Warangal Common Districts
-
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
రహస్య స్నేహితులు! ‘కోవర్టు’ల కలకలం..!
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ రంగులు మారుతున్నాయి. ఉదయానికున్న సమీకరణాలు.. సాయంత్రానికి తలకిందులవుతున్నాయి. పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడం, ప్రచారాలు, కార్యక్రమాలపై నిఘా పెట్టడం.. ఉల్లంఘనలుంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు ప్రత్యర్థి పార్టీలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వారు చేసిన తప్పులను వీరికి తెలియజేసే పనిని వారికి అప్పజెబుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడానికై నా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఫలానా పార్టీ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇవి మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కోవర్టుల కలకలం.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడి ఉన్నదే. కొంతమంది నాయకుడి వెన్నంటే ఉండి.. నమ్మకంగా నటించి ఇక్కడి విషయాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు. సంపాదనే పరమావధిగా ఈ పని చేస్తున్నారు. నాయకులు తనవెనుక ఉండే వారిలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసినా వారెవరో గుర్తించలేకపోతున్నారు. ప్రత్యర్థుల చెంత నమ్మకంగా పని చేస్తున్నవారిని నాయకులు బుట్టలోకి లాగుతున్నారు. వారి ద్వారా అక్కడ జరిగే విషయాలను తెలుసుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేతల వివరాలు, సభలు, సమావేశాల్లో జరిగే ఉల్లంఘనలు, ఎన్నికల్లో ధన, మధ్య ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ కోవర్టులు ఉపయోగపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒక్కడుగు ముందేసిన కోవర్టులు.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచుతూ మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెబుతున్నారన్న చర్చ ఉంది. ఇందుకోసం ప్రత్యర్థులు భారీగానే ముట్టచెబుతున్నారని సమాచారం. ఏం చేశారు.. ఎవరికి పంచారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం పంపిన పార్టీ ఫండ్‌పై పలు నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ‘ఎవరికి ఇచ్చారు.. ఎక్కడ పంచారు?’ అంటూ బహిరంగంగానే నిలదీతల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు రూ.10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అందినట్లు ఆపార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెండు విడతల్లో ఐదు రోజుల తేడాతో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందినట్లు ఆ పార్టీవర్గాల్లో జరుగతున్న చర్చ. అలాగే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు అందించినట్లు ఆ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అర్బన్ స్థానాల్లో పోటీ చేస్తున్న కొందరికి అంతకుమించే అందించినట్లు ప్రచారం. అయితే పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం పంపిణీ చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల డబ్బుల వ్యవహారంలో అభ్యర్థుల కుటుంబాల్లో ముదిరిన ఆధిపత్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పడరాని పాట్లు పడుతుంటే... మరోవైపు కోవర్టులు, పార్టీఫండ్, డబ్బుల పంపిణీ వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు. కోవర్టులకు భారీ నజరానాలు! రహస్య స్నేహితులు(కోవర్టులు) అందించిన స మాచారాన్ని బట్టి వారికి నజరానాలు అందించేందుకు అన్ని పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి, ప్రచార సమయంలో అభ్యర్థి వెంట తప్పనిసరిగా వీడియో బృందం ఉంటోంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులంతా రహస్య పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రత్యర్థులకు చేరవేస్తే అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం అందజేస్తున్నారు. కోవర్టుల స మాచారంతోనే ఎన్నికల సంఘాల వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు, జనగామ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులందాయి. పలుచోట్ల డబ్బులు తరలి స్తున్న వాహనాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఇవి చదవండి: 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్‌కు ఈటల సవాల్ -
నర్సంపేటలో బీఆర్ఎస్పై డబుల్ బెడ్రూం ఎఫెక్ట్?
2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : నిరుద్యోగ సమస్య. రోడ్లు. డ్రైనేజీ. డ్రింకింగ్ వాటర్. సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్). భూ సమస్యలు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన నర్సంపేట. త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల. ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు. త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్‌రెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు) బీజేపీ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు భౌగోళిక పరిస్థితులు.. పాఖాల అభయారణ్యం. పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు. -
కడియంకే టికెట్.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు : సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్ ఘనపూర్ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం ప్రధాన పార్టీలోని అభ్యర్థులు : బీఆర్ఎస్ కడియం శ్రీహరి (కన్ఫాం) కాంగ్రెస్ (ఆశావాహులు) సింగపురం ఇందిరా దొమ్మాటి సాంబయ్య బొల్లెపల్లి కృష్ణ బీజేపీ (ఆశావాహులు) డాక్టర్ విజయరామారవు మాదాసు వెంకటేష్ బోజ్జపల్లి సుభాస్ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట) సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్) మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం) ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం) -
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
కాంగ్రెస్‌పైనే ఓటర్ల కన్ను? భూపాలపల్లిలో ఉత్కంఠ!
రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోదావరి పరివాహక ప్రాంతం అయినా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలుపుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గం ఆసక్తికర అంశాలు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతం సింగరేణి కార్మికులకు నిలయమైన నియోజకవర్గం. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పోడు భూములు. డబుల్ బెడ్రూం ఇవ్వకపోవడం ప్రధాన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ గండ్ర వెంకట రమణారెడ్డి(కన్ఫర్మ్) కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) బీజేపీ చందుపట్ట కీర్తి రెడ్డి (ఆశావహుల లిస్ట్‌లో ప్రముఖంగా..) నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : భూపాలపల్లి నియోజకవర్గంలో దట్టమైన అటవీ ప్రాంతం, కాకతీయులు పాలించిన కోట గుళ్ల గణపేశ్వర ఆలయం, కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంల, పర్యాటక పాండవుల గుట్టలు, విద్యుత్ వెలుగుల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు,సింగరేణి బొగ్గు గనులు,గణపసముద్రం -
వర్ధన్నపేటలో అసమ్మతి సెగ!
వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య. సీసీ, బిటి రోడ్లు పూర్తీ స్ధాయిలో లేవు. తీవ్రంగా వేదిస్తున్న డ్రైనేజీ సమస్య. త్రాగు నీరు సమస్య. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. 8 మండలాల్లో రెండు మూడు చోట్ల మాత్రమే నిర్మించారు. ధరణి వల్ల భూ సమస్యలు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ ఆరూరి రమేష్ కాంగ్రెస్ కేఆర్ నాగరాజు మాజీ ఐపిఎస్ అధికారి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బీజేపీ కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మల్యే (కొత్త వ్యక్తి కోసం అన్వేషణ జరుగుతోంది) నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వర్దన్నపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆరూరి రమేష్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. మండలానికి ఒక క్యాంప్ ఆఫీస్ స్వంత నిధులతో నిర్మించుకున్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం అసమ్మత్తి సెగ తగిలే పరిస్థితి కనిపిస్తుంది. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ది మాత్రం శూన్యం. రాజకీయ అంశాలు : వర్ధన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉండగా మూడోసారి కూడా అధిష్టానం అతనికే టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ నుంచి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : వర్దన్నపేట నియోజకవర్గం వరంగల్, హన్మకొండ జిల్లాల చుట్టు ఉంది. భూమి గుండ్రంగా ఉన్నట్లు వర్దన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నుంచి హసన్ పర్తి అటు నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు విస్తరించి ఉంది. నదులు : వర్ధన్నపేట ఆకేరు వాగు, కోనారెడ్డీ, పర్వతగిరి రిజర్వాయర్. పర్యాటకం : ఖిలా వరంగల్ కోట, ఐనవోలు, పర్వతగిరి అన్నారం షరీఫ్ దర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా ఉన్న మామునూరు విమానాశ్రయం. 4th బెటాలియన్, రాష్ట్రంలోని ప్రధాన పోలిస్ ట్రైనింగ్ సెంటర్. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం, పర్వతగిరి. అన్నారం యాకుబ్ శావలి దర్గ -
వరంగల్ పశ్చిమ: అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు!
జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిన్నరాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అదృష్ట్యాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నగరంలోని హన్మకొండ కాజీపేట ప్రాంతాలను కలుపుకుని ఉంది. కాకతీయుల నాటి చెరువులు కుంటలు కబ్జాకు గురికావడంతో వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు ముంచెత్తడం.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్మార్ట్ సిటిగా పేరొందినప్పటికి మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, నిలువనీడలేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు అందకపోవడం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ అమలుకు నోచుకోకపోవడం వంటి అనేక సమస్యలు నగర ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. విద్యావంతులు మేధావులు, రాజకీయ నేతలకు నిలయంగా ఉన్న హన్మకొండ రాజకీయం ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతలైనా, అధికారులైనా వారి నివాసాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రమైన హన్మకొండలోనే ఉన్నాయి. కానీ సమస్యలకు పుట్టినిల్లుగా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ దాస్యం వినయ్ భాస్కర్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ నాయిని రాజేందర్‌రెడ్డి జంగా రాఘవరెడ్డి బీజేపీ రావు పద్మ ఏనుగుల రాకేష్ ధర్మారావు వృత్తిపరంగా ఓటర్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగర ప్రాంతం కావడంతో ఉద్యోగులు వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. శివారు కాలనీల్లోరైతులు ఉన్నప్పటికి వారిప్రభావం పెద్దగా ఉండదు. మతం/కులం పరంగా ఓటర్లు హిందువులు ఎక్కువగా ఉంటారు. బిసి జనాబా ఎక్కువగా ఉంది. 30 వేల మంది రెడ్డి ఓటర్లు ఉంటారు. ఎన్నికల్లో రెడ్డి ఓట్లు కీలకంగా మారుతాయి. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ బిఆర్ఎస్కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి టీఆర్ఎస్కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్‌కు టికెట్ దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్‌గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పదవులకు తోడు కాంగ్రెస్, బిజేపిలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్‌కు అనుకూలంగా మారుతున్నాయి. హంగు ఆర్బాటం లేకుండా అందరితో కలివిడిగా ఉండే వినయ్ భాస్కర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ప్రత్యర్థి పార్టీలోని గ్రూప్ రాజకీయాలు ఆయనకు కొండంత అండగా నిలువనున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్‌కి అంత ఈజీగా ఉండవన్న చర్చ ప్రజల్లో సాగుతుంది. అభివృద్ది సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు నగరంలో జరిగినప్పటికి ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అభివృద్ది సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం కావడంతో వినయ్ భాస్కర్‌కు మైనస్గాగా మారుతుంది. బాల సముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పూర్తై రెండేళ్ళు కావస్తున్న ఇంకా లబ్దిదారులకు అప్పగించకపోవడతో గృహ ప్రవేశం కాక ముందే ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. లబ్దిదారులకు అప్పగించకపోవడానికి ప్రధాన కారణం నిర్మించిన ఇళ్ళు 596 అయితే లబ్దిదారులు ఐదు వేలకుపైగా ఉండడంతో లబ్దిపొందేవారికంటే ఇళ్ళ కెటాయింపు జరిగితే శత్రువులుగా మారే వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో లబ్దిదారుల ఎంపికలో ఆలస్యం అవుతుంది. 31వ డివిజన్ శాయంపేటలో మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం.. అప్పగింతలో ఆలస్యం అవడంతో కమ్యూనిష్టులతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కమ్యూనిష్టులు ఏకంగా నగర శివారులోని ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించారు. నగరంలో నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కెటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాజీపేట కోచ్ ప్యాక్టరీ హామీ నెరవేరకపోవడం, కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు, పోతన కళాక్షేత్రం పనులు, చారిత్రాత్మకమైన వేయి స్థంబాల గుడి కళ్యాణమండపం పనులు మూడు అడుగులు మందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉండడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆశిస్సులతో భద్రకాళి బండ్ పనులు పూర్తై ప్రజల వినియోగంలోకి రాగ ఆలయ మాడవీదుల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అర్హులైన వారందరికి అందితే ఇక వినయ్ భాస్కర్ విజయానికి తిరుగేఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్‌ల ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు టికెట్ వరించడంతో ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలోని గ్రూప్ రాజకీయాలు అంతర్గత విబేధాలతో పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో వారిలోని పోటీ తత్వం గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీల కొంపముంచే అవకాశాలున్నాయని ఓరుగల్లు ప్రజలు భావిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నవారు చివరిక్షణంలో టిక్కెట్ దక్కకుంటే పార్టీ మారే అవకాశాలు సైతం లేకపోలేదని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్, బిజేపి లోని అనైక్యత బిఆర్ఎస్ కు కలిసొచ్చే అవకాశాలు మెండుకా ఉన్నాయి. అదే జరిగితే వరంగల్ పశ్చిమలో కారుజోరు బ్రేక్లులు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొండలు అడవులులేవు ఆలయాలు మాత్రం కాకతీయులు నిర్మించిన వేయిస్థంభాల గుడి, భద్రకాళి అమ్మవారు ఆలయం ఉంది. పర్యాటకులను ఆకర్శించేలా వేయిస్థంభాల గుడి ఉంది. భద్రకాళి బండ్ ఏర్పాటు చేశారు. -
వరంగల్ తూర్పు: త్రిముఖ పోటీ! కానీ బీఆర్ఎస్కు ఆయనే మైనస్సా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఓరుగల్లు జిల్లా రాజకీయంగా ఉద్యమాల పరంగా వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కేంద్ర బిందువుగా మారుతూ వస్తుంది. 2023 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ ఉన్నట్టుగానే ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది. అయితే ఇక్కడ ఓ వాదన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తేనే బీఆర్ఎస్కు ఫలితం దక్కుతుందని ఆపార్టీ నాయకులే భావిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ దళితులు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయం. తూర్పు నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న ఆజంజాహి మిల్లు పోయింది. ఇక ఎక్కువగా దినసరి కూలీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది అమలు అయ్యి తీరుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్న నమ్మకంతో పాటు మణిపూర్ ఘటనలు దళితులను మైనారిటీ ముస్లింలను కొంత కలవరపెడుతుంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా చూపెడుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు : వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంక మోగించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు వన్‌సైడ్‌గా పడుతాయని ఓ ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచినప్పటికీ వరంగల్ నియోజకవర్గం మారలేదు. దీంతో ప్రజల్లో పార్టీ పట్ల కొంత అసహనం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమా హేమీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నం చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుండి కొండ సురేఖ తోపాటు డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజెపి నుండి రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు ఘంటా రవికుమార్ పోటీకి సిద్దమయ్యారు. వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజకవర్గంలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు భౌగోళిక పరిస్థితులు.. నగరంతో పాటు శివారు కాలనీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు ఉన్న ఖిల్లావరంగల్ కోట ఉంది. ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల, 1100కోట్లతో 24అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నదులు అడవులు కొండలు లేవు.. కానీ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల మద్య భద్రకాళి అమ్మవారు ఆలయంతోపాటు చెరువు ఉంటుంది. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ప్రధానంగా డ్రైనేజ్ మంచినీటి సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు వచ్చి నగరంతోపాటు పలుకాలనీలు జలమయం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ మేయర్ గా ఎమ్మెల్యేగా వరంగల్ నగరంతో పాటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కానీ చెప్పేవి మాత్రం కొండంతలు.నరేందర్ శాసనసభ్యులు గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. -
పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!
పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజకీయపరమైన అంశాలు : పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నిరుద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు ధరణి పోర్టల్ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ కొండ సురేఖ (ఆశావాహులు) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు) బీజేపీ పార్టీ పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు మేజారిటీ ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. చలివాగు ఉంది చంద్రగిరిగుట్టలు చెన్నకేశవ స్వామి జాతర కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్‌గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
Mahabubabad: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఈసారి ఉత్కంఠ!
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు: స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అభ్యర్థులు : బీఆర్ఎస్ బానోత్ శంకర్ నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ : (ఆశవాహులు) బలరాం నాయక్ (మాజీ మంత్రి) మాజీ మంత్రి(TPCC నేత) డాక్టర్ మురళి నాయక్, నూనావత్ రాధా బీజేపీ : (ఆశవాహులు) యాప సీతయ్య జాటోత్ హుస్సేన్ నాయక్ వృత్తిపరంగా ఓటర్లు రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు. మతం కులం ఓటర్లు: ఎస్టి 95000 BC:76000 SC:32000 మైనార్టీ :16 ఓసి :14 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్.. పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం -
డోర్నకల్: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాంగ్రెస్
2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్‌కే టికెట్‌ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు: గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ రెడ్యా నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ పార్టీ : జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు) మలోత్ నెహ్రూ నాయక్ (ఆశావాహులు) ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు) బిజేపి పార్టీ : లక్ష్మణ్ నాయక్ (ఆశావాహులు) రాజకీయ అంశాలు : ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. వృత్తిపరంగా ఓటర్లు : గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు మతం/కులం వారిగా ఓటర్లు : ఎస్టీ ఓటర్లు 92616 మంది బిసి ఓటర్లు 76 వేల మంది ఎస్సీ ఓటర్లు 29401 మంది ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు : వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం. -
ములుగు (ఎస్టి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
ములుగు (ఎస్టి) నియోజకవర్గం ములుగు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్ ఐలో చేరి విజయం సాదించారు. అనసూయ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, అప్పటి మంత్రి ఎ.చందూలాల్ పై 22671 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. సీతక్కకు 88971 ఓట్లు రాగా, చందూలాల్‌కు 66300 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన బి.లక్ష్మీనారాయణకు సుమారు 3500 ఓట్లు వచ్చాయి. 2014లో ములుగు నుంచి టిఆర్ఎస్ పక్షాన చందూలాల్ గెలిచారు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు. 2014లో ఇక్కడ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడిరచారు. అప్పట్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ(సీతక్క) మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఆమె 2018లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య భద్రాచలానికి మారి మూడోసారి విజయం సాదించడం విశేషం. ములుగులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందూలాల్ ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచి కొంత కాలం ఎన్.టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. తదుపరి 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. రెండుసార్లు టిడిపి తరుపున లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 2009లో ఆయన టిఆర్ఎస్ పక్షాన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2014లో ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంత కాలం నక్సల్స్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఆ పంధాను వీడి టిడిపిలో చేరారు. 2018లో మరోసారి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ములుగు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
భూపాలపల్లి నియోజకవర్గం గత చరిత్ర ఇదే..
భూపాలపల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో శాయంపేట నియోజకవర్గం రద్దై భూపాలపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి రెండోసారి గెలిచారు. స్పీకర్ పదవిలో ఉండి 2018లో పోటీచేసిన మదుసూదనాచారి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. గండ్ర వెంకట రమణారెడ్డి తన సమీప స్వతంత్ర ప్రత్యర్ది గండ్ర సత్యనారాయణరావుపై 14729 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. వెంకటరమణారెడ్డికి 67309 ఓట్లు రాగా, సత్య నారాయణరావుకు 54187 ఓట్లు వచ్చాయి. సత్యనారాయణరావు టిఆర్ఎస్లో చేరినా, టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేయడంతో గండ్రకు గెలుపు సులువు అయిందని అనుకోవచ్చు. టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మదు సూదనాచారికి 53567 ఓట్లు వచ్చాయి. 2009లో గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో మధుసూదనాచారిని ఓడిస్తే, 2014లో మదుసూదనాచారి ఈయనను ఓడిరచారు. అనంతరం తెలంగాణ తొలి శాసనసభకు స్పీకర్ అయ్యే అవకాశం పొందారు. 1994లో టిడిపి తరపున గెలిచిన మధుసూదనాచారి కొంతకాలం ఎన్.టి.ఆర్. టిడిపిలో ఉన్నారు. తదనంతరం ఆయన టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ 2014లో మళ్లీ ఎమ్మెల్యే కాగలిగారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న గండ్రను 7214 ఓట్ల తేడాతో చారి ఓడిరచారు. కాని 2018లో ఓటమి చెందారు. మధు సూదనా చారి 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. గండ్ర కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 2014లో బిజెపి-టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన జి.సత్యనారాయణకు 57530 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లిలో రెండుసార్లు రెడ్డి, మరోసారి బిసి నేత గెలుపొందారు. శాయంపేట (2009లో రద్దు) 2004 వరకు ఉన్న శాయంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ఐ నాలుగుసార్లు గెలిస్తే, టిడిపి, బిజెపి, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇక్కడ రెండుసార్లు గెలిచిన సి.జంగారెడ్డి పరకాలలో ఒకసారి గెలుపొందారు. ఈయన హన్మకొండ లోక్‌సభ స్థానానికి పోటీచేసి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును ఓడిరచి సంచలనం సృష్టించారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన మాదాటి నరసింహారెడ్డి నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. కొండా సురేఖ ఇక్కడ రెండుసార్లు, పరకాలలో ఒకసారి, వరంగల్ తూర్పు నుంచి ఒకసారి గెలిచారు. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా వున్నారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా కొంతకాలం ఉండి రాజీనామా చేశారు. 2009లో పరకాల నుంచి గెలిచారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రబుత్వంపై వచ్చిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో సురేఖ అనూహ్యంగా టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేసి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా గతంలో ఎన్నికయ్యారు. శాయంపేటలో నాలుగుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం ఈ అభ్యర్థికి హ్యాట్రిక్ లభించనుందా..!
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే 2018లో అది ఇంకా పెరిగింది. రమేష్ తన సమీప తెలంగాణ జనసమితి ప్రత్యర్ధి పి.దేవయ్యపై విజయం సాధించారు. మహాకూటమిలో బాగంగా ఇక్కడ టిజెఎస్ పోటీచేసింది.బిజెపి పక్షాన పోటీచేసిన కె.సారంగారావుకు సుమారు 5400 ఓట్లు వచ్చాయి.రమేష్ కు 128764 ఓట్లు రాగా, దేవయ్యకు 31094 ఓట్లు వచ్చాయి. వర్ధన్న పేట నియోజకవర్గంలో 2014లో అప్పటి సిటింగ్ కాంగ్రెస్ ఐ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను ఆరూరి రమేష్ 86349ఓట్ల తేడాతో ఓడిరచారు. రమేష్ 2009లో స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయినా, 2014, 2018లలో వర్దన్నపేట నుంచి విజయం సాధించారు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్యక్షుడు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసి 2014లో ఇక్కడ పోటీచేసినా 20526 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి చెందారు. రెండువేల తొమ్మిదిలో మందకృష్ణ ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాగా 2009లో ఇక్కడ టిఆర్ఎస్ తరపున పోటీచేసిన సీనియర్ నేత విజయరామారావు తదుపరి పరిణామాలలో కాంగ్రెస్ ఐలో చేరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2004లో ఆయన ఘనపూర్ నుంచి గెలిచి టిఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. కొంతకాలం వై.ఎస్. మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికలలో వర్ధన్నపేటలో పోటీచేసి పరాజితులయ్యారు. ఈయన గతంలో మెదక్‌జిల్లా గజ్వేలు నుంచి ఒకసారి గెలిచారు. అలాగే సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నుంచి వర్ధన్నపేట దళితులకు రిజర్వు అయింది. దాంతో అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి కి మారి మరో మూడుసార్లు గెలిచి మొత్తం ఆరుసార్లు గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. దయాకరరావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు గెలిచారు. దయాకరరావు2008లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. దయాకరరావు కొంతకాలం విప్‌గా పనిచేశారు. తెలంగాణ తొలి శాసనసభలో టిడిపి పక్ష నేత అయ్యారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారి, 2018 ఎన్నికలలో ఆ పార్టీ పక్షాన గెలిచి మంత్రి అయ్యారు. వర్ధన్నపేటలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరుపున గెలిచిన టి.పురుషోత్తంరావు ఇంకోసారి వరంగల్ నుంచి కాంగ్రెస్ ఐ తరుపున గెలిచారు. అప్పట్లో తెలంగాణ వాదిగా వున్న పురుషోత్తంరావు, ఆ తర్వాత కాలంలో కోట్ల విజయ భాస్కరరెడ్డి క్యాబినెట్‌లోను, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ ఛెర్మన్గాను పనిచేశారు. ఇక్కడ నుంచి మాచర్ల జగన్నాథం ఒకసారి జనతా పక్షాన, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, పిడిఎఫ్ రెండుసార్లు, ఎన్‌టిపిఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలవగా, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 1952లోవర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ సీట్లను, వరంగల్ లోక్‌సభ సీటును గెలిచిన పెండ్యాల రాఘవరావు అసెంబ్లీ సీట్లను వదిలి లోక్‌సభకు వెళ్ళారు. వర్ధన్నపేట జనరల్‌గా ఉన్నప్పుడు ఆరుసార్లు వెలమ, రెండుసార్లు రెడ్లు, మూడుసార్లు బిసిలు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి ఇతరులు గెలిచారు. వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్ విజయం సాదించారు. వరంగల్ మేయర్‌గా ఉన్న నరేందర్ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది పి.రవిచంద్రపై 28142 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తొలిసారి నరేందర్ గెలు పొందారు. ఆయనకు 82461 ఓట్లు రాగా, రవిచంద్రకు 54225 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన కె.సతీష్‌కు సుమారు 4700 ఓట్లు వచ్చాయి. నన్నపునేని నరేందర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు. 2014లో మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్లో చేరి అప్పట్లో మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను 55085 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సురేఖ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉమ్మడి ఏపిలో 2009 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత, రోశయ్య మంత్రి వర్గంలో ఉంటూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు మద్దతుగా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో కొంతకాలం కీలక నేతగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడిరది. తదుపరి పరకాలకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి సుమారు 1500 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తదుపరి తెలంగాణ అంశంలో జగన్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటపడి మళ్లీ కాంగ్రెస్ ఐ లో చేరారు. అక్కడ ఇమడలేక 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు సీటును తీసుకుని గెలుపొందారు. ఒకప్పుడు ఈమెకు టిఆర్ఎస్ నాయకులకు, కెసిఆర్‌కు ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది ఆమె ఈ పార్టీ లోకి వచ్చి గెలుపొందడం విశేషం. గతంలో ఆమె శాయంపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ఆ నియోజకవర్గం 2009లో రద్దు అయింది.బసవరాజు సారయ్య మూడుసార్లు ఎన్నికయ్యారు. రజక వర్గానికి చెందిన సారయ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. వరంగల్‌లో ఒకసారి గెలిచిన టి. పురుషోత్తంరావు గతంలోవర్ధన్నపేట నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంటుగా గెలిచిన బి. నాగభూషణరావు 1983, 85లలో టిడిపి తరుపున గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఎమ్.ఎస్.రాజలింగం ఇక్కడ ఒకసారి, చిల్లంచెర్లలో మరోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన మీర్జాబేగ్, మరోసారి హనుమకొండలో నెగ్గారు. పురుషోత్తంరావు గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోమంత్రిగా ఉండగా, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రిమోట్ఏరియా అభివృద్ధి కమిటీ ఛ్కెర్మన్ పదవి ఇచ్చారు. వరంగల్ , వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో కలిపి ఒకసారి రెడ్డి, ఆరుసార్లు బిసి నేతలు,ఐదుసార్లు బ్రాహ్మణ, ఒకసారి వెలమ,ఒకసారి ముస్లిం,ఒకసారి కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం హ్యాట్రిక్ సాధ్యమా..?
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన వినయ్ భాస్కర్ మరోసారి విజయం సాదించారు. ఒక ఉప ఎన్నికతో సహా ఆయన నాలుగుసార్లు గెలిచినట్లు అయింది. వినయ్ భాస్కర్ తన సమీప టిడిపి ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై 36451 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన రేవూరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. దాస్యం వినయ్ భాస్కర్‌కు 80189 ఓట్లు రాగా, రేవూరి ప్రకాష్ రెడ్డికి 43299 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సంపేట నుంచి మూడుసార్లు గెలిచిన ప్రకాష్‌రెడ్డి 2018లో వరంగల్ వెస్ట్‌కు మారి ఓటమి చెందారు. బిజెపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఎమ్.ధర్మారావుకు ఆరువేల ఓట్లు వచ్చాయి. వినయ్ భాస్కర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఆయనకు ఈసారి విఫ్ పదవి వచ్చింది. 2014లో వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్ధి ఎర్రబెల్లి స్వర్ణను 56304 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. అప్పుడు కూడా బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా రంగంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మార్తి నేని ధర్మారారవు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హన్మకొండ బదులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడిరది. రెండువేల తొమ్మిదిలో తొలిసారి గెలిచిన వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో శాసనసభకు రాజీనామా చేసి 2010 జూ 27న జరిగిన ఉప ఎన్నికలో, ఆ తర్వాత మరో రెండుసార్లు విజయం సాదించారు. వినయభాస్కర్ సోదరుడు ప్రణయభాస్కర్ గతంలో హన్మకొండలో గెలుపొందిన ఎన్.టిఆర్ క్యాబినెట్లో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. అస్వస్థత కారణంగా ఈయన అకాల మరణం చెందారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి రంగారావు గెలిచారు. రంగారావు అంతకుముందు కూడా ఒకసారి గెలుపొందారు. గతంలో ఇక్కడ ఉన్న హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. 1952లో హన్మకొండలో గెలిచిన పెండ్యాల రాఘవరావు వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీచేసి గెలుపొందడం అరుదెన విషయం. ఆ తర్వాత రెండు అసెంబ్లీ సీట్లకు రాజీనామాచేశారు. హనుమకొండలో 1978లో గెలిచిన టి.హయగ్రీవాచారి, రెండుసార్లు ధర్మసాగర్ నుంచి, ఒకసారి ఘనపూర్ నుంచి గెలుపొందారు. హయగ్రీవాచారి, ఎస్. సత్యనారాయణ, ప్రణయభాస్కర్, పి.వి రంగారావులు మంత్రి పదవులు నిర్వహించారు. పివి. రంగారావు సోదరుడు రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు గతంలో ఎన్నికయ్యారు. 2004లో హనుమ కొండలో గెలిచిన మందాడి సత్యనారాయణరెడ్డి తర్వాత అసమ్మతి నేతగా ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటకు గురయ్యారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హత వేటుపడిన తొమ్మిదిమందిలో ఈయన ఒకరు. ఈయన హైకోర్టుకు వెళ్ళి ఒక నెలరోజుల పాటు స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత హైకోర్టు కూడా వ్యతిరేకతీర్పు ఇవ్వడంతో ఈయన పదవిని కోల్పోయారు. వరంగల్ పశ్చిమ , హన్మకొండ,హసన్ పర్తి, ధర్మసాగర్ కలిసి రెండుసార్లు రెడ్లు, ఏడుసార్లు బిసి నేతలు (వినయ్ భాస్కర్ కూడా బిసి నేతే), ఏడుసార్లు బ్రాహ్మణ,రెండుసార్లు ఎస్.సిలు, ఒకసారి ముస్లిం, ఒకసారి ఇతరులు గెలిచారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పరకాల నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ ఎవరు..?
పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన చల్లా దర్మారెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ధర్మారెడ్డి టిడిపి తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి కొండా సురేఖపై 46519 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుంచి టిఆర్ఎస్ తరపున గెలిచిన కొండా సురేఖ 2018 ఎన్నికల ముందు పార్టీ నాయకత్వంపై అలిగి పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. దర్మారెడ్డికి 105903 ఓట్లు రాగా, కొండా సురేఖకు 59384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన యు.శ్రీనివాస్‌కు సుమారు నాలుగువేల ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో చల్లా దర్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత సహోదర రెడ్డిపై 9108 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఇ. వెంకట్రామిరెడ్డికి 30283 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత దర్మారెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత నియోజకవర్గం అయిన శాయంపేట రద్దు కావడంతో 2009లో కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు. అంతేకాక డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా పొందగలిగారు. వైఎస్ మరణం తర్వాత కొండాసురేఖ కొంతకాలం రోశయ్య క్యాబినెట్లో కొనసాగి రాజీనామా చేశారు. కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా కొనసాగి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో 1562 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి బిక్షమయ్య చేతిలో సురేఖ ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సమైక్యవాదానికి అనుకూలంగా మొగ్గు చూపుతోందని విమర్శిస్తూ, సురేఖ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. తదుపరి ఆమె టిఆర్ఎస్లో చేరి 2014 లో వరంగల్ తూర్పులో గెలుపొందారు. 2018 ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, ఆ తర్వాత 2004 వరకు రిజర్వుడుగాను, 2009 నుంచి మళ్ళీ జనరల్‌గా మారింది. పరకాలలో పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, భారతీ యజనసంఫ్ు, భారతీయ జనతాపార్టీ కలిసి మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. బిజెపి సీనియర్ నాయకుడు సి. జంగారెడ్డి ఇక్కడ ఒకసారి, శాయంపేటలో రెండుసార్లు గెలుపొందారు. ఆయన హన్మకొండ లోక్‌సభ స్థానంలో మాజీప్రధాని పి.వి నరసింహారావును ఓడిరచి చరిత్ర సృష్టించారు. ఆర్. నరసింహరామయ్య ఇక్కడ ఒకసారి హసన్‌పర్తిలో రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు గెలిచిన బచ్చు సమ్మయ్య ఒకసారి, హసన్‌పర్తిలో మరోసారి గెలిచారు. బిజెపి అభ్యర్ధి అయిన జయపాల్ ఇక్కడ రెండుసార్లు, బి. రాజయ్య ఇక్కడ ఒకసారి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి గెలిచారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన శారారాణి ఆ తర్వాత అసమ్మతిలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ విఫ్‌కు విరుద్ధంగా కాసాని జ్ఞానేశ్వర్ మద్దతు ఇచ్చినందుకుగాను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈమెను అనర్హురాలిని చేస్తూ అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం తొమ్మిదిమంది ఈ విధంగా అనర్హతకు గురి అయితే వారిలో ఈమె ఒకరు. అయితే ఈమె తీర్పు రావడానికి ఒకరోజు ముందే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి గెలిచిన సమ్మయ్య గతంలో భవనం, కోట్ల మంత్రి వర్గాలలో ఉంటే, సి. ధర్మారెడ్డి అప్పట్లో జలగం క్యాబినెట్లో ఉన్నారు.పరకాలలో ఐదుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, తొమ్మిదిసార్లు ఎస్.సిలు, ఒకసారి ఇతరులు గెలిచారు. పరకాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నర్సంపేట నియోజకవర్గానికి తదుపరి చారిత్రక అభ్యర్థి ఎవరు..?
నర్సంపేట నియోజకవర్గం నర్సంపేటలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిఆర్ఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సుదర్శనరెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా ఉండేవారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాదవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాదించగా, 2018లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేతగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డి 2014లో నర్సంపేటలో ఓటమి చెందారు. ఆయన 2014లో ప్రత్యర్ధిగా కూడా నిలవలేకపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ టిక్కెట్ చివరిక్షణంలో కోల్పోయి, స్వతంత్రుడుగా పోటీచేసిన దొంతి మాధవరెడ్డి 2014లో గెలవడం విశేషం టిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శనరెడ్డి ఆ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి, మాధవరెడ్డి చేతిలో 18376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2018లో మాధవరెడ్డిని సుదర్శనరెడ్డి ఓడిరచారు. 2014లో ప్రకాష్ రెడ్డికి 34479 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కత్తి వెంకటస్వామికి 6638 ఓట్లు దక్కాయి. రేవూరి 2018లో ఇక్కడ నుంచి వరంగల్ పశ్చిమకు మారి పోటీచేసినా గెలవలేకపోయారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెండుసార్లు అది కూడా 1957, 1967లలోమాత్రమే గెలిచింది. 1972 నుంచి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది. అయితే 2004లో కాంగ్రెస్ ఐ మద్దతు ఇచ్చిన టిఆర్ఎస్ విజయం సాధించింది. వామపక్ష నేతలలో ఒకరైన మద్దికాయల ఓంకార్ ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయన మూడుసార్లు సిపిఎం పక్షాన గెలిస్తే, ఆ తర్వాత పార్టీకి దూరమె సొంతంగా ఎమ్.సిపిఐని ఏర్పాటుచేసుకున్నారు. రెండుసార్లు ఇండిపెండెంటుగా నెగ్గారు. 1994లో టిడిపి అభ్యర్ధి రేవూరి ప్రకాష్‌రెడ్డిపై 87 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రకాష్‌రెడ్డి 1999లో గెలిచాక 610 జీఓపై శాసనసభలో ఏర్పాటు చేసిన సభాసంఘానికి నాయకత్వం వహించారు. రేవూరి మూడుసార్లు గెలిచారు. కొంతకాలం టిడిపి పాలిట్‌బ్యూరో సభ్యునిగా కూడా వ్యవహరించారు. నరసంపేటలో ఏడుసార్లు రెడ్లు, ఐదుగురు బిసివర్గం నేతలు రెండుసార్లు ఇతరులు గెలిచారు. నర్సంపేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం గతంలో గెలిచిన అభ్యర్థులు వీరే..మరి ఇప్పుడు..?
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం మహబూబాబాద్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ రెండోసారి విజయం సాదించారు. ఈయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ పై 13534 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. శంకర్ నాయక్ కు 85397 ఓట్లు రాగా, బలరాం నాయక్ కు 71863 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జె.హుస్సేన్ నాయక్ కు 11600 పైగా ఓట్లు వచ్చాయి. 2014లో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గంలో శంకర్ నాయక్ కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవిత ను 9315 ఓట్ల తేడాతో ఓడిరచారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండి కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందడం విశేషం. ఆ తర్వాత ఇద్దరూ టిఆర్ఎస్లో చేరిపోయారు. కవిత 2019 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. మహబూబాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.ఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి. 1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్థనరెడ్డి గెలుపొందారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్‌రెడ్డి ఈ నియోజకవర్గం 2009లో రిజర్వు కావడం వల్ల పోటీచేయ లేకపోయారు. మహబూబాబాద్‌లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు బ్రాహ్మణ,ఒకసారి ఎస్.సి, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గ గత చరిత్ర ఇదే..మరి ఇప్పుడు..?
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గం డోర్నకల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో గిరిజన నేత డి.ఎస్.రెడ్యా నాయక్ ఆరోసారి విజయం సాదించారు. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ సీటుగా ఉన్నప్పుడు ఈయన నాలుగు సార్లు గెలవడం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో రెడ్యానాయక్ కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత టిఆర్ఎస్లోకి మారిపోయారు. తదుపరి 2018లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి రామచంద్రునాయక్ పై 17511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెడ్యా నాయక్‌కు 88307 ఓట్లు రాగా, రామచంద్రు నాయక్‌కు 70926ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.రవీందర్‌కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రెడ్యానాయక్ 2009లో ఓడిపోయినా, 2014లో తన పాత ప్రత్యర్ధి సత్యవతి రాధోడ్‌ను 23531ఓట్ల తేడాతో ఓడిరచారు. 2014లో తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ప్రభజంనం వీచినా ఇక్కడ మాత్రం అది కనిపించలేదు. 2009లో టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించిన సత్యవతి 2014లో టిఆర్ఎస్లోకి వెళ్లి పోటీచేసి ఓటమిచెందారు. ఆ తర్వాత కాలంలో ఆమె ఎమ్మెల్సీ అయి 2018 ఎన్నికల తర్వాత కొంతకాలానికి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1957లో ఏర్పడిన డోర్నకల్ నియోజకవర్గంలో 13సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిస్తే, ఒకసారి టిడిపి గెలిచింది. ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది. డోర్నకల్‌లో 1972లో నూకల రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా నెగ్గగా, ఆయన అకాల మరణం తర్వాత 1974లో జరిగిన ఉప ఎన్నికలో ఆర్. సురేంద్రరెడ్డి ఏకగ్రీవంగా గెలవడం మరో విశేషం. నూకల మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఆయన తర్వాత రామసహాయం సురేంద్రరెడ్డి మరో నాలుగుసార్లు, తదనంతరం రెడ్యా నాయక్ మరో ఆరుసార్లు గెలిచారు. నూకల గతంలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. నూకల కొంతకాలం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని శాసన సభలో తెలంగాణ యున్కెటెడ్ ఫ్రంట్ ఏర్పడిన శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వహించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వున్నారు. రెడ్యానాయక్ 2004లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. సురేంద్రరెడ్డి మహబూబాబాద్ నుంచి ఒకసారి, వరంగల్లు నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. డోర్నకల్‌లో ఎనిమిది సార్లు రెడ్డి సామాజికవర్గం ఎన్నిక కాగా,నాలుగుసార్లు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు గిరిజన నేత ఎన్నికవడం విశేషం. డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గత చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్.పిగా కూడా నెగ్గారు. దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్. విజయ్‌కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్‌సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐకి మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు. అయితే తీర్పు రావడానికి ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు. దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్‌గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు. చెన్నూరు(2009లో రద్దు) రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు. ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్‌రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సింగాపూర్ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్‌కు 22700 పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ తొలి క్యాబినెట్లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు. రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఐలో గెలుపొంది టిఆర్ఎస్లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్ఎస్లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఐ కు రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్లో చేరి వరంగల్ నుంచి లోక్ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్‌లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్ నియోజకవర్గం జనరల్‌గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోవడం ఓ విషాదం. హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్.టి.ఆర్. క్యాబినెట్‌లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. డాక్టర్ రాజయ్య కూడా కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు. స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..