
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినిపిస్తే చాలు అందరిలో ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు, వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ ఈసారి ఎవరిని టార్గెట్ చేశాడా? అని నెటిజన్లు ఆత్రుతగా చూస్తారు. అలా తనదైన తీరుతో ఇతరులకు షాక్ ఇచ్చే ఆర్జీవీ ఈసారి సరికొత్తగా వార్తల్లో నిలిచాడు. నిజ జీవిత సంఘటనలు, బయోపిక్‌లను తెరకెక్కించడంలో వర్మ సాటి ఎవరు లేరు.
ఇప్పటికే ‘రక్త చరిత్ర, మర్డర్, సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి నిజ జీవిత సంఘటనలు సినిమాగా రూపొందించిన ఆయన తాజాగా ‘కొండా’ పేరుతో మరో మూవీని తెరకెక్కించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్ వెళ్లాడు. ‘కొండా’ మూవీ ప్రారంభోత్సవంలో భాగంగా ఆర్జీవి అక్కడి గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాడు. అలాగే అక్కడ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాడు.
అనంతరం అక్కడి వంచనగిరి గ్రామంలో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. కాగా తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి, సురేఖల జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రీసెంట్‌గా ఆర్జీవీ విడుదల చేశారు. 1980 లవ్‌స్టోరీ విత్ నక్సల్ బ్యాగ్రౌండ్‌తో సినిమా రూపొందనుంది. అరుణ్ అదిత్ ఇందులో కొండా మురళి పాత్రలో కనిపించబోతున్నాడు. భైరవగీత ఫేమ్ ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment