
ప్రతీకాత్మకచిత్రం
ఒడిశా(బరంపురం): నగరంలో గత కొద్ది రోజులుగా రహస్యంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను ఎస్పీ శరవన్ వివేక్ భగ్నం చేశారు. దీనిని నిర్వహిస్తున్న కేంద్రంపై ఆయనే స్వయంగా మఫ్టీలో దాడి చేయడంతో ముగ్గురు యువతులతో 12మంది విటులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం బరంపురం పోలీసు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు.
పక్కా సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి తానే స్వయంగా మఫ్టీలో బుల్లెట్‌పై బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బరంపురం టాటా బెంజ్ జంక్షన్‌లో ఉన్న తులసీ గెస్ట్‌హౌస్(లాడ్జి) వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నరు. నిందితులను మంగళవారం బరంపురం సబ్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వివరించారు.
చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..)
Comments
Please login to add a commentAdd a comment