Wines shop
-
బీర్లు.. నో స్టాక్!
నల్లగొండ రూరల్: జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో బీర్ల కొరత ఏర్పడింది. చాలా వరకు వైన్స్‌ల ఎదుట బీర్లు.. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో లిక్కర్‌కు డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 155 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉండగా.. నల్లగొండలోని లిక్కర్ డిపోకు వచ్చిన బీర్లను ఎకై ్సజ్ అధికారులు ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు 80 పెట్టెల (ఒక పెట్టెలో 12 బీర్లు) చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవికి తోడు ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బీర్లకు డిమాండ్ పెరిగింది. కానీ, మద్యం ప్రియులకు వారు కోరుకున్న కంపెనీ బీర్లు లభించడం లేదు. మద్యం షాపుల వద్ద కేవలం ఫలానా కంపెనీకి చెందిన బీర్లు మాత్రమే ఉన్నాయనే బోర్డులు పెడుతున్నారు. అవి కూడా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయి. కోరుకున్న బీర్లు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపుల్లో ఎక్కువ ధరకు బీర్లు అమ్ముతున్నట్లు సమాచారం. డిమాండ్‌కు తగినట్లుగా లేని సరఫరా నల్లగొండలోని లిక్కర్ డిపో నుంచి నల్లగొండ జిల్లాలోని 155 వైన్స్‌లు, 21 బార్లు, సూర్యాపేట జిల్లాలోని 99 వైన్స్‌లు, 16 బార్లకు రోజుకు 20వేల నుంచి 25వేల పెట్టల బీర్లు సరఫరా చేస్తున్నామని ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బీర్ల దిగుమతిలో తేడా లేదని, వేసవి కారణంగా బీర్లకు డిమాండ్ పెరగగా.. అందుకు తగినట్లుగా బీర్ల సరఫరా లేకపోవడంతో మద్యం షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శమిస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగిన డిమాండ్.. మద్యం డిపోకు రోజు 20వేల నుంచి 25వేల పెట్టెల బీర్లు దిగుమతి అవుతున్నాయి. ఈ బీర్లను అన్ని షాపులకు రేషన్ ప్రకారం సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లిక్కర్ డిపో నుంచి మద్యం దుకాణాలకు 1,30,379 పెట్టెల బీర్లు సరఫరా చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1,62,227 పెట్టెల బీర్లు సరఫరా చేశారు. గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈసారి 31,848 పెట్టెల బీర్లు అదనంగా సరఫరా చేశారు. గతేడాది ఏప్రిల్ నెలలో మొదటి 15 రోజులకు గాను రూ.21.25కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి 15 రోజుల్లో రూ.27.25కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా ఈ ఏడాది రూ.6 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అదేవిధంగా గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 75 వేల పెట్టెల లిక్కర్ అమ్మడం ద్వారా రూ.57.20కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక లక్షా 31 వేల పెట్టెల లిక్కర్ అమ్మడం ద్వారా రూ.93.75కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి 15 రోజుల్లో రూ.36.55కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. -
మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచే వైన్‌షాప్‌లు బంద్
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
Fact Check: పాచి పాటే.. మళ్లీ పురందేశ్వరి నోటా!?
సాక్షి, అమరావతి: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటే ఇదేనేమో.. బీజేపీలో సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటివారు చంద్రబాబు స్లీపర్‌సెల్స్‌గా ఇప్పటికే పనిచేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి వారు బీజేపీ ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం హైరానా పడుతూ ఉంటారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇప్పుడా జాబితాలోకి వచ్చి చేరారు. బీజేపీ పచ్చబ్యాచ్లో కొత్తగా చేరిన ఆమె తన మరిది చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు తెగతాపత్రయ పడుతున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలపై నాలుగేళ్లుగా టీడీపీ చేసిచేసి వదిలేసిన పసలేని, పాచిపోయిన ఆరోపణలనే ఆమె తాజాగా ఆలపిస్తున్నారు. రోజుకో అసత్య ఆరోపణతో పచ్చ మీడియాలో ప్రముఖంగా కనిపించేందుకు నానాపాట్లు పడుతున్నారు. కానీ, పురందేశ్వరి తాజాగా చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తి నిరాధారమని ఇప్పటికే పలుసార్లు స్పష్టమైంది. గతంలో టీడీపీ, ప్రస్తుతం పురందేశ్వరి చేస్తున్న దు్రష్పచారాన్ని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఆధారాలతో సహా సమర్థంగా తిప్పికొట్టింది. ఆమె తాజాఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెవరేజస్ కార్పొరేషన్ పునరుద్ఘాటించింది. నిజాలు చూడమ్మా.. కట్టు కథలు కట్టిపెట్టమ్మా రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీల నుంచే ప్రభుత్వం అత్యధికంగా మద్యం కొనుగోలు చేస్తోందని పురందేశ్వరి చేసిన ఆరోపణ బెడిసికట్టింది. మద్యం కొనుగోళ్ల కోసం 2015 నుంచి రాష్ట్రంలో అమలుచేస్తున్న విధానాన్నే ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఇక మద్యం కొనుగోళ్లపై ఆమె చెప్పిన లెక్కలన్నీ కాకిలెక్కలేనన్నది స్పష్టమైంది. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల నుంచి పారదర్శకంగా మద్యం కొనుగోలు చేస్తున్నారని బెవరేజస్ కార్పొరేషన్ రికార్డులు వెల్లడించాయి. అవి.. ► ఆదాన్ డిస్టిలరీ నుంచి ఒక ఏడాదిలోనే రూ.1,164.38 కోట్ల విలువైన మద్యం కొన్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, 2019, అక్టోబరు 1 నుంచి 2023, సెపె్టంబరు 30 వరకు అదాన్ డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చెల్లించింది కేవలం రూ.443.01 కోట్లు మాత్రమే. ► ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి రూ.1,863 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి కూడా ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.876.38 కోట్లు విలువైన మద్యమే కొనుగోలు చేసింది. ► ఇక ఎస్ఎన్జీ డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం రూఐ.1,996.66 కోట్లు విలువైన మద్యం కొనుగోలు చేసిందని పురందేశ్వరి ఆరోపించారు. దాని నుంచి కూడా ప్రభుత్వం రూ.1,214.40 కోట్ల మద్యమే కొనుగోలు చేసింది. ► అలాగే, రాడికో ఖైతాన్ డిస్టిలరీ నుంచి రూ.948.64 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసినట్లు పురంధేశ్వరి ఆరోపించారు. కానీ, ఆ డిస్టిలరీ నుంచి ప్రభుత్వం రూ.719.92 కోట్ల విలువైన మద్యాన్నే కొనుగోలు చేసింది. మద్యం మాఫియా ఆటకట్టించిన సీఎం జగన్.. నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మూడు మద్యం షాపులు.. ఆరు బెల్డ్ షాపులుగా యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. అంతేకాక.. ► మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించి ఆ వేళలను కచి్చతంగా అమలుచేస్తున్నారు. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను సమూలంగా తొలగించారు. ► అలాగే, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దుచేశారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది. ► అంతేకాక, మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను కూడా పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులూ ఇవ్వలేదు. ► ఒక్కో వ్యక్తికి గరిష్టంగా ఆరు బాటిళ్లు అమ్మేందుకు ఉన్న పరిమితిని మూడు బాటిళ్లకు కుదించింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు మద్యం ధరలు షాక్ కొట్టేలా పెంచారు. ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ► ప్రజలను మద్యం మహమ్మారి నుంచి దూరం చేసేందుకు మద్య విమోచన కమిటీని ఏర్పాటుచేసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటుచేసి గంజాయి, అక్రమ మద్యం, సారా దందా ఆటకట్టిస్తోంది. నగదు, డిజిటల్ విధానంలో చెల్లింపులు.. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కూడా బెవరేజస్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది. నగదు విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఏ రోజుకా రోజు ఆ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోజమచేస్తున్నారు. రోజువారి మద్యం నిల్వలు, అమ్మకాలు, బ్యాంకులో జమచేసిన నగదు వివరాలన్నీ కూడా బెవరేజస్ కార్పొరేషన్ పారదర్శకంగా వెల్లడిస్తోంది. నాణ్యతలోనూ రాజీలేకుండా.. ఇక రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడటంలేదు. మద్యం నాణ్యతను పరీక్షించేందుకు బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక ల్యాబలేటరీలను నెలకొలిపింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 96,614 శాంపిల్స్‌ను మాత్రమే పరీక్షించగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్షిస్తోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గిందన్న కేంద్రం.. మరోవైపు.. రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో 34.9 శాతం మంది పురుషులు, 0.4 శాతం మంది మహిళలు మద్యం సేవించేవారు. అదే 2019–21 నాటికి పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ విధానంతోనే ఈ సత్ఫలితాలు సాధ్యమయ్యాయి. అవన్నీ చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీలే.. నిజానికి.. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. వాటన్నింటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాలే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఇక చంద్రబాబు టీడీపీ కీలక నేతలకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకే అనుమతులిచ్చారు. ఉదా.. ► పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా సుధాకర్‌కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. ఎస్పీవై ఆగ్రో ప్రొడక్షన్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. .. ఇలా చంద్రబాబు అనుమతిచ్చిన డిస్టిలరీల నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మద్యం కొనుగోలు చేస్తోంది. అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందేముందీ? ఈ వాస్తవాలు కనిపించవా.. పురందేశ్వరి!? చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కొనుగోళ్లు.. పచ్చ పైత్యంతో పురందేశ్వరి వాస్తవాలను గుర్తించడంలేదు కానీ.. మద్యం కొనుగోళ్లలో అస్మదీయుల డిస్టిలరీలకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు అత్యంత సన్నిహితులైన వారికే ఎక్కువ మద్యం ఆర్డర్లనీ కట్టబెట్టారు. కేవలం నాలుగైదు కంపెనీలకు మాత్రమే 70శాతం ఆర్డర్లు ఇచ్చారు. తన సన్నిహితులు, బినామీలకు ఏకపక్షంగా ఆర్డర్లు ఇచ్చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. అది ఎలాగంటే.. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014–15 నుంచి 2018–19 వరకూ ఇష్టారాజ్యంగా మద్యం కొనుగోళ్లు చేశారు. టీడీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలో యునైటెడ్ స్పిరిట్స్‌కు 46.01%, రెండో ఏడాది 45.31%, మూడో ఏడాది 44.29%, నాలుగో ఏడాది 37.69%, ఐదో ఏడాది 31.9% ఆర్డర్లు ఇవ్వడమే దీనికి నిదర్శనం. ► అలైడ్ బ్లెండక్స్ మరియు డిస్టిలరీస్‌కు వరుసగా ఆ ఐదేళ్లలో 9.43%, 13.41%,10.04%, 10.73%, 7.53 శాతం ఆర్డర్లు దక్కాయి. ఇలా మొదటి నాలుగైదు కంపెనీలకే దాదాపు 70శాతానికి పైగా ఆర్డర్లు దక్కాయి. మిగిలిన కంపెనీలకు అరకొరగా ఇచ్చేవారు. ఆ మతలబును ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబు ప్రభుత్వంలో కూడా 100కు పైగా మద్యం డిస్టిలరీలు ఉన్నాయి. కానీ, వాటిలో కేవలం నాలుగైదు డిస్టిలరీలకే 70శాతానికి పైగా మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక ఉన్న గూడుపుఠాణి ఏమిటన్నది పురందేశ్వరి ఏనాడూ ప్రశ్నించలేదు. మరి దీనివెనుక మతలబు ఏమిటి? ఇది కుంభకోణం కాదా? మరి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదో పురందేశ్వరే సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని డిస్టిలరీలకు దాదాపు సమానంగా మద్యం ఆర్డర్లు ఇస్తూ పారదర్శక విధానాన్ని పాటిస్తుంటే ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. సత్ఫలితాలిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఈ గణాంకాలే సాక్ష్యం.. -
మద్యం దుకాణాలకు.. బినామీల సునామీ..!
మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కొన్ని మద్యం దుకాణాలు వరించాయి. ఇందులో జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు దుకాణాలు వచ్చిన ప్రాంతాల్లో మద్యం విక్రయించడానికి కొంత షేర్ కావాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సామాన్యులు దక్కించుకున్న దుకాణాలను సైతం కైవసం చేసుకునే పనిలో లిక్కర్ డాన్లు బిజీగా ఉన్నారు. రెండేళ్లపాటు మీకు సక్రమంగా నిర్వహించడానికి రాదని.. మీకు ఎంతో కొంత ఇస్తాం.. వ్యాపారం మేము చేస్తాం అంటూ నయానో.. భయానో సొంతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇటీవల మద్యం దుకాణాలు లక్కీడిప్ ద్వారా ఇతరులకు దక్కిన వాటిని చేజిక్కించుకునేందుకు లిక్కర్ కింగ్‌లు రంగంలోకి దిగారు. ఇప్పటికే పాత దుకాణాల్లో డిమాండ్ ఉన్న వాటిలో అంటిపెట్టుకోవడానికి గుడ్‌విల్‌తోపాటు ప్రత్యేక షేర్లు అడుగుతున్నారు. కల్తీ మద్యం విక్రయాల్లో ఆరితేరిన కొందరు వ్యాపారులు గుడ్‌విల్ ఇచ్చి ఎలాగైనా దుకాణాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో దుకాణానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు గుడ్‌విల్ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆ స్థాయిలో లాభాలు ఉన్నాయా అనే చర్చ మరోసారి ఇటు వ్యాపారుల్లో, అటు ప్రజల్లో సాగుతోంది. కల్తీ మద్యంలో ఆరితేరిన వ్యాపారులే దుకాణాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో విక్రయాలు.. ఉమ్మడి జిల్లాలోని 230 మద్యం దుకాణాలలో విక్రయాలు గణనీయంగా ఉన్నాయి. ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులే ఇక్కడ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈసారి దుకాణాలు లక్కీడిప్‌లో ఇతరులకు దక్కినా.. లాభాలు రుచిమరిగి ఉండటంతో పాత వ్యాపారులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఉండే బెల్టు షాపులకు దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తారు. అయితే ప్రభుత్వం అందించే మద్యం విక్రయిస్తే ఎక్కువగా లాభం ఉండకపోవడంతో ఈ బెల్టు దుకాణాలు కల్తీ మద్యం విక్రయాలకు అడ్డాగా మారాయి. కల్తీ మద్యాన్ని కొందరు వ్యాపారులే సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని కొందరు మద్యం వ్యాపారులకు మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారుచేసే వ్యాపారులతో సంబంధాలు ఉండటంతోనే ఉమ్మడి జిల్లాలో కల్తీమద్యం ఏరులై పారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల మండలాల్లోనే మద్యం వ్యాపారులు తమ పలుకుబడి ఎక్కువగా ఉండే గ్రామాలను కల్తీ చేసేందుకు ఎంచుకుంటున్నారు. మద్యంలో రంగునీళ్లు కలిపి అన్ని బెల్టు షాపులకు పంపిణీ చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం సీసాల సీల్ విప్పి తిరిగి వేసే యంత్రాలు సైతం కొందరి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారంలో పేరుగాంచిన వ్యక్తులు అధిక లాభాలు ఉండటం వల్ల దుకాణాలు ఎవరికి వచ్చినా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. చట్టప్రకారం నేరం.. లక్కీడిప్‌లో దుకాణం సొంతం చేసుకుని రిజిష్టర్‌లో సంతకం చేసిన వారి పేరిటే లైసెన్స్ ఇస్తాం. నవంబర్ 25 వరకు కొత్త దుకాణదారులకు లైసెన్స్ జారీ చేస్తాం. గుడ్‌విల్ ఇచ్చి దుకాణాలు తీసుకోవడం చట్టప్రకారం నేరం. అలా చేసుకున్న వారికి దుకాణంపై ఎలాంటి హక్కులు ఉండవు. ఎకై ్సజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకున్న వారే మద్యం దుకాణాలు నడపాలి. అమ్మకాల్లో ఏదైనా సమస్య వస్తే మద్యం దుకాణ లైసెన్స్ ఎవరి పేరుపై ఉంటే వాళ్లే బాధ్యులు అవుతారు. భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు జరిగినా లైసెన్స్ ఉన్న వ్యక్తులపైనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – దత్తరాజ్‌గౌడ్, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ -
రిజర్వుడ్ వైన్‌షాపుల గుర్తింపు..! నేడు నోటిఫికేషన్ జారీ..
ఆదిలాబాద్: జిల్లాలోని రిజర్వుడ్ వైన్‌షాపులను లాటరీ విధానంలో ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం రిజర్వేషన్ షాపుల గుర్తింపునకు లాటరీ తీసి ఆయా షాప్ నంబర్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 40 వైన్‌షాపులుండగా ఇందులో 15 రిజర్వ్ కాగా, 25 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రిజర్వ్ చేసిన 15 షాపుల్లో గౌడ్స్‌కు జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి షాపు–1 వచ్చింది. ఎస్సీలకు 5 షాపులు కేటాయించగా, ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లోని షాపు నంబర్ 9, రైల్వేగేటు సమీపంలోని షాపు నంబర్ 10, బేలలోని షాపు నంబర్ 11, భీంపూర్ మండల కేంద్రంలోని షాపు నంబర్ 18, బజార్హత్నూర్ మండలం గిర్నూర్లోని షాపు నంబర్ 29 కేటాయించారు. ఎస్టీలకు తొమ్మిది షాపులు రిజర్వ్ కాగా, ఇవన్నీ ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వచ్చాయి. నేడు నోటిఫికేషన్ జారీ.. నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేయనుంది. వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈనెల 18న సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తుకు గడువు ఉంది. 21న లాటరీ పద్ధతిలో వైన్‌షాపులను కేటాయిస్తారు. దరఖాస్తు వివరాలు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే వెల్లడించనున్నట్లు డీపీఈవో హిమశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. -
త్వరలో షురూ..! కిక్కెక్కించే... లక్కెవరికో..?
నిజామాబాద్: వైన్ దుకాణాలకు టెండర్లు నవంబర్‌లో జరగాల్సి ఉండగా ముందస్తుగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న వైన్స్‌లకు మరో రెండునెలల పాటు లైసెన్స్‌లు ఉండగానే ముందుస్తుగా టెండర్లు వేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలుండడంతో ఆ సమయంలో లాటరీల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి అధికారులు జిల్లాలోని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ముందుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2021–2023 పిరియడ్ ముగియకముందే 20 23–2025 సంబంధించి వైన్స్ దుకాణాలకు లైసెన్స్ లు ఇచ్చేందుకు జీవో నం. 86ను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. దీంతో ఈనెల 4వ తేదీ నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అందించనున్నారు. టెండర్లు ఇలా.. ఎక్సైజ్ శాఖ కొత్త ఎకై ్సజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తుందని డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ ద శరథం పేర్కొన్నారు. ఈనెల 3న జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, గౌడ, ఓపెన్ అభ్యర్థులకు వైన్ షాప్‌లు కేటాయిస్తారు. ఈనెల 3న వైన్ దుకాణాల కు నోటి ఫికేషన్ విడుదల చేస్తారని, 4న జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ దరఖాస్తులు నింపి రూ. 2 లక్షలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటలకు దరఖాస్తులను తీసుకుంటామని, 21న వైన్స్ లైసెన్స్‌లకు సంబంధించిన డ్రా తీస్తామన్నారు. వైన్స్ లైసెన్స్‌లు లాటరీలో వచ్చిన వారు అదే రోజు గాని మరుసటి రోజు (21, 22 తేదీల్లో) మొదటి ఇన్స్టాల్ మెంట్ చెల్లించాలని, వైన్స్‌లకు మద్యంను ఈనెల 30న అందిస్తామని, డిసెంబర్ 1 నుంచి షాపులను లైసెన్స్ పొందినవారు నడిపించుకోవాలన్నారు. దరఖాస్తుల ద్వారా రూ. 35.24 కోట్ల ఆదాయం జిల్లాలో 102 వైన్స్‌షాపులు ఉండగా వీటిని దక్కించుకోవడానికి 2021 నవంబర్‌లో 1,762 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 1,762 దరఖాస్తుదారులకు సంబంధించి రూ. 35.24 కోట్లు ఆదాయం చేకూరింది. ఒక్కో దరఖాస్తుదారుడు ప్రస్తుతం లాటరీలో పాల్గొనేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వరు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో జిల్లాలో వైన్స్‌లకు టెండర్లు సంఖ్య పెరిగి, రూ. 42 కోట్ల నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌లో పాత లైసెన్స్‌లు క్లోజ్.. 2021–2023కు గాను వైన్ దుకాణాల లైసెన్స్‌లు నవంబర్‌లో పూర్తవుతాయి. అసలైతే నవంబర్లోనే వైన్స్‌లకు దరఖాస్తులు ఆహ్వానించి మూడో వారంలో లాటరీ తీసేవారు. ఈ లాటరీలో వచ్చిన వారికి ఎక్కడ వచ్చిందో అక్కడ డిసెంబర్ 1 నుంచి వైన్స్లలో మద్యం అమ్మకాలు సాగించాల్సి ఉండేది. కాని ఈసారి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేందుకు ముందుగానే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. -
వైన్స్‌లో చోరీ..! ఎందుకీ తేడా? పలు అనుమానాలకు దారితీస్తున్న చోరీ..!!
ఆదిలాబాద్: జాతీయ రహదారికి కూతవేటు దూరాన భోరజ్ సమీపంలో ఉన్న వైన్స్ షాపులో శనివారం రాత్రి జరిగిన చోరీలో కొత్త కోణం బయటపడింది. దాదాపు 26 పెట్టెల మద్యం, రూ.70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలు సేకరించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులు చెప్పిన సొమ్ముకు, పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సొమ్ముకు పొత్తన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.3 లక్షల వరకు చోరీకి గురైనట్లు నిర్వాహకులు చెప్పారు. రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. కాగా, చోరీ సొత్తుపై స్పష్టత కొరవడింది. ఎందుకీ తేడా? వైన్స్షాపులో చోరీని గుర్తించి నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.2.30 లక్షల విలువ చేసే మద్యం, రూ.70 వేల నగదును ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వైన్స్ షాపును పరిశీలించారు. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైందని, నిర్వాహకులు అబద్దం చెబుతున్నారని అనధికారికంగా వెల్లడించారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చోరీకి గురైన సొమ్మును నిర్వాహకులు ఎక్కువగా చేసి చూపుతున్నారని కేసు నమోదు చేయడానికి వెనక ముందు చేశారు. చోరీ విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. రూ.62 వేల విలువ చేసే మద్యంతోపాటు మరో రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు మాత్రం రూ.3లక్షల వరకు చోరీ అయిందని చెప్పడం గమనార్హం. ఏదీ నిజం ? వైన్స్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించడం అనే పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. రూ.3 లక్షల వరకు సొత్తు చోరీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోద చేస్తే, అంత మొత్తం రికవరీ చూపించడం కష్టం ఉంటుందని పోలీసులే కావాలనే రూ.70 వేలు మాత్రమే అని నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నిర్వాహకుల నిజాయితీపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఊరికి బయట ఉన్న వైన్స్‌లో రాత్రి వేళ కౌంటర్లో రూ.70 వేల వరకు నగదు ఉంచాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత డబ్బులు, మద్యం సీసాలతో నిండిన షాపులో కాపలాగా ఎవరిని ఎందుకు నియమించలేదు? రూ.3 లక్షలు చోరీకి గురైతే ఎఫ్ఐఆర్లో రూ. 70వేలు అని పోలీసులు రాస్తే, నిర్వాహకులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నలకు సమాధానాలు లేవు. అసలు సీసీ టీవీలో కనిపిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? చోరీకి గురైన సొత్తు ఎంత? నిర్వాహకులు, పోలీసుల చెబుతున్నది ఎవరిది నిజం? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ టీవీల్లో రికార్డ్ అయిన దొంగలు దొరకాలి. ఈ విషయమై సీఐ కోల నరేశ్‌ను వివరణ కోరగా, కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
బాగా తాగు..! తాగి ఊగు..! దొరికితే అంతే సంగతులు..!!
నిజామాబాద్: ‘తాగాలి.. తాగి ఊగాలి..’ అనేది పాత సామెత. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ‘మరింతగా తాగాలి.. డ్రంకెన్ డ్రైవ్‌కు చిక్కి వేసినంత జరిమానా కట్టాలి’ అనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో వైన్స్ వ్యాపారులను లిక్కర్ అమ్మకాలు పెంచాలంటూ ఆబ్కారీ అధికారులు మెడమీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు. బీర్ల అమ్మకాలను నామమాత్రం చేసి లిక్కర్ అమ్మకాలు భారీగా పెంచాలంటుండడంతో వ్యాపారులు గుస్సా అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 180 వైన్స్‌లు ఉన్నాయి. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తాజాగా ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్స్‌లకు రూ. 10 లక్షల మేర అరువు మీద సరుకు అంటగట్టారు. వ్యాపారులు అయిష్టంగానే తీసుకున్నా రు. ఇందుకు సంబంధించి వ్యాపారుల వద్ద నుంచి బలవంతంగా ఇప్పటివరకు రూ. 13 కోట్ల మేర చె క్కులు వసూలు చేశారు. ఈ చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఆగస్టు 3న చెల్లించాలని డెడ్‌లైన్ వి ధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెలాఖరుకు సంబంధించిన టార్గెట్ మేరకు కూడా నగదు చెల్లించి సరుకు తీసుకోవాల్సిందేనని హుకుం జారీ కావడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనా భా ఆధారంగా, గతంలో జరిగిన అమ్మకాల మేరకు లక్ష్యం విధించారు. అమ్మకాలు తగ్గితే సదరు వైన్స్‌లపై కేసులు నమోదు చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వాపోతున్నారు. వర్షం కారణంగా అమ్మకా లు తగ్గినా ఊరుకునేది లేదని కమిషనరేట్ నుంచి కోప్పడుతుండడంతో అధికారులు సైతం టెన్షన్ ప డుతున్నారు. అమ్మకాల పెంపు కోసం ఆబ్కారీ అధికారులు సర్కిల్స్ వారీగా నిరంతరం స మావేశాలు పెడుతున్నారు. అమ్మకాలు తగ్గితే మా త్రం ఆయా ప్రాంతాల్లో నాటుసారా, ఇతర రాష్ట్రాల మద్యం వస్తుందంటూ వైన్స్ వ్యాపారులను తిడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో కొందరు ఆబ్కారీ సీఐలు దగ్గరుండి వ్యాపారులకు అప్పులిప్పించి మరీ సరు కు కొనిపించిన సందర్భాలు అనేకమున్నాయి. మరోవైపు పోలీస్‌శాఖ.. మద్యం అమ్మకాల విషయంలో ఆబ్కారీ శాఖ ఒక్క చిన్న అవకాశం కూడా వదలట్లేదు. ప్రభుత్వం కూడా అమ్మకాల విషయంలో తగ్గేదే లేదంటోంది. 2021 నవంబర్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లు దక్కించుకున్నవాళ్లు డిసెంబర్ 1 నుంచి షాపులు ప్రాంరంభించాల్సిన నేపథ్యంలో నవంబర్ 28వ తేదీనే వాళ్లకు సరుకు అంటగట్టారు. షాపులు సమయానికి దొరకని వాళ్లు టెంటు వేసైనా సరే డిసెంబర్ 1న అ మ్మకాలు ప్రారంభించాలని ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించడం గమనార్హం. అ యితే వైన్స్ వ్యాపారులు, పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ విషయమై ప్రస్తావించారు. ఆబ్కారీ అధికారులు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం తమ టార్గెట్ తమకుందని, డ్రంకెన్ డ్రైవ్ ను ఆపడం కుదరదని తేల్చిచెప్పడంతో తకరారు ప డింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఒక చోట ఈ డ్రంకెన్ డ్రైవ్ నేపథ్యంలో ఒక వ్యక్తి వైన్స్ షెట్టర్‌ను కిందికి లాగి అమ్మకాలు చేయవద్దని గొడవ చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై ఆబ్కారీ అధికారులు పోలీసు కేసు పెట్టారు. ఇలాంటి ఘటనలు పలుచోట్ల గతంలోనూ చోటుచేసుకున్నాయి. మొత్తంమీద ఆబ్కారీ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులు మరిన్ని ఏ ర్పాటు చేసి అమ్మకాలు చేస్తుండడం విశేషం. అధికారులే అనుమతులిచ్చి.. మద్యం బెల్టు దుకాణాలను నిర్మూలించాల్సిన ఆబ్కారీ అధికారులే వాటిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీలు, మ రికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, పెద్దలు మద్యం అమ్మకాలను లేకుండా చేసేందుకు ఆయా గ్రామాల్లో బెల్టు షాపులను పెట్టకుండా కట్టుబా ట్లు విధించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలను పెంచేందుకు గాను ఆబ్కారీ అధికారులే బెల్టు షాపులు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా గ్రామాల పెద్దలను, సర్పంచ్‌లను కలిసి మాట్లాడి ఒప్పిస్తుండడం విశేషం. ఎక్కువమంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ వాళ్లే కావడంతో ఆబ్కారీ అధికారులు సంక్షేమ పథకాల కు డబ్బులు అవసరమనే మాటలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. మరో విశేషమేమిటంటే బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ పోలీసులకు సైతం చెప్పడం కొసమెరుపు. -
ఎనీ టైం మద్యం రెడీ..
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచి జోరుగా మద్యం అమ్ముతున్నప్పటికీ ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో 13 బార్లు ఉండగా అందులో 12 బార్లు నడుస్తున్నాయి. ఎకై ్సజ్ నిబంధనల మేరకు బార్లలో మద్యాన్ని బార్లోపలే అమ్మాలి. కాని నగరంలో గత కొన్నేళ్లుగా లిక్కర్ దందాలో ఆరితేరిన వ్యాపారి ఒకరు తన బార్లో దర్జాగా రాత్రి 10 గంటల తర్వాత షట్టర్ తెరిచి బయటకు అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా ఎకై ్స జ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున.. నగరంలోని శివాజీనగర్ చౌరస్తా, గుర్బాబాది రోడ్డు, అర్సపల్లి రోడ్డులో ఉన్న బార్లు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బాహాటంగానే బయటకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం వైన్స్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మాలి. బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు తెరిచి ఉంచాలి. కాని నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న బార్లు రాత్రి 10 గంటల తర్వాత వైన్స్‌లు మూసిన అనంతరం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు. అధికారికంగా బార్ తలుపులు మూసి ఉంచినప్పటికీ అనధికారికంగా రాత్రి ఒంటి గంట వరకు కూడా దర్జాగా మద్యం అమ్ముతున్నారు. ఎకై ్స్జ్ అధికారులకు నెలవారీగా మామూళ్లు అందుతుండడం వల్లే వాటి జోలికి వెళ్లట్లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే.. నగరంలోని బార్లకు వైన్స్ మద్యం తరులుతున్నా ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. గతంలో ఓ బార్లో వైన్స్ మద్యం దొరకడంతో అప్పుడు ఉన్న ఓ ఎకై ్సజ్ అధికారితో బేరసారాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై డిప్యూటీ కమిష నర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి విచారణ చేపట్టారు. ఈ విచారణ కూడా నామమాత్రంగానే జరిగినట్లు సమాచారం. అలాగే అర్ధరాత్రి తర్వాత బార్లో మద్యం బయటకు అమ్మడంపై తనిఖీలు చేయాలని ఎకై ్సజ్ ఎస్సైకి ఆదేశాలు అందినప్పటికీ తనిఖీలు చేపట్టకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైన్స్‌ల ఆదాయానికి గండి.. నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో పరిధిలో 19 వైన్స్‌లు ఉన్నాయి. ఈ వైన్స్‌లో రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు. కాని బార్లు అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతుండడంతో తమ ఆదాయానికి గండి పడుతోందని వైన్స్ యజమానులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ బార్లు కూడా బీర్‌కు రూ. 20, విస్కీకి రూ. 50 చొప్పున అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్లు తెలిసింది. తనిఖీలు చేస్తాం.. రాత్రివేళ్లలో తనిఖీలు చేపట్టాలని ఎస్‌హెచ్‌వో దిలీప్‌కు ఆదేశాలిచ్చాను. ఎకై ్సజ్ ఎస్సై మల్లేశ్‌కు తనిఖీలు చేపట్టాలని సూచించాం. బార్లకు వచ్చిన మద్యంను బయటకు అమ్మడానికి లేదు. ఇలా చేస్తే నోటీసులు అందిస్తాం. బార్లు అ ర్ధరాత్రికి అమ్మకాలు చేస్తున్నారని వైన్స్ యాజ మాన్యాల నుంచి ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకుంటాం. – మల్లారెడ్డి, -
పోలీసులున్నా.. రోడ్డుపైనే తాగేస్తున్నారు..
నిజామాబాద్ నగరంలోని నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డులో సోమవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ.. చలాన్లు విధిస్తున్నారు. మరోపక్క అదే రోడ్డులోని వైన్స్ దుకాణం ఎదురుగా గల డివైడర్‌పై ఇద్దరు మందు బాబులు మద్యం తాగుతూ, దారిన పోయే ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. పక్కనే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, మందుబాబులు మద్యం తాగడంపై పలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులు వారిని పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పూటుగా మద్యం తాగి.. సెల్‌ఫోన్ కోసం గొడవ..
సాక్షి, జగద్గిరిగుట్ట (హైదరాబాద్): సెల్‌ఫోన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద సోమవారం భూక్య భీమా(45), తన స్నేహితుడు ఫుల్‌గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్‌ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. వైన్స్ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్‌ను చెక్ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు. చదవండి: న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు -
ఈ దారి మందుబాబుల కోసమే..
సాక్షి, మంచిర్యాల: ఓ మద్యం షాపు పుణ్యమా అని ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు పూర్తిగా మందు బాబులకే అంకితమైంది. ప్రజాధనంతో రూ.లక్షలు ఖర్చు చేసి మున్సిపాలిటీ పాలకవర్గం రోడ్డు వేయిస్తే ఆ రోడ్డు స్థానికులకు ఉపయోగం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీచౌరస్తాకు వెళ్లే మార్గమధ్యలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఓ వైన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ వైన్స్‌కు వచ్చే కస్టమర్ల సిట్టింగ్ కోసం ప్రత్యేకంగా పర్మిట్ రూం ఉంది. అయితే రాత్రివేళలో వైన్స్‌కు వచ్చే వారు అనుమతి పొందిన పర్మిట్ రూంకే పరిమితం కాకుండా మందుబాబులు రోడ్డుపైకి కూడా వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్డుకు అడ్డుగా కాలనీవాసులు వేయగా ప్రస్తుతం వైన్స్ నిర్వాహకులు తీసి వేయడం లేదు. రోజు సాయంత్రం మద్యం షాపునకు వచ్చే కస్టమర్ల తాకిడితో ఆ కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. దీంతో ఆ కాలనీకి వెళ్లే రోడ్డును పూర్తిగా ఇనుప రేకులను అడ్డుగా ఉంచి రాకపోకలు లేకుండా దారిని బ్లాక్ చేశారు. వైన్స్ ఏర్పాటు చేయకముందు సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఈ రోడ్డు గుండా మెయిన్ రోడ్డుకు రాకపోకలు సాగించేవారు. అయితే తరచూ రోడ్డుపైకి మందుబాబులు వస్తుండడంతో ఏకంగా రోడ్డునే మందుబాబులకు కేటాయించినట్లు అయింది. రోడ్డు బ్లాక్‌పై అటు మున్సిపల్ అధికారులు, ఇటు ట్రాఫిక్, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ దారిని వైన్స్ యాజమానులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఇక రాత్రిపూట అయితే ఈరోడ్డుపైనే మద్యం సేవిస్తున్నారు. దీంతో ఆ కాలనీవాసులు ఈ రోడ్డు వైపు నుంచి రాకుండా వేరే మార్గం గుండా వెళ్తున్నారు. -
సికింద్రాబాద్ బోయిగూడలోని శ్రీవెంకటేశ్వర వైన్స్లోచోరీ
-
వైన్ షాపుల వద్ద టీడీపీ కార్యకర్తల క్యూ
-
జనగామలో కాల్పుల కలకలం
సాక్షి, కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్లలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు వైన్స్ షాప్ సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 6.70లక్షల నగదును లాక్కెళ్లారు. మంగళవారం రాత్రి వైన్స్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్న షాపు యజమానులను దుండగులు అడ్డగించారు. తుపాకితో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి వారి వద్ద నుంచి 6.70లక్షల రూపాయాలను ఎత్తుఎళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బీరు బాటిల్లో చెత్తా చెదారం
కుషాయిగూడ: బీరు బాటిల్లో చెత్తా..చెదారంతో పాటుగా సన్నని పురుగులు దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..మల్కాజిగిరికి చెందిన యశ్వంత్ ఈసీఐఎల్ చౌరస్తాలోని తేజ వైన్స్‌లో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో చెత్తా, చెదారంతో పాటు సన్నని పురుగులు కనిపించడంతో అతను వైన్స్ నిర్వాహకులను నిలదీశాడు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈసీఐఎల్‌కు చేరుకున్న ఎక్సైజ్ అధికారులు బీరు బాటిల్‌ను పరిశీలించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుని ఆరోపణలు వాస్తవమేనని, షాంపిల్స్ సేకరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైన్స్ షాపు లో చోరీ
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని సితార వైన్స్షాపులో ఆదివారం చోరీ జరిగింది. వైన్స్ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలోని సితార వైన్స్ నిర్వహకులు రోజులాగే శనివారం రాత్రి 10గంటలకు వైన్స్ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఉదయం 11గంటలకు షాపును తీసి చూడగా మద్యం కాటన్లు పక్కకు జరిపి, చిందర వందరగా పడేసి ఉన్నాయి. షాపులో ఉన్న సీసీ కెమరాలను పక్కకు తిప్పి ఉన్నాయి. షాపులో ఉన్న రూ.56వేలు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. షాపులోని సిట్టింగ్ గదికి ఉన్న తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. -
యువకుడిపై కత్తులతో దాడి, మృతి
జగిత్యాలరూరల్(కరీంనగర్): వైన్స్ షాపు ముందు మద్యం కొనుగోలు చేస్తున్న యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చనిగల్ గ్రామంలో బుధవారం జరిగింది. మండలంలోని గోవిందపల్లి గ్రామానికి చెందిన రాకేష్(20) వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా.. కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో అతనిపై దాడి చేసి పరారయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్టు సమాచారం. -
కిక్కు దిగింది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఓ వైపు మద్యం పాలసీ గడువు ముగుస్తోంది... కొత్త పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది... పెద్ద మొత్తాలతో షాపులు దక్కించుకున్న మద్యం వ్యాపారుల్లో అలజడి రేగుతోంది. వ్యాపారం ప్రారంభించింది మొదలు ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో ఆశించిన స్థాయిలో పెట్టుబడి దక్కించుకోలేకపోయారు. గడువు దగ్గరపడుతున్నకొద్దీ ఎమ్మార్పీని పక్కన పెట్టి మేం చెప్పిందే రేటు అన్నట్టు అమ్మకాలు సాగించారు. విస్తృతంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి తమ దందా సాగించారు. ఒక విధంగా చెప్పాలంటే వీరికి అధికారులు సైతం ఇతోధికంగా సాయపడ్డారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు సాహసించలేదు. అయితే రాష్ట్ర స్థాయి నిఘా అధికారులు ఇప్పుడు జిల్లాపై కన్నేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు స్థానికంగా ఉండడంతో దాడులపైనే దృష్టిసారించారు. ఇన్నాళ్లూ చూసీచూడనట్టు వ్యవహరించినా మద్యం చట్టం ప్రకారం కేసుల నమోదు, లక్ష్య సాధన విషయమై స్థానిక ఉద్యోగులు తనిఖీల్ని ముమ్మరం చేశారు. లెసైన్సీలకు తెలియకుండా అక్రమాలు జరగవన్న ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులకు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. దుకాణాల్లోని గుమాస్తాల్ని తీసుకువచ్చి అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ‘టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలో ఉన్నప్పుడు కూడా వ్యాపారులు జాగ్రత్త వహించడం లేదు. మా పని మేం చేసుకోక తప్పదు కదా’అని ఎక్సైజ్‌శాఖలోని ఓ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలతో వ్యాపారుల్లో అలజడి మొదలైంది. ఏడాదిపొడవునా వచ్చిన కష్టాలతో తాము పూర్తిగా నష్టపోయామనీ, ఇప్పుడు అధికారులు చేసిన ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల విలవిల పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి షాపులు దక్కించుకుని అమ్మకాలు చేపట్టాక వరుసగా తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాపారులు వాపోతున్నారు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో కొంత నష్టపోగా... ఎచ్చెర్లలో మద్యం డిపోను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయడం, మధ్యలో ఆమదాలవలస గోదాములనుంచి మద్యం సరఫరా చేయడంవల్ల సరకు సక్రమంగా సరఫరా కాక అమ్మకాలు చేయలేకపోయామని వారు చెబుతున్నారు. తమకు నష్టాలొస్తున్నాయని, అధికారుల దాడులతో విసిగిపోతున్నామని, మామూళ్లు ఇస్తున్నా సోదాల పేరిట ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టారు. గడువు సమీపిస్తుండడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చూసీ చూడనట్టు వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల చేతుల్లో లేకపోవడంతో టీడీపీ నాయకుల వెంట పడుతున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్టీఎఫ్ ఈ నేపథ్యంలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల్ని గుర్తించి తాజా నివేదికను హైదరాబాద్ పంపించినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో వ్యాపారులు హోలోగ్రామ్, కంప్యూటర్ పరికరాల సహాయంతోనే వ్యాపారం సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎక్కడా అమలు కాలేదు. ఇప్పుడు ఎక్కడ వ్యాపారులు దొరికినా కేసులు పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ వెనుకాడటంలేదని తెలుస్తోంది. -
మద్యం విక్రయిస్తే ఉపేక్షించం
అనుమతి లేకుండా మద్యం విక్రరుుస్తే ఉపేక్షించం అనుమతులు లేకుండా రెస్టారెంటుల్లో మద్యం తాగడంగానీ, విక్రయిచడంగానీ చేస్తే ఉపేక్షించబోమని ఎస్ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తెలిపారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ప్రత్తిపాడులోని రెస్టారెంట్లు నిర్వాహకులతో మాట్లాడారు. రాత్రి పదిన్నర గంటల తరువాత రెస్టారెంట్లు తెరిచి ఉండటానికి వీలులేదన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. రెస్టారెంటు ఎదుట మద్యం తాగరాదన్న బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్వేషాలకు పోకండి విద్వేషాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతాప్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలో హైపర్సెన్సిటివ్ గ్రామాలైన తిమ్మాపురం, వంగిపురంల్లో ఆయన బుధవారం పర్యటించారు. స్థానికులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు జరిగితే సమాచారం అందించాలని కోరారు. -
ఆ మద్యం దుకాణాలు ఇక బంద్!
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో మొత్తం 142 మద్యం దుకాణా లు ఉండగా, వీటిలో 121 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చారు. మిగిలిన 21 దుకాణాలకు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా, వ్యాపారులు ముందు కు రావటంలేదు. దీంతో 12 దుకాణాలను డిమాండ్ ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించారు. మిగిలిన 9 దుకాణాలకు ఈ నెల ఏడున టెండర్లు పిలిచారు. ఈసారి కూడా ఏ ఒక్క వ్యాపారీ టెండర్ వేయలేదు. దీంతో ఆబ్కారీ శాఖ ఆశించిన ఆదాయానికి గండి పడింది. టెండర్ల గడువు చివరి రోజైతే, కనీసం ఒక్క టెండరైనా వేయాలని అధికారులు వ్యాపారులను బతిమాలినా ఫలితం లేకుండా పోయిం ది. బాల్కొండ మండలం ముప్కాల్, ఆర్మూర్ మండలం పెర్కిట్, మామిడిపల్లి, కోటగిరి, ధర్పల్లి, భీంగల్, కామారెడ్డి మండలం దేవుని పల్లి, భిక్కనూర్, బాన్స్వాడ మండలం తాడ్కో ల్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. నిర్వహణ భారం మద్యం దుకాణాలు నడిపేందుకు మడిగెలు అద్దెకు తీసుకోవాలంటే నెల అద్దె భారీగా చెల్లిం చాలి. దానికి తోడు అడ్వాన్సులు, గ్రామాలలో ఏటా రూ.36 లక్షల లెసైన్సు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. వ్యాపారులకు మద్యం అమ్మకాలపై 25 శాతం కమీషన్, అది కూడ లెసైన్సు ఫీజు మొత్తానికి ఏడు రెట్లు అమ్మకాలు సాగించేంత వరకే ఇస్తారు. ఆ తరువాత జరిగే అమ్మకాలపై 14.5 శాతం పన్ను విధిస్తున్నారు. ఆబ్కారీ, పోలీసు మామూళ్లు, నజరానాలు, ఇతర ఖర్చు లు వెరసి ఖర్చు తడిసి మోపెడవు తోంది. లాభం మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనే పరిస్థితి నెలకొంది. అధికారు లు మద్యం దుకాణాలకు టెండర్ వచ్చేంత వరకు ఒక రకంగా, టెండర్ వచ్చాక మరొక రకంగా ప్రవర్తిస్తుండటంతో వ్యాపారులు భయపడి ముందుకు రావటం లేదని తెలుస్తోంది. ఈ సంవత్సరం లెసైన్సు రెన్యూవల్ పూర్తి అయి ఆరు నెలలు కావస్తోంది. ఖాళీగా ఉన్న దుకాణాలు తీసుకుంటే మిగిలిన నెలలకే లెసైన్సు ఫీజు ఉంటుంది. పర్మిట్ రూములకు రూ. రెండు లక్షలు చెల్లించవలసి ఉంటుంది. పర్మిట్ రూమ్‌కు కూడా మిగిలిన నెలలకు మాత్రమే రెంటల్ చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నా అధికారులు అంగీకరించడం లేదు. మళ్లీ టెండర్లు పిలుస్తాం జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాలకు మరోసారి టెండర్లు నిర్వహించనున్నట్లు ఆబ్కారీ సూపరింటెండెంట్ గంగారాం తెలిపారు. ఆయా ప్రాంతాలలో లాభాలు ఎక్కువగా లేకపోవటంతో టెండర్లు రావటంలేదన్నారు.