under-18
-
Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన
పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది. -
ముచ్చటగా మూడోస్థానం
భీమడోలు : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి అండర్–18 జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగి శాయి. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బాలుర విభాగంలో ప్రథమ స్థానాన్ని ప్రకాశం, ద్వితీయస్థానాన్ని విశాఖపట్నం జట్లు సాధించాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లా జట్లు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా, తృతీయ స్థానాలను పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం టీములు గెలుచుకున్నాయి. ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. జాతీయస్థాయికి ఎంపికైన బాలుర జట్టు ఇదే.. ప్రకాశం జిల్లాకు చెందిన కె.అనిల్, పి.విశ్వనాథన్, పి.బాల సామిరెడ్డి, విశాఖపట్నం నుంచి పి.నరేష్, టి.తలుపులు, ఎల్.సురేష్ (విజయనగరం), రమేష్ (పశ్చిమ గోదావరి), మునిశేఖర్(చిత్తూరు), అబ్బాస్ అలీ(కృష్ణా జిల్లా), కె.చరణ్(కడప), హేమ సుందర్(గుంటూరు), రామాంజనేయులు(అనంతపురం). బాలికల జట్టు విజయనగరం నుంచి బి.శిరీషా, బి.శాంతమ్మ, కృష్ణా నుంచి కె.కుమారి, పి.నవ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జి.రాజీ, వి.ప్రభావతి, పి.చక్ర అనూష(తూర్పుగోదావరి), జి.పార్వతి(కడప), పి.వినీత(అనంతపురం), పి.అనూష(విశాఖపట్నం), కె.సుజాత(గుంటూరు), సీహెచ్ ప్రియాంక(నెల్లూరు). -
ఘనంగా అండర్–18 వాలీబాల్ పోటీలు
కాకినాడ రూరల్ : జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ డివిజన్ స్థాయి అండర్–18 ఒకరోజు వాలీబాల్ పోటీలు ఆదివారం ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్‌కు చెం దిన వివిధ మండలాల నుంచి 14 వాలీ బాల్ టీములు పోటీల్లో పాల్గొన్నాయి. 150 మంది క్రీడాకారులు, 10 మంది రిఫరీలు పాల్గొనగా ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ అడిషినల్ కమాండెంట్ మోహన్‌ప్రసాద్ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. క్రీడలు శరీర దారుఢ్యా న్ని పెంచుతాయన్నారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి రామరాజు, అడిషినల్ కమాండెంట్ లోక్‌నాథ్ బాబు, ప్రధాన కార్యదర్శి వై.బంగార్రా జు, సంయుక్త కార్యదర్శి లంక జార్జి, ధనరాజు, కె.యశ్వంత్ పాల్గొన్నారు.