state wide
-
ఇక క్షణాల్లో కేసుల నమోదు..
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న నేరాలను అదుపు చేసేందుకు ప్రొటెక్టివ్ పోలీసింగ్‌లో భాగంగా ‘ఈ – పెట్టి’ కేస్ యాప్‌ను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ రవీందర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్నపాటి నేరాలకు పాల్పడినవారిపై నేరం జరిగిన స్థలంలోనే పోలీసులు ‘ఈ – పెట్టి’ యాప్ ద్వారా కేసులను నమోదు చేసేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశల మేరకు పెట్టి’ కేసులపై దృష్టిసారించామని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ ద్వారా చిన్నపాటి నేరాలకు పాల్పడుతున్నవారిపై నేరం జరిగిన ప్రాంతంలో కేసులను నమోదు చేయడంతో పాటు నేరానికి గల సాక్ష్యాలను కూడా సేకరించి నేరస్తులకు సంబంధిచిన పూర్తి వివరాలు, ఫొటోలు, డాటా బెస్ ద్వారా పంపిస్తామని తెలిపారు. ట్యాబ్‌లో ఈ అప్లికేషన్ ద్వారా కేసులు నమోదు చేయడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిందితుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు ఉండదని పేర్కొన్నారు. ఫలితంగా నిందితులపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశలు పెరుగుతాయని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 45 లా అండ్ అర్డర్ పోలీస్ స్టేషన్లకు చెందిన 147 మంది అధికారులన్లీ ట్యాబ్‌లను అందజేశారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ పూజ, ఏసీపీ మదన్‌లాల్ పాల్గొన్నారు. -
మూడు రోజులు సంతాప దినాలు
కొవ్వూరు రూరల్ : పోలవరంలో నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు జనాన్ని తరలించి.. ఆ వెనుకే మోటార్ సైకిల్‌పై అక్కడకు బయలుదేరిన కొవ్వూరు వ్యవసాయ అధికారి కాకర వేణుగోపాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన వ్యవసాయ శాఖలో విషాదం నింపింది. ఈ విషయం తెలిసి వ్యవసాయ శాఖ అధికారుల సంఘ నాయకులు ఘటనా స్థలానికి తరలివచ్చి నివాళులు అర్పిం చారు. ఆయన మృతదేహాన్ని పోలవరం నుంచి రాజమండ్రికి తరలిం చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కమలాకరశర్మ మాట్లాడుతూ శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో సంతాప దినాలు పాటిస్తున్నట్టు చెప్పారు. తమ శాఖ ఉద్యోగులెవరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామన్నారు. అందరితో కలిసిమెలిసి, స్నేహభావంతో మెలిగే వేణుగోపాల్ మృతి తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు. సంఘ కార్యదర్శి వైవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే సభలు, సమావేశాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యే అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. వేణుగోపాల్‌కు ఇద్దరు కుమార్తెలని, 18 ఏళ్లు నిండిన వెంటనే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ సమయంలో లభించే అన్ని ప్రయోజనాలను వేణుగోపాల్ కుటుంబ సభ్యులకు అందించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు, కొవ్వూరు ఏడీఏ జేవీఎస్ రామ్మోహనరావు మాట్లాడుతూ మంచి స్నేహితుణ్ణికోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. ఏవోలు జె.రత్నప్రభ, కె.రాజెంద్రప్రసాద్, డి.కృష్ణకిశోర్ తదితరులు నివాళి అర్పించారు. -
ముచ్చటగా మూడోస్థానం
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగి శాయి. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని ప్రకాశం, ద్వితీయస్థానాన్ని విశాఖపట్నం జట్లు సాధించాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా జట్లు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా, తృతీయ స్థానాలను పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం టీములు గెలుచుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. జాతీయస్థాయికి ఎంపికైన బాలుర జట్టు ఇదే.. ప్రకాశం జిల్లాకు చెందిన కె.అనిల్, పి.విశ్వనాథన్, పి.బాల సామిరెడ్డి, విశాఖపట్నం నుంచి పి.నరేష్, టి.తలుపులు, ఎల్.సురేష్ (విజయనగరం), రమేష్ (పశ్చిమ గోదావరి), మునిశేఖర్(చిత్తూరు), అబ్బాస్ అలీ(కృష్ణా జిల్లా), కె.చరణ్(కడప), హేమ సుందర్(గుంటూరు), రామాంజనేయులు(అనంతపురం). బాలికల జట్టు విజయనగరం నుంచి బి.శిరీషా, బి.శాంతమ్మ, కృష్ణా నుంచి కె.కుమారి, పి.నవ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జి.రాజీ, వి.ప్రభావతి, పి.చక్ర అనూష(తూర్పుగోదావరి), జి.పార్వతి(కడప), పి.వినీత(అనంతపురం), పి.అనూష(విశాఖపట్నం), కె.సుజాత(గుంటూరు), సీహెచ్ ప్రియాంక(నెల్లూరు). -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
అరట్లకట్ట (పాలకొల్లు అర్బన్): ఈ ఏడాది నవంబర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జరిగే రాష్ట్రస్థాయి సాప్్టబాల్ పోటీలకు ఇరువురు అరట్లకట్ట విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం కె శ్రీనివాస్ సోమవారం విలేకరులకు తెలిపారు. పెదవేగిలో నిర్వహించిన అండర్–17, అండర్–14 సాప్్టబాల్ పోటీల్లో పరసా రాజేష్, మల్లుల తేజేంద్రకుమార్ ఎంపికయ్యారన్నారు. వీరు జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ పాలా దుర్గారావును, విద్యార్థులను సర్పంచ్ చింతపల్లి లక్ష్మీకుమారి, ఎంపీటీసీ గుత్తుల స్వాతి, విద్యాకమిటీ చైర్మన్ చింతపల్లి వరప్రసాద్, హెచ్ఎం కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు మూర్తి, వేణు, చలపతిరావు, వరప్రసాద్, విద్య, గ్రామపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. -
ఆసక్తికరంగా పాల పోటీలు
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాలపోటీల్లో భాగంగా శుక్రవారం పాల సేకరణను నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో వివిధ జాతుల గోవులు, గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటల పాల ఉత్పత్తులను సేకరించారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ దాదాపు గంటసేపు సాగింది. సేకరణ అనంతరం పాల ఉత్పత్తులను అధికారుల సమక్షంలో రైతులు తూకం వేయించి, నమోదు చేయించారు. అలాగే శనివారం ఉదయం సైతం ఇదే తరహాలో పాలను సేకరించి మూడుపూటల లభించిన ఉత్పత్తుల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. ఉదయం మార్కెట్‌యార్డులో ఉన్న గో జాతులను ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు సందర్శించారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్ర«థమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తతీయ బహుమతిగా రూ. 20 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తతీయ బహుమతిగా రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నామన్నారు. శనివారం మద్యాహ్నం నుంచి జరిగే అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. విజేతలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. -
నేటి నుంచి పాడి పశువుల పోటీలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ద్వారకాతిరుమలలో గురువారం నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పాడి పశువుల పోటీలు నిర్వహించనున్నట్టు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.జ్ఞానేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పశు సంవర్థకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాల పోటీలు, పశుజాతి అందాల పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాల పోటీలకు ముర్రా జాతి గేదెలు, ఒంగోలు జాతి ఆవులు, గిర్, పుంగనూరు, షాహివాన్ తదితర దేశవాళీ జాతుల గేదెలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పోటీలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముర్రా జాతి దున్నపోతులు, పెయ్యలకు, ఒంగోలు జాతి పెయ్యలు, గిత్తలకు మాత్రమే అందాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 200 పశువులు పాల పోటీల్లో, మరో 200 పశువులు అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి : తిరుమల శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే కార్యక్రమాల్లో భాగంగా టీటీడీ చేపట్టే శ్రీనివాస కల్యాణాలను ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కల్యాణం ప్రాజెక్ట్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మొత్తం 7 ప్రాంతాల్లో 17వ తేదీ వరకు స్వామివారి కల్యాణాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలు, తేదీల వివరాలు.. - 9న శ్రీకాకుళం జిల్లా మండాన మండలం మహారజోల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం. - 10న శ్రీకాకుళం జిల్లా పొండూరు ఎస్పీఆర్ హైస్కూల్ మైదానం. -11న విశాఖపట్నం జిల్లా చిటికాడ మండలం జి.కొత్తపల్లిలోని నిత్యానంద ఆశ్రమం. -13న తూర్పు గోదావరి జిల్లా గాడాలలో గల అభయ పొన్నూరి రియల్ ఎస్టేట్ గ్రౌండ్స్‌లో శ్రీవారి కల్యాణాలను నిర్వహిస్తారు. -14న ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీసీతారామనగర్. -16న చిత్తూరు జిల్లా పీలేరు మండలం వెంకటాద్రిఇండ్లు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఆవరణలో నిర్వహిస్తారు. -17న చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సీ రామాపురం జెడ్పీ హైస్కూల్ మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైనాయి. మొత్తం 2661 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు. పరీక్షలలో మాస్ కాపీయింగ్‌ను నిరోధానికి తొలిసారిగా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష కేంద్రాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ నెంబర్ 1 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పారు. -
రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌కు మద్దతుగా దీక్షలు