ముచ్చటగా మూడోస్థానం
ముచ్చటగా మూడోస్థానం
Published Sat, Oct 29 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగి శాయి. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని ప్రకాశం, ద్వితీయస్థానాన్ని విశాఖపట్నం జట్లు సాధించాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా జట్లు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా, తృతీయ స్థానాలను పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం టీములు గెలుచుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు.
జాతీయస్థాయికి ఎంపికైన బాలుర జట్టు ఇదే..
ప్రకాశం జిల్లాకు చెందిన కె.అనిల్, పి.విశ్వనాథన్, పి.బాల సామిరెడ్డి, విశాఖపట్నం నుంచి పి.నరేష్, టి.తలుపులు, ఎల్.సురేష్ (విజయనగరం), రమేష్ (పశ్చిమ గోదావరి), మునిశేఖర్(చిత్తూరు), అబ్బాస్ అలీ(కృష్ణా జిల్లా), కె.చరణ్(కడప), హేమ సుందర్(గుంటూరు), రామాంజనేయులు(అనంతపురం).
బాలికల జట్టు
విజయనగరం నుంచి బి.శిరీషా, బి.శాంతమ్మ, కృష్ణా నుంచి కె.కుమారి, పి.నవ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జి.రాజీ, వి.ప్రభావతి, పి.చక్ర అనూష(తూర్పుగోదావరి), జి.పార్వతి(కడప), పి.వినీత(అనంతపురం), పి.అనూష(విశాఖపట్నం), కె.సుజాత(గుంటూరు), సీహెచ్ ప్రియాంక(నెల్లూరు).
Advertisement