నర్సంపేట నియోజకవర్గానికి తదుపరి చారిత్రక అభ్యర్థి ఎవరు..?
నర్సంపేట నియోజకవర్గం
నర్సంపేటలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిఆర్ఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సుదర్శనరెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా ఉండేవారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాదవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాదించగా, 2018లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి.
తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేతగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి 2014లో నర్సంపేటలో ఓటమి చెందారు. ఆయన 2014లో ప్రత్యర్ధిగా కూడా నిలవలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ టిక్కెట్ చివరిక్షణంలో కోల్పోయి, స్వతంత్రుడుగా పోటీచేసిన దొంతి మాధవరెడ్డి 2014లో గెలవడం విశేషం టిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శనరెడ్డి ఆ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి, మాధవరెడ్డి చేతిలో 18376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2018లో మాధవరెడ్డిని సుదర్శనరెడ్డి ఓడిరచారు.
2014లో ప్రకాష్ రెడ్డికి 34479 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కత్తి వెంకటస్వామికి 6638 ఓట్లు దక్కాయి. రేవూరి 2018లో ఇక్కడ నుంచి వరంగల్ పశ్చిమకు మారి పోటీచేసినా గెలవలేకపోయారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెండుసార్లు అది కూడా 1957, 1967లలోమాత్రమే గెలిచింది. 1972 నుంచి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది. అయితే 2004లో కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చిన టిఆర్ఎస్ విజయం సాధించింది. వామపక్ష నేతలలో ఒకరైన మద్దికాయల ఓంకార్ ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచారు.
ఆయన మూడుసార్లు సిపిఎం పక్షాన గెలిస్తే, ఆ తర్వాత పార్టీకి దూరమె సొంతంగా ఎమ్.సిపిఐని ఏర్పాటుచేసుకున్నారు. రెండుసార్లు ఇండిపెండెంటుగా నెగ్గారు. 1994లో టిడిపి అభ్యర్ధి రేవూరి ప్రకాష్‌రెడ్డిపై 87 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రకాష్‌రెడ్డి 1999లో గెలిచాక 610 జీఓపై శాసనసభలో ఏర్పాటు చేసిన సభాసంఘానికి నాయకత్వం వహించారు. రేవూరి మూడుసార్లు గెలిచారు. కొంతకాలం టిడిపి పాలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా వ్యవహరించారు. నరసంపేటలో ఏడుసార్లు రెడ్లు, ఐదుగురు బిసివర్గం నేతలు రెండుసార్లు ఇతరులు గెలిచారు.
నర్సంపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..