయారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా సుమిత్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఇంటి ప్రధాన గేటు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఉన్న వారితో ఘర్షణకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె వెంట ఉంటామని హెచ్చరించారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. -
ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై..
బరంపురం (ఒడిశా): కోర్టు తీర్పుతో తపస్విని దాస్, సుమిత్ సాహు జంట కలిసింది. వైద్యుడైన సుమిత్ ప్రేమ పేరుతో తపస్వినిని వంచించి, ఆపై కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి జరిగిన 7 నెలలకే భార్యని విడిచిపెట్టి సుమిత్ పరారయ్యాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం స్థానిక బ్రహ్మనగర్ రెండో లైన్‌లోని తన అత్త వారింటి ఎదుట ధర్నా చేపట్టింది. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) బరంపురం ఎస్డీజేఎం కోర్టు నుంచి భార్య తపసిని దాస్‌తో కలిసి కారులో వెళ్తున్న సుమిత్ ఈ క్రమంలో బాధితురాలికి స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలిచి, కోర్టులో కేసు వేయించారు. వీరి కేసు విచారణను శుక్రవారం చేపట్టిన బరంపురం ఎస్డీజేఎం(సబ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) కోర్టు తపస్వినికి అనుకూలంగా తీర్పునిస్తూ భార్యతోనే భర్త కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. అస్కా పట్టణంలో వేరే ఇంటిని అద్దెకు తీసుకుని నూతన దంపతులు జీవించాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలో వారిని ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు ఎవ్వరూ కలవరాదని కోర్టు కోరింది. చదవండి: (చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..) -
మీడియాతో ఎస్పీ మాట్లాడుతుండగా... ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఎస్పీ కార్యాలయంలో 12 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న విలేకరి స్వధీన్ పండా పామును గుర్తించి అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం కిరండమల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
ఉద్దానం మామిడి రుచి చూశారా? యమ టేస్టీ
కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి. ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్లోడింగ్ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా ఇదే పంథా.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. - పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం ముందు శాంపిల్ తీసుకెళతాం చిక్కాఫ్ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్‌లో లోడ్ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. - ఆరంగి శివాజీ, చిక్కాఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కవిటి మండలం -
లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్
బరంపురం: నగరంలో లాక్డౌన్, షడ్‌డౌన్‌లతో పాటు నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. గత పది రోజులుగా సుమారు 2వేలకు పైగా మోటార్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 832 మందిపై కేసులు నోమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు ఎస్డీపీఓ బిష్ణుప్రసాద్ పాత్రో తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.41 వేల జరిమానా.. రాయగడ: కరోనా నియంత్రణలో భాగంగా అమలు చేస్తున్న వారాంతపు షట్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కల్యాణసింగుపూర్ పోలీసులు కొరడా ఝులిపించారు. ఐఐసీ సుకుమా హంసద్ ఆధ్వర్యంలో పోలీసులు కల్యాణసింగుపూర్‌లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.41వేలు జరిమానా విధించినట్లు ఐఐసీ అధికారి తెలిపారు. ఏఎస్ఐ డీకే సాహు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. -
ఖైదీలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి
బరంపురం: ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్న వారిని సైతం కోవిడ్ మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నగరంలోని సర్కిల్ జైలులో ఉంటున్న ఖైదీలు ఒక్కొక్కరిగా వైరస్ బారినపడుతున్నారు. దీనంతటికీ కారణం ఈ జైలులో పరిమితికి మించి అధిక సంఖ్యలో ఖైదీలు ఉండడమే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడి జైలులో 743 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 941 మంది ఖైదీలు ఉండడం విశేషం. దీంతో ఒకేగదిలో ఎక్కువ మంది ఖైదీలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కరోనా నిబంధనలు ఉల్లంఘనకు గురవడం జరుగుతోంది. ఇటీవల జైలులోని దాదాపు 47 మంది ఖైదీలు కరోనా బారినపడి, చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ విచారణ ఖైదీ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలోని కోవిడ్ కేర్ సెంటర్‌కి తరలించి, చికిత్స అందజేస్తున్నారు. మిగతా 46 మంది బాధిత ఖైదీలను అదే జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇక్కడి ఖైదీలను వేరేచోట జైలుకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ విషయమై రాష్ట్ర జైలు శాఖకి పలుమార్లు లేఖలు కూడా రాశామని జైలర్ సత్యనారాయణ తెలిపారు. ఇటీవల ఇక్కడి నుంచి గజపతి జిల్లాలోని పర్లాకిమిడి సబ్ జైలుకి ఇద్దరు ఖైదీలను కూడా తరలించామని ఆయన పేర్కొన్నారు. చదవండి: మందుబాబులకు శుభవార్త: ఆర్డర్ పెట్టు.. మందు పట్టు చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత
బరంపురం: కరోనాతో కళింగ దర్పన్ టీవీ చానల్ ఎండీ బిష్ణు ప్రసాద్ సాహు (48) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట వైరస్ బారినపడిన ఈయన చికిత్స నిమిత్తం టాటా కోవిడ్ కేర్ సెంటర్లో చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రతిదిన్, ఒడిశా భాస్కర్ వంటి దినపత్రికల్లో రిపోర్టర్‌గా పనిచేసిన ఆయన సరిగ్గా మూడేళ్ల కిందట బరంపురం నగరంలో కళింగ దర్పన్ పేరిట టీవి చానల్ ప్రారంభించి, పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన మృతి పట్ల గంజాం, బరంపురం ప్రాంతాల జర్నలిస్టులు తమ సంతాపం ప్రకటించారు. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
చేప గాలానికి.. 22 అడుగుల ‘తిమింగలం’
బరంపురం: పనికిరాని వ్యర్థ వస్తువులతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి బరంపురం ఐటీఐ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ 22 అడుగుల తిమింగలం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ రజత్ కుమార్ పాణిగ్రహి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో ఐటీఐ కళాశాలలో చదువుతున్న ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లకు చెందిన 25 మంది విద్యార్థులు 40 రోజుల పాటు శ్రమించి వ్యర్థ పదార్థాలతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. ఇది సుమారు 400 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విద్యార్థులు 70 అడుగుల గిటార్‌ను తయారు చేసి అసియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ చేప గాలానికి చిక్కిన 22 అడుగుల తిమింగలం ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ నేపథ్యంలో బరంపురం ఐటీఐ విద్యార్థులకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తప్పక స్థానం దక్కుతుందని ప్రిన్సిపాల్ రజత్ పాణిగ్రహి ఆశాభావం వెలిబుచ్చారు. -
నకిలీ జర్నలిస్టుల అరెస్ట్
బరంపురం : జర్నలిస్టుల పేరిట పలు మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సదర్ పోలీస్‌స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గంజాం జిల్లాలోని బల్లిపడలో ఉన్న సరస్వతి శిశు మందిర్ విద్యాలయాన్ని శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారులో చేరుకుని, పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, ఫొటోలు తీశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు కావాలి్సన కనీస సదుపాయాలు లేవని, పాఠశాల యాజమాన్యాన్ని బెదిరించారు. తామంతా ఎంబీసీ టీవీ చానల్‌కు చెందిన జర్నలిస్టులమని, మీ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని, ఆ విషయాన్ని వార్తల్లో ప్రసారం చేయకుండా ఉండాలంటే, తమకు కొంత డబ్బును లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై స్పందించిన పాఠశాల యాజమాన్యం ఎదురుదాడికి దిగి, జరిగిన సంఘటనపై సదర్ పోలీసులకు సమాచారమిచి్చంది. ఇదే విషయంపై స్పందించిన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. దీంతో వారంతా నకిలీ జర్నలిస్టులుగా తేలడంతో వారితో పాటు కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అనంతరం వారి వినియోగిస్తున్న పలు మీడియా పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అరెస్టయిన వారిలో బరంపురం నగరానికి చెందిన దీపక్ బడిప్యా, సునీల్ పొడియారి, తపన్ పట్నాయక్, డ్రైవరు డి.నాగేశ్వర్ ఉన్నట్లు ఐఐసీ అధికారి తెలిపారు. -
క్షణ క్షణం.. భయం భయం
బరంపురం: అభం శుభం ఎరుగని గిరిపుత్రులు పత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో హయిగా బతికే అవకాశం రోజు రోజుకూ సన్నగిల్లుతుంది. ప్రతిక్షణం ఆందోళన, అనుక్షణం ఆవేదనతో గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్ధు అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన గ్రామాలు అట్టుడుకుతున్నాయి. పోలీసులు, మావోయిస్టులు తమకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ‘ఏ జన్మలో ఏ పాపం చేసామో.. ఇప్పుడిలా నరకం అనుభవిస్తున్నా’మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొందమాల్ జిల్లాను ఆనుకొని మావోయిస్టుల బృందం నయగడా జిల్లా అటవీశాఖ కార్యలయంలో చొరబడి.. ఆయుధాలు దోచుకున్నారు. అలాగే 18న కొందమాల్ జిల్లాలో జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్‌కి కొద్ది గంటల ముందు పిరింగియాలో అధికారుల వాహనాలను పేల్చివేశారు. ఈ ఘటన నుంచి కోలుకునే లోపే అదే రోజు సాయంత్రం గచ్చపడా పోలీసు స్టేషన్ పరిధిలోని బోరలా గ్రామంలో పోలింగ్ సూపర్ వైజర్‌గా ఉన్న సంజుక్త దిగల్ను తుపాకీతో కాల్చిచంపారు. పక్కా సమాచారంతో! మావోయిస్టుల వరుస ఘటనలతో రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొందమాల్, గజపతి, గంజాం జిల్లాల సరిహద్ధులు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సాయంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక గిరిజనులు భయంతో తల్లడిల్లి పోతున్నారు. కొందమాల్ జిల్లా దరింగబడి బ్లాక్ బమ్మునిగాం పోలీస్ స్టేషన్ పరిధి తిరుబడి అటవీ ప్రాంతం, గంజాం జిల్లా సరిహద్ధు మోహన, గుమ్మ, గంజాం–కొందమాల్ జిల్లా సరిహద్ధులైన ముజగర్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతమైన గస్మా అరణ్య ప్రాంతాల్లో ఛతీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో బీహార్‌కు చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు తిష్ట వేసి, ప్లీనరీలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కొద్ది రోజుల క్రితం దక్షణాంచల్ ఐజీ జితేంద్రకోయల్ ఆదేశాలతో గంజాం ఎస్పీ బ్రాజేష్కుమార్ రాయ్, కొందమాల్ ఎస్పీ ప్రతీక్‌సింగ్ సంయుక్తంగా నిర్వసిస్తున్న ఈ కూంబింగ్‌లో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ, కోబ్రా కమాండర్లు మావోయిస్టులను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందమాల్ జిల్లా గిరిజనులను సాక్షి ప్రతినిధి కలిశారు. వారి కన్నీటి వెతలకు అక్షర రూపమే ఈ ప్రత్యేక ‘సాక్షి’ కథనం... గంజాం, కొందమాల్ జిల్లాల్లో తిరుబడి, గస్మా, ముజగర్ పానిగొండా అటవీ ప్రాంతం గంజాం, కొందమాల్ జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం 4 ఫారెస్ట్ అరణ్య ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. నక్సలైట్లు అరణ్య ప్రాంతాల్లో ప్లినరీలు నిర్వహిస్తున్న సమాచారంతో గతవారం నుంచి పోలీసులు, సీఆర్పీ బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో దరింగబడి, తిరుబడి, కిటింగియా, రైకియా, దసింగియా, పనిగొండా, మోహన, గుమ్మా, ముజగర్, గస్మా ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు భయంతో వణుకుతున్నారు. కొనసాగుతున్న కూంబింగ్ వల్ల ఈ భయం మరింత పెరిగిపోయింది. ఇలా సరిహద్ధుల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కొందమాల్ జిల్లాలో దట్టమైన ప్రాంతాలైన దరింగబడి బ్లాక్ తిరుబడి, గస్మా, ముజగర్కు మెల్లమెల్లగా బలగాలు చేరుతూ... మావోయిస్టులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో పోలీసులు ఏజెన్సీ కేంద్రాల్లో కట్టుదిట్టంగా కూంబింగ్ చేయాలని ఉన్నతాధికార్లు అదేశించినట్లు తెలిస్తుంది. మావోయిస్టులపై పోలీస్‌లు ముప్పేట దాడులు జరిపే సమయం లేదన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాని దుర్గంగా మార్చుకున్న విధంగా గత 2 ఏళ్లుగా కొందమాల్ జిల్లాని కూడా మావోయిస్టులు అక్రమించుకొని, దాడులు జరిపి.. తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఒకవైపు కొనసాగుతున్న కూంబింగ్‌తో మరోవైపు రక్షిత జోన్లలో తలదాచుకుంటున్న మావోయిస్టుల అగ్రనాయకులు పోలీసు వ్యూహాలను తిప్పికొట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య యుద్ధ పాతిపదక వాతావరణంలో మార్పులు తీసుకు రావల్సి వచ్చింది. అల్లాడుతున్న గరిపుత్రులు గంజాం, కొందమాల్ జిల్లా పరిధిలోని కటింగియా, పాణిగొండా, తిరుబడి, దాసింగి, మోనా, అడవా గిరిజన ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే గరిపుత్రులు బతుకే నరకంగా భావిస్తున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని భయపడుతూ జీవిస్తున్నారు. గ్రామాలు దాటి బయటికి వస్తే తరిగి క్షేమంగా ఇంటికి వేళ్లలేమనే భయంతో ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వారం రోజులుగా ఇక్కడ గిరిజన గ్రామాల్లో గిరిపుత్రుల పరిస్థతి దయానీయంగా ఉంది. పోలీసులు ఇప్పటికే తిరుబడి గిరిజనుల ఇళ్లకు వచ్చి మావోయిస్టుల ఆచూకీ కోసం పదే పదే వేధిస్తున్నారని చెబుతున్నారు. తమకు ఏమీ తెలియదన్నా వినడం లేదని, తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆదివాసీలు తమ అవేదని వ్యక్తం చేస్తున్నారు. దాడులు ఎక్కువయ్యాయి కొందమాల్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. వారికి పటున్న ప్రాంతాల్లో విజయం సాధించడం కష్టమే. ఏ సమయంలోనూ ఉద్యమాన్ని తక్కువగా అంచనా వేయలేం. మరోవైపు మావోస్టుల దాడులు, పోలీసుల కూంబింగ్ వల్ల గిరిజనులు ఎక్కువగా నష్టపోతున్నారు. శాంతి చర్చలు ఏర్పాటు చేసి, అమాయక గిరిపుత్రులకు ప్రాణభయం లేకుండా చర్యలు చేపట్టాలి. – లంబొదర్ కార్, కుయి సమాజ్ అధ్యక్షుడు క్షణ క్షణం.. భయం భయం పోలీసులు రక్షిస్తారని భావించడం ఎప్పుడో మానేశాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడి గూడేల సమీపంలోనే ఉన్నారంటూ పోలీసులు మమ్మల్ని వేధించడం నిత్య కృత్యమైంది. మేమంతా ఇక్కడ ఉండటమే నేరంలా చూస్తున్నారు. రెండువైపులా ఇబ్బందులతో ప్రత్యక్ష నకరం చూస్తున్నాం. – మరియా ధిగల్, గిరిజనురాలు, తిరుబడి ప్రభుత్వ తీరే కారణం మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడానికి కారణం ప్రభుత్వం పనితీరే. వారికి, పోలీసులకు పరస్పర కాల్పుల వల్ల గిరిజనులు నలిగి పోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. పాలకుల నిర్లక్ష్యం వల్లే పోలీసులు, నక్సలైట్ల లోనూ పోరుబాట పెరిగింది. ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్ పరిణామాలు మరింత వ్యధను మిగిల్చేవిగా ఉంటుందని ఆందోళనగా ఉంది. ప్రపుల్ల సమంతరాయ్, లోక్‌శక్తి అభియాన్ అధ్యక్షుడు -
యువకుడిపై బాంబు దాడి
బరంపురం: గోపాలపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొడగుమలా గ్రామంలో నివాసముంటున్న సుశాంత్ సాహు అనే యువకుడిపై కొంతమంది దుండగులు ఆదివారం బాంబుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో సదరు యువకుడు అక్కడికక్కడే చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఈ విషయం సంచలనం రేకిత్తిస్తోంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న గోపాలపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రా, ఏఎస్పీ ప్రభాత్‌చంద్ర రౌత్రాయ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, గ్రామంలో నెలకొన్న శాంతి భద్రతలను పర్యవేక్షించారు. వివరాలిలా ఉన్నాయి.. గోపాలపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బొడగుమలా గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్న తన స్నేహితులతో కలిసి, సుశాంత్ సాహు శనివారం రాత్రి 9 గంటల సమయంలో మొబైల్లో క్రికెట్ చూస్తున్నాడు. అదే సమయంలో రెండు బైకులపై మాస్కులు ధరించుకుని, వచ్చిన దుండగులు సుశాంత్‌ను టార్గెట్‌గా చేసుకుని, రెండు బాంబులు విసిరారు. అందులో ఒక బాంబు సుశాంత్‌పై పడి, పేలగా మరొకటి నేలపై పడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో సుశాంత్ సాహు శరీరం తునాతునకలై పోయింది. ఇదే విషయమై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుశాంత్ హత్యకు సుశాంత్‌కు ఇతరులతో ఉన్న పాత శత్రుత్వమే కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. దాదాపు 3 ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఎదుట సుశాంత్ సాహు తల్లిపై కూడా బాంబు దాడి జరిగిందని, ఇదే కేసులో జామీనుపై విడుదలైన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే విషయంపై సమగ్ర విచారణ జరిపి, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ పినాకి మిశ్రా తెలిపారు. -
బీఎంసీ స్వపరిపాలన దినోత్సవం నేడు
బరంపురం : బీఎంసీ (బరంపురం మున్సిపల్ కార్పొరేషన్) 151వ స్వపరిపాలనా దినోత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీజేడీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహి తెలిపారు. ఈ మేరకు స్థానిక ఐవీ సమావేశ మందిరంలో బీఎంసీ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ బరంపురం మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. బరంపురం మున్సిపాలిటీ ఏర్పడి 151 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ స్వపరిపాలన దినోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛభారత్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలిమల, పరిశుభ్రతపై నగర ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు వివరించారు. గతేడాది బీఎంసీ 150వ స్వపరిపాలనా దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని, ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నగర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అలాగే బీఎంసీ 151వ స్వపరిపాలనా దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమానికి నేతలు, అధికారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కళ్లికోట్ కళాశాల మైదానంలో సాయంత్రం జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటులు సునీల్‌శెట్టితో పాటు కరీనాఖాన్, పాప్ సింగర్ వినోథ్‌రాథోడ్ పాల్గొని, వీక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మేల్యే రమేష్‌చంద్ర చావ్ పట్నాయక్, మాజీ కేంద్రమంత్రి చంద్రశేఖర్ సాహు, మేయర్ కె.మాధవి, డిప్యూటీ మేయర్ జోత్సా్న నాయక్, కమిషనర్ చక్రవర్తి రాథోడ్, బరంపురం అభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్ మహరణ తదితరులు పాల్గొన్నారు. -
బరంపురానికి పచ్చదనంలో మొదటి స్థానం
బరంపురం : దక్షిణ ఒడిశాలో అన్ని రంగాల్లో మొదటి స్థానం పొందిన బరంపురం నగరం పచ్చదనంలో కూడా మొదటి స్థానం పొందేవిధంగా అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. గురువారం స్థానిక హిల్‌పట్నాలో గల ఎంఈవీ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యాజమన్యం ఆధ్వర్యంలో క్లీన్ బరంపురం.. గ్రీన్ బరంపురం చైతన్య ర్యాలీ, మొక్కల పెంపకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సి పాల్ ప్రకాష్ చంద్ర పండా ఎన్సీసీ, స్కౌ ట్స్, గైడ్స్, విద్యార్థుల చైతన్య ర్యాలీని ప్రారంభిం చారు. అనంతరం అయన మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, మొక్కల పెంపకంతో పచ్చదనంతో పాటు పర్యావరణం పొందగలమని చెప్పారు. ఈ నేపథ్యంలో మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో కార్యదర్శి కుమార్ రంజన్ పాఢి, ప్రముఖ జర్నలిస్టులు శక్తిధర్ రాజ్‌గురు, సుదీప్‌కుమార్ సాహు పాల్గొని ప్రసంగించి పిల్లలను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో వందలాది మంది ఎన్సీసీ, సౌట్స్, గైడ్స్ పిల్లలు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగ అరెస్ట్
బరంపురం ఒరిస్సా : నగరం సమీప కొత్త కమలాపూర్ గ్రామంలో జరిగిన దోపిడీ సంఘటనలో గోపాల్పూర్ పోలీసులు ఓ దోపిడీ దొంగను అరెస్ట్ చేసి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, రూ.25 వేల దోపిడీ సొత్తుని స్వాధీనం చేసుకున్నా రు. ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. గత నెల 16వ తేదీన గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల కొత్త కమలాపురం గ్రామంలో ఒక ఇంటిలో దుండగుడు చొరబడి రూ.35 వేల నగదు, ఒక లాప్టాప్, ఒక సెల్‌ఫోన్ దోచుకుని పరారైన సంఘటనపై గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు మాయారాయ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గోపాల్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి గొళాబందలో నివాసం ఉంటున్న దోపిడీకి పాల్పడిన ప్రమోద్ కుమార్ మెహరాని గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిని నిందితుడిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి బరంపురం సర్కిల్ జైలుకు రిమాండ్‌కు తరలించారు. -
12 గంటల్లో.. వీడిన మిస్టరీ
బరంపురం : నగర శివారు హల్దియాపదర్ ప్రాంతంలోని రళబ గ్రామ పోలిమేరల్లో మంగళవారం పోలీసులు గుర్తించిన మహిళ సంజూ బెహరా హత్య కేసుకు సబంధించిన నిందితుని 12 గంటలు తిరక్కుండానే హత్య కేసును ఛేదించి నిందితుని అరెస్ట్ చేసి విజయం సాధించినట్లు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా చెప్పారు. బరంపురం ఎస్పీ కార్యాలయంలో బరంపురం పోలీసు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ పినాకి మిశ్రా మాట్లాడుతూ గోళంతరా పోలీస్‌స్టేషన్ పరిధిలో గల హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల మహిళ సంజూ బెహరా మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నట్లు చెప్పారు. మహిళా సంజూ బెహరా హత్య కేసుపై ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రత్యేకపోలీసు బృందంగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. సంజు బెహరా హత్య జరిగిన సంఘటనా స్థలంలో నిందితుని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించగా పలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. నిందితుడితో వివాహేతర సంబంధం హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల సంజూ బెహరా బరంపురం గేట్ బజార్ చేపల మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే గేట్ బజార్లో చేపల మార్కెట్ దగ్గర టున్నా డకువా అనే యువకుడు సెలూన్ షాప్ నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు. అయితే సంజుబెహరా వివిధ ప్రేమ వ్యవహారాలు కలిగి ఉన్నట్లు టున్నా డకువా అనుమానించేవాడు. ఈ నేపథ్యంలో 17వ తేదీ రాత్రి హల్దియాపదర్ ప్రాంతంలోని రళబ దగ్గరకి టున్నా బెహరా వెళ్లి సంజు బెహరాను ఫోన్ చేసి పిలిచాడు. ఇద్దరు సైకిల్‌పై రళబ పోలిమేర శివారు ఆశ్రమం వెనుకకు వెళ్లి వారితో పాటు తీసుకువెళ్లిన బీరు బాటిల్స్ తాగారు. బీరు బాటిల్స్ పగలగొట్టి హత్య అనంతరం సంజు బెహరా ప్రేమవ్యవహారాలపై టున్నా డుక్కువ ప్రశ్నించగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తాగిన ఖాళీ బీరు బాటిల్స్ టున్నా పగుల గొట్టి సంజుబెహరాను పొడిచి హత్య చేశాడు. వారిద్దరి పెనుగులాటలో టున్నా డకువాకి కూడా గాయాలయ్యాయి. ఆ పెనుగులాటలో టున్నా డకువా మొబైల్ ఫోన్ పడిపోయినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడి మొబైల్‌ఫోన్‌ను పట్టుకుని దర్యాప్తు చేపట్టగా సంఘటన అంతా వెలుగులోకి వచ్చిందని ఎస్పీ పినాకి మిశ్రా వివరించారు. స్వల్ప గాయాలైన టున్నా డకువా సిటీ అస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకుని ఏమీ ఎరగనట్లు ఉన్నాడు. దర్యాప్తు అనంతరం నిందితుడు టున్నా డకువాని అతని నివాసంలో బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. హత్యకు వాడిన పలిగిన బీరు బాటిల్ గాజు ముక్కలు, సంఘటనా స్థలంలో రక్తపు నమూనా మట్టి అనవాళ్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పినాకి మిశ్రా తెలియజేశారు. -
జీఆర్పీ ఎస్సై అరెస్టు
బరంపురం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్‌పై బరంపురం రైల్వే స్టేషన్లో దాడి చేసి గాయపరిచిన కేసులో బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా అరెస్టయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 17వ తేదీ రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న బరంపురం జీఆర్పీ స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను బి–1 కోచ్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్ టికెట్ అడగడంతో వాగ్వాదం జరిగింది. బరంపురం రైల్వేస్టేషన్ రాగానే బి.కిరణ్ సాగర్‌ను జీఆర్పీ ఎస్సై, ఇతర జీఆర్పీ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుడు బి.కిరణ్ సాగర్ విశాఖపట్నం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఏడీజీ జీఆర్పీ బరంపురం పోలీస్‌స్టేషన్ ఐఐసీ రాజేంద్ర కుమార్ ముండాపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం ఈ కేసును బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో గురువారం బరంపురం జీఆర్పీ పోలీసులు ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా పెట్టుకున్న బెయిల్‌ను ఎస్డీజేఎం కోర్టు తిరస్కరించింది. -
రైల్వే ట్రాక్ ఎక్కితే ఏనుగైనా పీనుగే
బరంపురం : రాష్ట్రంలో మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది. రైల్వేట్రాక్‌లపై గజరాజులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జంతు ప్రేమికులు, రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలో గల రైల్వే ట్రాక్‌పై వివిధ ప్రాంతాల్లో గత 7 ఏళ్లలో జరిగిన దుర్ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 22 ఏనుగులు మృతి చెందిన సంఘటనలు జంతు ప్రేమికులను కలిచివేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఝార్సుగుడ జిల్లాలోని బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ముఖ్యంగా ఏనుగుల రక్షణపై చేపట్టవలసిన చర్యలపై భారత రైల్వే విభాగం, అటవీ శాఖ, వన్యప్రాణుల సంరక్షణ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 2011 నుంచి 2018 ఏప్రిల్ వరకు 7 ఏళ్లలో 22 ఏనుగులు దుర్మరణం చెందాయి. 2012–2013 మధ్య కేవుంజర్ జిల్లా పరిధి చంపువా అటవీ రేంజ్లో గల రైల్వే ట్రాక్‌పై రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 5 ఏనుగులు మృతిచెందాయి. ఇదేవిధంగా 2012 డిసెంబర్ 29వ తేదీ అర్ధరాత్రి గంజాం జిల్లా కళ్లికోట్ అటవీ రేంజ్ రంబా జంగిల్ పరిధిలో గల సుబలియా రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో 6 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ విభాగం, కేంద్ర అటవీ విభాగం అధికారులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ సభ్యులు ఏనుగులు మృతి చెందిన సంఘటన స్థలాలకు వచ్చి పరిశీలించి ప్రత్యేకంగా అరా తీసి కేంద్రానికి నివేదిక అందజేశారు. మూణ్ణాళ్ల ముచ్చటగా రక్షణ చర్యలు అనంతరం కేంద్రం ఆదేశంతో ఒడిశా రాష్ట్రం రైల్వే ట్రాక్ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల రక్షణ కోసం పలు విధాలా చర్యలు చేపట్టారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో గల రైల్వేట్రాక్‌పై వెళ్లే రైళ్లు 20 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడపాలని కేంద్ర రైల్వే విభాగం అదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అటవీ శాఖ, వన్యపాణ సంరక్షణ విభాగం, రైల్వే అధికారులు అప్రమత్తమై సాయంత్రం 6గంటల నుంచి (రాత్రంతా) ఉదయం 5గంటల వరకు రంబా సుబలియా రైల్వే లైన్ వచ్చేసరికి సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి పోయే ట్రైన్ల స్పీడ్ తగ్గించారు. ఇరువైపులా ట్రైన్లు 20 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే నడిచేవి. కొన్నాళ్ల తరువాత రక్షణ చర్యలు అటకెక్కాయి. తాజాగా దుర్ఘటనలు గత 2016–17 మధ్య ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో 7 ఏనుగులు మృతి చెందగా 2018 ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఝార్సుగుడ జిల్లా బగ్గిధి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల రైల్వే ట్రాక్‌పై తాజాగా రైలు ఢీకొన్న దుర్ఘటనలో 4 ఏనుగులు మృతి చెందిన సంఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది రాష్ట్రంలో రైల్వే ట్రాక్‌లపై ఏనుగుల దుర్మరణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టి ఏనుగులకు రక్షణ కల్పించాలి. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై తక్కువ వేగంతో రైళ్లు నడిపించాలి. ఇదే విధంగా అయా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ వైర్లు అమర్చాలి. రైలు వచ్చిన సమయంలో ఈ సోలార్ విద్యుత్ వైబ్రేషన్ వచ్చేలా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న రైల్వేట్రాక్ సైడ్లలో రైళ్లు స్లోగా నడపాలని సూచన బోర్డులు అమర్చాలి. ముఖ్యంగా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో వన్యపాణి సంరక్షణ అధికారులు, అటవీశాఖ అధికారులు స్థానిక పోలీసులు సయుక్తంగా అయా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరపాలని జంతు ప్రేమికులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
ఒడియాలోనే సైన్‌బోర్డులు
బరంపురం: ఒడిశా ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి అన్ని వ్యాపార సంఘాల దుకాణాల బోర్డులు ఒడియా భాషలోనే ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో స్పష్టం చేశారు. గంజాం చాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక కొమ్మబాల వీధిలో గల కార్యాలయంలో 50వ వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వీవీ రామ నరసింగ రావు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి సూర్జో పాత్రో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్తచట్టాన్ని అమలు చేసిందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రత్యేక ఒడిశా అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త చట్టం అనుసారంగా ఒడిశా రాష్ట్రంలో ప్రతి వ్యాపార దుకాణం ముందు వ్యాపార బోర్డులపై మాతృ భాష ఒడియాలోనే పేర్లు ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో కూడా తప్పని సరిగా ఒడియా భాషలో బోర్డుల్లో పేరు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక రాష్ట్రంలో గల కలెక్టరేట్ కార్యాలయాల నుంచి అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో కూడా ఒడియా భాషలోనే బోర్డులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్లకు ఒడియా భాషలోనే లేఖలు, కరస్పాండింగ్ చేయగలరని లేఖలో కూడా కింద ఒడియా భాషలో తప్పనిసరిగా సంతకం ఉండాలని స్పష్టం చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చేసిన కరస్పాండింగ్ లేఖలు మాత్రం ఆంగ్లంలో ఉంటాయని అన్నారు. తెలుగులో కూడా బోర్డులు ఇదే విధంగా రాష్ట్రంలో 4.17 కోట్ల మంది జనాభా ఉన్నా వారిలో రెండో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెలుగు ప్రజలు ఉన్న ఊళ్లలో మాత్రం తెలుగులో కూడా బోర్డులు అమర్చగలరని చెప్పారు. వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉల్లి, బంగాళా దుంపల ధరలు పెరగనున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలుగా బంగాళాదుంపలు, ఉల్లిపాయల నిల్వలు ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిదని చెప్పారు. వ్యాపారస్తులు ఆన్లైన్ బిల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి సక్రమంగా పన్ను చెల్లించాలని కోరారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ వల్ల జాతీయ రహదారులలో చెక్‌పోస్ట్‌లు ఎత్తివేశామని అన్నారు. ఉత్తమ వ్యాపారస్తులకు సన్మానం అనంతరం గంజాం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వావీ రామ నరసింగ రావు కొత్తగా సంఘంలో చేరిన, ప్రభుత్వానికి సక్రమంగా, సరైన పన్ను చెల్లించిన ఉత్తమ వ్యాపారస్తులను పేరుపేరున పిలవగా మంత్రి సూర్జో పాత్రో వారికి గౌరవ సన్మానం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంతోష్ కుమార్ సాహు, గౌరవ అతిథి మనోజ్ కుమార్ పాఢితో సహా జిల్లాలో గల వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘అపరేషన్ అకర్ష్’
బరంపురం : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒడిస్సాలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. 2019లో రానున్న సాధారణ ఎన్నికలకు ముందుగా ఒడిస్సాలో మరో నాలుగు నెలల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఒకవైపు అధికార పార్టీ బీజేడీ..మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ పరస్పర ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఒక వైపు దక్షిణ ఒడిస్సా కేంద్ర బిందువు బరంపురం..మరోవైపు పశ్చిమ ఒడిస్సా ప్రాణకేంద్రం సంబల్పూర్ నగరాలు వేదికలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న బీజేడీ బరంపురం నగరంలోను, 5వ తేదీన బీజేపీ సంబల్పూర్లోను మిశ్రమ సమ్మేళన్ పర్బ్ పేరుతో ‘అపరేషన్ అకర్ష్’ చేపట్టి తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలనుపోత్సహించేందుకు ఇరు పార్టీలు తమదైన రాజకీయ శైలిలో పావులు కదుపుతున్నాయి. అమిత్ షా–నవీన్ ‘ఢీ’ ఏప్రిల్ 4, 5 తేదీల్లో బీజేడీ, బీజేపీ చేపట్టే మిశ్రమ సమ్మేళన్ వేర్వేరు బహిరంగ మహాసభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘ఢీ’ కొడుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన అధికార రాష్ట్ర బీజేడీ పార్టీ బరంపురం కళ్లికోట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మిశ్రమ సమ్మేళన్ పర్బ్కు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకానుండగా..మరుసటి రోజు 5వ తేదీన సంబల్పూర్లో బీజేపీ మిశ్రమసమ్మేళన్ పర్బ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ ఒడిస్సాలో బీజేపీ తన ఓటు బ్యాంక్‌ను పెంచుకుని రెండో స్థానంలో ఉండగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు అమిత్ షా ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇందుకు 5వ తేదీన పశ్చిమ ఒడిస్సా, సంబల్పూర్లో జరగనున్న బీజేపీ మిశ్రమ సమ్మేళన్ సభలో భారీ స్థాయిలో యువ శక్తిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో 4వ తేదీన దక్షిణ ఒడిస్సా, బరంపురంలో జరగనున్న అధికార పార్టీ బీజేడీ మిశ్రమ సమ్మేళన్ పర్బ్‌లో స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ చంద్ర శేఖర్ సాహు, ఏఐసీసీ సభ్యుడు విక్రమ్ పండా, డీసీసీ అధ్యక్షుడు భగవాన్ గంతాయత్లతో పాటు కాంగ్రెస్ నాయకులు బీజేడీలో చేరనున్నారు. కాంగ్రెస్ కంచుకోటకు బీటలు? ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గంజాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. గంజాం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ నాయకులంతా అధికార పార్టీ బీజేడీ పార్టీలోకి వలస పోతుండడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కానరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్.జగన్నాథ్ రావు 7 సార్లు పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఘనత ఉంది. మరోవైపు అత్యధికంగా తెలుగు ప్రజల ఓట్లు ఉండే బరంపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్పటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి బరంపురం కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటగా ఘనచరిత్ర ఉన్న బరంపురం ప్రస్తుత వలసలతో జిల్లాలో కాంగెస్ కానరాకుండా పోయే దయనీయ పరిస్థితి ఏర్పడింది. -
కలకలం
బరంపురం : మావోయిస్టుల దుర్గంగా ఉన్న కొందమాల్ జిల్లాలో ఒక్కసారిగా యుద్ధవాతావరణం అలుముకుంది. కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో జరిగిన ఎదురు కాల్పులు భయానక పరిస్థితులను సృష్టించాయి. కొందమాల్ జిల్లాలో పోలీసులు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో మావోయిస్టు శిబిరాన్ని పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందమాల్ ఎస్పీ ప్రత్తిక్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొందమాల్ జిల్లా కొజ్జిరిపడ సమితి లంబాగుడా పంచాయతీ కుకులసెలయేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరంలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓడీ జవాన్లు, సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసుల సహాయంతో బుధవారం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. సూమారు 2 గంటల వరకు ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు సాగిన అనంతరం మవోయిస్టులు వెనక్కు తగ్గి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల శిబిరాన్ని పరిశీలించి భారీ డంప్‌ను గుర్తించి విస్ఫోట సామగ్రి, అయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్‌లో మావోయిస్టు జెండాలు, ఒక సీఎల్ఆర్ మెషీన్, రెండు కుర్చీలు, రెండు రేడియోలు, తాగునీటి బాటిల్స్, ఔషధాలు, 3 జతల చెప్పులు, వివిధ సామగ్రి ఉన్నట్లు ఎస్పీ ప్రత్తిక్ సింగ్ తెలియజేశారు. కొందమాల్ జిల్లాలో కొందమాల్, కలహండి, బౌధ్, నయగడ్ (కేకేబీఎన్)డివిజన్ దళం సీపీఐ మావోయిస్టు ఆధ్వర్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు, శిబిరంలో మహిళా క్యాడర్‌తో పాటు సుమారు 14 మంది మవోయిస్టులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. జోరుగా కూంబింగ్ జరిగిన సంఘటపై కొందమాల్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కమనకొలొ, లొండిగాం, గొచ్చపడా, బలందపూర్, దసపల్లా, రాణిపొత్తర, గస్మా, గెలరీ, శ్రీరామ్‌పూర్, దరింగబడి, సాలిమాగచ్ అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహాయంతో సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నట్లు కొందమాల్ ఎస్పీ ప్రత్తిక్ సింగ్ తెలియజేస్తున్నారు. గంజాం, గజపతి, కొందమాల్ జిల్లాల సరిహద్దుల్లో వచ్చి పోయే వాహనాలను, ప్రయాణికుల బస్సులను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్ఓజీ జవాన్ల సహకారంతో స్థానిక పోలీసులు కూడా సోదాలు చేస్తున్నారు.జేసీబీ, 3ట్రాక్టర్ల కాల్చివేత కొందమాల్ జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం రాయగడ : జిల్లా సరిహద్దులో గల కొందమాల్ జిల్లా బలిగుడ పోలీస్‌స్టేషన్ పరిధి గుమ్మడ మహరోడ్డు కుర్తింగుడ దగ్గరలో బుధవారం అర్ధరాత్రి 40మంది సాయుధ మావోయిస్టులు రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఒక జేసీబీ, 3ట్రాక్టర్లను కాల్చివేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. జినుగు నరసింగరెడ్డి అనే వ్యక్తి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని..దీనిపై ప్రజాకోర్టులో విచారించి తగిన చర్యలు చేపడతామని కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులు పోస్టర్లలో హెచ్చరించారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా 6నుంచి 8 అడుగుల రహదారి మాత్రమే నిర్మించాలి. రహదారిపనులను గ్రామీణ ప్రజల ద్వారా చేపట్టాలి. మెషినరీతో పనులు చేపట్టకూడదు. రోజుకూలి రూ.200కు బదులు రూ.1200 చెల్లించాలి. వారానికి ఒకసారి పేమెంట్ చెల్లించాలని పోస్టర్లలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో విదేశీ మద్యం నిర్మూలించేందుకు మహిళలు ఉద్యమాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. -
మహిళ హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్ట్
బరంపురం : వారం రోజుల క్రితం నగర శివారు బెందాలి గ్రామం కెనాల్ పక్కన జరిగిన మహిళ హత్యకు సబంధించిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సంతున్ కుమార్ దాస్ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సదర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరు ల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సదర్ పోలీస్‌స్టేష న్ పరిధిలో గల నగర శివారు బెందాలి గ్రామం దగ్గరలో వివా హిత ప్రతిమా బెహరా హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం ప్రతిమా బెహర భర్త మృతి చెందాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన సనాతన్ సాహుతో ప్రతిమా బెహరాకు వివాహేతర సబంధం ఉన్నట్లు చెప్పారు. అయితే గత 19వ తేదీన ప్రతిమా బెహరా గ్రామ శివారు కెనాల్లో స్నానం చేసేందుకు వెళ్లగా సనాతన్ సాహు తన సహచరులతో ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గొంతునులిమి హ త్య చేసినట్లు చెప్పారు. ఈ హత్యకు సబంధించిన ముఖ్య నేరస్థుడు సనాతన్ సాహుతో పాటు మనోజ్ కుమార్ సాహు, నీలాంచల్ దాస్, రామదాస్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెంటనే పట్టుకుంటామని ఏఎస్పీ సంతున్కుమార్ దాస్ చెప్పారు. సమావేశంలో సదర్ పోలీస్‌స్టేషన్ ఎస్డీపీఓ అశోక్‌కుమార్ మహంతి ఐఐసీ అధికా రి శివశంకర్ మహాపాత్రో పాల్గొన్నారు. -
గుర్తు తెలియని యువతి ఆత్మహత్య?
బరంపురం: గంజాం జిల్లాలోని కళ్లికోట్ అటవీ ప్రాంతంలో గురువారం చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని యువతి మృతదేహం స్థానికుల కంటపడింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కళ్లికోట్ బ్లాక్, పకురుషోత్తంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో బధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు యువతిని హత్య చేసిన అనంతరం చెట్టుకి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న యువతి మృతదేహం గుర్తు పట్టలేదని అయితే యువతి శరీరంపై గాయాలు ఉండడంతో అది ఆత్మహత్య కాదు. హత్యే అని అనుమానాలు బలపడుతున్నాయని పోలీసులు తెలియజేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం యువతిది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది నిర్ధారించగలమని పోలీసులు తెలియజేస్తున్నారు.