![Fir Registered In Minutes Police Cases - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/28/sand.jpg.webp?itok=rvU9GNKL)
ఈ– పిట్టి’ కేసు యాప్‌ను ప్రారంభిస్తున్న సీపీ రవీందర్
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న నేరాలను అదుపు చేసేందుకు ప్రొటెక్టివ్ పోలీసింగ్‌లో భాగంగా ‘ఈ – పెట్టి’ కేస్ యాప్‌ను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్‌రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నపాటి నేరాలకు పాల్పడినవారిపై నేరం జరిగిన స్థలంలోనే పోలీసులు ‘ఈ – పెట్టి’ యాప్ ద్వారా కేసులను నమోదు చేసేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశల మేరకు పెట్టి’ కేసులపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా చిన్నపాటి నేరాలకు పాల్పడుతున్నవారిపై నేరం జరిగిన ప్రాంతంలో కేసులను నమోదు చేయడంతో పాటు నేరానికి గల సాక్ష్యాలను కూడా సేకరించి నేరస్తులకు సంబంధిచిన పూర్తి వివరాలు, ఫొటోలు, డాటా బెస్ ద్వారా పంపిస్తామని తెలిపారు. ట్యాబ్‌లో ఈ అప్లికేషన్ ద్వారా కేసులు నమోదు చేయడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిందితుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు ఉండదని పేర్కొన్నారు. ఫలితంగా నిందితులపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 లా అండ్ అర్డర్ పోలీస్ స్టేషన్లకు చెందిన 147 మంది అధికారులన్లీ ట్యాబ్‌లను అందజేశారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ పూజ, ఏసీపీ మదన్‌లాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment