యువకుడి మెడలో దిగిన కర్రచెక్క | Stick pierces man's neck | Sakshi
Sakshi News home page

యువకుడి మెడలో దిగిన కర్రచెక్క

Published Sat, Feb 11 2017 2:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

యువకుడి మెడలో దిగిన కర్రచెక్క

యువకుడి మెడలో దిగిన కర్రచెక్క

బరంపురం(ఒడిశా):
బైక్‌పై వస్తూ చెట్టును ఢీకొన్న యువకుడి మెడలో కర్రచెక్క చొచ్చుకుపోయింది. ఈ సంఘటన ఒడిశాలోని కొందమాల్‌ జిల్లాలోని బిల్లిగుడాలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల సహకారంతో 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్‌కళాశాలో చేర్చగా  వైద్యులు చికిత్స అందజేశారు. బాధితుని బంధువులు అందించిన సమాచారం ప్రకారం కొంధమాల్‌ జిల్లా బల్లిగుడా పోలీసుస్టేషన్‌ పరిధిలో టిక్కలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌ పాత్రో బల్లిగుడా వచ్చి తిరిగి బైక్‌పై తన సొంత గ్రామం టిక్కలపల్లి వెళ్తున్న సమయంలో దుదృష్టవశాత్తు బైక్‌ అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టాడు.

దీంతో ప్రదీప్‌ కుమార్‌ పాత్రో మెడలో కర్ర చెక్క చొరబడినట్లు బంధువులు చెప్పారు. ప్రస్తుతం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాలలో యువకుడు చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement