
కుషాయిగూడ: బీరు బాటిల్‌లో చెత్తా..చెదారంతో పాటుగా సన్నని పురుగులు దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..మల్కాజిగిరికి చెందిన యశ్వంత్ ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్‌లో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో చెత్తా, చెదారంతో పాటు సన్నని పురుగులు కనిపించడంతో అతను వైన్స్ నిర్వాహకులను నిలదీశాడు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు ఘట్‌కేసర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈసీఐఎల్‌కు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు బీరు బాటిల్‌ను పరిశీలించారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుని ఆరోపణలు వాస్తవమేనని, షాంపిల్స్ సేకరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment