రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | selected to statewide games | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Published Mon, Sep 19 2016 7:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

selected to statewide games

అరట్లకట్ట (పాలకొల్లు అర్బన్‌): ఈ ఏడాది నవంబర్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అనంతపురం జరిగే రాష్ట్రస్థాయి సాప్‌్టబాల్‌ పోటీలకు ఇరువురు అరట్లకట్ట విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కె శ్రీనివాస్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. పెదవేగిలో నిర్వహించిన అండర్‌–17, అండర్‌–14 సాప్‌్టబాల్‌ పోటీల్లో పరసా రాజేష్, మల్లుల తేజేంద్రకుమార్‌ ఎంపికయ్యారన్నారు. వీరు జిల్లా తరపున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ పాలా దుర్గారావును, విద్యార్థులను సర్పంచ్‌ చింతపల్లి లక్ష్మీకుమారి, ఎంపీటీసీ గుత్తుల స్వాతి, విద్యాకమిటీ చైర్మన్‌ చింతపల్లి వరప్రసాద్, హెచ్‌ఎం కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు మూర్తి, వేణు, చలపతిరావు, వరప్రసాద్, విద్య, గ్రామపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement