
క్యాన్‌లో చిక్కుకున్న పాము
భువనేశ్వర్/పూరీ: ఖాళీ బీర్ క్యాన్‌లో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బయటపడలేక పాము విలవిలలాడటాన్ని గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులకు తెలియజేశారు. హెల్ప్‌లైన్ సభ్యుడు సుశాంత కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, పాము గాయపడకుండా జాగ్రత్తగా బయటకు తీసి.. జనసంచారం లేని ప్రాంతంలో విడిచి పెట్టారు.