వరంగల్ వెస్ట్ నియోజకవర్గం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన వినయ్ భాస్కర్ మరోసారి విజయం సాదించారు. ఒక ఉప ఎన్నికతో సహా ఆయన నాలుగుసార్లు గెలిచినట్లు అయింది. వినయ్ భాస్కర్ తన సమీప టిడిపి ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై 36451 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన రేవూరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. దాస్యం వినయ్ భాస్కర్‌కు 80189 ఓట్లు రాగా, రేవూరి ప్రకాష్ రెడ్డికి 43299 ఓట్లు వచ్చాయి.
గతంలో నర్సంపేట నుంచి మూడుసార్లు గెలిచిన ప్రకాష్‌రెడ్డి 2018లో వరంగల్ వెస్ట్‌కు మారి ఓటమి చెందారు. బిజెపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే ఎమ్.ధర్మారావుకు ఆరువేల ఓట్లు వచ్చాయి. వినయ్ భాస్కర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.ఆయనకు ఈసారి విఫ్ పదవి వచ్చింది. 2014లో వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్ధి ఎర్రబెల్లి స్వర్ణను 56304 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. అప్పుడు కూడా బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా రంగంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మార్తి నేని ధర్మారారవు మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత హన్మకొండ బదులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడిరది. రెండువేల తొమ్మిదిలో తొలిసారి గెలిచిన వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో శాసనసభకు రాజీనామా చేసి 2010 జూ 27న జరిగిన ఉప ఎన్నికలో, ఆ తర్వాత మరో రెండుసార్లు విజయం సాదించారు. వినయభాస్కర్ సోదరుడు ప్రణయభాస్కర్ గతంలో హన్మకొండలో గెలుపొందిన ఎన్.టిఆర్ క్యాబినెట్‌లో కొంతకాలం మంత్రిగా ఉన్నారు.
అస్వస్థత కారణంగా ఈయన అకాల మరణం చెందారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి రంగారావు గెలిచారు. రంగారావు అంతకుముందు కూడా ఒకసారి గెలుపొందారు. గతంలో ఇక్కడ ఉన్న హన్మకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి ఒకసారి, టిఆర్‌ఎస్ ఒకసారి, పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. 1952లో హన్మకొండలో గెలిచిన పెండ్యాల రాఘవరావు వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీచేసి గెలుపొందడం అరుదెన విషయం.
ఆ తర్వాత రెండు అసెంబ్లీ సీట్లకు రాజీనామాచేశారు. హనుమకొండలో 1978లో గెలిచిన టి.హయగ్రీవాచారి, రెండుసార్లు ధర్మసాగర్ నుంచి, ఒకసారి ఘనపూర్ నుంచి గెలుపొందారు. హయగ్రీవాచారి, ఎస్. సత్యనారాయణ, ప్రణయభాస్కర్, పి.వి రంగారావులు మంత్రి పదవులు నిర్వహించారు. పివి. రంగారావు సోదరుడు రాజేశ్వరరావు సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు గతంలో ఎన్నికయ్యారు. 2004లో హనుమ కొండలో గెలిచిన మందాడి సత్యనారాయణరెడ్డి తర్వాత అసమ్మతి నేతగా ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటకు గురయ్యారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హత వేటుపడిన తొమ్మిదిమందిలో ఈయన ఒకరు. ఈయన హైకోర్టుకు వెళ్ళి ఒక నెలరోజుల పాటు స్టే తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత హైకోర్టు కూడా వ్యతిరేకతీర్పు ఇవ్వడంతో ఈయన పదవిని కోల్పోయారు. వరంగల్ పశ్చిమ , హన్మకొండ,హసన్ పర్తి, ధర్మసాగర్ కలిసి రెండుసార్లు రెడ్లు, ఏడుసార్లు బిసి నేతలు (వినయ్ భాస్కర్ కూడా బిసి నేతే), ఏడుసార్లు బ్రాహ్మణ,రెండుసార్లు ఎస్.సిలు, ఒకసారి ముస్లిం, ఒకసారి ఇతరులు గెలిచారు.
వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment