
డబ్బాలో నాగుపామును వేసిన విలేకరి స్వధీన్ పండా
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఎస్పీ కార్యాలయంలో 12 అడుగుల నాగుపాము హల్‌చల్ చేసింది. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న విలేకరి స్వధీన్ పండా పామును గుర్తించి అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం కిరండమల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.