2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి.
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు :
- నిరుద్యోగ సమస్య.
- రోడ్లు.
- డ్రైనేజీ.
- డ్రింకింగ్ వాటర్.
- సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్).
- భూ సమస్యలు.
నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :
- వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్గా మారిన నర్సంపేట.
- త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల.
- ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు.
- త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి.
ప్రధాన పార్టీల అభ్యర్థులు :
బీఆర్‌ఎస్
- పెద్ది సుదర్శన్‌రెడ్డి (కన్‌ఫాం)
కాంగ్రెస్
- దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు)
బీజేపీ
- రేవూరి ప్రకాశ్‌రెడ్డి (ఆశావాహులు)
వృత్తిపరంగా ఓటర్లు
- రైతులు.
- వ్యాపారులు.
మతం/కులం పరంగా ఓటర్లు
- బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు
భౌగోళిక పరిస్థితులు..
- పాఖాల అభయారణ్యం.
- పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు.
Comments
Please login to add a commentAdd a comment