
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అప్పారావు
కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): వ్యక్తిగత కక్షల నేపథ్యంలో బీరు సీసాతో పొడిచిన వ్యక్తే తిరిగి బాధితుడికి సపర్యలు చేయడం.. ఆనక ఆసుపత్రులకు తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన పుప్పల అప్పారావుకు అదే గ్రామానికి చెందిన పుప్పల లోవరాజు మధ్య ఘర్షణ జరిగింది.
ఈ నేపథ్యంలో అప్పారావుపై లోవరాజు బీరు సీసాతో దాడిచేసి, విరిగిన సీసాను ఎడమ దవడలోకి దించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడ్ని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు జీజీహెచ్‌కు సిఫార్సు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసాతో పొడిచిన లోవరాజే అప్పారావును తొలుత పీహెచ్‌సీకి అక్కడి నుంచి జీజీహెచ్‌కి తరలించి దగ్గరుండి మరీ వైద్యం చేయిస్తూ సపర్యలు చేయడం కొసమెరుపు.
చదవండి: చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి
అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది
Comments
Please login to add a commentAdd a comment