జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. జమ్మికుంట హౌసింగ్‌బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. హుజూరాబాద్, హుస్నాబాద్, మంథని, కమలాపూర్, రామగుండంలోని లోతట్టు ప్రాంతాల ఇళ్లలో నీళ్లు చేరాయి.
మహదేవపూర్, మహాముత్తారం ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అటవీగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్-వరంగల్ రహదారిపై భీమదేవరపల్లి మండలం ముల్కనూరు వద్దనున్న వంతెన తెగిపోయి రాకపోకలు బందయ్యాయి. హుస్నాబాద్ మండలం గౌరవెల్లి-గుడాటిపల్లి గ్రామాల మధ్యనున్న వాగులో తహశీల్దార్, ఎస్సై చిక్కుకుపోగా స్థానికులు వారిని కాపాడారు. ముల్కనూర్ కస్తూరిబా పాఠశాల జలయమమైంది. కమలాపూర్ మండలం అంబాల వద్ద పత్తి ట్రాక్టర్ వాగులో మునిగిపోయింది. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ పరిధిలోని మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో 30వేల మెకట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌పడింది.
జలమయం
Published Sun, Oct 27 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement