సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment