మూడు రోజులు సంతాప దినాలు | three condolence days | Sakshi
Sakshi News home page

మూడు రోజులు సంతాప దినాలు

Published Sat, Dec 31 2016 2:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

three condolence days

కొవ్వూరు రూరల్‌ : పోలవరంలో నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు జనాన్ని తరలించి.. ఆ వెనుకే మోటార్‌ సైకిల్‌పై అక్కడకు బయలుదేరిన కొవ్వూరు వ్యవసాయ అధికారి కాకర వేణుగోపాల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన వ్యవసాయ శాఖలో విషాదం నింపింది. ఈ విషయం తెలిసి వ్యవసాయ శాఖ అధికారుల సంఘ నాయకులు ఘటనా స్థలానికి తరలివచ్చి నివాళులు అర్పిం చారు. ఆయన మృతదేహాన్ని పోలవరం నుంచి రాజమండ్రికి తరలిం చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కమలాకరశర్మ మాట్లాడుతూ శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో సంతాప దినాలు పాటిస్తున్నట్టు చెప్పారు. తమ శాఖ ఉద్యోగులెవరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామన్నారు. అందరితో కలిసిమెలిసి, స్నేహభావంతో మెలిగే వేణుగోపాల్‌ మృతి తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు. సంఘ కార్యదర్శి వైవీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే సభలు, సమావేశాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యే అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు. వేణుగోపాల్‌కు ఇద్దరు కుమార్తెలని, 18 ఏళ్లు నిండిన వెంటనే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ సమయంలో లభించే అన్ని ప్రయోజనాలను వేణుగోపాల్‌ కుటుంబ సభ్యులకు అందించాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు, కొవ్వూరు ఏడీఏ జేవీఎస్‌ రామ్మోహనరావు మాట్లాడుతూ మంచి స్నేహితుణ్ణికోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. ఏవోలు జె.రత్నప్రభ, కె.రాజెంద్రప్రసాద్, డి.కృష్ణకిశోర్‌ తదితరులు నివాళి అర్పించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement