9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు | july 9 to state wide srinivasa kalyanostawalu | Sakshi
Sakshi News home page

9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు

Published Sun, Jul 3 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

july 9 to state wide srinivasa kalyanostawalu

తిరుపతి : తిరుమల శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే కార్యక్రమాల్లో భాగంగా టీటీడీ చేపట్టే శ్రీనివాస కల్యాణాలను ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కల్యాణం ప్రాజెక్ట్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మొత్తం 7 ప్రాంతాల్లో 17వ తేదీ వరకు స్వామివారి కల్యాణాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. 
ఉత్సవాలు నిర్వహించే ప్రాంతాలు, తేదీల వివరాలు..
- 9న శ్రీకాకుళం జిల్లా మండాన మండలం మహారజోల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం.
- 10న శ్రీకాకుళం జిల్లా పొండూరు ఎస్‌పీఆర్ హైస్కూల్  మైదానం. 
-11న విశాఖపట్నం జిల్లా చిటికాడ మండలం జి.కొత్తపల్లిలోని నిత్యానంద ఆశ్రమం.   
-13న తూర్పు గోదావరి జిల్లా గాడాలలో గల అభయ పొన్నూరి రియల్ ఎస్టేట్ గ్రౌండ్స్‌లో శ్రీవారి కల్యాణాలను  నిర్వహిస్తారు. 
-14న ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీసీతారామనగర్‌.
-16న చిత్తూరు జిల్లా పీలేరు మండలం వెంకటాద్రిఇండ్లు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఆవరణలో నిర్వహిస్తారు.
-17న చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సీ రామాపురం జెడ్పీ హైస్కూల్ మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement