warngal
-
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
Acharya Saana Kastam Song Controversy: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ.. అభిమానుల కోసం వరసగా ఓక్కో అప్డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. అంతేగాక ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది. ఇటీవల విడుదలై ఆచార్య స్పెషల్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్ వైరల్ ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్ ఆర్ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ ఉంటావా’ సాంగ్‌ను కూడా వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతటి రచ్చకు దారితీసేందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే పుష్ప సాంగ్ మాదిరిగానే ఆచార్య స్పెషల్ సాంగ్ కూడా వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిసోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తోంది చూడాలి. -
పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేయాలి: విజయ్ దేవరకొండ
‘‘పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చేసే సినిమాలన్నీ వరంగల్‌లోనే స్టార్ట్ చేయాలి.. ఎందుకంటే వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ‘రొమాంటిక్’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఆకాశ్ మాటలు విన్నాక తనలో మంచి ఫైర్ ఉందనిపించింది. మీ నాన్న (పూరి జగన్నాద్) కాలర్ ఎగరేయాలి. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి పూరి, చార్మీగార్లు నాకు చెప్పేవారు. ప్రతి సినిమా చూస్తాడట.. సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. సక్సెస్ అవుతావు. ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారు. ఈ సినిమా 100శాతం హిట్ అవుతుంది. విధి అనేది నన్ను, పూరి జగన్నాథ్, చార్మీలను కలిపింది. ‘లైగర్’ సినిమా కోసం వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాం’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నాకు పదేళ్లప్పుడు స్కూల్ తరపున వరంగల్‌కి వచ్చాను. అప్పటి నుంచి నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ‘రొమాంటిక్’ చిత్రంలో ఆకాశ్, రమ్యకృష్ణ, కేతిక ఇరగ్గొట్టేశారు. మంచి లవ్‌స్టోరీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమా చూడండి. ఆకాశ్ చాలా మాట్లాడేశాడు.. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ లేవగానే ఓ డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు నన్ను. తను మంచి నటుడు’’ అన్నారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ వరంగల్‌లో చేశాం.. పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తోనే ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలి’’ అన్నారు చార్మి. అనిల్ పాదూరి మాట్లాడుతూ– ‘‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌గారు పూరి జగన్నాథ్‌గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను నమ్మి ‘రొమాంటిక్’ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, చార్మీగార్లకు థ్యాంక్స్. మంచి ప్రేమకథా చిత్రాల్లో ‘రొమాంటిక్’ కూడా ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. పూరి ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో నర్సీపట్నంలో పుట్టిన మా నాన్న సినిమా నేపథ్యం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి పైకి వచ్చారు. ‘పూరి టైమ్ అయిపోయిందిలే.. ఇక సినిమాలు ఏం చేస్తాడు?’ వంటి రకరకాల కామెంట్స్ చూసినప్పుడు బాధ వేసేది. అలాంటి వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో సమాధానం చెప్పారు. అలాగే ‘వీడేం హీరోలే’ అని నన్ను కొందరన్నారు. నన్ను చూసి మీరు గర్వపడేలా ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతా నాన్నా.. ఏదో ఒకరోజు గర్వంగా మీరు కాలర్ ఎగరవేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
వరంగల్‌లో ఆర్జీవీ సందడి, అక్కడి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న వర్మ
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినిపిస్తే చాలు అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ ఈసారి ఎవరిని టార్గెట్ చేశాడా? అని నెటిజన్లు ఆత్రుతగా చూస్తారు. అలా తనదైన తీరుతో ఇతరులకు షాక్ ఇచ్చే ఆర్జీవీ ఈసారి సరికొత్తగా వార్తల్లో నిలిచాడు. నిజ జీవిత సంఘటనలు, బయోపిక్‌లను తెరకెక్కించడంలో వర్మ సాటి ఎవరు లేరు. ఇప్పటికే ‘రక్త చరిత్ర, మర్డర్, సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి నిజ జీవిత సంఘటనలు సినిమాగా రూపొందించిన ఆయన తాజాగా ‘కొండా’ పేరుతో మరో మూవీని తెరకెక్కించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్ వెళ్లాడు. ‘కొండా’ మూవీ ప్రారంభోత్సవంలో భాగంగా ఆర్జీవి అక్కడి గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాడు. అలాగే అక్కడ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాడు. అనంతరం అక్కడి వంచనగిరి గ్రామంలో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. కాగా తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి, సురేఖల జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రీసెంట్గా ఆర్జీవీ విడుదల చేశారు. 1980 లవ్‌స్టోరీ విత్ నక్సల్ బ్యాగ్రౌండ్‌తో సినిమా రూపొందనుంది. అరుణ్ అదిత్ ఇందులో కొండా మురళి పాత్రలో కనిపించబోతున్నాడు. భైరవగీత ఫేమ్ ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రలో కనిపించనున్నారు. -
అగ్గి పెడతా.. కేసీఆర్ పార్టీని కూల్చేస్తా
సాక్షి, కమలాపూర్ (వరంగల్): తాను ఒక్క హుజూరాబాద్‌తోనే కొట్లాట ఆపనని, ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అగ్గి పెట్టి.. కేసీఆర్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు తన పేరిట నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారని, దళితబంధు వద్దు.. అని సృష్టించిన లేఖపై ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. అలాగే తాను కేసీఆర్‌కు భయపడి వాళ్ల కాళ్ల మీద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లు మరో దొంగ లేఖ పుట్టించారని, తాను చచ్చినా ఎవరి ముందు మోకరిళ్లనని స్పష్టంచేశారు. గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం చంపిస్తానంటేనే బెదిరిపోలేదని, ఇప్పుడు కూడా కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోనని పేర్కొన్నారు. ‘కేసీఆర్! నువ్వు కాదు కదా.. నీ జేజమ్మ వచ్చినా ఇక్కడ గెలవలేరు. ఇక్కడ ఉన్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు పద్దెనిమిదిన్నర ఏళ్లుగా నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నోళ్లు.. నీ సారా సీసాలకు, డబ్బు సంచులకు లొంగిపోరు, బెదిరింపులకు, నీ పోలీసు రాజ్యానికి భయపడరు. ఇది చైతన్యవంతమైన హుజూరాబాద్’అని అన్నారు. కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ఈ నెల 30న హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈటల మోసానికి.. గెల్లు విధేయతకు మధ్య పోటీ -
వరంగల్: కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్, లైవ్ అప్డేట్స్
-
మినీ మున్సి‘పోలింగ్’.. లైవ్ అప్డేట్స్
-
Telangana Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
తెలంగాణలో రెండు, కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 5 గంటల వరకు ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. అయితే 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. Time: 3:00 గంటల వరకు పోలింగ్ 44.15 శాతంగా నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. Time: 2:15 PM కాంగ్రెస్ నేత ముస్తఫా అరెస్ట్ ఖమ్మం: 57వ డివిజన్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకుడు ముస్తఫాని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తలను అడ్డుకోవడమే కాక వారిని చెదరగొట్టారు. Time: 1:31 PM ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రం ఎదుట లాఠీఛార్జి ఖమ్మం: 57వ డివిజన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. Time: 1:02 PM విషాదం.. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి వరంగల్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో విషాదం నెలకొంది. 57వ డివిజన్లోని సమ్మయ్య నగర్ లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌బాబు గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలోని కొండాపూర్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పని చేస్తున్నారు. Time: 12:47 PM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్‌రావు.. సిద్ధిపేట 23వ వార్డులోని 69వ పోలింగ్ బూత్‌లో మంత్రి హరీష్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలోన రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట 43 వార్డులకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ను వెబ్ కెమెరా లో పరిశీలించారు. సమయానుకూలంగా ఓటర్లందరూ వచ్చి విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. Time: 12:08 PM ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వరంగల్ కార్పొరేషన్- 23.62 శాతం ఖమ్మం కార్పొరేషన్- 23.41 శాతం సిద్దిపేట మున్సిపాలిటీ- 31.39 శాతం అచ్చంపేట మున్సిపాలిటీ- 34 శాతం జడ్చర్ల మున్సిపాలిటీ-35 శాతం కొత్తూరు మున్సిపాలిటీలో 43.99 శాతం నకిరేకల్ మున్సిపాలిటీ- 45.55 శాతం Time: 12:00 PM టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ ఖమ్మం: పీజీ కాలేజీ సెంటర్ ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలకు దిగారు. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. Time: 11:35 AM సిద్ధిపేట మున్సిపాలిటీలో ఉదయం 11 గంటల వరకు 31.39 శాతం పోలింగ్ నమోదైంది. సిద్ధిపేట జిల్లా గజ్వెల్ పట్టణం లో 12వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. అచ్చంపేటలో 11 శాతం, నకిరేకల్‌లో 11.12 శాతం, జడ్చర్లలో 12 శాతం, ఖమ్మం కార్పొరేషన్లో 15.23 శాతం పోలింగ్ జరిగింది. Time: 10:43 AM బీజేపీ ఆందోళన.. ఖమ్మం కార్పొరేషన్ 20వ డివిజన్ పరిధిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్టులతో ధర్నా నిర్వహించారు. Time: 9:20 AM ఖమ్మం: పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల కోవిడ్ నిబంధనలు ప్రకారం.. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లు క్యూలైన్లల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. Time: 8:36 AM ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం కార్పొరేషన్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఇందులో 10వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో 59డివిజన్ల కు పోలింగ్ జరుగుతుంది. హార్వెస్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 8:14 AM సిద్దిపేటలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 100653 ఉండగా.. పురుష ఓటర్లు 49875 మంది, మహిళా ఓటర్లు 50767 మంది ఉన్నారు. 130 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 485 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. Time: 7:58 AM నల్గొండ జిల్లా: నకిరేకల్ నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వార్డుకి రెండు బూత్‌లు చొప్పున 40 పోలింగ్ బూత్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. Time: 7:10 AM తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగనుంది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్ది పేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు, కొన్ని మున్సిపాలిటీలలోని ఒక్కొక్క వార్డుకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ♦వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్ ♦వరంగల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ ♦వరంగల్ కార్పొరేషన్ 66 డివిజన్ల బరిలో 502 మంది అభ్యర్థులు ♦ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం, 59 చోట్ల పోలింగ్ ♦ఖమ్మం కార్పొరేషన్ 59 డివిజన్ల బరిలో 251 మంది అభ్యర్థులు ♦ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 377 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ♦ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2.88 లక్షల మంది ఓటర్లు ♦సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్ ♦అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలకు పోలింగ్ ♦సిద్దిపేట మున్సిపాలిటీ 43 వార్డుల్లో 236 మంది అభ్యర్థులు ♦కొత్తూరు మున్సిపాలిటీ 12 వార్డుల్లో 47 మంది అభ్యర్థులు ♦అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డుల్లో 66 మంది అభ్యర్థులు ♦జడ్చర్ల మున్సిపాలిటీ 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు ♦నకిరేకల్ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు కోవిడ్– 19 నిబంధనలను హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పరిధిలోని జిల్లా కల్లెక్టర్లు, పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు రోజున పాటించాల్సిన కోవిడ్–19 నిబంధనలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఈ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, ఓఎస్డీ జయసింహ రెడ్డి కూడా పాల్గొన్నారు. మే 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది.పోలింగ్ సందర్భంగా ఇలా.. ► పోలింగ్ నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ► అన్ని పోలింగ్ కేంద్రాల పరిసరాలను శానిటైజ్ చేయాలి ► పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలోనూ, బయటికి వచ్చేటప్పుడూ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. దీనికోసం శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలి. ► భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్క్ చేసి, భౌతిక దూరం పర్యవేక్షణకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకం ► భౌతిక దూరం పాటించేలా పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల సీటింగ్ ► సిబ్బంది, పోలీసులు విధిగా మాస్క్ లు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు ధరించాలి. వీలును బట్టి ఎన్–95 మాస్క్ లేదా రెండు మాస్కులు ధరించాలి. ► కోవిడ్–19 నిబంధనల అమలుకు ప్రతి మునిసిపాలిటీలో ఒకరు లేదా ఇద్దరు హెల్త్ నోడల్ అధికారుల నియామకం. ► ప్రతి కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు ఆరోగ్య సిబ్బంది మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలి. ► అవసరమైన అంబులెన్సులను ఆక్సిజెన్ సిలిండర్లతో సిద్ధంగా ఉంచాలి ► రిసెప్షన్లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒకే సమయంలో 10 మందికి మించకుండా ఉండేలా చూడాలి. ► పోలింగ్ సిబ్బందికి రిసెప్షన్ సెంటర్ నుండి వారి గమ్యస్థానాలకు రవాణా సౌకర్యం కల్పించాలి. ► నలుగురికంటే ఎక్కువ మంది ఒక్కచోట చేరకుండా చూడాలి. అవసరమైతే 144 సెక్షన్ విధించాలి. కౌంటింగ్ సమయంలో... ► స్ట్రాంగ్ రూమ్‌లు విశాలమైన గదులలో ఏర్పాటు చేసి శానిటైజ్ చేయాలి. అలాగే పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలి. ► కౌంటింగ్ హాల్స్ విశాలమైన గదులలో ఏర్పాటు చేయాలి. ఒక్క కౌంటింగ్ హాల్లో 50 మందికి మించి ఉండొద్దు. ► కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి. ► మాస్కులు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకునేలా చూడాలి. ► జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదు. ► అవసరమైన వారికి పీపీఈ కిట్లు ఇవ్వాలి. -
తాటికల్లు మంచిగున్నది..
సాక్షి,చెన్నారావుపేట: ఎన్నికల ప్రచారాలు జోరుగా ,చాలా వింతగా చేస్తున్నారు అభ్యర్థులు . గెలవాలనే తపనతో ప్రజలను ఆకర్షించాలని వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారు. ఇదే విధంగా తాటికల్లు తాగుతున్నట్లు టీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ జిల్లా చెన్నారావు పేటోలో ప్రచారాలు చేశారు. -
కుగ్రామం నుంచి జిల్లా వరకు...
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి కుగ్రామం నుంచి మునిసిపాలిటీ, నియోజకవర్గం, జిల్లాకేంద్రం వరకు విస్తరించింది. సింగరేణి గనులతో భూపాలపల్లి ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోంది. కేటీపీఎస్ ఏర్పాటుతో భూపాలపల్లి కార్మిక ప్రాంతంగా రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే పట్టణంలో అధికంగా ఉన్నారు. 2008లో ఏర్పడ్డ భూపాలపల్లి నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించడంలో కార్మికులే కీలకంగా మారారు. రైతులు సైతం ప్రభావితం చేయనున్నారు. ఇతర ప్రాంతాల వారే అధికం భూపాలపల్లి పట్టణానికి విలక్షణమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్థిరపడిన వారిలో అధికశాతం వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారే. గోదావరి ఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి, చెన్నూర్ వంటి ప్రాంతాల్లో కొన్ని గనులు మూతపడటంతో పాటు ఇక్కడ కొత్తగా గనులు ప్రారంభం అవ్వడంతో ఆయా ప్రాంతాల్లోని కార్మిక కుటుంబాలు భూపాలపల్లికి వచ్చి స్థిరపడ్డాయి. వీరితో పాటు కాటారం, మహాదేవ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు.ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, గణపురం, రేగొండ మండలాలతోపాటు వరంగల్ రూరల్ జిల్లా నుంచి శాయంపేట మండలం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. చిట్యాల నుంచి కొత్తగా టేకమట్ల మండలం కొత్తగా ఏర్పడింది. కార్మిక ఓటర్లే కీలకం భూపాలపల్లి నియోజకవర్గంలో కార్మిక ఓట్లే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఏడు వేల కార్మిక కుటుంబాలు భూపాలపల్లిలో నివాసముంటున్నారు. దాదాపుగా 20వేల ఓట్లు కార్మిక వర్గాల వారివే ఉన్నాయి. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే అని ప్రతి అభ్యర్థి భావిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కూడా కార్మికులకు సెలవు దినమైన ఆదివారం నాడే కార్మిక వాడల్లో నాయకులు కలియతిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో గెలుపొందిన వారు భూపాలపల్లి మండలంలో ముఖ్యంగా పట్టణ పరిధిలో అధికం ఓట్లు రావడం వల్లే గెలుపొందారు. ఈ సారి ఓ పార్టీకి ఓటు వేసి గెలుపిస్తారో వేచి చూడాలి. 2009లో నియోజకవర్గంగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భూపాలపల్లి ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చీఫ్ విప్‌గా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి గెలుపొంది తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభాపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు. పెరిగిన ఓటర్లు జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ములుగు కన్నా భూపాలపల్లిలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో 2లక్షల 22వేల 582 మంది ఓటర్లు ఉంటే 2014 ఎన్నికల్లో 2లక్షల 37వేల 803 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన తుది జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2లక్షల 45వేల 307 మంది ఓటర్లు ఉన్నారు. -
ఖర్చు పెరిగితే వేటు
సాక్షి, జనగామ: ప్రస్తుతం ఎన్నికల ప్రచారం, సరళి చేస్తే అభ్యర్థులు ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకపోతే మాత్రం వారిపై వేటు తప్పదు. భవిష్యత్‌లో పోటీచేసేందుకు కూడా అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ నిబంధన ఉంది.ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ అభ్యర్థుల వ్యయానికి కచ్చితమైన నిబంధలు రూపొందించింది. పోటీచేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చుచేయొద్దని స్పష్టంగా పేర్కొంది. నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఖర్చులను పరిమితం చేసింది. రూ.28 లక్షలకు మించి ఖర్చుచేసినా, ఖర్చుల లెక్కలను చూపకపోయినా వేటుతప్పదని కఠినంగా హెచ్చరిస్తున్నారు. లెక్కలు చూపకుండా గెలిస్తే అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దుచేయడంతోపాటు భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు. ఖర్చుల నిబంధనలు ఇవి... అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి గెలుపు పొందిన తరువాత విజయోత్సవ ర్యాలీ లేదా కృతజ్ఞత ర్యాలీ వరకు రూ.28 లక్షలు ఖర్చు పెట్టొచ్చు. ఎన్నికల ఖర్చుల కోసం పోటీ చేసే అభ్యర్థి ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థితోపాటు తన ఏజెంట్ పేరుతో బ్యాంకు అకౌంట్ తెరవాలి. చీఈ అకౌంట్లో మొత్తం రూ.28లక్షలు జమ చేయాలి. ఈ మొత్తంలో తాను సొంతంగా ఇచ్చినది, పార్టీ పంపించిన, ఇతర దాతలు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. రూ. 20 వేల లోపు అయితే నగదు రూపంలో, రూ.20 వేలు దాటితే చెక్ రూపంలో డిజిటల్ ఫార్మెట్లో జమచేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 40 మందికి వరకు స్టార్ క్యాంపెయినర్లను, గుర్తింపులేని రాజకీయ పార్టీలు 20 మంది వరకు స్టార్ క్యాంపెయినర్లను నమోదుచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్టార్ క్యాపెయినర్లు వాడుతున్న హెలీక్యాప్టర్ లేదా ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రయాణిస్తే ఆ ఖర్చులో సగం అభ్యర్థి వ్యయంలో కలుపుతారు. స్టార్ క్యాంపెయినర్లు నిర్వహించే బహిరంగ సభలో ఒక అభ్యర్థితోపాటు ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఆ వేదికపై కన్పిస్తే బహిరంగ సభ ఖర్చు అభ్యర్థులకు సమానంగా పంచబడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థికి ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో మూడు రకాల పేజీలుంటాయి. మొదటిపేజీలో నగదుకు సంబంధించిన వివరాలు, రెండోపేజీలో బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు, మూడో పేజీలో అభ్యర్థి పెట్టిన ఖర్చుల వివరాలు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు అభ్యర్థి తరుపు ఏజెంట్ నింపాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తరువాత అభ్యర్థులు లేదా ఏజెంట్లు అకౌంట్స్ అధికారులతో సమావేశమైన, నమోదైన ఖర్చులను సరిచూసుకోవాలి. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కనీసం మూడు సార్లు అభ్యర్థి ఖర్చులను బిల్లులతో సహా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న అకౌంట్ విభాగంలో సమర్పించి సరి చూసుకోవాలి. ఆ సమయంలో అకౌంట్ సిబ్బంది ఖర్చులను తమ దగ్గర ఉన్న బుక్‌లో నమోదు చేస్తారు. అభ్యర్థికి తెలియకుండా షాడో టీం సభ్యులు అభ్యర్థి ఖర్చుపై నిఘాపెడుతారు. ఆ విషయాన్ని అభ్యర్థి తరుపు ఏజెంట్‌కు తెలియజేస్తారు. ఖర్చు విషయాన్ని సరి చూసుకొని భవిష్యత్ ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థి తరుపున ప్రచారం చేయడానికి వాహనాలు, బహిరంగ సభల అనుమతులు రద్దుచేస్తారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే కౌంటింగ్ పూర్తయిన 26వ రోజున ఎన్నికల అధికారులు అభ్యర్థికి లేదా ఏజెంట్లకు తెలియజేస్తారు. అభ్యర్థులు గానీ వారి ఏజెంట్లు గానీ కౌంటింగ్ జరిగిన 30వ రోజులోపు అకౌంట్‌ను సరి చూసుకోని సమర్పించాలి. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు దాటినా, అభ్యర్థులు ఎన్నికల ఖర్చును సమర్పించకపోయినా వారి సభ్యత్వం రద్దవుతుంది. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులు. -
ఇక క్షణాల్లో కేసుల నమోదు..
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న నేరాలను అదుపు చేసేందుకు ప్రొటెక్టివ్ పోలీసింగ్‌లో భాగంగా ‘ఈ – పెట్టి’ కేస్ యాప్‌ను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నపాటి నేరాలకు పాల్పడినవారిపై నేరం జరిగిన స్థలంలోనే పోలీసులు ‘ఈ – పెట్టి’ యాప్ ద్వారా కేసులను నమోదు చేసేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశల మేరకు పెట్టి’ కేసులపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా చిన్నపాటి నేరాలకు పాల్పడుతున్నవారిపై నేరం జరిగిన ప్రాంతంలో కేసులను నమోదు చేయడంతో పాటు నేరానికి గల సాక్ష్యాలను కూడా సేకరించి నేరస్తులకు సంబంధిచిన పూర్తి వివరాలు, ఫొటోలు, డాటా బెస్ ద్వారా పంపిస్తామని తెలిపారు. ట్యాబ్‌లో ఈ అప్లికేషన్ ద్వారా కేసులు నమోదు చేయడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిందితుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు ఉండదని పేర్కొన్నారు. ఫలితంగా నిందితులపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 లా అండ్ అర్డర్ పోలీస్ స్టేషన్లకు చెందిన 147 మంది అధికారులన్లీ ట్యాబ్‌లను అందజేశారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ పూజ, ఏసీపీ మదన్‌లాల్ పాల్గొన్నారు. -
వన బోజనంలో అపశృతి.. ఆరుగురు మృతి !
సాక్షి, వరంగల్: వనభోజనానికి వచ్చిన కుటుంబాల్లో విషాదచాయాలు అలుముకున్నాయి. వనభోజనానికి వచ్చిన ఆరుగురు బాలురు బుధవారం గ్రామానికి సమీపంలోని కుంటలో ఈతకు దిగారు. ప్రమాదవశాత్తూ వారు మునిగి చనిపోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొత్తపేటలో చోటుచేసుకుంది. ఈతకు దిగిన వారిలో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన బాలురు నదీమ్ షా(16), మొమిన్(14), రసూల్(13), రంజాన్(16)లుగా గుర్తించారు. వీరి మరణంతో ఆ గ్రామం కన్నీటి సుడుల్లో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కలిచి వేసింది -
లావుగా ఉన్నానని ఎవరూ ఒప్పుకొలేదు..!
సాక్షి, చెన్నారావుపేట: ఇన్ని రోజులు పెళ్లికి అందం, ఐశ్వర్యం, పెద్దలు ఒప్పుకోకపోవడం ఇవే కారణం అనుకున్నాం. కానీ లావు అనే పదం కూడా వచ్చి చేరింది. పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుడి జీవితంలో లావుగా ఉన్నాడనే కారణం విషాదం నింపింది.దీంతో పెళ్లి కావడం లేదనే మనో వేదనతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని చెన్నారావుపేట మండలంలోని ఉప్పెరపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రమేష్(32) మహారాష్ట్రలోని బీవండిలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కుటుంబాన్ని ఆయనే పోషిస్తున్నాడు. తన ఇద్దరు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు. తన వివాహంపై కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ లావుగా ఉన్నాడనే కారణం అతని పెళ్లికి అడ్డుగా వచ్చింది. అందుకే పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని తీవ్ర మనోవేదన చెందేవాడు. దీంతో అతను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. -
లవర్‌ను తిట్టాడని చంపేశాడు
సాక్షి, వరంగల్: తన లవర్‌ను తిట్టిన వ్యక్తిని ఓ ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. హత్య జరిగిన స్థలంలో ఒక్క క్లూ కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఏడాది పాటు శ్రమించారు. లక్షలాది ఫోన్‌కాల్స్ డేటాను విశ్లేషించారు. హంతకులను అధునాతన టెక్నాలజీ సాయంతో మడికొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు జరిగిన దర్యాప్తులో చివరికి నిందితులకు సంకెళ్లేశారు. చందు మర్డర్ మిస్టరీ.. 2016 సెప్టెంబర్ 14న భట్టుపల్లి కోటచెరువు దగ్గర జరిగిన పులిగిల్ల చందు (19) హత్య కేసును మడికొండ పోలీసులు చేధించారు. ఏడాది పాటు జరిగిన దర్యాప్తు వివరాలను కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ జనార్ధన్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత ఏడాది వినాయక నిమజ్జనం రోజున కాజీపేట మండలం భట్టుపల్లి కోట చెరువు వద్ద చందు హత్య జరిగింది. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఘటనా స్థలంలో పోలీసులకు లభించలేదు. విచారణ ఇలా... చందు హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కేసులో ఒక్కో చిక్కుముడి విప్పుతూ నిందితులను పట్టుకున్నారు. ముందుగా 2016 సెప్టెంబర్ 14న దర్గా కాజీపేటలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ల పరిధిలో వచ్చి పోయిన కాల్స్ వివరాలు సేకరించారు. ఇందులో అనుమానాస్పదంగా అనిపించిన 12 మందిని గుర్తించి, అనుమానితుల కాల్ డేటా రికార్డు (సీడీఆర్) జాబితా ఆధారంగా విచారణ చేపట్టగా వారికి ఈ కేసుతో ఏ సంబంధం లేదన్నట్లు తేల్చారు. టవర్ లొకేషన్.. కేసు విచారణకులో భాగంగా పోలీసులు టవర్ లొకేషన్ టెక్నాల జీని ఆశ్రయించారు. మృతదేహం లభ్యమైన ఘటనా స్థలంలో హత్య జరిగినట్లుగా భావిస్తున్న సమయంలో అక్కడున్న టవర్ లొకేషన్ మ్యాప్‌ను సెల్‌ఫోన్ ఆపరేటర్ల నుంచి తెప్పించారు. దీంట్లో హత్య జరిగిన సమయంలో, ఘటనా స్థలానికి కేవలం 200 మీటర్ల దూరంలో కేవలం గుగులోతు శివ అనే వ్యక్తి ఫోన్ సిగ్నల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడగా తానూ, తన స్నేహితుడు రెడ్డిమళ్ల రాంకీ కలిసి ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో అనుమానితుల ఆ సమయంలో వివిధ రకాల నెట్‌వర్క్‌ల నుంచి ఎవరెవరివితో మాట్లాడారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజు నిందితులు ఉపయోగించిన హోండా అక్సెంట్ కారు వివరాలు తీసుకున్నారు. నిందితులు రాంకీ, గుగులోతు శివను అరెస్ట్ చేసి, కారు ను, హత్యకు వాడిన ఇనుప చువ్వను స్వాధీ నం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనపరిచిన మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది దేవేందర్, సాం బయ్య, కె.కిషన్, రవి, శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు. లవర్‌ను తిట్టినందుకే.. వర్ధన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రాంకీ, పాలకుర్తిలో ఇరిగేషన్ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. దర్గా కాజీపేటలో ఉండే అతడి బావ కనుమల్ల కిరణ్ ఇంటికి వచ్చే క్రమంలో అక్కడే ఉండే ఓ యువతితో రాంకీ ప్రేమలో పడ్డాడు. వినాయక నిమజ్జనం రోజున నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డిమల్ల రాంకీ అతడి లవర్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న పులిగిల్ల చందు రాంకీ లవర్‌ను కామెంట్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పకడ్బందీగా.. రాంకీ, దర్గా కాజీపేటలో ఉండే గుగులోతు శివ అనే తన స్నేహితుడి ద్వారా పుల్లిగిల్ల చందును పిలిచాడు. ముగ్గురు కారులో వర్ధన్నపేట వరకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ముగ్గురూ మద్యం సేవించారు. అనంతరం కారు నడుస్తుండగానే రెడ్డిమల్ల రాంకీ తనతో తెచ్చుకున్న పదునైన ఇనుప చువ్వతో చందు మెడ, గొంతు భాగంలో విచక్షణరహితంగా పొడిచి చంపాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత భట్టుపల్లి కోటచెరువు మత్తడి పక్కనే ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి వెళ్లారు. -
రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం
► బీబీనగర్ వద్ద ఘటన ► మృతుడి స్వస్థలం వరంగల్‌లోని శివనగర్ ► స్వగృహానికి చేరుకున్న మృతదేహం ఖిలా వరంగల్: సినీరంగంలో హీరో స్థాయికి ఎదిగిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓరుగల్లు బిడ్డను చిరుప్రాయంలోనే మృత్యువు కబళించింది. తన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన వరంగల్–హైదారాబాద్ జాతీయ రహదారిపై యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. బంధువులు, మిత్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రైల్వేగేట్ ప్రాంతం 18వ డివిజన్ శివనగర్‌కు చెందిన సరోహా రూపేష్, ఫరిజానా(ఫాతిమా) దంపతులకు ఇద్దరు కుమారులు అస్లాం (ఖరన్సింగ్) (21), సల్మాన్ఉన్నా రు. మూడేళ్ల కిత్రం చిన్నపాటి ఉద్యోగం చేసేందుకు అస్లాం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ మిత్రుడి సహకారంతో సినిమా రంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. గత ఏడాది నుంచి ప్రేమమయం సినిమాకు హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆడియో ప్రారంభం, వచ్చే నెల సినిమా విడుదలకు సిద్ధం చేశారు. రంజాన్ పండుకు అస్లాం హైదరాబాద్ నుంచి శివనగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ఇద్దరు ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అస్లాంకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే సికిందరాబాద్‌లోని ఎంజీఎంకు తరలించారు. అస్లాం మృతదేహం పోస్టుమార్టం పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం శివనగర్‌లోని తన స్వగృహానికి చేరుకుంది. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సినిమా ప్రముఖులు తరలివచ్చి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో మెట్టు శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్,ప్రవీణ్, శ్రీరాం రాజేష్, కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీపద్మ, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
వరంగల్ రేంజ్లో 40 లక్షల మెుక్కలు నాటాం
డీఐజీ ప్రభాకర్‌రావు కాళేశ్వరం : రెండో విడత హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజ్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 40 లక్షల మెుక్కలు నాటామని డీఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు. మహదేవపూర్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ‘సైరన్ కూత–హరితం మోత’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మెుక్కలు నాటేవారిని ప్రోత్సహించాలని, నరికేవారిని సహించొద్దని ప్రజలు, అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12 లక్షల మెుక్కలు నాటామని తెలిపారు. మహదేవపూర్‌లో సైరన్ ఆన్ చేయగానే అందరూ కలిసి 22,600 మెుక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, డీఎఫ్‌వో రవికిరణ్, సర్పంచ్ కోట రాజబాబు, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనాబాను, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి బాపు, ఎంపీటీసీ చాగర్ల రమాదేవి, ఎంఈవో రాజయ్య, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వరారవు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల హెచ్ఎంలు, నాయకులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
వరంగల్: వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు వరదతో ఏకమై ప్రవహిస్తున్నాయి. కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామ సమీపంలోని పెద్దతండా వద్ద మున్నేరువాగు పొంగి ప్రవహిస్తోంది. అలాగే, మంగపేట మండలం రాజుపేట ముసలమ్మవాగు ఉప్పొంగటంతో గ్రామంలోని నలబై ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వరద తీవ్రత ఇంకా పెరుగుతోంది. అలాగే, భూపాలపల్లి- పరకాల మార్గంలో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. -
కొనసాగుతున్నములుగు బంద్
ములుగు: వరంగల్ జిల్లా ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌తో మంగళవారం ములుగులో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా సాధన సమితి, అఖిలపక్షం, అన్ని కుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ములుగు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, సినిమాహాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అప్పుడు.. ఇప్పుడూ వరంగల్ ఫస్ట్
విద్యారణ్యపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2002, 2003, 2004 విద్యా సంవత్సరాల్లో ఎస్సెస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లా వరుసగా మూడు సార్లు మొదటిస్థానం సాధించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ, భారీ నీటిపారుదలశాఖమంత్రిగా పనిచేశారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా కడియం శ్రీహరి ఉండడం... ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో వరంగల్ జిల్లా మొదటిస్థానం సాధించడం విశేషం. -
ఓరుగల్లు సిగలో స్మార్ట్ కిరీటం
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ నగరాల సరసన వరంగల్ కేంద్ర నిధులు రూ.70 కోట్లు వచ్చే అవకాశం మారనున్న నగర రూపరేఖలు {sాఫిక్, విద్యుత్ కష్టాలకు చెక్ ఎకోఫ్రెండ్లీ సిటీగా రూపాంతరం {పజాప్రతినిధులు, నగర వాసుల హర్షం ఓరుగల్లుకు అరుదైన గౌరవం దక్కింది. స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల్లో తొలి విడత జాబితాలో చోటు సంపాదించింది. ఇక ఓరుగల్లు రూపు రేఖలు.. దిశదశ మారనుంది. అద్దం వంటి రహదారులు, ఆహ్లాదాన్నిచ్చే పచ్చదనం, నగరమంతా వైఫై సౌకర్యం, అవాంతరాల్లేని విద్యుత్ సరఫరా, వేగవంతమైన ప్రజా రవాణా, ప్రత్యేక ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, ఈ-విధానంలో కార్యకలాపాలు, కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్, మళ్లింపునకు రింగ్ రోడ్లు, వినోదానికి పార్కులు, మల్టీలెవల్ పార్కింగ్, జీపీఎస్ ట్రాకింగ్, గ్రీన్ బిల్డింగ్‌లకు ప్రోత్సాహం, కాలుష్యం లేని వాతావరణం ఇలా మన నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పురోగమించనుంది. - వరంగల్ అర్బన్ వరంగల్ అర్బన్ : హృదయ్ పథకంలో చోటు దక్కించుకోవడంతోపాటు గ్రేటర్ హోదా పొందిన వరంగల్ నగరం సిగలో మరో మణిహారం చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపికైంది. తొలివిడతలో దేశవ్యాప్తంగా వంద నగరాలతో పోటీపడి స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొద్ది నెలలుగా స్మార్ట్‌సిటీలపై ముమ్మరమైన కసరత్తు చేపట్టింది. ఓరుగల్లుకు స్మార్ట్ అర్హతలపై మహా నగర పాలక సంస్థ అధికారులు పలుమార్లు నివేదికలు సమర్పించారు. ఓరుగల్లు విశిష్టతలు, నగరానికి ఉన్న అర్హతలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఎట్టకేలకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఐదు స్మార్ట్ సిటీలను ఎంపిక చేయగా... ఇందులో వరంగల్ నగరం స్మార్ట్ సిటీ హోదా ఖరారైంది. దీంతో ప్రజాప్రతినిధులు,అధికారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారనున్న ఓరుగల్లు దశాదిశ స్మార్ట్‌సిటీతో ఓరుగల్లు దశాదిశ మారనుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఆధునిక నగర నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభించనున్నాయి. ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య జీవన ప్రమాణాలు సహా పరిపాలన పరమైన సేవలన్నీ జాతీయ స్థాయిలో ఉండేలా నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు కేంద్రం రూ.70 కోట్ల నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్, ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, బిల్డింగ్స్, కమ్యూనికేషన్స్, ట్రాన్పొర్టేషన్ విభాగాల్లో మార్పులు సంభవించనున్నారుు. వీటికి అనుబంధంగా ఇతర అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టే అవకాశం ఉంది. స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనలో నగర మేయర్, కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లు కీలక పాత్ర పోషిస్తాయి. నగరం మొత్తం వైఫై.. ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి సంబంధిత సంస్థలకు డబ్బులు చెల్లించాలి. స్మార్ట్ సిటీలోఆ బాధ ఉండదు. నగరం మొత్తం వైఫై వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. ప్రతిఒక్కరూ సెల్ఫోన్లు, ల్యాప్ టాప్ల ద్వారా నగరంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే సదుపాయం సమకూరనుంది. కాలుష్యానికి చెక్.. నగర ప్రజలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య కాలుష్యం. స్మార్ట్‌సిటీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఈ విధానంలో భవనాలపై మొక్కలు పెంచేలా ప్రోత్సాహకాలు అందిస్తారు. కొత్తగా నిర్మించనున్న భవనాలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఉండాలి. అదేవిధంగా ఇంకుడుగుంతలు నిర్మించిన తర్వాతే భవనం నిర్మించేలా నిబంధనలు కఠినతరం చేస్తారు. వీటితో పాటు పగటి వేళ భవనంలోకి గాలి, వెళుతురు వచ్చే బిల్డింగ్ డిజైన్ల వైపు ప్రజలు మొగ్గు చూపేలా ప్రణాళిక రూపొందిస్తారు. నగర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పార్కులను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తారు. ఈ పరిపాలన.. మహా నగర పాలక సంస్థ పరిధిలో పౌరసేవలు మరింత సులభమవుతాయి. పన్నుల చెల్లింపు, అనుమతులు త్వరతగతిన అందే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్లు, ఫేస్బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సామాజిక సైట్ల ద్వారా కూడా పౌరసేవలు పొందవచ్చు. ఇదేసమయంలో ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొదిస్తారు. వినియోగదారుడు బల్దియాలో పెట్టుకున్న ఆర్జీ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కార్పోరేషన్ ద్వారా అందుతున్న సేవలు సంతృప్తికంగా ఉన్నాయా ? లేదా ? అనే అంశాన్ని నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రజారవాణా సులభం, వేగవంతం.. నగరంలో ప్రజా రవాణా కీలకం. ఈ మేరకు వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా నిబంధనలుంటాయి. ఫలితంగా ఆయా వాహనాల గమన సమాచారం ప్రభుత్వ అధికారుల వద్ద నిక్షిప్తమవుతుంది. తద్వారా సులభంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేస్తారు. వాతావరణం ఏ మాత్రం కలుషిత ం కాకుండా చర్యలు తీసుకుంటారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, రహదారుల్లో సీసీ కెమెరాలు, మైక్‌లు అమరుస్తారు. వీటి సాయం... సెంట్రల్ కంట్రోల్ స్టేషన్ ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. ఒక పాయింట్లో ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ దారిలో వెళ్లే వాహనదారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు. అంతేకాదు స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాహనదారులు తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రికల్ చార్జింగ్, బ్యాటరీ అధారిత వాహనాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. పెట్రోల్‌బంక్‌ల తరహాలో వెహికల్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. రహదారుల వెంట పాదచారులు నడిచేందుకు, సైకిళ్లు వెళ్లేందుకు ప్రత్యేక మార్కింగ్ వేస్తారు. నగర జీవనంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దపీట వేస్తారు. మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అవసరం లేని వాహనాల రాకపోకలను నియంత్రించడానికి రింగు రోడ్లను అభివృద్ధి చేస్తారు. 24 గంటల పాటు విద్యుత్ నగరంలో వీధిదీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో పెనుమార్పులు సంభవిస్తాయి. నగరంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రత్యేక గ్రిడ్ పరిధిలోకీ తీసుకొస్తారు. ఏ ప్రాంతంలోనైనా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురైతే తక్షణమే స్పందించే వీలుంటుంది. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే అధునాతన బల్బులను వీధిదీపాలుగా ఉపయోగిస్తారు. సరఫరా నష్టాలను నివారించేందుకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తారు. దీని ద్వారా విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంటుంది. మెరుగైన డ్రెరుునేజీ వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి రోడ్లు చెడిపోవడం, గోతులు పడడం వంటివి జరుగుతుంటాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన తర్వాత ఇటువంటి అగచాట్లు కానరావు. నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చ ర్యల్లో భాగంగా సీనరేజీ ప్లాంట్లు నెలకొల్పే అవకాశం ఉంది. ఇలా శుద్ధి చేసిన నీటిని పార్కులు, రోడ్ల పక్కన చెట్ల నిర్వహణకు ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లీన్‌సిటీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. తడి, పొడి చెత్తను రోడ్లపై పారబోయడం కాకుండా వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తితో పాటు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళిక రూపొందిస్తారు. -
దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ
వరంగల్:జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం ఉదయం 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు. దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.