- డీఐజీ ప్రభాకర్‌రావు
వరంగల్ రేంజ్‌లో 40 లక్షల మెుక్కలు నాటాం
Published Sat, Jul 23 2016 11:04 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
కాళేశ్వరం : రెండో విడత హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజ్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 40 లక్షల మెుక్కలు నాటామని డీఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు. మహదేవపూర్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ‘సైరన్ కూత–హరితం మోత’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మెుక్కలు నాటేవారిని ప్రోత్సహించాలని, నరికేవారిని సహించొద్దని ప్రజలు, అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12 లక్షల మెుక్కలు నాటామని తెలిపారు. మహదేవపూర్‌లో సైరన్ ఆన్ చేయగానే అందరూ కలిసి 22,600 మెుక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, డీఎఫ్‌వో రవికిరణ్, సర్పంచ్ కోట రాజబాబు, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనాబాను, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి బాపు, ఎంపీటీసీ చాగర్ల రమాదేవి, ఎంఈవో రాజయ్య, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వరారవు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల హెచ్‌ఎంలు, నాయకులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement