beer bottle
-
బీరులో చెత్త, చెట్నీలో బొద్దింక
-
బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: బీరు కొనుగోలు చేయడానికి వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తి షాకయ్యాడు. బీరు సీసాలో కప్ప అవశేషాలు దర్శనమిచ్చిన ఘటన ఆర్మూర్ డివిజన్లోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో చోటు చేసుకుంది. దీంతో వైన్ షాపు నిర్వాహకుడిని ఆ వ్యక్తి నిలదీశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. -
మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్‌లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ..
దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
ఆధారాలు దొరకలేదు.. చివరికి బీరు సీసా మూత నిందితులను పట్టించింది
బెంగళూరు: బీరు సీసా మూత నిందితులను పట్టించింది. బెంగళూరులోని మిలీనియం బార్ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్ పోలీసులు ఛేదించారు. అప్రోజ్, రాకేశ్, రాజు, ఆదిల్ పాషా అనే నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. మిథున్‌రాజ్, ముత్తురాజ్ అనే స్నేహితులు ఆటోలో పాటలు పెట్టుకొని మాట్లాడుకుంటుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నిందితులు బీరు బాటిళ్లతో తలలపై దాడి చేసి పారిపోయారు. బాధితులు రక్తం మడుగులో పడి ఉండగా ఆస్పత్రికి తరలించారు. చంద్రలేఔట్ ఎస్ఐ రవీశ్ కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీకెమెరాల్లో కూడా నిందితుల కదలికలు లేవు. కేవలం ఘటన స్థలిలో బీరు బాటిల్ మూత లభించింది. బ్యాచ్ నంబర్ ఆధారంగా కొనుగోలు చేసిన బార్ ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి సీసీకెమెరా పరిశీలించగా నిందితులు బీర్లు కొనుగోలు చేసి బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఎందుకు దాడికి పాల్పడ్డారని ప్రశ్నించగా ఊరికేనే దాడి చేసినట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భర్తకు దూరంగా.. ప్రియుడికి ఫోన్ చేసి నేను చనిపోతాను... -
హైదరాబాద్: ప్రాణం తీసిన బీరు
సాక్షి, క్రైమ్: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు. -
బీరు ప్రియులపై మరో భారం.. బాటిల్‌పై రూ. 5 నుంచి 10 వరకు పెంపు!.
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో బీరు ప్రియులపై మరో భారం పడనుంది. త్వరలో రాష్ట్రంలో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. కొన్నినెలల కింద ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం తెలిసిందే. బార్లీ, డీజిల్, పెట్రోల్ రేట్లు అమాంతం పెరగడంతో బీర్ల ధరలు పెంచేందుకు తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం అబ్కారీ శాఖకు ఆ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. బాటిల్ మీద రూ. 5 నుంచి రూ. 10 మేర పెంచడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, బార్లీ కొరత ఈ బీర్ల ధర పెంపునకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బీర్ల తయారీలో అవసరమైన ముఖ్యమైన ముడి పదార్థం బార్లీ. బార్లీ ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆ ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బార్లీ దిగుమతి క్షీణించినట్లు చెబుతున్నారు. దీంతో బీర్ల తయారీకి ఖర్చు పెరిగిందని ధర పెంచుకోవడానికి నిర్ణయించాయి. ఇప్పటికే మద్యం అధిక ధరల వల్ల మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. ఇప్పుడు బీర్ల ధరలు పెరిగితే లబోదిబోమనడం ఖాయం. చదవండి: ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షాక్.. కీలక ఆదేశాలు జారీ -
బీర్ బాటిల్‌తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా
సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ అసిస్టెంట్ రిఫరీ తలపై ఒక ఆకతాయి బీర్ బాటిల్ విసరడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటన బుండెస్లిగా లీగ్‌లో జరిగింది. బోచుమ్, బోరుస్సియా మోయెన్చెంగ్లాడ్బాచ్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. హాఫ్ టై ముగిసేసరికి గ్లాడ్బాచ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. బోచుమ్ జట్టు ఓడిపోతుందన్న విషయాన్ని ఒక ఆకతాయి అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఇక రెండో హాఫ్ మొదలైన తర్వాత ఆట 71వ నిమిషంలో అసిస్టెంట్ రిఫరీ క్రిస్టియన్ గిట్టిల్మన్పై సదరు ఆకతాయి బీర్ బాటిల్‌ను విసిరాడు. అది వచ్చి నేరుగా రిఫరీ తలకు బలంగా తగిలింది. గ్రౌండ్లో కూలబడ్డ రిఫరీ నొప్పితో విలవిల్లాలాడు. విషయం తెలుసుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు రిఫరీ వద్దకు వచ్చి అతనికి ఎలా ఉందోనని ఆందోళన పడ్డారు. దాదాపు 20 నిమిషాల చర్చ అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌ను సజావుగా జరగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కోసం రిఫరీని గాయపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ తెలిపింది. ఇదిలాఉంటే.. గ్లాడ్బాచ్కు చెందిన ఒక ఆటగాడు స్టాండ్స్‌లో ఉన్న సదరు ఆకతాయితో గొడవకు దిగాడు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా.. నీ బుద్దిని కాస్త అదుపులో ఉంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఉదంతాన్ని ఇరు క్లబ్‌లు సోషల్ మీడియా వేదికగా ఖండించాయి. ''మేం రిఫరీ లైన్స్‌మన్ క్రిస్టియన్ గిట్టిల్మన్ను క్షమాపణ కోరుతున్నాం. ఈ విషయం మాకు భరించలేనిది. ఒక ఆకతాయి అభిమాని పిచ్చిగా ప్రవర్తించినందుకు మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతాం'' అంటూ బోచుమ్ క్లబ్ వెల్లడించింది. చదవండి: PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! Nick Kyrgios: టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే? Disgraceful situation at Vonovia Ruhrstadion, where the Bochum-Gladbach Bundesliga clash was abandoned after 71 minutes due to a linesman being struck on the head by an object from the crowd.#BOCBMG pic.twitter.com/Yfdn4R2blJ — Sacha Pisani (@Sachk0) March 18, 2022 -
అది ఒక బీర్.. కానీ, ఇప్పుడు అదే ఉక్రెయిన్ ‘ఆయుధం’!
ఉక్రెయిన్ నగరం లీవ్.. పోలాండ్ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరం. ఆ భూభాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు రెండు రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. సైన్యం తుటాలు, బాంబులతో పాటు గాల్లోంచి పడుతున్న బీర్ సీసాలు.. భారీ శబ్ధాలతో పేలిపోతున్నాయి. దీంతో రష్యా బలగాలు అక్కడే ఆగిపోయాయి. ఇంతకీ ఆ బీర్.. ఎందుకలా పేలిపోతున్నాయో చెప్తున్నారు ప్రావ్డా బ్రూవరీ యజమాని యూరై జాస్టనీ. ఉక్రెయిన్ లోని లివ్ పట్టణానికి చెందిన ప్రావ్డా బ్రూవరీ బీర్ల తయారీకి ప్రసిద్ధి. కానీ, యుద్ధం నేపథ్యంలో బీర్ల తయారీని ఆపేసింది ఈ కంపెనీ. అందుకు బదులుగా రష్యా సైన్యం కోసం ప్రత్యేకంగా ‘మొలటోవ్ కాక్ టెయిల్’ తయారు చేస్తోంది. తాగడానికి కాదు.. లేపేయడానికి!. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగులు హుషారుగా ఈ బాటిల్ బాంబులను తయారు చేస్తున్నారు. ఈ బీర్ బాటిళ్లలో ఆయిల్, పెట్రోల్ మిక్స్ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు. లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది. సీసా మూతభాగంలో ఉన్న వస్త్రానికి అగ్గి రాజేసి శుత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్ల పని మటాషే!. ఉక్రెనియన్ టెర్రిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌ల కోసం శనివారం నుంచి తయారు చేస్తున్నారు. 2014 క్రిమియా సంక్షోభం సమయంలోనూ ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు జరిగాయట. ఆ సమయంలో కంపెనీలో పని చేసిన ఓ వ్యక్తి.. అప్పటి విషయాన్ని గుర్తు చేయడంతో మళ్లీ బీర్ బాటిల్ బాంబులు తయారవుతున్నాయి. ఈ యుద్ధానికి మద్దతుగా మేము మా వంతుగా ప్రతిదీ చేస్తాం. ఎవరో ఒకరు దీన్ని చేయాలి. 2014లోనూ దీన్ని తయారు చేసి వినియోగించిన దాఖలాలున్నాయి. మా ఉద్యోగి ఒకరికి మెలటోవ్ కాక్ టెయిల్ తయారీ గురించి తెలుసు. అందుకే దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాం అని చెప్తున్నారు యూరై. ఇదిలా ఉంటే ఈ కంపెనీ గతంలోనూ ‘పుతిన్ ఖుయ్లో’ అంటూ పుతిన్ అవమానిస్తూ గతంలో బీర్లు తయారు చేసింది. అవి భయంకరంగా అమ్ముడు పోయేవి కూడా. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై బీర్ బాటిల్‌తో దాడి
సాక్షి, బెంగళూరు: బిగ్‌బాస్ కంటెస్టెంట్ కిరిక్ కీర్తిపై బీర్ బాటిల్‌తో దాడి జరిగింది. గురువారం అతను స్నేహితులతో కలిసి సదాశివనగరలో పబ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫొటో తీశాడు ఫోటో ఎందుకు తీశావంటూ కీర్తి ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అవతలి వ్యక్తి ఆవేశంతో కీర్తిపై బీర్ బాటిల్‌తో దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన) -
బీర్ క్యాన్‌లో నాగుపాము.. బయటపడలేక విలవిల
భువనేశ్వర్/పూరీ: ఖాళీ బీర్ క్యాన్‌లో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బయటపడలేక పాము విలవిలలాడటాన్ని గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులకు తెలియజేశారు. హెల్ప్‌లైన్ సభ్యుడు సుశాంత కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, పాము గాయపడకుండా జాగ్రత్తగా బయటకు తీసి.. జనసంచారం లేని ప్రాంతంలో విడిచి పెట్టారు. చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) -
సీసాతో పొడిచి.. సపర్యలు చేసి..
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): వ్యక్తిగత కక్షల నేపథ్యంలో బీరు సీసాతో పొడిచిన వ్యక్తే తిరిగి బాధితుడికి సపర్యలు చేయడం.. ఆనక ఆసుపత్రులకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన పుప్పల అప్పారావుకు అదే గ్రామానికి చెందిన పుప్పల లోవరాజు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అప్పారావుపై లోవరాజు బీరు సీసాతో దాడిచేసి, విరిగిన సీసాను ఎడమ దవడలోకి దించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడ్ని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు జీజీహెచ్‌కు సిఫార్సు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసాతో పొడిచిన లోవరాజే అప్పారావును తొలుత పీహెచ్‌సీకి అక్కడి నుంచి జీజీహెచ్‌కి తరలించి దగ్గరుండి మరీ వైద్యం చేయిస్తూ సపర్యలు చేయడం కొసమెరుపు. చదవండి: చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది -
ప్రేమించలేదనే కోపంతో బీరు సీసాతో దాడి
వరంగల్ అర్బన్, కాశిబుగ్గ: తమను ప్రేమించడం లేదనే కోపంతో తరచూ యువకులు అఘాయిత్యాలు, అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే జిల్లా కేంద్రంలోని అబ్బనికుంటలో బుధవారం చోటు చేసుకుంది. వరంగల్ 11వ డివిజన్క్రిస్టియన్ కాలనీకి చెందిన బసికె నిఖిల్ 10వ డివిజన్ అబ్బనికుంట(టీఆర్టీ కాలనీ)కి చెందిన మైనర్ బాలికను వేధిస్తున్నాడు. కొంతకాలంగా తనను ప్రేమించాలని ఆమె వెంట పడుతుండగా బాలిక పట్టించుకోలేదు. అంతేకాకుండా అతనికి దూరంగా ఉండసాగింది. (పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి) దీంతో కోపం పెంచుకున్న నిఖిల్ బుధవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవ రూ లేని సమయం చూసుకుని వెళ్లిన ఆయన బీరు సీసా పగలగొట్టి దానితో బాలికపై దాడి చేశాడు. బాలిక తప్పించుకోవడంతో చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె గట్టిగా అరవడంతో గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాత బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించామని మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ నరేష్కుమార్ తెలిపారు. -
మద్యం సీసాలపై గాంధీ చిత్రం.. కంపెనీ క్షమాపణలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ చిత్రాన్ని మద్యం సీసాలపై చిత్రించిన ఘటనలో ఇజ్రాయెల్ కంపెనీ క్షమాపణలు కోరిందని, ఆ చిత్రంతో మద్యం ఉత్పత్తిని నిలిపివేసిందని, సరఫరా చేసిన సీసాలను వెనక్కి తీసుకుందని విదేశాంగమంత్రి జయశంకర్ తెలిపారు. మంగళవారం జీరోఅవర్ సందర్భంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ లేవనెత్తారు. దీనిపై జైశంకర్ ‘ఆ సంస్థ ప్రజలకు, భారత ప్రభుత్వానికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపిందని, జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసింది’ అని తెలిపారు. ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ బీర్ తయారీ కంపెనీలు మాల్కా బ్రేవరీ, నెగేవ్ బీర్స్ ఈ చర్యకు పాల్పడ్డాయి. తమ బీర్లకు పబ్లిసిటీ కల్పించేందుకు ఏకంగా వివిధ దేశాల ప్రముఖ వ్యక్తుల ముఖచిత్రాలను బీర్ బాటిళ్లపై ముద్రించాయి. ఇందులో భాగంగా టీ షర్ట్ వేసుకొని.. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న మహాత్మాగాంధీ చిత్రాన్ని బీర్ బాటిల్‌పై ముద్రించాయి. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏకంగా బీర్ బాటిళ్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించి.. అవమానించడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఈవిధంగా స్వాతంత్ర్యయోధులను కించపరిచిన ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహులకు లేఖలు రాశారు. ఇజ్రాయెల్‌లో పనిచేసే ఓ భారతీయుడు మొదట ఈ బీర్ బాటిల్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేసి.. తన ఆవేదనను వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత జాతిపిత అయిన గాంధీని అవమానించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితమంతా మద్యం ముట్టనని తన తల్లికి వాగ్దానం చేసి.. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఇలా చేయడం నిజంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 సంవత్సరంలో కూడా అమెరికాకు చెందిన ఒక బీరు కంపెనీ గాంధీని అవమానించేలా ఓ వాణిజ్య ప్రకటనను రూపొందించింది. దీనిపై భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది. -
వామ్మో.. బీరు సీసాలో తేలు
పరకాల: బీరు సీసాలో తేలు అవశేషాలు కనిపించిన ఘటన పరకాల పట్టణంలోని ఓ వైన్స్షాపులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన మద్యం ప్రియులను కలవరానికి గురి చేసింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్‌లో రాకేష్ ఓ కంపెనీకి చెందిన లైట్ బీరు కొనుగోలు చేశాడు. సీసా నలుపు రంగులో ఉండటంతో సీసాలోని బీరు మొత్తం పూర్తయ్యేంత వరకు తేలు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు. బీరు సీసా అడుగు భాగంలో తేలు కనిపించడంతో విషయాన్ని వైన్స్ యాజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆ యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమైనా తయారు చేశామా అని షాపు యాజమాని అనటంతో కొద్ది సేపు మద్యం కొనుగోలు దారులతో గొడవ జరిగింది. తేలు అవశేషాలు ఉన్న బీరు త్రాగటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. ఘటనను పరకాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. అసలే వేసవి కాలం..బీరు పట్ల ఎక్కువగా ఇష్టపడే మద్యం ప్రియులు బీరు సీసాలో తేలు రావడంతో అయోమయానికి గురయ్యారు. -
బీరు సీసాలో పురుగులు
ఉదయగిరి: పట్టణ సమీపంలోని గండిపాళెం మార్గంలో ఉన్న ఓ మద్యం షాపులో ఆది వా రం ఓ వ్యక్తి బీరు కొనుగోలుచేయగా అందులో సన్నని పురుగులున్నాయి. దీంతో అతను ఎక్సైజ్ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. -
బీరు బాటిల్లో చెత్తా చెదారం
కుషాయిగూడ: బీరు బాటిల్లో చెత్తా..చెదారంతో పాటుగా సన్నని పురుగులు దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..మల్కాజిగిరికి చెందిన యశ్వంత్ ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్‌లో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో చెత్తా, చెదారంతో పాటు సన్నని పురుగులు కనిపించడంతో అతను వైన్స్ నిర్వాహకులను నిలదీశాడు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈసీఐఎల్‌కు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు బీరు బాటిల్‌ను పరిశీలించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుని ఆరోపణలు వాస్తవమేనని, షాంపిల్స్ సేకరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రేమించలేదని బీరు సీసాతో దాడి..
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (16)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కుమురంభీం జిల్లా ఈస్గావ్ మండలం అనుకొండకు చెందిన గోవర్ధన్ (18) ఇదే కళాశాలలో గతేడాది పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడు శనివారం ఆదిలాబాద్‌కు వచ్చి తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ కళాశాల వెనుక మైదానంలో ఉన్న ఆ విద్యార్థినితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీర్ సీసాతో దాడి చేయగా ఆమె తల, మెడ, చేతిపై గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా చేతిపై గాయమైంది. ఈ క్రమంలో గోవర్ధన్ వారిని తోసేసి పరారీ కాగా.. స్థానికులు విద్యార్థినులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను షీ టీం సభ్యులు గాయపడిన విద్యార్థినిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
పోలీస్ స్టేషన్ లో నిర్భయను మించిన ఘోరం
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం మరింత ఆందోళన రేకెత్తించింది. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్హయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బెయిల్ మంజూరు కావడంతో తనకు జరిగిన ఘోరంపై న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది బాధితురాలు. స్టేషన్ ఎస్.ఓ.ఒ.రాకేశ్ శర్మ ఒక వారంపాటు తనను హింసించిన తీరును మీడియాకు బాధితురాలు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ .. కారంపొడిని చల్లారని ఆరోపించింది.కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. నీళ్ళు అడిగితే, మూత్రం త్రాగమంటూ పోలీసులకు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, తల్లి, భర్త, పిల్లలను పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది. బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులోమాదిరిగా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలపై క్రూరత్వాన్ని చాటుకున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ఉదంతంపై ర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. -
బీర్ బాటిల్లో బల్లి
-
అత్త పై బీర్ బాటిల్‌తో కోడలు దాడి