
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (16)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. కుమురంభీం జిల్లా ఈస్‌గావ్ మండలం అనుకొండకు చెందిన గోవర్ధన్ (18) ఇదే కళాశాలలో గతేడాది పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడు శనివారం ఆదిలాబాద్‌కు వచ్చి తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ కళాశాల వెనుక మైదానంలో ఉన్న ఆ విద్యార్థినితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీర్ సీసాతో దాడి చేయగా ఆమె తల, మెడ, చేతిపై గాయాలయ్యాయి.
అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా చేతిపై గాయమైంది. ఈ క్రమంలో గోవర్ధన్ వారిని తోసేసి పరారీ కాగా.. స్థానికులు విద్యార్థినులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను షీ టీం సభ్యులు గాయపడిన విద్యార్థినిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment