
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.
ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు:
స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు.
నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు:
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.
అభ్యర్థులు :
బీఆర్ఎస్
- బానోత్ శంకర్ నాయక్ (కన్‌ఫాం)
కాంగ్రెస్ : (ఆశవాహులు)
- బలరాం నాయక్ (మాజీ మంత్రి)
- మాజీ మంత్రి(TPCC నేత)
- డాక్టర్ మురళి నాయక్,
- నూనావత్ రాధా
బీజేపీ : (ఆశవాహులు)
- యాప సీతయ్య
- జాటోత్ హుస్సేన్ నాయక్
వృత్తిపరంగా ఓటర్లు
- రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు.
మతం కులం ఓటర్లు:
- ఎస్టి 95000
- BC:76000
- SC:32000
- మైనార్టీ :16
- ఓసి :14
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు:
మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్..
పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం