
సాక్షి,డోర్నకల్: ఇందులో ఏముంది? ట్రాక్టర్ నుంచి లోడ్ దించుతున్నారంతే అనుకుంటున్నారా? సరిగ్గా చూస్తే.. ట్రాలీ కింద ప్రత్యేకంగా అమర్చిన అరలో బాక్స్‌లున్నాయి కదా.. అవన్నీ 3 క్వింటాళ్ల గంజాయి నింపిన పెట్టెలు. ఒక్కో దానిలో 2 కిలోలు ప్యాక్‌చేసి ఇలా 150 బాక్స్‌లను తరలిస్తుండగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అమ్మపాలెం క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నారు.
మరిపెడ మండలం తండాధర్మారానికి చెందిన బానోత్ కిరణ్‌కుమార్, కొత్తగూడెం జిల్లా కోయగూడెంకు చెందిన ఆర్‌ఎంపీ బాదావత్ సూర్య ఏపీలోని చింతూరులో గంజాయి కొని తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. కిలో రూ.3 వేలకు కొని మహారాష్ట్రలో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment