భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని సితార వైన్స్‌షాపులో ఆదివారం చోరీ జరిగింది. వైన్స్ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలోని సితార వైన్స్ నిర్వహకులు రోజులాగే శనివారం రాత్రి 10గంటలకు వైన్స్ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఉదయం 11గంటలకు షాపును తీసి చూడగా మద్యం కాటన్లు పక్కకు జరిపి, చిందర వందరగా పడేసి ఉన్నాయి. షాపులో ఉన్న సీసీ కెమరాలను పక్కకు తిప్పి ఉన్నాయి. షాపులో ఉన్న రూ.56వేలు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. షాపులోని సిట్టింగ్ గదికి ఉన్న తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు.