
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు :
పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్.
నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు :
మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం
ప్రధాన పార్టీల అభ్యర్థులు:
కాంగ్రెస్
- సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే)
బీఆర్ఎస్
- బడే నాగజ్యోతి (కన్‌ఫాం)
బీజేపీ
- తాటి కృష్ణ (ఆశావాహులు)
- భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు)
వృత్తిపరంగా ఓటర్లు :
వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ
మతం/కులం పరంగా ఓటర్లు :
- ఎస్టీ లంబాడా ఓటర్లు 34400
- ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250
- ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :
ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం.
Comments
Please login to add a commentAdd a comment