Housing board colony
-
కరీంనగర్: జలమయంగా మారిన హౌసింగ్ బోర్డ్ కాలనీ
-
వైన్స్ షాపు లో చోరీ
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని సితార వైన్స్షాపులో ఆదివారం చోరీ జరిగింది. వైన్స్ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలోని సితార వైన్స్ నిర్వహకులు రోజులాగే శనివారం రాత్రి 10గంటలకు వైన్స్ షాపును మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం ఉదయం 11గంటలకు షాపును తీసి చూడగా మద్యం కాటన్లు పక్కకు జరిపి, చిందర వందరగా పడేసి ఉన్నాయి. షాపులో ఉన్న సీసీ కెమరాలను పక్కకు తిప్పి ఉన్నాయి. షాపులో ఉన్న రూ.56వేలు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. షాపులోని సిట్టింగ్ గదికి ఉన్న తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. -
హౌసింగ్ బోర్డు కాలనీలో చోరీ
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మోర్తల సైదురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 16 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజి 700 గ్రాముల వెండి, రూ 9000 నగదు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ భిక్షపతి పరిశీలించారు. -
మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..
రాబంధువు ⇒ఒంగోలులో మూడేళ్లుగా మహిళ నిర్బంధం ⇒బంధువే వ్యభిచారం కూపంలోకి దించి చిత్రవధ ⇒మాదక ద్రవ్యాలు, మత్తు ఇచ్చి నిత్యం వేధింపులు ⇒రక్తమోడుతూ బయటకు పరుగులు తీసిన బాధితురాలు ⇒ స్థానికుల సాయంతో వ్యభిచారం నిర్వాహకుల గుట్టురట్టు ⇒ హౌసింగ్‌బోర్డు, అరుణోదయకాలనీల్లో రెండు ఇళ్ల తనిఖీ ⇒అక్కడి పరిస్థితులు చూసి నెవ్వెరపోయిన పోలీసులు ⇒ఓ నిర్వాహకుడు అరెస్టు.. పోలీసుస్టేషన్‌కు తరలింపు ఒంగోలు క్రైం : ఒంగోలులో మహిళలను బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించి వారిని చిత్రవధకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని హౌసింగ్ బోర్డుకాలనీతో పాటు అరుణోదయ కాలనీలో రెండు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. వివరాలు.. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్రగాయాలు, అరకొర దుస్తులతో 24 ఏళ్ల యువతి శుక్రవారం ఉదయం బయటకొచ్చి దొడ్డిదారి నుంచి పక్కింట్లోకి వెళ్లింది. ఆ ఇంటి యజమాని, ఎన్జీవో అసోసియేషన్ నాయకురాలు టి.రాజ్యలక్ష్మి.. ఆమెకు దుస్తులిచ్చి చేరదీసింది. వెంటనే చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించింది. తాలూకా పోలీసులతో సాగర్ అక్కడకు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన మాటలు విని స్థానికులు, పోలీసులు నివ్వెరపోయారు. బాధితురాలు గాయాలపాలై ఉంది. వీపుపై కొరికిన గాయాలున్నాయి. అంటే ఆమెను ఏ స్థాయిలో చిత్రహింసలకు గురి చేశారో అర్థమవుతోంది. మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. పుట్టినరోజుకు పిలిచి.. చచ్చే వరకు కొట్టి బాధితురాలిది కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం. వ్యభిచారం నిర్వాహకురాలు లక్ష్మిది కూడా అదే గ్రామం కావడం గమనార్హం. పైగా ఆమె బాధితురాలికి దూరపు బంధువు కూడా. పుట్టినరోజు పార్టీకని మూడేళ్ల క్రితం బాధితురాలిని లక్ష్మి తన ఇంటికి ఆహ్వానించింది. అప్పటి నుంచి ఆమెతో వ్యభిచారం చేయిస్తూనే ఉంది. బలవంతంగా మద్యం తాగించటం.. మత్తు పదార్థాలు తినిపించడం.. మాదక ద్రవ్యాలు చేతి మీద వేసి ముక్కుతో పీల్పించటం లక్ష్మికి వెన్నతో పెట్టిన విద్యని బాధితురాలు రోదిస్తూ చెబుతోంది. మంచానికి కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టేదని కన్నీటిపర్యంతమైంది. రోకలిబండతో కొట్టడం.. కత్తితో పొడుస్తానని బెదిరించటం లక్ష్మికి నిత్యకృత్యమని చెప్పడంతో పోలీసులు సైతం చలించారు. ఇక్కడా అంతే.. బాధితురాలి కథనం ప్రకారం అరుణోదయకాలనీలోని ఓ ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. తీరా అక్కడ శ్రీను అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఆ ఇల్లు కూడా హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఇంటిని తలపించింది. సుమారు 100కుపైగా సీడీలు బయటపడ్డాయి. వాటిల్లో అశ్లీల చిత్రాలు, సినిమాలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. అది ఇల్లేనా? హౌసింగ్‌బోర్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటికి బాధితురాలితో కలిసి పోలీసులు వెళ్లారు. అప్పటికే లక్ష్మి తన ఇంటిక తాళం వేసి పరారైంది. ఇంటి చుట్టూ తిరిగిన పోలీసులకు లోన ఎవరో ఉన్నారని అనుమానం వచ్చింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. మద్యం మత్తులో సుమారు 22 ఏళ్ల యువతి పోలీసుల కంటబడింది. ఆమెతో పాటు నలుగురు చిన్నపిల్లలూ ఉన్నారు. లోపల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఇంటి నిండా వాడిపడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు, బటన్ చాకులు, ఏవేవో మత్తు పదార్థాలు కనిపించడంతో చుట్టుపక్కల వారు బిత్తరపోయారు. -
కరీంనగర్లో భారీ పేలుడు : ఇద్దరు మృతి
-
కరీంనగర్లో జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు మృతి
కరీంనగర్: జిల్లా హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇంట్లో నిల్వఉంచిన జిలెటిన్ స్టిక్స్ సంబంధిత రసాయన పదార్థాలతో బొమ్మలను తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తుల దాడి
చాకుతో చేయి కోసిన వైనం భీమవరం : సైకిల్‌పై స్కూల్‌కు వెళుతున్న విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారైన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గునుపూడికి చెందిన పొన్నాడ రాంబాబు కుమార్తె మేఘన హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఆదిత్య స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం సైకిల్‌పై స్కూల్‌కు వెళుతుండగా స్థానిక వన్‌టౌన్‌లోని శ్రీనివాస థియేటర్ రోడ్లోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మొహానికి ఖర్చీఫ్‌లు కట్టుకుని మోటారు సైకిల్‌పై వెళుతూ విద్యార్థిని చేతిని చాకుతో కోసి పరారయ్యారు. చేతి నుంచి రక్తం కారడంతో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై తన వెనుక వస్తూ వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
‘కంచె’కు ఆటంకాలు
సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం కార్యరంగంలోకి దిగింది. పట్టణంలో వేర్వేరు చోట్ల ఉన్న 42 ఎకరాల స్థలాలను పరిరక్షించేందుకు పంచాయతీరాజ్ శాఖకు రూ.30 లక్షలు మంజూరు కావడంతో సర్కార్ జాగాల చుట్టూ కంచె నిర్మాణాలకు అధికార యంత్రాంగం పూనుకుంది. సిద్దిపేట తహశీల్దార్ ఎన్వై గిరి ఆధ్వర్యంలో అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీలోని సర్వే నంబర్ 1340లో ఉన్న 5 ఎకరాల 10 గుంటల భూమికి కంచె ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న స్థానిక దళితులు అధికారులను అడ్డుకున్నారు. ఈ భూములకు సంబంధించిన పట్టాలు తమ వద్ద ఉన్నాయంటూ దళితులు వాగ్వాదానికి దిగారు. పదేళ్ల క్రితమే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుందని అధికారులు చెప్పడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కిందటే భూములు స్వాధీనం చేసుకుంటే 2007లో నోటీసులు ఎలా జారీ చేశారంటూ ప్రశ్నించారు. ఓ దశలో అధికారులకు, స్థానిక దళితులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో అధికారులు పోలీసుల సాయం కోరారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళనకు దిగిన వారిని స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన మిగతా దళితులు పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నినాదాలు చేశారు. దీంతో తహశీల్దార్ గిరి ఫోన్లో వారితో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ వారు ట్యాంక్ దిగిరాకపోవడంతో ఆర్డీఓ ముత్యంరెడ్డికి ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆయన సూచన మేరకు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దళితులతో మాట్లాడిన తహశీల్దార్ పట్టాలు తీసుకుని వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు బత్తుల చంద్రం, బొమ్మల యాదగిరి మాట్లాడుతూ, గతంలో ఎంతో మంది అధికారులు వచ్చి ఎన్నో స్థలాలకు నోటీసులు జారీ చేసిన సందర్భాలున్నాయన్నారు. కానీ సిద్దిపేట అధికారులు వ్యవహరించినట్లుగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. అగ్రవర్ణాలతో చేతులు కలిపి దళితుల భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. గతంలో సర్వే నంబరు 1906 ఫైర్ స్టేషన్ పక్కన గల 1-20 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించినా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో తెలపాలన్నారు. అక్కడ చూపించని దౌర్జన్యం ఇక్కడ దళితులపై ఎందుకు చూపించాల్సి వస్తుందన్నారు. అవి మా పట్టా భూములు అధికారులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న భూములపై మాకే హక్కులున్నాయి. ఆ జాగాల పట్టాలు మావద్ద ఉన్నాయి. వాటిపైనే ఎంతో ఆశలు పెట్టుకుని బతుకుతున్నాం. అలాంటిది మా స్థలాలను లాక్కుంటామంటే ఎలా ఊరుకుంటాం. -స్థానిక దళితులు అవి ప్రభుత్వ భూములే తాము కంచె ఏర్పాటు చేస్తున్న స్థలాలు ముమ్మాటికి ప్రభుత్వ భూములే. 1976లో కొందరికి పట్టాలు ఇచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వారు వాటిని వినియోగిస్తుండడంతో బదలాయింపు నిషేధ చట్టాన్ని ప్రయోగించి పదేళ్ల కిందటే స్వాధీనం చేసుకున్నాం. ఆ మేరకు అప్పట్లోనే నోటీసులు జారీ చేశాం. -ఎన్వై గిరి, తహశీల్దార్ -
జలమయం
జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. జమ్మికుంట హౌసింగ్‌బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, కమలాపూర్, రామగుండంలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలో నీళ్లు చేరాయి. మహదేవపూర్, మహాముత్తారం ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అటవీగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్-వరంగల్ రహదారిపై భీమదేవరపల్లి మండలం ముల్కనూరు వద్దనున్న వంతెన తెగిపోయి రాకపోకలు బందయ్యాయి. హుస్నాబాద్ మండలం గౌరవెల్లి-గుడాటిపల్లి గ్రామాల మధ్యనున్న వాగులో తహశీల్దార్, ఎస్సై చిక్కుకుపోగా స్థానికులు వారిని కాపాడారు. ముల్కనూర్ కస్తూరిబా పాఠశాల జలయమమైంది. కమలాపూర్ మండలం అంబాల వద్ద పత్తి ట్రాక్టర్ వాగులో మునిగిపోయింది. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ పరిధిలోని మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో 30వేల మెకట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌పడింది.