
ములుగు (ఎస్టి) నియోజకవర్గం
ములుగు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్ ఐలో చేరి విజయం సాదించారు. అనసూయ తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ది, అప్పటి మంత్రి ఎ.చందూలాల్ పై 22671 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. సీతక్కకు 88971 ఓట్లు రాగా, చందూలాల్‌కు 66300 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన బి.లక్ష్మీనారాయణకు సుమారు 3500 ఓట్లు వచ్చాయి.
2014లో ములుగు నుంచి టిఆర్‌ఎస్ పక్షాన చందూలాల్ గెలిచారు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు. 2014లో ఇక్కడ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడిరచారు. అప్పట్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ(సీతక్క) మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఆమె 2018లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య భద్రాచలానికి మారి మూడోసారి విజయం సాదించడం విశేషం.
ములుగులో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్ ఒకసారి పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందూలాల్ ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచి కొంత కాలం ఎన్.టిఆర్ క్యాబినెట్‌లో ఉన్నారు. తదుపరి 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్‌లో ఉన్నారు.
రెండుసార్లు టిడిపి తరుపున లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 2009లో ఆయన టిఆర్‌ఎస్ పక్షాన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2014లో ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంత కాలం నక్సల్స్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఆ పంధాను వీడి టిడిపిలో చేరారు. 2018లో మరోసారి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు.
ములుగు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..