Plantation Programme
-
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
Mann Ki Baat: జన స్పందనకు వందనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ‘ఛీర్4భారత్’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్ కీ బాత్‌లో మోదీ ఇంకా ఏమన్నారంటే..నా తల్లి పేరిట మొక్క నాటాను ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. సంస్కృత భాషను గౌరవించుకుందాం ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్‌కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్ 30) ‘హూల్ దివస్’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్ గిరిజన యోధులు వీర్ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా. మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్ కల్చర్‌పై కువైట్ ప్రభుత్వం కువైట్ నేషనల్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుర్కమెనిస్తాన్‌లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్తోపాటు భారత్‌కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్ దేశాలైన సురినామ్, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.వోకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్ ఉత్పత్తులను గ్లోబల్‌కు చేర్చడంలో జమ్మూకశ్మీర్ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్‌కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్ ఖేరా హితవుపలికారు. -
మదిలోంచి గదిలోకి.. నట్టింట్లో.. నచ్చేట్టు!
నగర ప్రజల ఆలోచనా సరళి మారుతోంది.. పచ్చని ప్రకృతికి ఆకర్షితులవుతున్నారు.. గార్డెన్లో పెరగాల్సిన మొక్కలను గదుల్లో అలకరణకు పెడుతున్నారు. మొత్తానికి మొక్కలు నట్టింట్లో నచ్చే విధంగా ఏర్పాటుచేసుకుంటున్నారు. మదిలో మెదిలే ఆలోచనకు అనుగుణంగా గదులను మార్చేస్తున్నారు. నగర వాతావరణంలో తగ్గిపోతున్న ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికీ, కాలుష్య కారకాలను నియంత్రిచడానికి ఇంటీరియర్ మొక్కలు ఉపకరిస్తున్నాయి.పచ్చనిచెట్లు.. ప్రగతికి మెట్లు.. అన్నట్లు.. మొక్కలు ప్రగతికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో దోహదం చేస్తాయి.. ఈ కాన్సెప్్టతోనే ఇంటీరియర్ డిజైనర్స్ ఇంట్లో పెరిగే మొక్కలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఓ వైపు కాలుష్యం.. మరో వైపు ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు చక్కని పరిష్కారం ఈ ఇన్డోర్ ప్లాంట్స్. నగర వాతావరణంలో ఇళ్లు, ఆఫీసు అనే తేడా లేకుండా కాలుష్య కారకాలైన బెంజీన్, ఫార్మాల్డిహైడ్, యుబిక్విటస్, ట్రైక్లోరో ఇథిలిన్ వంటి ప్రమాదకర కారకాలు గాలిలో కలిసి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బ్రాంకైటిస్, ఆస్తమా వంటి రోగాలతో పాటు కేన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు దాడిచేస్తున్నాయి. వీటిని అరికట్టడంలో ఇంటీరియర్ ప్లాంట్స్ కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.కాలుష్య నివారిణి సింబయాటిక్.. సింబయాటిక్ రిలేషన్ షిప్ అనే విధానంలో కొన్ని మొక్కలు గాలిలోని కాలుష్య కారకాలని నిర్మూలిస్తాయి. ఇందులో మొక్కల ఆకులు, వేర్లతో పాటు..మట్టిలోని సూక్ష్మజీవులు సైతం ప్రధాన పాత్ర పోషిస్తాయి. సహజంగానే ఇండోర్ ప్లాంట్స్ వాటి ఎదుగుదలకు కిరణజన్య సంయోగక్రియని (ఫోటోసింథసిస్) అధిక మొత్తంలో జరుపుతుంది. పత్రాలకున్న సూక్ష్మ రంధ్రాలు గాలిలోని విషవాయువులు, కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి.జెర్బరా డైసీ (జెర్బరా జెమ్సన్, డైసీ, గుల్బహర్) ఈ పూల మొక్క బెంజిన్, ‘క్యాన్సర్’ కారక రసాయనాలను తొలగించడంలో ఉపయోగపడుతుందని ‘నాసా’ తెలిపింది. ఈ మొక్క రాత్రంతా కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఈ మొక్కను బెడ్రూంలో పెంచుకుంటారు. దీనిని ఇంట్లో సూర్యకాంతి పడేలా పెట్టుకోవాలి. ఇది ఇండోర్, ఔట్‌డోర్ ప్లాంట్ కూడా.. రంగుల పూలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.క్రైసాంథిమమ్ (క్రైసాంథిమమ్ మారిఫోలియమ్, గార్డెన్ మమ్) ఇంటి పరిసరాల్లోని అమ్మోనియా, బెంజిన్, ఫార్మాల్డిహైడ్, గ్జైలిన్తో పాటు ఇతర రసాయనాలను తొలగిస్తుంది. గాలిని శుద్ధి చేసే అత్యుత్తమమైన మొక్కగా ‘నాసా’ దీనిని గుర్తించింది. విభిన్న రంగుల పూలతో అతి తక్కువ ధరకు దొరికే సాధారణ మొక్క. గార్డెన్‌లోనూ పెరుగుతుంది. పొగతాగే ప్రదేశంలో, ప్లాస్టిక్, ఇంక్ పేయింట్స్, వారి్న‹Ù, ఆయిల్స్, డిటర్జెంట్స్, సింతటిక్ ఫైబర్స్, గ్యాసోలిన్, రబ్బర్ వాసన వచ్చే చోట ఉంచడం వల్ల విష వాయువులను నిర్మూలిస్తుంది. పీస్ లిల్లీ(స్పాతిపైలమ్) తెల్లటి పూలతో చూడగానే ఆకట్టుకుంటుంది. కాలుష్యకారకాలైన బెంజిన్, టోల్యూన్, గ్జైలీన్, అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరో ఇౖథెలిన్లను ఫిల్టర్ చేస్తుంది. విషవాయులు వెలువడే ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచితే వాటిని గ్రహించి పరిశుభ్రమైన గాలిని అందిస్తుంది. కార్పొరేట్ ఆఫీసుల్లో స్మోకింగ్ జోన్ వద్ద వీటిని పెట్టడం వల్ల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. లెమన్‌గ్రాస్.. లెమన్‌గ్రాస్ మొక్కను వరండాలో, బాల్కనీలో సూర్యరశ్మి తగిలేలా పెంచుకోవాలి. విషవాయువులను తొలగించడంతో పాటు మంచి ఫ్లేవర్‌ను అందిస్తుంది. దోమల నివారణకు చక్కటి పరిష్కారం. ఈ మొక్క ఆకులను మరుగుతున్న టీలో వేసుకుంటే ఔషధ గుణాలను అందించమే కాకుండా మంచి రుచిని అందిస్తుంది.కలబంద (అలోవెర) ఇది ఒక సకులెంట్ జాతి మొక్క. ఈ మొక్క గాలిని పూర్తి స్థాయిలో కాలుష్య రహితం చేస్తుంది. ఎంతలా అంటే... ఒక ఇంటిని రిఫ్రెష్ చేయడానికి ఒక్క మొక్క చాలు. వాతావరణంలోని ఫార్మాల్డిహైడ్‌ని తొలగించి, ఎన్నో ఔషధగుణాలను అందిస్తుంది. దీనిని వంటగది కిటికీ దగ్గర పెట్టుకుంటే ఎంతోమేలు. కిచెన్‌లో గ్యాస్‌స్టవ్ నుండి వెలువడే ఫార్మాల్డిహైడ్‌ని పూర్తిగా శోషించుకుంటుంది.స్పైడర్ ప్లాంట్ (రిబ్బన్ ప్లాంట్) ఇంటిని శుభ్రపరిచే క్రమంలో స్ప్రే చేసినప్పుడు వెలువడే రసాయనాలను శోషించుకోడం స్పైడర్ ప్లాంట్ ప్రత్యేక లక్షణం. అన్ని నర్సరీల్లో లభించే అతి సామాన్యమైన మొక్క. తక్కువ నీటితో పెరుగుతుంది. దీనిని వరండాలో కానీ, బాత్రూమ్ దగ్గర, రోడ్డుకు ఇరువైపులా, కిటికీల దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. మనీ ప్లాంట్(ఎపిపైరెమ్నమ్ ఆరియమ్) అందరి ఇళ్లలో విరివిరివిగా పెంచుకునే ఈ మొక్క కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్, ఫార్మాల్డిహైడ్ తదితర కారకాలకు సహజ విరుగుడుగా పని చేస్తుంది. దీనిని బెడ్ రూమ్‌లో, ఫరీ్నచర్ దగ్గర పెంచుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ కాలం మూసి ఉంచే గదుల్లో, స్టోర్ రూమ్‌లో ఉంచడం వల్ల ఫలితాన్నిస్తుంది. స్నేక్ ప్లాంట్(సెన్సివేరియా లారెంటీ) పాము చర్మంపై చారలను పోలి ఉండే ఈ మొక్క ఇంట్లోని బెంజిన్, ఫార్మాల్డిహైడ్, గ్జైలిన్తో పాటు ట్రైక్లోరో ఇౖథెలిన్ను తొలగిస్తుంది. సాధారణంగా దీనిని కార్పొరేట్ ఆఫీసుల్లో, రెస్టారెంట్లలో పెంచుతుంటారు. దీని పెంపకం కోసం ప్రత్యేక జాగ్రత్తలు అవసరంలేదు. నెలకు ఒకటీ, రెండు సార్లు నీరు పోస్తే చాలు. కాంతి తగిలేలా అమర్చుకోవాలి. దీనిని కార్పెటింగ్ ఏరియాలో, రబ్బరు వస్తువులు, శుభ్రపరచి ఉంచిన వస్తువుల వద్ద ఏర్పాటు చేసుకోవాలి. డంబ్ కేన్(లొయోపాడ్ లిల్లీ) వెడల్పుగా ఉండే వీటి ఆకులు అతి తొందరగా గాల్లో కలుíÙతాలను తొలగిస్తుంది. ఈ మొక్క కాస్త విషకారిణి..దీని నుంచి వచ్చే పసరు తాకకుండా చూసుకోవాలి. తాకితే నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఫరీ్నచర్ దగ్గర్లో పెంచుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవే కాకుండా డ్రాసేన, బాంబూ ప్లామ్ వంటి పలు మొక్కలు అతి త్వరగా పెరిగి గాలిలోని కాలుష్యకారకాలను తొలగిస్తాయి.చైనీస్ ఎవర్గ్రీన్(ఆగ్లోనెమ మోడెస్టమ్) ఇది అధిక మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్లాంటి టాక్సిన్లను తొలగిస్తుంది.ఇంట్లో అలంకరణగా పెంచడం వల్ల అదృష్టం కలిసొస్తుందని ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో నమ్ముతారు. ఈ మొక్కని గ్యాసోలిన్ కారక ప్రదేశాల్లో, కార్పెటింగ్ ఏరియాల్లో పెంచుకోవచ్చు. రబ్బర్ ప్లాంట్ (ఫైకస్ రోబస్టా) ఇది అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేసి ౖ2 స్థాయిలను పెంచుతుంది. ఫార్మాల్డిహైడ్ వంటి విషవాయువులను తొలగిస్తుంది. ఖాళీ ప్రదేశంలో, సూర్యకాంతి పడేలా పెట్టుకుంటే మంచిది. దీని మందమైన ఆకులు సూర్య కాంతిని తట్టుకుని, ముదురు రంగులో అందంగా కనిపిస్తాయి. ఇది బోన్సాయిలో కూడా లభిస్తుంది. -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్‌కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్‌కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్‌గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్‌కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్‌గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్‌గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్‌కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్‌గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్‌లో పుట్టిపెరిగిన భాఖర్‌కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్‌లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
పర్యావరణ హితులు.. మన డ్వాక్రా మహిళలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి నాగా వెంకటరెడ్డి : రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబాల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలను పర్యావరణ హితులుగా కూడా మారుస్తున్నారు. జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకంలో వీరిని భాగస్వాములను చేస్తున్నారు. టోల్‌ప్లాజాలు, నగర శివార్లలో వ్యాపార అవకాశాలను ఏ మేరకు కల్పించవచ్చనేది కూడా పరిశీలించాలని సీఎం జగన్ సెర్ప్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు ఆర్థికంగా కూడా తోడ్పాటు లభిస్తుంది. స్వయం సంమృద్ధికి బాటలు వేసుకోనున్నారు. మహిళల జీవన ప్రమాణాలు కూడా పెంపొందుతాయి. రూ.1.57 కోట్ల ప్రాజెక్టులో 761 సంఘాల భాగస్వామ్యం నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం), నేషనల్ హైవేస్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మధ్య గత ఏడాది కుదిరిన ఎంవోయూ ప్రకారం రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటి వాటిని అయిదేళ్ల పాటు రక్షించి ఎన్హెచ్ఎఐకి అప్పజెప్పాలి. ఈ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలోని ‘సెర్ప్’ తీసుకుంది. తొలుత ఎన్‌హెచ్– 544డి పరిధిలోని గిద్దలూరు – వినుకొండ సెక్షన్లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి– ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్న 17.74 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా (మొత్తం 35.48 కి.మీ) 5,907 మొక్కలు నాటాలి. గుంతలు తవ్వకం, మొక్కలు కొని నాటడం, కంచె ఏర్పాటు, నీటి సరఫరా, ఎరువులు వేయడం, అయిదేళ్ల పాటు పెంచే బాధ్యతలను త్రిపురాంతకం, పెదారవీడు మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 761 డ్వాక్రా సంఘాల్లోని 7,610 మంది సభ్యులకు ‘సెర్ప్’ అప్పగించింది. ఇందుకోసం ఎన్హెచ్ఏఐ అయిదేళ్లకు రూ.1.57 కోట్లు ఇస్తుంది. త్రిపురాంతకం, పెదారవీడు మండల సమాఖ్యలు, ఆరు గ్రామైక్య సంఘాలు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఏడాదిలో 3 నెలలు ఉపాధి.. దినసరి వేతనం రూ.400 ప్రాజెక్టులో భాగస్వాములవుతున్న ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి ఏడాదికి సుమారు మూడు నెలలు ఉపాధి లభిస్తుంది. సగటున దినసరి వేతనం రూ.400 వస్తుంది. తద్వారా ఏడాదికి రూ.36 వేలు చొప్పున అయిదేళ్లలో రూ.1.80 లక్షలు సమకూరుతుందని. ఈ స్వయం సహాయక సంఘాలకు గ్రామైక్య సంఘాలు నేతృత్వం వహిస్తాయి. డీఆర్డీఏ, సెర్ప్ ఉన్నతాధికారుల మార్గదర్శనం చేస్తారు. కాంట్రాక్టు వ్యవస్థను దరిజేరనీయకుండా డ్వాక్రా సంఘాలే నీటి సరఫరాకు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు యంత్ర పరికరాలు, ఎరువులు సమకూర్చే బాధ్యతలను తీసుకున్నందున వ్యాపార వ్యవహారాలలోనూ వారికి అనుభవం వస్తుంది. ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన మేరకు 5,907 బొగోనియా, స్పాథోడియా, మిల్లింగ్ టోనియా, మారేడు, పొగడ మొక్కలను ప్రభుత్వ నర్సరీలలోనే డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. పచ్చదనం పెంపునకు ప్రణాళిక రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో 24.62 శాతం గ్రీనరీ ఉండగా రాష్ట్రంలో 22.86 ఉంది. ఈ వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై కోటి మొక్కలు పెంచాలన్నది గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం. 660 మండలాల్లోని వెయ్యి కొండలనైనా ఎంపిక చేసుకుని ఒక్కో కొండపై కనీసం 10 వేల మొక్కల పెంపకం చేపట్టనుంది. సీడ్ బాల్స్ విధానంలో ఫలాలనిచ్చే ఉసిరి, రేగు, సీతాఫలం, వెలగ, నీడనిచ్చే వేప, కానుగ తదితర మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీలో మొక్కల పెంపకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం ఓ ముఖ్యాంశం. పొదుపు సంఘాల మహిళలు ఇందులో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర , జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల వెంబడి మొక్కలు నాటి పెంచే ప్రక్రియను డ్వాక్రా సభ్యులు చేపట్టిన సంగతి తెలిసిందే. రానున్న కాలంలో జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకంలోనూ భాగస్వాములు కానున్నారు. వ్యాపార అవకాశాలపైనా దృష్టి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని 8.64 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలలో దాదాపు 90 లక్షల మంది సభ్యులు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మెప్మాలో లక్ష గ్రూపులు, పది లక్షల మంది వరకు సభ్యులు ఉన్నారు. 2014 నాటికి రాష్ట్రంలో 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా 2023 నాటికి 8,744 కిలోమీటర్లకు పెరుగుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా తిరుపతిలో ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ చొరవ, వేగం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ఈ జాతీయ రహదారులను ఉపయోగించుకొంటూ మహిళలకు పలు వ్యాపార అవకాశాలివ్వాలన్నది సీఎం జగన్ సంకల్పం. ఈమేరకు అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రహదారుల టోల్‌ప్లాజాలు, ప్రధాన కూడళ్లు, నగర శివార్లలోని ఎన్హెచ్ఏఐ స్థలాల్లో స్థానిక డ్వాక్రా సంఘాలతో ఫుడ్ ప్లాజాలు, అవుట్లెట్ల ఏర్పాటు, గ్రామీణ ఉత్పత్తుల విక్రయాలకు స్టాళ్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకోసం ఎన్హెచ్ఎఐతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారని సెర్ప్ సీఈవో ఎండి ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం
సాక్షి, షోలాపూర్ : మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు. ఏకలవ్య అభిమాని కాకా సాహెబ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీడియాలో చదివి అభిమానిగా మారిపోయారు షోలాపూర్ రైతు కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే. ఈ ఏడాది ఏప్రిల్ లో మండుటెండలు లెక్క చేయకుండా.. షోలాపూర్ నుంచి విజయవాడ, తాడేపల్లి వరకు సైకిల్ పై వచ్చి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అదే అభిమానంతో ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో చేపట్టారు. (చదవండి : ఇది కదా అభిమానం అంటే.. మహారాష్ట్ర నుంచి విజయవాడకు సైకిల్ పై) సీఎం జగన్ .. యువతరానికి స్పూర్తి ఒక మంచి కార్యక్రమానికి పరిధి ఏముంటుంది? సమాజానికి హితం చేసే పనులు ఎవరు చేపట్టినా సంతోషమే... ఇది కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే ఆలోచన. తన అభిమాన నాయకుడు సీఎం జగన్ కోసం.. అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సమాజానికి తన వంతుగా మేలు చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షోలాపూర్ జిల్లాలో దాదాపు 4800 పాఠశాలలున్నాయి. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం లక్షా 11 వేల 111 మొక్కలు నాటనున్నారు. ఉద్యమంలా మొక్కల పెంపకం ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి బాలాజీ మంజులే ప్రారంభించారు. కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే నేతృత్వంలోని సీఎం జగన్ దాదాశ్రీ ఫౌండేషన్ అభినందనీయమని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని, దీని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని బాలాజీ మంజులే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి కర్మల తహసీల్దార్ విజయ్ జాదవ్ సాహెబ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బిభీషన్ అవతే, వ్యవసాయోత్పత్తి కమిటీ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ధేరే సహా పలువురు పాల్గొన్నారు. -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్‌హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్‌ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
మొక్కలంటే వ్యసనం.. ఓ ప్రకృతి ప్రేమికుడి కథ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన హరినాథ్ గత పదేళ్లుగా మొక్కల పెంపకమే లోకంగా బతుకుతున్నాడు. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లి రోడ్లు, అడవులవెంట తిరుగుతూ విత్తనాలు చల్లడమే ఆయన పని. ఆరు పదుల వయసులో అలుపెరగకుండా అడవుల పెంపకమే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆయన ఈ పనికి దిగడం వెనుక ఆసక్తికరమైన కథ దాగుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం హరినాథ్ తల్లిదండ్రులు కష్టపడటంతో పాల్వంచ సమీపాన జగన్నాథపురంలో ఆ కుటుంబానికి 1970వ దశకంలో 50 ఎకరాలకు పైగా భూమి సొంతమైంది. చదువు కోసం పాల్వంచలోని కేటీపీఎస్ స్కూల్‌కు రోజూ నడిచి వెళ్లే హరినాథ్ ఆకాశం కనిపించకుండా పెరిగిన చెట్లు, వాటి మధ్యన తిరిగే పక్షులు, పాములు, వన్యప్రాణులను చూస్తుండేవాడు. అయితే హరినాథ్ ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలోకి అడుగుపెట్టగానే విలాసాలు దరిచేరాయి. చదువు పూర్తయి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఉద్యోగిగా పనిచేసిన ఆయన జూదం, తాగుడులాంటి వ్యసనాల్లో చిక్కుకుపోయారు. యాభై ఏళ్లు దాటినా బయటపడలేకపోయారు. దీంతో భూమి హరించుకుపోగా రూ.30 లక్షల అప్పు మిగిలింది. వనజీవి రామయ్య స్ఫూర్తితో.. కేటీపీఎస్ ఉద్యోగిగా కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు 2013లో విలాసాలు, వ్యసనాలపై వైరాగ్యం ఏర్పడింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకోగా టీవీలో పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితంపై వచ్చిన కథనం హరినాథ్‌ను ఆకట్టుకుంది. దట్టమైన అడవి మీదుగా స్కూల్‌కు వెళ్లిన రోజులు గుర్తుకురాగా.. ప్రస్తుతం పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారడం కళ్లెదుట కనిపించింది. దీంతో వనజీవి మార్గంలో నడవాలనే నిర్ణయానికి రాగా, కొత్తగూడెంకు చెందిన మొక్కల వెంకటయ్య తదితరులు పరిచయమయ్యారు. అలా పదేళ్లుగా పాల్వంచ – కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరినాథ్ గడుపుతున్నాడు. మొక్కల పెంపకమే లక్ష్యంగా... ఏటా మార్చి నుంచి జూన్ వరకు 40 రకాల చెట్ల విత్తనాలను సేకరిస్తాడు. ఆ విత్తనాలను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడవుల్లో చల్లుతాడు. పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్ మండలాల పరి ధి రోడ్లు, అడవులు, కార్యాలయాలు.. ఖాళీ స్థలం కనిపి స్తే చాలు ఔషధాలు, పండ్లు, నీడనిచ్చే నలభై రకాల మొ క్కల విత్తనాలు చల్లుతున్నాడు. పండ్లను కోతులు, పక్షు లు తింటున్నప్పుడు కలిగే సంతోషం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హరినాథ్ చెబుతుంటాడు. 2016 లో ఉద్యోగ విరమణ చేశాక వచ్చే పెన్షన్ నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు భరిస్తున్నాడు. పదేళ్ల క్రితం హరినాథ్ మొలుపెట్టిన పయనానికి ఇప్పుడు మరో ఇరవై మంది సాయంగా ఉంటున్నారు. మరో ఏడు జిల్లాల నుంచి వనప్రేమికులు విత్తనాలు తీసుకెళ్తుంటారు. మొక్కలపై అవగాహన పెంచండి పదేళ్లుగా లక్షలకొద్దీ విత్తనాలు చల్లుతున్నాను. పశువుల కాపర్ల అత్యుత్సాహంతో చెట్లు చనిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై పశువుల కాపర్లకు అవగాహన కలి్పస్తే మంచిది. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నేను వ్యసనాల్లో మునిగిపోయినప్పుడు వాళ్ల బాగోగులు మా ఆవిడే చూసు కుంది. వ్యసనాల నుంచి బయటకు వచ్చాక ప్రకృతి రక్ష ణ, అడవుల పెంప కంపై ధ్యాస పె ట్టా. నా సహకారం లేకున్నా ముగ్గురు పిల్లలు చదువు పూ ర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ఇది ప్రకృతి నాకు తిరిగి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నా. –హరినాథ్ -
#IPL2023: 292 డాట్‌బాల్స్.. లక్షకు పైగా మొక్కలు
ఐపీఎల్ 16వ సీజన్లో ప్లేఆఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు స్పాన్సర్ టాటాతో కలిసి బీసీసీఐ సరికొత్త కార్యచరణ రూపొందించింది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో నయోదయ్యే ప్రతీ డాట్‌బాల్‌కు 500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే విజేతగా నిలిచి ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ ఇమేజ్ గ్రాఫిక్ ఉపయోగించారు. మరి ప్లేఆఫ్స్ దశలో ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో నమోదైన డాట్‌బాల్స్‌కు ఎన్ని మొక్కలు నాటనున్నారో ఇప్పుడు చూద్దాం. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు 40 ఓవర్లలో మొత్తం 84 డాట్ బాల్స్ వేశారు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చేసిన మొత్తం డాట్ బాల్స్ సంఖ్య 96.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 2వ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేవలం 67 డాట్ బాల్స్ వచ్చాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం డాట్ బాల్స్ 45. అంటే 4 మ్యాచ్‌ల నుంచి మొత్తం 292 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే 292 x 500 లెక్కన బీసీసీఐ మొత్తం 1 లక్షా 46 వేల మొక్కలు నాటనుంది. దీని ద్వారా గ్రీన్ డాట్ ప్రచారంలో ఐపీఎల్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టడం విశేషం. పర్యావరణం పట్ల బీసీసీఐ బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో దీనిపై చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. డాట్ బాల్‌కు మొక్కలు నాటాలన్న నిర్ణయంతో క్రికెట్ అభిమానుల మెప్పు పొందుతోంది బీసీసీఐ. చదవండి: '45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు' లండన్ చేరుకున్న రోహిత్ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ -
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
నాటిన ప్రతి మొక్క.. చెట్టవ్వాల్సిందే!
సాక్షి, అమరావతి: మొక్కల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా.. ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వాతావరణం, నేల స్వరూపాలకు తగినట్లుగా మొక్కలను పెంచేలా కొత్త గ్రీనింగ్ పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్ని మొక్కలు నాటామనే సంఖ్యకు కాకుండా.. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది. గ్రో మోర్ వుడ్.. యూజ్ మోర్ వుడ్(ఎక్కువ కలప పెంచు.. ఎక్కువ కలప ఉపయోగించు) అనే నినాదానికి అనుగుణంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. గతంలో కలపతో చేసిన వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండేది. దీంతో కలప తరిగిపోయి.. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల ప్రమాదమని గ్రహించిన ప్రజలు మళ్లీ చెక్క వస్తువుల వైపు చూస్తున్నారు. అలాగే వాతావరణంలో కూడా కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. పచ్చదనం పెరిగితే తప్ప ఆక్సిజన్ ఉత్పత్తికి వేరే మార్గం లేదని తేలిపోయింది. ఇందుకు తగ్గట్టుగా మొక్కలు నాటే విధానాన్ని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చాలనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ ఇందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అడవులతో పాటు వాటి వెలుపల, రోడ్లు, కాలువలు పక్కన, పార్కులు, ఇతర ప్రాంతాల్లో అక్కడి వాతావరణం, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, కలప అవసరాలకు అనుగుణంగా.. ఏ జాతి మొక్కలు నాటాలో నిర్ణయించేలా రాష్ట్ర అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో వాణిజ్య నర్సరీలు రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చివేయాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒకటి, రెండు వాణిజ్య నర్సరీలను ఆధునిక రీతిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీల్లో స్థానికంగా పెరిగే వృక్ష జాతులు, జన్యుమార్పిడి చేసిన మొక్కలు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యాధునికంగా మొక్కలు పెంచే విధానం, వేగంగా పెరిగే మొక్కలు తదితర కోణాల్లో పరిశోధనలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సరికొత్తగా పచ్చదనం.. అడవులతో పాటు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో.. ప్రతి చోటా అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఏ మొక్కలు నాటాలి, వాటి నిర్వహణ తదితరాలపై శాస్త్రీయంగా పరిశోధనలు చేయిస్తాం. ఎలాంటి మొక్కలు నాటాలో చెప్పడంతో పాటు.. అవి సక్రమంగా పెరిగేలా చూసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త గ్రీనింగ్ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పచ్చదనం పెంపు సరికొత్తగా, నాణ్యంగా ఉండేలా చూస్తాం. – వై.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
ద.మ.రైల్వేలో మియావాకి ప్లాంటేషన్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో దక్షిణ మధ్య రైల్వే అగ్రగామిగా నిలిచింది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. సికింద్రాబాద్ నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వేకాలనీలో 4,300 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి ప్లాంటేషన్ పూర్తిచేశారు. త్వరలో మరో 1,100 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో శాంతినగర్ కాలనీలో 20 వేల మొక్కలతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావాకీ ప్లాంటేషన్ అందుబాటులోకి రానుంది. ‘సే ట్రీస్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్‘అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో దక్షిణ మధ్యరైల్వేలో అటవీ విస్తరణకు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. దట్టమైన అడవిలా.. మొక్కల పెంపకంలో మియావాకి ప్లాంటేషన్ విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా వివిధ ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్ నగరంలో ఈ మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కూడా మియావాకి పెంపకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు జోన్ పరిధిలోని ఖాళీస్థలాల్లో మియావాకి ప్లాంటేషన్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. మియావాకి దట్టమైన బహుళజాతుల మొక్కలతో కూడిన పట్టణ అటవీప్రాంతం. పర్యావరణ ఇంజనీరింగ్ విధానంలో ఈ మొక్కలను పెంచడం వల్ల త్వరితగతిన పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనంతో అడవిలాగా కనిపిస్తాయి. విభిన్నజాతుల మొక్కలను నాటడమే ఈ విధానంలోని ప్రత్యేకత. రెండేళ్లలో అవి స్వయం సమృద్ధిని సంతరించుకుంటాయి. రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో... మియావాకి విధానంలో మొక్కలు వందశాతం జీవించే అవకాశాలు ఉంటాయి. మొత్తం 5,055 రకాల స్థానిక పండ్లు, ఔషధ, పూల జాతి మొక్కలు, కలప వంటివి ఎంపిక చేసి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు గద్వాల, నిజామాబాద్ రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోనూ మియావాకి ప్లాంటేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. సుమారు 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8,500 మొక్కలను పెంచారు. ఖాళీ స్థలాలను పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగించడంపట్ల దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్ అంతటా పట్టణ అడవుల విస్తరణను ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఎంతో కీలకమన్నారు. పచ్చదనం వల్ల మాత్రమే సురక్షితమైన వాతావరణాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. -
ఎడారుల్లో పచ్చదనం కోసం...
ఎడారుల్లో మొక్కలు పెంచితే ఎంతో బాగుంటుంది కదూ! ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా? అసాధ్యమైన ఈ పనిని సుసాధ్యం చేసేందుకు నడుం బిగించారు దుబాయ్ శాస్త్రవేత్తలు. ఎడారుల్లో మొక్కలు నాటడానికి ఏకంగా ఒక రోబోనే తయారు చేశారు. ఈ రోబో ఎడారుల్లో ఎంత దూరమైనా సునాయాసంగా ముందుకు సాగుతూ, విత్తనాలు నాటి, అవి మొలకెత్తి ఏపుగా ఎదిగే వరకు సమస్త బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తుంది. దుబాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అక్కడి విద్యార్థులు ఈ రోబోను రూపొందించారు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. ఎడారులు, బీడభూముల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతోనే దీనిని రూపొందించామని ఈ రోబో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త మజ్యర్ ఇత్తెహాది తెలిపారు. -
అధికారిపై పెట్రోల్ పోసి.. తానూ పోసుకున్న మహిళ
మన్ననూర్ (అచ్చంపేట): నాగర్‌కర్నూల్ జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ అధికారిపై చెంచు మహిళ పెట్రోల్ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు. తాజాగా శుక్రవారం ప్లాంటేషన్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. -
బీజేపీ అధికారంలోకి వచ్చాక పర్యావరణం నాశనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతింటోందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పర్యావరణ పరిరక్షణపై బీజేపీ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. కానీ ఏ సంవత్సరంలో.. ఎక్కడ, ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని విత్తనాలు చల్లారనే వివరాలను వెల్లడించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్యావరణం నాశనం అయ్యింది’’అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. బీజేపీ యూపీలో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం సాగుతోందని అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. తమ హయాంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామని గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో చెరువులు తవ్వి, గ్రీన్ పార్కులు డెవలప్ చేశామని చెప్పారు. 30 కోట్ల మొక్కలను నాటాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ ఏడాది ప్లాంటేషన్ డ్రైవ్‌లో 30 కోట్ల మొక్కలను నాటాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా భూమి, మొక్కలను గుర్తించాలని జిల్లా న్యాయాధికారులను (డీఎం) కోరినట్లు మంగళవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు. చదవండి: ప్రేమించినోడితోనే పెళ్లి అన్నందుకు తండ్రి దారుణం.. -
రాయిని తొలచి.. రావి ఆకుగా మార్చి..
యాదగిరిగుట్ట: ఎక్కడ చూసినా ఆహా.. అనిపించే అందాలు. ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చని మొక్కలు.. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు.. రంగురంగుల పూల మొక్కలతో కనువిందు చేసే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, చుట్టు పక్కల పరిసరాలను వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండకు వెళ్లే మార్గంలోని రెండో ఘాట్ రోడ్డు కింది భాగంలో, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఆనుకొని ఉన్న భారీ రాయిని తొలచి దానిని రావి ఆకు మాదిరిగా మార్చారు. ఎకరం పైగా స్థలంలో ఉన్న ఈ రాయిని 27 గుంటల్లో తొలచి దాని చుట్టూ భారీ రావి ఆకుగా తీర్చిదిద్దారు. ఈ రావి ఆకు ఆకారంలో పూణె నుంచి తీసుకొచ్చిన గులాబీ, తెలుపు రంగులో ఉన్న సుమారు 12వేల పూల మొక్కలు నాటుతున్నారు. చుట్టు ఆకు మాదిరిగా ఉన్న డిజైన్‌లో గ్రీనరీతో కూడిన లాన్ ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కరోనా ‘వల’కు చిక్కొద్దు..! కుర్రారంలో కాలాముఖ దేవాలయం -
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, హైదారబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈక్రమంలో ఎఫ్ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలు పరిశీలించాయి. వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ప్రకటించాయి. వీటిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. భాగ్యనగరానికి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్ట్’గా గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హరితహారం వల్లే ఇది సాధ్యమయ్యిందని తెలిపారు. హరితహారంలో భాగంగా గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుంచి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్‌ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్ -
హరిత స్ఫూర్తిని చాటుతూ..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా హరిత స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’లో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వ్యవధిలో కోటి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయ క్షేత్రంలో రుద్రాక్ష మొక్క నాటారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబసభ్యులతో కలసి ప్రగతిభవన్ ప్రాంగణంలో, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో భర్త అనిల్‌తో కలసి మొక్కలు నాటారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒకే గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాల్సి రావడంతో గ్రామ వన నర్సరీలు, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు సేకరించేందుకు స్థానిక నేతలు భారీ కసరత్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ‘కోటి వృక్షార్చన’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు తీసుకున్న రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ను సీఎం అభినందించారు. సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు.. సీఎం 67వ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కేటీఆర్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమతో పాటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు తదితరులు మొక్కలు నాటారు. సీఎం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 22 శాతంగా ఉన్న గ్రీన్‌కవర్ 33 శాతానికి పెరుగుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో ‘హోప్ 4 స్పందన’ఆధ్వర్యంలో పోలియో బాధితులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అన్ని పారిశ్రామికవాడల్లో మొత్తం 1.62 లక్షల మొక్కలు నాటారు. బండ మాదారం సీడ్స్ ఆగ్రోపార్క్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మొక్కలు నాటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జల విహార్‌లో జరిగిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పాల్గొన్నారు. కేసీఆర్ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. బల్కంపేట ఎల్లమ్మకు తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టు చీర సమర్పించారు. సింగరేణి వృక్షోత్సవం పేరిట సింగరేణి భవన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రారంభించారు. సంస్థ పరిధిలోని 11 ప్రాంతాల్లో 2.35 లక్షల మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా మలక్‌పేట వికలాంగుల సంక్షేమ భవన్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. -
పనికిరాని ఇసుక దిబ్బలు.. 10 వేల చెట్లయ్యాయి!
పట్నా: విత్తనాన్ని పాతితే మొక్కై హామీ ఇస్తుంది. ఆ తరువాత చెట్టుగా ఎదిగి రక్షణ ఇస్తుంది. బిహార్‌లో గయ ప్రాంతంలోని బెలగాంజ్ ఇసుకతిప్పలతో ఉంటుంది. చెట్లేమీ ఉండవు. మొక్క నాటాలనే ఆలోచన పొరపాటున కూడా రాదు. ఆ ఎడారిలాంటి ప్రదేశంలో పదిహేను సంవత్సరాల కాలంలో పదివేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించాడు సత్యేంత్ర మంఝీ. ఎం.ఏ చేసిన ఇతడికి ‘మౌంటెన్ మ్యాన్’గా ప్రసిద్ధుడైన దశ్‌రథ్ మంఝీ ఆదర్శం. ఒకసారి దశరథ్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ‘ఈ ఎడారిలో చెట్లు నాటవచ్చు కదా’ అన్నాడు. అదే సత్యేంద్రకు వేదవాక్కు అయింది. దశ్‌రథ్ ఒక్కడే 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి, దారి వేసిన మహాకష్టంతో పోల్చితే తాను పడబోయే కష్టం ఎంత అనుకొని రంగంలోకి దిగాడు సత్యేంద్ర. ఆయన శ్రమ వృథా పోలేదు. ఇసుకదిబ్బలు ఇప్పుడు చెట్లయ్యాయి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది లేదు... అని మరోసారి నిరూపించిన పచ్చటి సత్యం ఇది. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి చదవండి: టూర్ ప్యాకేజీ: ఒక్కరికి 35 వేలవుతుంది! -
అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీ సెకండ్!
పచ్చదనం (గ్రీన్ కవర్) పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ కవర్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 2020– 21లో ‘జగనన్న పచ్చతోరణం’ పథకం కింద 20 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఇప్పటికే 9.50 కోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. మొక్కలు నాటి.. చేతులు దులుపుకోవడం కాకుండా గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత ఏడాది జులై 20న ఉత్తర్వులు జారీ చేసింది. నాటిన వాటిలో కనీసం 85 శాతం మొక్కలు చెట్లుగా ఎదిగేలా పరిరక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నాటిన ప్రతి మొక్కకూ ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పచ్చదనం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28.30 లక్షల మంది నివసించనున్న కాలనీలను పచ్చని పందిరిలా మార్చాలనే ఆశయంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని ప్రభుత్వం తలపెట్టింది. ► విశాఖపట్నాన్ని పచ్చని మహానగరంగా తీర్చిదిద్దే చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ‘గ్రీన్ విశాఖ’ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మొక్కలు నాటుతున్నట్లు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు. ► ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి సజావుగా పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ‘ఒక్కొక్కరు ఒక్కో మొక్క’ నాటి సంరక్షించాలనే నినాదాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రాహదారులు, గ్రామీణ రోడ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. నర్సరీల్లో 6 కోట్ల మొక్కల పెంపకం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అటవీ శాఖ సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీల్లో 2020లో 6.03 కోట్ల మొక్కలు పెంచారు. గత ఏడాది (2020) జులై 22న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం జగన్ మొక్కలు నాటి జగనన్న పచ్చతోరణానికి శ్రీకారం చుట్టారు. ► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిగా ‘ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్ పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► రాష్ట్ర అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా 29 ప్రధాన శాఖల ద్వారా 2020–21లో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛంద సంస్థలు, వనసంరక్షణ సమితులు, స్వయం సహాయక సంఘాలు, పేపర్ మిల్లులతోపాటు అన్ని వర్గాల ప్రజలను ఈ మహాక్రతువులో భాగస్వాములను చేస్తోంది. ► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉండగా 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం గ్రీన్ కవర్ ఉంది. అంటే, 26 శాతం గ్రీన్ కవర్ ఉన్నట్లు లెక్క. దీన్ని 33 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి అటవీ విస్తీర్ణం పెంపులో ఏపీ సెకండ్! దేశ వ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వితీయ స్థానంలో నిలవడం గమనార్హం. 16వ భారత అటవీ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్ 2019) ప్రకారం 1,025 చదరపు కిలోమీటర్ల గ్రీన్ కవర్ పెంపు ద్వారా కర్ణాటక దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 990 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెంపుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోనూ, 823 కిలోమీటర్ల పెంపుతో కేరళ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. ప్రతి రెండేళ్లకోసారి దేశంలో అటవీ విస్తీర్ణం, వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్ఎస్ఐ) విభాగం ఐఎస్ఎఫ్ఆర్ నివేదికను వెల్లడిస్తుంది. 2017 –18 సంవత్సరాలతో పోల్చితే 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 990 చదరపు కిలోమీటర్లు పెరగడం విశేషం. గత ఏడాది జులై 22వ తేదీ నుంచి ఇప్పటి వరకూ వివిధ విభాగాల ద్వారా 9.50 కోట్ల మొక్కలు నాటడం విశేషం. వాటి వివరాలిలా ఉన్నాయి. జిల్లాల వారీగా నాటిన మొక్కలు(లక్షల్లో) అనంతపురం 61.861 చిత్తూరు 87.645 గుంటూరు 32.281 నెల్లూరు 9.487 ప్రకాశం 60.046 వైఎస్సార్‌కడప 20.342 కర్నూలు 36.282 పశ్చిమ గోదావరి 170.020 తూర్పుగోదావరి 56.016 కృష్ణా 36.628 శ్రీకాకుళం 92.431 విశాఖపట్నం 162238 విజయనగరం 124.978 మొత్తం 950.255 నాలుగు రకాల ప్లాంటేషన్ పచ్చదనం పెంపులో భాగంగా ప్రభుత్వం నాలుగు రకాల ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎవెన్యూ ప్లాంటేషన్ : జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు నాటడాన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ అంటారు. చింత, వేప, మర్రి, కానుగ, రావి, బాదం, నిద్రగన్నేరు, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు. బ్యాంక్ ప్లాంటేషన్ : స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి సుబాబుల్, టేకు, జామాయిల్, వేప, మలబార్ నీమ్, బాదం తదితర మొక్కలను నాటుతారు. బ్లాక్ ప్లాంటేషన్ : చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయ భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటడాన్ని బ్లాక్ ప్లాంటేషన్ అంటారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి ఎర్ర చందనం, శ్రీగంధం, మోదుగ, నేరవేప, రోజ్ఉడ్, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు పెంచుతారు. ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు వేప, చింత, ఎర్రచందనం, టేకు, శ్రీగంధం, ఉసిరి, మామిడి, దానిమ్మ, జామ, సపోటా తదితర మొక్కలను ఇష్టపడుతుంటారు. -
హరితహారం సామాజిక బాధ్యత
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని అన్ని రంగాలు బాధ్యతగా, సవాలుగా స్వీకరించి హరిత తెలంగాణకు బాటలు వేయాలని సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడ ఉన్న పచ్చదనం దేశంలోని ఏ ఇతర విమానాశ్రయంలో లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వేపతో పాటు వివిధ రకాల ఔషధ గుణాలున్న 600 మొక్కలను నాటారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ తరఫున జీఎంఆర్, సీఐఎస్ఎఫ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్, ఎయిర్పోర్ట్ ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ స్టార్ హీరో
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నటుడు విజయ్ సేతుపతి మెక్కలు నాటారు. ఉప్పెన సినిమా దర్శకుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో తానూ భాగం అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి , ఛాలెంజ్‌కి తనని నామినేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. (భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి) అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ‘ఉప్పెన’ సినిమాలో తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. విజయ్ సేతుపతి ఇప్పటివరకు పిజ్జా, నేను రౌడినే వంటి తెలుగు రీమేక్‌లలో నటించారు. 2009 సైరా నర్సింహారెడ్డిలో మొదటిసారిగా తెలుగులో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో రెండవ సినిమా ఉప్పెనలో నటించారు. వైష్షవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. దీంతో ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) Makkal selvan @VijaySethuOffl accepted the #GreenIndiaChallenge 🌱 given by #Uppena director @BuchiBabuSana and planted saplings at his home. He expressed appreciation towards this great initiative & requested all those waiting for #Uppena should also take part.💚@MPsantoshtrs pic.twitter.com/p8sKuhv5BN — Vamsi Shekar (@UrsVamsiShekar) July 27, 2020 -
‘కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరం’
సాక్షి, కరీంనగర్: హరితహారంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రామ్‌నగర్‌లోని హాస్పిటల్ ఆవరణంతో పాటు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మేయర్ సునీల్ రావుతో కలిసి డివిజన్లోని ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మొగ్దుంపూర్లో కలెక్టర్ శశాంక్‌తో కలిసి ఎకరం ప్రభుత్వ స్థలంలో మంకీ ఫుడ్ కోర్టుకు శ్రీకారం చుట్టి.. పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. అందుచేత అడవి లేని కరీంనగర్ జిల్లాలో 50 లక్షల మొక్కలు సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అడవులు లేని జిల్లాగా ఉన్న కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరీంనగర్ జిల్లా మళ్లీ అడవులకు నిలయంగా మారుతుందన్నారు. నగరంలో 10 నుంచి 12 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని, నగర ప్రజలకు కావలసిన పండ్లు, పూల మొక్కలు ఇంటికి ఆరు ఉచితంగా పంపిణీ చేస్తుననామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించితే బావి తరాలకు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతామని మంత్రి వ్యాఖ్చానించారు. -
మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మొక్కల పెంపకంలో తెలంగాణ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. కేంద్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2017–18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాధానం ఇచ్చిన సందర్భంగా దీనికి సంబందించిన గణాంకాలను వెల్లడించా రు. అంతకుముందు 2016–17లో 4,38,059 హెక్టార్లలో, 2015–16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్క లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018–19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది. గతేడాదికి సంబంధించి లక్ష్యాల సాధన గణాంకాలు ఇంకా సిద్ధం చేయలేదని రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు.. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ రక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యానికి చేరువలో ఉన్నామని, అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా పని చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజున మొక్కను నాటి కానుకగా ఇద్దామని అన్నారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడం ఆదర్శనీయమన్నారు. కేసీఆర్ బర్త్‌డే రోజున మొక్కలు నాటుదాం: మంత్రి సబిత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,01,116 మొక్కలు నాటి సంబురాలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సీఎం పుట్టిన రోజున ఆయనకు కానుకగా ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించామని మంత్రి చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వాటి సంరక్షణా బాధ్యతలు కూడా స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయనున్నామని పేర్కొన్నారు. -
సీఎం పుట్టినరోజున మొక్కలు నాటుదాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నె ల 17న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా చొరవ చూపాలని ఆయన కోరారు. 17న మొక్కలు నాటండి: ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న మొక్కలు నాటాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
ఆ రాణికి చిన్ననాటి నుంచే చెట్లంటే ప్రాణం
సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడంతో మొక్కలు నాటి వన సంపదను పెంచడం కోసం ఒక్కో దేశం ఒక్కోరకమైన ఉద్యమాలను చేపట్టాయి. ప్రస్తుతం భారత దేశంలో ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట సెలబ్రిటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, ఇంగ్లండ్‌లో ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అన్న ప్రచారంతో మొక్కలు నాటే ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తోంది. లండన్ నగరంలో ఈ ఉద్యమానికి ‘ది నేషనల్ ట్రస్ట్’ నాయకత్వం వహిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరం చుట్టూ ఐదు భారీ వనాలు ఉన్నాయి. ఒక్కో వనంలో కోటి పాతిక లక్షల వరకు చెట్లను ఇప్పటికే పెంచారు. ఒక్కో వనం 25వే హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. అదనంగా మరో 30 వేల హెక్టార్లలో భారీ వక్షాల సంరక్షణ బాధ్యతను ఈ ట్రస్టే చూస్తోంది. ఇప్పుడు ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ ఉద్యమం సందర్భంగా ఈ ఐదు వనాల్లోకి పర్యాటకులను ఉచితంగా అనుమతిస్తోంది. అంటే 20 పౌండ్ల (దాదాపు 1850 రూపాయలు) చార్జీలను రద్దు చేసింది. అలాగే ఒక రోజు వేలాడే టెంటులో బస చేసే చార్జీల్లో వంద పౌండ్లను అంటే, దాదాపు ఏడు వేల రూపాయలను తగ్గించింది. అయితే ఒక షరతు వచ్చే పర్యాటకుడు తప్పనిసరిగా ఓ చెట్టును తీసుకొచ్చి ఈ వనంలో నాటాల్సి ఉంటుంది. ఇది కూడా నగర ప్రజలకు మాత్రమే పరిమితం. బ్రిటష్ రాణి ఎలిజబెత్–2 అలెగ్జాండ్ర మేరి స్ఫూర్తితోని ‘బీ ఏ ట్రీ ఏంజెల్’ అని పేరు పెట్టి ఉంటారు. ఆమె ఒక్క ఇంగ్లండ్‌లోనే కాకుండా కామన్వెల్త్ దేశాలతో సహా 53 దేశాల్లో ఆమె చెట్లను విరివిగా నాటడం వల్ల ఆమెను ‘ట్రీ ఏంజెల్’ అని పిలుస్తారు. ఎలిజబెత్ రాణి తన 11 ఏళ్ల ప్రాయంలో స్కాట్లాండ్లోని తన తల్లి ఇల్లైన గ్లామిస్ క్యాజల్ ఆవరణలో 1937లో మొదటిసారి మొక్కను నాటారు. అప్పటి నుంచి ఆమె మొక్కలు నాటే ఉద్యమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
గవర్నర్‌ను కలిసిన పర్యావరణ బాబా
సాక్షి, ఢిల్లీ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను రుషికేశ్ అవధూత అరుణ గురూజీ మహారాజ్ కలిశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటుతున్నామని ఈ పర్యావరణ బాబా వివరించారు. అందులో భాగంగా ఏపీలో కూడా మొక్కలు నాటుతామని చెప్పారు. ఈ విషయాన్ని స్వాగతించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారు. -
‘ఏపీ పౌరులు ఈ ఏడాది 5 మొక్కలు నాటండి’
సాక్షి, విజయవాడ : కార్గిల్ విజయ్ దివస్ (జూలై 26) సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రబ హరిచందన్ రాజ్‌భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కార్గిల్ విజయ్ రోజున ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ రోజు చిరస్మరణీయమైనది. కార్గిల్‌ను ఆక్రమించుకున్న పాకిస్తాన్ సేనల్ని భారత సైనికులు తిప్పి కొట్టిన రోజు. మన సైనికుల వీరత్వానికి మనమంతా గర్వించాలి. మన ప్రజలంతా కలిసికట్టుగా ఉండి దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. విజయ్ దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పౌరుడు ఈ ఏడాది కాలంలో ఐదు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో, వివిధ పండుగల జరుపుకునే క్రమంలో గుర్తుగా ఒక మొక్కను నాటండి. ఈ చిన్న ప్రయత్నం పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తుంది. చేయి చేయి కలుపుదాం. మొక్కలు నాటి.. మానవజాతిని కాపాడుదాం.. జైహింద్’ అని పేర్కొన్నారు. -
‘హరిత’ సైనికుడు
సాక్షి, అల్గునూర్(పెద్దపల్లి ) : ‘వానలు వాపస్ రావాలి..కోతులు వాపస్ పోవాలి’ అని కేసీఆర్ చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నాడు మక్తపల్లివాసి. కేసీఆర్ స్ఫూర్తితో మొక్కల పెంపకానికి నడుం బిగించాడు. ఇప్పటి వరకు లక్ష సీడ్‌బాల్స్ సొంతంగా తయారు చేయించి పంపిణీ చేయించిన హరిత ప్రేమికుడు ఎన్ఆర్ఐ నరేందర్ పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన చింతం కనకలక్ష్మి–రాములు దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు నరేందర్. నరేందర్ అమెరికాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడ్డారు. మిత్రులతో కలిసి నవ సమాజ నిర్మాణ సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు పేదల పిల్లల ఉన్నత చదువుకు సాయం అందిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి ఆర్థికసాయం చేయిస్తున్నారు. గతేడాది అడవుల్లోని జంతువులు, పక్షులు నీరులేక చనిపోతున్నాయని మిత్రుల ద్వారా తెలుసుకున్న నరేందర్ అడవుల్లో నీటికుండీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హరితహారంపై దృష్టి.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నరేందర్ తిమ్మాపూర్ మండలాన్ని హరిత మండలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే స్వగ్రామం మక్తపల్లికి వచ్చిన నరేందర్ బెంగళూర్‌లోని ప్రముఖ విత్తన కంపెనీ, నర్సరీ తయారీ కంపెనీని కలిసి సీడ్‌బాల్స్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్ష సీడ్ బాల్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. చింత, తుమ్మ, రావి, జువ్వి, మర్రి, మారేడు, మేడి, నేరేడు, మామిడి, పుల్చింత, సపోటా, జామ తదితర విత్తనాలతో సీడ్‌బాల్స్ తయారు చేయాలని కోరాడు. సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేశాడు. తొలి విడతగా సుమారు 50 కిలోల సీడ్ బాల్స్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి పంపించగా విత్తనాలను ఆయన మిత్రులు గురువారం గ్రామంలో బాబింగ్ చేశారు. -
లక్ష కోట్ల వృక్షార్చన!
భూమి భగ్గుమంటోంది.. నీటి కటకట.. కాలుష్యం కోరలు చాస్తోంది.. ఈ సమస్యలకు పరిష్కారం.. చెట్టు.. అవును ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష కోట్ల వృక్షాలు కావాలంటున్నారు శాస్త్రవేత్తలు! ‘వృక్షో రక్షతి రక్షితః’మహానుభావులు ఎప్పుడో చెప్పారు.. వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే.. మొక్కలు పెంచడమే మేలైన పరిష్కారమని ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడ నాటాలి? వంటి చిక్కు ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగా పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు కనీసం లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల మొక్కలు నాటాలని వీరు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. వాతావరణంలో ఇప్పటికే చేరిపోయిన కార్బన్డయాక్సైడ్ మోతాదును 66 శాతం వరకూ తగ్గించేందుకు ఇన్ని మొక్కలు అవసరమన్నది వీరి అంచనా. ఇంకోలా చెప్పాలంటే అమెరికా భూభాగమంత విస్తీర్ణంలో కొత్తగా మొక్కలు నాటితే భూమి ఇంకొంత కాలం ‘పచ్చ’గా ఉంటుందన్నమాట! వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నాం. సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తితోపాటు అనేక ఇతర చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా కేవలం లక్ష కోట్ల మొక్కలు నాటడం ఈ సమస్యకు అతి చౌకైన పరిష్కారమన్నది స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యూరిచ్ శాస్త్రవేత్త థామస్ క్రోథర్ అంచనా. భూమ్మీద పచ్చదనం ఎంతుందన్న అంశంపై వీరు వేల ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించారు. మరిన్ని మొక్కలు నాటేందుకు ఉన్న అవకాశాలనూ లెక్కకట్టారు. మానవ ఆవాసాలు, వ్యవసాయ భూమి వంటి వాటిని మినహాయించి చూసినప్పుడు దాదాపు 160 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ విస్తీర్ణంలో మొక్కలు నాటితే భూమ్మీద మొత్తం 440 కోట్ల హెక్టార్లలో పచ్చదనం ఏర్పడుతుంది. అదనంగా నాటే 1 – 1.5 లక్షల కోట్ల మొక్కలు పెరిగి పెద్దయితే.. వాతావరణంలో పేరుకు పోయిన దాదాపు 20,500 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోగలవు. పారిశ్రామిక విప్లవం సమయం నుంచి భూ వాతావరణంలోకి దాదాపు 30,000 టన్నుల కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలిసిందని అంచనా. ఎక్కడ?..: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటితే సరిపోదు అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో సుమారు 47 కోట్ల హెక్టార్ల అడవులు పెంచేందుకు అవకాశముంది. వాతావరణ మార్పుల కారణంగా సైబీరియా ప్రాంతంలోని ఉత్తర బోరియాల్ అడవుల విస్తీర్ణం భవిష్యత్తులో పెరిగే అవకాశముండగా.. దట్టమైన ఉష్ణమండల అడవులు అననుకూ లంగా మారతాయి. కాబట్టి ఉష్ణమండల ప్రాంతాల్లో అడవుల పెంపకం అంత మేలు చేకూర్చదని థామస్ అంటున్నారు. వీలైనంత తొందరగా ఈ బృహత్ వృక్షార్చనను మొదలుపెట్టాలని.. అవి ఎదిగేందుకు దశాబ్దాల సమయం పడుతుందన్నది మరచిపోకూడదని చెప్పారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మొక్కల మాటున అవినీతి చీడ
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): వన సంరక్షణ ...వన మహోత్సవం...ఇలా రకరకాల పేర్లతో గత ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీడియాలో ప్రకటనలు... పత్రికల్లో ఫొటోలతో తెగ హల్చల్ చేశారు. ప్రజల్ని భాగములను చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేసినట్టు ఆర్భాటం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది ... ఆ మొక్కల మాటున అవినీతికి పాల్పడి లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. సంరక్షణ గాలికొదిలేయడంతో ఎదగాల్సిన మొక్కలు ఆదిలోనే ఎండిపోయాయి. ఓ కాలానికి పరిమితం కావల్సిన ఎండలు దాదాపు ఏడాదంతా విరగగాయడానికి కారణం పచ్చదనం లేకపోవడమే. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నిల్వలు బాగా పెరిగిపోతుండటంతో భూతాపం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేప«థ్యంలో ఆడవులను సంరక్షించుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంచే బాధ్యతలను ప్రతి ఒక్కరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని సమర్ధవంతంగా చేయాల్సిన గత ప్రభుత్వం నిధులెలా ఖర్చు చేయాలో చూసిందే తప్ప మొక్కలెలా పెంచాలో శ్రద్ధ పెట్టలేదు. మొక్కలు పెంపకం పేరుతో నిధులు మింగేసిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. అధికారుల వద్ద లభ్యమైన రెండేళ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ∙2016–17లో 32 మండలాల్లో 1,87 156 మొక్కలు నాటినట్టుగా చూపించారు. ఇందులో 84, 233 మొక్కలు బతికున్నట్టుగా రికార్డుల్లో చూపిస్తున్నారు. అంటే 45 శాతం మొక్కలు ఊపిరిపోసుకున్నాయన్నమాట. ∙2017–18లో 51 మండలాల్లో 2,61,208 మొక్కలు నాటగా 1,35,828 మొక్కలు బతికినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, 2017–18 సంవత్సరానికి సంబంధించి 23 మండలాల్లో సామాజిక తనిఖీలు జరిపితే రూ.22,19,693మేర దుర్వినియోగం చేసినట్టు తేలింది. అంతకుముందు సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటిలో బతికున్నవెన్నో అధికారుల వద్ద లెక్కల్లేవు. ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయో తేల్చే తనిఖీలు జరగలేదు. ఇదంతా అధికారికంగా చెబుతున్న సమాచారం. కానీ అనధికారికంగా చూస్తే వేసిన మొక్కలు ఎక్కడున్నాయో...ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ లెక్కన మొక్కల పెంపకం కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా దుర్వినియోగమయింది. మొక్కలు వేసినందుకు, మొక్కలు పెంపక వేతనం, నీటి సరఫరా ఖర్చు, ఎరువులు, ఇతరత్రా వాటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినట్టు లెక్కలు రాసుకున్నారు. రికార్డుల్లో లెక్కలు చూపించారే తప్ప క్షేత్రస్థాయిలో వేసిన మొక్కలను పట్టించుకోకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలున్నాయి. విశేషమేమిటంటే 2017–18లో సామాజిక తనిఖీల్లో 22 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగిందని, 300 మందికిపైగా అక్రమాలకు పాల్పడ్డారని తేల్చినా ఇంతవరకూ ఒక్క పైసా రికవరీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిబట్టి అక్రమాలను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని డ్వామా పీడీ ఎన్వీ రమణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా ‘నేను ఎన్నికల ముందు బాధ్యతలు స్వీరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని, పరిశీలిస్తానని చెప్పారు. 2016–17లో మొక్కలు నాటిన మండలాలు 32 నాటిన మొక్కలు 1,87,156 మొత్తం వ్యయం 150.37 లక్షలు బతికిన మొక్కలు 84, 233 బతికిన మొక్కల శాతం 45 2017–18లో సోషల్ ఆడిట్ చేసిన మండలాలు 23 దుర్వినియోగమైనట్టు తేల్చిన నిధులు రూ. 22,19,693 2017–18లో మొక్కలు నాటిన మండలాలు 51 నాటిన మొక్కలు 2,61,208 మొత్తం వ్యయం 946.11 లక్షలు బతికిన మొక్కలు 1,35,828 బతికిన మొక్కలు శాతం 52 -
ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం
భువనేశ్వర్: ఫొని తుపాను సృష్టించిన వినాశనం నుంచి ఒడిశా ఇప్పడిప్పుడే కోలుకుంటుంది. గత నెల ఫొని వినాశనానికి రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యవరణం తీవ్రంగా దెబ్బతిన్నది. అనేక వృక్షాలు నేలకొరిగాయి. ఫొని ధాటికి దాదాపు 20 లక్షలకు పైగా వృక్షాలు కుప్పకూలినట్లు కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయన్ వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టారు. పర్యవరణ పరిరక్షణ నిమిత్తం ఐదేళ్ల కాలానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఫొని కారణంగా నష్టపోయిన వృక్ష సంపదను తిరిగి సాధించేందుకు రూ.188ను కేటాయించారు. ఆ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నారు. ఫొను నష్టంపై శనివారం ఉన్నతాధికారులతో సమావేశమైన నవీన్ ఈ మేరకు అంచనాలను వేసి నష్టనివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,780 హెక్టార్ల పంట నష్టం కూడా సంభవించింది. కాగా ఫొని తుపాను విరుచుకుపడినప్పుడు తన ప్రజలకు తక్షణ సహాయ సహకారాలను అందించడంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న చర్యలు యావద్దేశం ప్రశంసలను అందుకున్న విషయం తెలిసిందే. -
హరితహారానికి మొక్కలు సిద్ధం
సాక్షి, వేములపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని ఏడు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి వన సేవకులు మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పం చాయతీలో 40వేల నుంచి లక్ష మొక్కలు నాట డమే లక్ష్యంగా అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లోఅటవీశాఖ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కల పెంపకం శరవేగంగా జరుగుతుంది. ఉపాధిహామీ పథకంలో భాగంగా మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో 30వేల మొక్కలు, సల్కునూరులో 40వేలు, ఆమనగల్లు, శెట్టిపాలెం, రావులపెంట, వేములపల్లి, బుగ్గబావిగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లో 50వేల చొప్పున, కామేపల్లి, అన్నపరెడ్డిగూడెం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో 20వేల చొప్పున మొక్కలను నాటేందుకు అధికారులు నిర్ణయించారు. నాటిన ప్రతి మొక్క బతికేవిధంగా చర్యలు నర్సరీల్లో పెంచిన మొక్కలను మండలంలోని ఆయా గ్రామాల్లో నాటిన తరువాత నాటిన ప్రతి మొక్క బతికి పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే జామ, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, వెలిగ, బొప్పాయి, మునగ, గోరింట, కరివేపాకు, మారేడు, పీటోపాల్, డెకోమా, టేకు లాంటి వివిధ రకాల మొక్కలను అందించనున్నా రు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో సంచులలో మట్టిని నింపేందుకు, మొక్కలకు నీటిని చల్లేం దుకు, మొక్కల మధ్య కలుపు తీసే పనులకు అధి కారులు ఉపాది కూలీలను వినియోగిస్తూ పలు కుటుంబాలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని వర్షాకాలంలో ప్రారంభించనున్నందున జూన్ నాటికి ఆయా గ్రామాల్లో మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలం లోని ఆరు నర్సరీల్లో సంచులలో మట్టిని నింపి విత్తనాలు వేశాం. అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి వన సేవకులకు తగు సూచనలు చేస్తూ వర్షాకాలం ఆరంభంనాటికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనయ్య, ఏపీఓ -
దమ్మపేట పోలీసులు.. ప్రకృతి ప్రేమికులు..!
సాక్షి, దమ్మపేట: మనుషుల రక్షణే కాకుండా ప్రకృతి రక్షణకు ఇక్కడి పోలీసులు నడుం బిగించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతున్నారు. నిత్యం చెట్ల రక్షణ కోసం సమయాన్ని కేటాయిస్తూ దమ్మపేట పోలీస్‌స్టేషన్‌ను పచ్చదనంతో నింపారు. దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి పక్కనే పోలీస్‌స్టేషన్ పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటున్నది. హరితహారంలో భాగంగా అప్పటి ఎస్ఐ ఎం.నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విడతలవారీగా మొక్కలు నాటుతూ వాటి పరిరక్షణ చేపట్టారు. ఇక్కడి మొక్కలపై ఎస్ఐ జలకం ప్రవీణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మొక్కలను పోలీసులు దత్తత తీసుకున్నారు. ఇక్కడ గానుగ, దానిమ్మ, వేప, కొబ్బరి మొక్కలను నాటారు. క్రోటన్తో పాటు ప్రత్యేక పూల మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేసి స్టేషన్ ముందు అందమైన గార్డెన్ రూపొందించారు. ఎదిగిన ప్రతి చెట్టుకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేశారు. పచ్చదనంతో ప్రశాంత వాతావరణం పచ్చదనంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని అంటున్నారు ఎస్సై జలకం ప్రవీణ్. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘చెట్ల నీడన చేరితే మన అలసట తీరుతుంది. పచ్చని చెట్లు ఆహ్లాదాన్నిస్తాయి. ఆలోచనలపై సానుకూల ప్రభావం చూపుతాయి. బాధ, కోపం, ఆవేశంతో ఎన్నో గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో మంచి ఆలోచనలు, మనుషుల్లో మార్పు రావడానికి ఇక్కడి పచ్చదనం కొంత దోహదపడుతోంది’’ అన్నారు. -
నాకు ఓటు వేస్తే పర్యావరణాన్ని కాపాడుతా
సాక్షి, కోదాడ : తనకు ఓటు వేస్తే పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని, ప్రజలకు మెరుగైన జీవన విధానానికి అవకాశం కల్పిస్తానని హమీ ఇస్తున్నాడు కోదాడకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ. సోమవారం మొక్కలను చేత పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ ప్రేమి కులు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణం, గ్రామాల్లో హరిత వనాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు. -
‘మొక్క’వోని సంకల్పం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఊళ్లను హరిత గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. నాలుగో విడత హరితహారంలో భాగంగా ప్రతి ఇంట్లో పచ్చదనం కనిపించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలు, రహదారి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోనుంది. సంఘంలోని ప్రతి సభ్యురాలు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటేలా ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో హరితహారం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ విడతలో జిల్లావ్యాప్తంగా 1.97 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ హరితహారం కార్యక్రమంపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి.. లక్ష్యం మేరకు అధికారులు విరివిగా మొక్కలు నాటించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అధికారులు తమ శాఖల పరిధిలో మొక్కలు నాటించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరగడంతో క్షేత్రస్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం చేస్తున్న సూచనలతోపాటు జిల్లా అధికారులు నూతన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కుటుంబానికి ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. జిల్లా అధికారులు ఒకడుగు ముందుకేసి ఇందులో మహిళలు పాలుపంచుకునే విధంగా చర్యలు చేపట్టారు. గత మూడు విడతల్లో నాటిన మొక్కలు కొన్ని చనిపోవడంతోపాటు సంరక్షణ లేక ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ఈసారి నాటిన మొక్కలు ఎండిపోకుండా.. వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. మహిళా సంఘాలకూ బాధ్యత.. హరితహారంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అధికారులతోపాటు ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మొక్కలు నాటడంతోనేతమ బాధ్యత తీరిందని ప్రజలు భావిస్తుండటంతో చాలా వరకు మొక్కలు ఎండిపోతున్నాయి. అలా కాకుండా.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలనే ఉద్దేశంతో ఈసారి హరితహారం కార్యక్రమంలో మహిళా సంఘాలు పాలుపంచుకునే విధంగా చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 25,034 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వీటిలో 2,31,586 మంది సభ్యులున్నారు. వీరిచేత సుమారు 13లక్షలకు పైగా మొక్కలు నాటించాలని ప్రయత్నిస్తున్నారు. మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఆరు మొక్కలు ఇచ్చి.. వారి ఇంటి ఆవరణతోపాటు పరిసరాల్లో నాటించాలని సూచిస్తున్నారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఒకవేళ మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోయినా.. చనిపోయినా.. దాని స్థానంలో మరో మొక్కను వెంటనే నాటాల్సి ఉంటుంది. రైతులకూ మొక్కల పంపిణీ.. డీఆర్డీఏ ద్వారా రైతులకు కూడా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు మొక్కలను అందజేస్తారు. వీటి రవాణా, నాటేందుకు, నీళ్లు పోసేందుకు అయ్యే ఖర్చులను ఉపాధిహామీ పథకం ద్వారా ఆయా రైతులకు చెల్లిస్తారు. అలాగే పెద్ద రైతులకు కూడా గుంతలు తీసినందుకు, మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చును చెల్లించనున్నారు. ఇక ప్రతి కుటుంబానికి 6 మొక్క లు పెంచుకునేందుకు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటిని ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు చదవుతు న్న ప్రతి విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీరు కూడా తమ ఇంటి ఆవరణలో మొక్కలను పెంచాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖలైన విద్య, నీటిపారుదల, దేవాదాయ తదితర శాఖలు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రభుత్వ శాఖల లక్ష్యం ఇలా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1.97 కోట్ల మొక్కలు నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో డీఆర్డీఏ ద్వారా 66 లక్షల మొక్కలు, అటవీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 45 లక్షలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 15 లక్షలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 8 లక్షలు, సింగరేణి ద్వారా 5 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 8 లక్షలు, ఐటీసీ ద్వారా 50 లక్షల మొక్కలు నాటించేందుకు బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల అధికారులు లక్ష్యాల మేరకు మొక్కలు నాటించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. -
పెళ్లికి రండి.. మొక్క తీసుకోండి
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అతడో సామాజిక సేవకుడు. పలు సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ఆశయ స్ఫూర్తి పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్నాడు. ప్రకృతిపై మమకారంతో వినూత్నంగా అతడు తన పెళ్లికార్డులతో పాటు మొక్కలు పంపిణీ చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. కొండపల్లిలో ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి అస్గర్ హుస్సేన్ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన తన వివాహం సందర్భంగా శుభలేఖలతో పాటు మొక్కలు పంచేందుకు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి కార్డులతో పాటు 200 పండ్లు, పూలు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో ఐదు అడుగుల స్థలంలో కనీసం ఒక మొక్క నాటాలనేది ఆశయస్పూర్తి ఫౌండేషన్ లక్ష్యమన్నారు. -
చేతులు కాలాక ‘చెట్లు’ పట్టుకున్నామా?
తెలంగాణలో హరితహారం.. ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం! కోస్టారికాలో ఒకటి.. పాకిస్తాన్, చైనాల్లో మరోటి.. ఇంకోటి! పేరు ఏదైనా జరుగుతున్నది మాత్రం ఒక మహా ఉద్యమం. కోటానుకోట్ల మొక్కల పెంపకం! భూమాతకి పచ్చాని కోక కట్టే యత్నం! భూమాత కోపానికి బలికాకూడదని అనుకున్నారో... తిండితిప్పలకు కరవొచ్చి.. ఆయువు తీరుతుందన్న బెంగ వెంటాడిందో... కారణం ఏదైతేనేం.. చేతులు కాలాక అయినా సరే.. మనిషి మళ్లీ ప్రకృతి బాట పట్టేందుకు గట్టి ప్రయత్నం మొదలెట్టాడు! సాహో అందాం.. మనమూ ఓ చేయి వేద్దాం! అభివృద్ధి పేరుతో ఇప్పటివరకూ జరిగింది ప్రకృతి వినాశనమే. చెట్లు కొట్టేశాం.. అడవుల్ని నరికేశాం. ఫలితం అనుభవిస్తున్నాం. ఎప్పుడు వస్తాయో తెలియని వానలు..మండువేసవిలో పలుకరించే వరదలు, గడగడలాడించాల్సిన చలికాలంలోనూ చెమట్లు! కలియుగంలో ప్రకృతి చిత్ర విచిత్రంగా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దపు అంతానికి భూమ్మీద మనిషి మనుగడే కష్టమైపోతుందన్న ఆందోళన వ్యక్తమైన సంగతి మనకు తెలిసిన విషయమే. దశాబ్దాల పరిశోధనలు, చర్చోపచర్చల తరువాత శాస్త్రవేత్తలు భూమి భవిష్యత్తును స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రపంచదేశాలు మేల్కొన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న ప్రధాన విష వాయువు కార్బన్ డైయాక్సైడ్‌ను కట్టడి చేసేందుకు కోటానుకోట్ల మొక్కలు నాటేందుకు నడుం బిగించాయి.! ఎవరెంత? ఏ పని చేసినా.. భారీగా చేసే చైనా మొక్కల విషయంలోనూ ఈ పంథాను వదల్లేదు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా కోటీ అరవై మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో.. మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంకోలా చెప్పాలంటే ఐర్లాండ్ దేశమంత సైజులో పచ్చదనం నింపే ప్రయత్నం అన్నమాట! మన దాయాది పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని కొండల్లో వంద కోట్ల మొక్కల్ని నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే.. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. లాటిన్ అమెరికా దేశాలు ఐదు కోట్ల ఎకరాల్లో అడవుల పెంపకానికి రెడీ అవుతున్నాయి. కూటికి పేదలని అందరూ అనుకునే ఆఫ్రికా దేశాలు.. తామూ పచ్చధనులమే అంటూ ఇంకో 25 కోట్ల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంగ్లాండ్, ఐర్లండ్, నార్వే, ఫ్రాన్స్, భారత్.. ఆ దేశం, ఈ దేశం అని లేదు.. 120కి పైగా దేశాల్లో ఈ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం సాగుతోంది. చెట్లు అంటే కేవలం కలప మాత్రమే కాదని అర్థం చేసుకున్నాం. వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడతాయని, నీటి వనరుల్ని సంరక్షిస్తాయని, జీవ వైవిధ్యాన్ని పెంచుతాయని, భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయని ప్రపంచ దేశాలు గ్రహించుకున్నాయి. వాతావరణ సంక్షోభం నుంచి బయటపడాలంటే అడవుల్ని పెంచడమే పరిష్కారమార్గమని భావించి 2015లో భారీగా అటవీ విస్తీర్ణం పెంచుతామని ప్రతిజ్ఞ చేశాయి. 2030 నాటికి 350 మిలియన్ హెక్టార్లలో అడ వుల్ని (విస్తీర్ణంలోభారత్ కంటే కూడా ఎక్కువ) పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్ణయించింది. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమైనా అన్ని దేశాలు చెట్ల పెంపకంలో చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం 21.7శాతం అటవీ విస్తీర్ణం ఉంది. 2020 నాటికి 23 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఉంది. గత అయిదేళ్లుగా చైనాలో 51 కోట్ల ఎకరాల్లో అటవీవిస్తీర్ణం పెరిగింది. పాకిస్తాన్ కూడా 100 కోట్ల మొక్కలు నాటుతాం అంటూ తనకు తానే లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించడంలో కూడా అందరికంటే ముందుంది. అక్కడ ప్రతిఊరూ ఒక నందనవనంగా మారిపోతోంది. మొక్కలు నాట డమనేది నేడు ప్రపంచ దేశా లకు ఒక చారిత్ర క అవసరంగా మారి పోయింది. అదొక రాజ కీయ, ఆర్థిక, పర్యావరణ అవసరం. ముప్పు తీరలేదు... బోలెడన్ని మొక్కలు నాటేశాం కదా.. ఇక చిక్కులు తీరినట్టేనా? అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన వినాశనంతో పోలిస్తే.. నాటిన మొక్కలు, పెరిగిన అటవీ విస్తీర్ణం పిసరంతే. చాలా దేశాల్లో పలు కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతూనే ఉంది. కలప స్మగ్లింగ్, కార్చిచ్చులు, చీడపీడలు ఇందుకు ప్రధాన కారణాలు. అమెజాన్ అడవులుండే బ్రెజిల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడానికి స్మగ్లింగ్ కారణమవుతూంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లలో కార్చిచ్చులు అడవులను బలితీసుకుంటున్నాయి. గత 25 ఏళ్లలో అటవీ విస్తీర్ణం సగానికి పైగా తగ్గిపోయిందన్న వాస్తవం తెలిస్తే ఈ నష్టం పూడ్చటం అంత సులువు కాదని ఇట్టే అర్థమైపోతుంది. పరిష్కారం ఏమిటి? మొక్కలు పెంచే కార్యక్రమాలు.. పర్యావరణాన్ని కాపాడేలా, ప్రపంచం ఆకలి తీరేలా, కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేసేలా మారాలంటే.. ఏదో కొన్ని మొక్కలు నాటేస్తే సరిపోదన్నది నిపుణుల అభిప్రాయం. గంపగుత్తగా కొన్ని చోట్ల మొక్కలు నాటేసి అడవులను పెంచేశాం అని కాకుండా.. సాధారణ వ్యవసాయంలోనూ అడవులను పెంచాలని వీరు అంటున్నారు. ఆగ్రోఫారెస్ట్రీ అని పిలిచే ఈ పద్ధతిలో పంటపొలాల చుట్టూ కొంతమేరకు నీడనిచ్చే, ఫలా లందించే చెట్లు పెంచాలి. అలాగే మైదాన ప్రాంతాల్లో పచ్చికబీళ్లను ఏర్పాటు చేస్తే పాడిపశువుల మేత కరువు తీరడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటిభూమి 200 కోట్ల హెక్టార్లు ఉంది. వాటిల్లో వేర్వేరు రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యతను కాపాడుకోవాలని అప్పుడే వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ రకమైన ఆగ్రోఫారెస్ట్రీతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అనేందుకు నైజీరియానే నిదర్శనం. సుమారు 30 ఏళ్ల క్రితం నైజీరియాలో దుర్భర పేదరికం ఉండేది. కరువు కాటకాలతో ఆ దేశం అల్లాడిపోయింది. ధనిక దేశాల సూచనలు, సలహాల మేరకు చెట్లు, చేమల్ని తొలగించి చదును చేసి వేలాది హెక్టార్లలో గోధుమ, మొక్కజొన్న పంట లు వేశారు. కానీ అదో విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కొందరు యువ శాస్త్రవేత్తలు చెట్లు చేమలు తొలగించకుండానే పంటలు వేస్తే అద్భుతమైన దిగుబడులు వచ్చాయి. అప్పుడే వారికి తెలిసింది. చెట్లు ఉంటే పంటలు కూడా బాగా పండుతాయని. అప్పట్నుంచి నైజీరియా దాదాపుగా 20 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి ఏడాదికి ఆరు లక్షల టన్నుల వరకు పెరిగింది. మలావి, మాలి, ఇథియోపియా వంటి దేశాల్లో ఇప్పుడు రైతులే తమ వ్యవసాయ భూముల్లో చెట్లను కూడా పెంచుతున్నారు. భారత్‌లోనూ పెరుగుతున్న పచ్చదనం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్–10లో ఉందంటేనే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలు రకరకాల పేర్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్నది లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 2015 నాటి పారిస్ ఒప్పందం ప్రకారం మొక్కల పెంపకానికే రూ.43 వేల కోట్లు వెచ్చించడానికి అంగీకరించింది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో నర్మద నదీ తీరం వెంబడి ఒక్కరోజే 6.6 కోట్ల మొక్కల్ని నాటడం ఇందులో భాగమే. రాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా రెండేళ్లలో అడవుల విస్తీర్ణం 6,778 చదరపు కిలోమీటర్ల మేర పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ (2,141 చ.కి) మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,101చ.కి), కేరళ (1,043 చ.కి.), ఒడిశా (885 చ.కి.), తెలంగాణ (565 చ.కి.)æ ఉన్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో అభివృద్ధి పేరుతో చెట్లను నరికేయడం కొనసాగుతూనే ఉంది. భారత్ ఇదే స్థాయిలో మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తే ఏడాదికి 520 మిలియన్ల గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గించగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం.. తెలంగాణలో హరితహారం కొంతవరకు సత్ఫలితాల్నే ఇస్తున్నాయి. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినప్పటికీ మొక్కల్ని పెంచాలన్న అవగాహనను భవిష్యత్ తరాల్లో నింపుతున్నాయి. 2015లో మొదలైన హరితహారం కార్యక్రమంలో నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇప్పటివరకు 82 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. అయితే 20 కోట్ల విత్తనాలను కొండ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ చల్లారు. ఆ విధంగా చూస్తే 102 కోట్ల మొక్కల్ని నాటినట్టుగా లెక్క. రికార్డు స్థాయిలో 75 శాతం మొక్కల్ని పరిరక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏపీలోని అరకు ప్రాజెక్టులో భాగంగా స్థానిక గిరిజనులే లక్షల సంఖ్యలో పండ్ల మొక్కలు, కాఫీ చెట్లు పెంచారు. దీంతో పదిహేను వేల హెక్టార్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కథనాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక్కొక్కరికి.. వెయ్యి ఈత మొక్కలు!
బషీరాబాద్ : 4వ విడత హరితహారంలో తొమ్మిది లక్షల మొక్కలు నాటాలని జిల్లా ఆబ్కారీ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కలు నాటాలంటే సుమారు రెండు వేల ఎకరాల స్థలం కావాలని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మూడో విడతలో చెరువుగట్లపై, గీతా కార్మిక సొసైటీ భూముల్లో, అసైన్డ్ భూముల్లో 8 లక్షల మొక్కలు నాటారు. సంరక్షణలేక పోవడంతో అందులో సగానికి పైగా ఎండిపోయాయి. దీంతో ఈసారైనా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయనుంది. ఈ విడత లక్ష్యం చేరుకోవడానికి ఎక్సైజ్ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో తొమ్మిది లక్షల ఈత మొక్కలను ఎక్కడ నాటాలనే ఆలోచనలో పడింది. ఇప్పుడున్న చెరువు గట్లు మీద పెట్టినా స్థలం సరిపోదని భావించిన ఆబ్కారీ అధికారులు సరికొత్త ఆలోచనకు తెరలేపారు. హరితహారం లక్ష్యాన్ని గీతా కార్మికులకు నిర్ధేశించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొక్కలు నాటడానికి స్థలాలులేకుంటే గౌడల పట్టా భూముల్లోనైనా నాటించాడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఒక్కో గీతా కార్మికుడికి ఐదు వందల నుంచి వెయ్యి ఈత మొక్కలు నాటాలని ఆదేశిస్తున్నారు. గౌడలు ఇంత పెద్దమొత్తంలో మొక్కలు ఎలా నాటాలని లోలోన మదన పడుతున్నారు. అధికారుల ఆదేశాలు విస్మరిస్తే కష్టాలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పట్టా భూముల్లో నాటండి తాండూరు నియోజకవర్గంలో 4వ విడత హరితహారం కింద 3లక్షల ఈత మొక్కలు నాటాలని లక్ష్యం ఉంది. దీనికోసం ఒక్కో గీతా కార్మికుడు తప్పనిసరిగా వెయ్యి మొక్కలు నాటాలని తాండూరు ఎక్సైజ్ సీఐ రమావత్ టుక్యానాయక్ ఆదేశిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని మైల్వార్‌లో ఓ గీతా కార్మికుడి ఇంటికి మంగళవారం వెళ్లి విషయాన్ని చెప్పడంతో అతడి నోట మాట రాలేదు. ‘ఇన్నీ మొక్కలు ఇస్తే ఎక్కడ నాటాలి సార్.. పోయినేడాది నాటిన మొక్కలకే జాగ లేదు.. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి..’ అంటూ ఆ గీతా కార్మికుడు సీఐని ప్రశ్నించారు. మీ పట్టా భూముల్లో నాటండడని సీఐ సమాధానం చెప్పారు. -
మొక్కల వ్యర్థాలతో ప్లాస్టిక్, నైలాన్!
వృధాగా పడేసే మొక్కల వ్యర్థాల నుంచి విలువైన ప్లాస్టిక్, నైలాన్, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే ఎంజైమ్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. యునైటెడ్ కింగ్డమ్తో పాటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మొక్కల్లో ప్రధాన భాగమైన లిగ్నెన్లపై పరిశోధనలు చేస్తున్నారు. కేవలం కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్ల ద్వారా మాత్రమే నాశనమయ్యే ఈ లిగ్నెన్లలో మనకు ఉపయోగపడే అనేక రసాయనాలు ఉన్నాయి కాని వీటిని సమర్థంగా విడగొట్టడం మాత్రం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. తాజాగా ఓ వినూత్నమైన పద్ధతి సాయంతో ప్రొఫెసర్ మెక్‌గీహన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని సాధ్యం చేసింది. ఈ క్రమంలో లిగ్నెన్లో ఉండే కొన్ని ఎంజైమ్లతో జీవ సంబంధిత పాలిమర్లు అంటే నైలాన్, ప్లాస్టిక్ వంటివి తయారు చేసేందుకు పనికొస్తాయని వీరు గుర్తించారు. దీంతో ఇప్పటివరకూ వ్యర్థంగా పడేస్తున్న లిగ్నెన్లతో విలువైన పదార్థాలను తయారు చేయవచ్చునని స్పష్టమైంది. ముడిచమురుపై ఆధారపడకుండా సహజసిద్ధంగా నశించిపోగల ఈ తరహా ప్లాస్టిక్, నైలాన్లతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని మెక్‌గీహన్ అంటున్నారు. సైటోక్రోమ్ పీ450 అనే ఈ ఎంజైమ్‌లు చాలారకాల మూలకాలతో సులువుగా కలిసిపోగలవని, ఫలితంగా కొన్ని కొత్త కొత్త పదార్థాలను తయారుచేయడం వీలవుతుందని అంచనా. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఎంజైమ్‌తో మరింత వేగంగా చర్యలు జరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వతంగా మూసివేత
సాక్షి, చెన్నై: ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ శాశ్వత మూసివేతకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అంతకుముందు తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. ప్రజాభీష్టం మేరకు స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్టెరిలైట్ ఫ్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ గత వారం స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 13మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
-
మొక్కకు చీర రక్ష
బోధన్ : ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా బోధన్ మున్సిపల్ శాఖ పట్టణంలోని ప్రధాన రోడ్లలో మొక్కలు నాటారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రైల్వేగేట్ మీదుగా బాన్సువాడ వెళ్లే ప్రధాన రోడ్డులో లయన్స్ కంటి ఆస్పత్రి, రాకాసీపేట్ రైల్వేస్టేషన్, రాకాసీపేట్ ప్రాంత క్రాసింగ్ కూడలి వద్ద ప్రధాన రోడ్డుకు ఆనుకుని మొక్కలు నాటా రు. ఇక్కడ రోడ్డు పక్కన చిరు టీ, టిఫిన్ హోట ల్ నడుపుకుంటున్న వహీదా అనే మహిళ హో టల్ ముందు నాటిన మొక్క మేకలు తినేయకుండా, మొక్క చుట్టూ చీరలు కట్టి సంరక్షిస్తోంది. ఇలా ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటే హరిత తెలంగాణ కల సాకారం అవుతోందనడంలో సందేహంలేదు. -
రైతుల ధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతు
-
నా పేరు చెప్పుకోండి..?
జహీరాబాద్ టౌన్: ఈ ఫొటోలో కనిపిస్తోంది క్యాబేజీ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇది క్యాబేజీలా కనిపిస్తున్న ఓ పిచ్చిమొక్క. మండలంలోని హుగ్గెల్లి రైతు ఇస్మాయిల్ తన పొలంలో క్యారెట్ సాగు చేశాడు. పంట మధ్యలో ఈ పిచ్చి మొక్క మొలిచింది. విచిత్రమైన ఈ మొక్కను సమీప రైతులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. -
తమిళనాట మరో ఉద్యమం
చెన్నై: తమిళనాట మరో ఉద్యమం మొదలైందంది. తీత్తుకుడిలోని స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్‌ను మూసివేయాలని వేలాది మంది నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కలుషిత నీటి ద్వారా పంటలు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్ ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిసింది. -
ఒక కంపెనీ.. 22 బ్రాండ్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్టార్టప్స్ హవా మొదలయ్యాక.. వయసు, అనుభవంతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించిన వారు చాలామందే ఉన్నారు. ప్లసెరో ఇంటర్నేషనల్ కూడా ఈ కోవలోదే. పట్టుమని పాతికేళ్లు లేని ఢిల్లీ కుర్రాడు స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించేసి.. విజయవంతంగా నడిపిస్తున్నాడు. దేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 22 బ్రాండ్లు.. నెలకు 3 లక్షల బాటిళ్లు.. రూ.2.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి కంపెనీని తీసుకెళ్లాడు. మరిన్ని వివరాలు ప్లసెరో ఇంటర్నేషనల్ సీఈఓ వేదాంత్ పాడియా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మార్కెటింగ్‌లో పలు ఆన్లైన్ కోర్సులు చేశా. తర్యాత పాకెట్ యాడ్ పేరిట ప్రకటనల విభాగంలో సేవలందించే స్టార్టప్‌ను ప్రారంభించా. సరైన వ్యాపార విధానం లేకపోవటం, అంతర్గత సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల దీన్ని మూసేశా. రెండేళ్ల తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం చూపించాలని సంకల్పించి.. రూ.3 కోట్లతో 2015 మార్చిలో ప్లసెరో ఇంటర్నేషనల్‌ను ప్రారంభించా. దేశంలో స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ తయారు చేసే ఏకైక సంస్థ ప్లసెరోనే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిల్టాన్, సెల్లో వంటి కంపెనీలు ఆయా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఉత్పత్తే మా ప్రత్యేకత. 22 బ్రాండ్లు... ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ కొనుగోలు ప్లసెరో నుంచి పెక్స్‌పో, డ్యూమా, క్వాన్‌టాస్, ఎన్ డ్యురా తదితర 22 బ్రాండ్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్, స్పోర్ట్స్, థర్మో మూడు విభాగాల్లో బాటిల్స్ ఉంటాయి. 500 ఎంఎల్, 750 ఎంఎల్ 1,000 ఎంఎల్ సైజుల్లోని బాటిల్స్ ధరలు రూ.325 నుంచి రూ.1,999 వరకూ ఉన్నాయి. దేశంలో 102 మంది డీలర్లున్నారు. ఆన్లైన్లో విక్రయాల కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే 6 నెలల్లో సొంత ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభిస్తాం. బిగ్‌బజార్, డీమార్ట్ వంటి హైపర్‌మార్కెట్లతో పాటూ టెలిషాపింగ్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. నెలకు 3 లక్షల విక్రయాలు; 25 శాతం ఎగుమతులే ఢిల్లీ–హర్యానా సరిహద్దులోని సోనిపట్‌లో 4 ఎకరాల్లో ప్లాంట్ ఉంది. నెలకు 7 లక్షల బాటిళ్ల తయారీ సామర్థ్యం. ప్రస్తుతం 60 శాతమే వాడుతున్నాం. దేశంతో పాటూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయ్‌లోనూ నెలకు 3 లక్షల బాటిల్స్ విక్రయిస్తున్నాం. ప్రధాన బ్రాండ్ అయిన పెక్స్‌పో నెలకు ఆన్లైన్లో 10 వేలు, డీలర్షిప్స్ ద్వారా 85 వేలు విక్రయమవుతోంది. మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 25 శాతం వరకుంటుంది. మా విక్రయాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కువ. మా మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం. గతేడాది ఈ రెండు రాష్ట్రాల్లో 62 వేల బాటిల్స్ విక్రయించాం. ప్రస్తుతం నెలకు 2.5 కోట్ల ఆదాయాన్ని సాధిస్తున్నాం. నికర లాభం 18% ఉంటుంది. గతేడాది రూ.30 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ప్రతి నెలా 35% వృద్ధిని నమోదు చేస్తున్నాం. రూ.10 కోట్ల నిధుల సమీకరణ.. వచ్చే ఏడాది కాలంలో రూ.60 కోట్ల ఆదాయం, 50 లక్షల విక్రయాలకు చేరాలని లకి‡్ష్యంచాం. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగిసేలోగా లంచ్ బాక్స్‌లు, కంటైనర్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాం. ప్రస్తుతం సంస్థలో 225 మంది ఉద్యోగులున్నారు. తొలిసారిగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. చర్చలు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో ముగిస్తాం’’. -
ఇక్కడ ఆడపిల్ల పుడితే మొక్కలు నాటుతారు.!
జైపూర్: ఆడపిల్ల పుడితే చాలు అన్నీ బాధలే అనుకునే సమాజం ఇది. ఆడశిశువును చెత్తబుట్టల్లో పడేసే కర్కశులూ లేకపోలేరు. భ్రూణ హత్యలకు పాల్పడే మూర్ఖులు చాలా మంది నేటి సమాజంలో ఉన్నారు. కానీ ఓ గ్రామం మాత్రం వీటికి దూరంగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఆడపిల్ల జన్మిస్తే అక్కున చేర్చుకుంటారు. ఊరంతా కలిసి పండుగ జరుపుతారు. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు. ఇలా నాటిన ప్రతి మొక్కని కన్న బిడ్డలా చూసుకుంటారు. ఇంత గొప్ప పనికి శ్రీకారం చుట్టింది రాజస్థాన్‌లోని పిప్లాన్‌ట్రీ అనే గ్రామం. ఇటు స్త్రీ నిష్పత్తిని పెంచుతూ.. అటూ పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు సదరు గ్రామస్తులు. ఇంత గొప్ప ఆచారాన్ని గత 11 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఓ వైపు సమాజంలో ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. చాలా చోట్ల వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు చేస్తున్న కార్యక్రమం నిజంగా సమాజానికి మేల్కొలుపు లాంటిదే. ఇటీవల ఆ గ్రామంపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ డ్యాక్యుమెంటరీ రూపొందించి ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆ గ్రామ ప్రజలు నాటిన మొక్కలు, వారు మొక్కలపై తీసుకుంటున్న శ్రద్ధను తెలియజేశారు. ఆడశిశువు జన్మను ప్రొత్సహిస్తూ, పర్యావరణాన్ని సంరక్షిస్తూ పిప్లాన్‌ట్రీ గ్రామస్తులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఆడపిల్ల పుడితే ఆ గ్రామంలో 111 మొక్కలు నాటుతారు
-
జామాయిల్ ప్లాంటేషన్‌లో మంటలు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోనీ వీకె–7 షాప్ట్ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్‌లో, ఐటీఐ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాదాపు 200 ఎకరాల జీడి మామిడి, జామాయిల్ ప్లాంటేషన్ కాలిపోయింది. నష్టం విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది కలిసి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మంటలతో పాములు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావటంతో అందరూ కలవరపడ్డారు. -
హరిత‘దైన్యం’
సాక్షి, సిద్దిపేట: మూడో విడత హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 492 మంది హరిత సైనికులను నియమించారు. సైకిళ్లను సైతం అందచేశారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను.. రోజూ మూడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరిగి పర్యవేక్షించాలి. మొక్క ఎదుగుదలను పరిశీలించడం, కలుపు తీసి కంచెవేయడం, పాదులు తీయడం, ట్రీగార్డుపెట్టడం, మొక్క చనిపోతే దాని స్థానంలో కొత్తది నాటడం.. వీరి విధులు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.194 చొప్పున ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తారు. ఉపాధి హామీ నిబంధన ప్రకారం ఒక జాబ్ కార్డుకు ఏడాదికి వంద రోజులే పని కల్పిస్తారు. హరిత సైనికులు నెలలో 24 రోజులు పనిచేసినా.. నాలుగు నెలల్లోనే అతని వంద రోజులు పని పూర్తవువుతుంది. దీంతో అతనికి డబ్బులు చెల్లింపునకు నిబంధనలు అడ్డు వస్తాయి. దీంతో అతని పనిదినాలు పూర్తయ్యాక మరొకరి కార్డుపై పనిచేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నిజమైన కార్డుదారునికి, హరిత సైనికుడికి మధ్య డబ్బుల విషయంలో ఘర్షణలు పరిపాటి అయ్యాయి. నిజానికి ఒక సైనికుడు రోజూ 400 మొక్కలు పరిరక్షించాలి. కానీ, 800–1,000 మొక్కల పర్యవేక్షణ అతనికి అప్పగిస్తున్నారు. కూలీ మాత్రం 400 మొక్కలకే ఇస్తున్నారు. మిగిలిన మొక్కలు చూసినందుకు అదనపు డబ్బులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఉపాధి హామీ పథకం నుంచి హరితహారానికి కేటాయించిన డబ్బుల్లో రూ.2.5 కోట్లు బకాయిలు పడగా.. ఇందులో హరిత సైనికుల బకాయిలు కోటి రూపాయల వరకు ఉన్నాయి. దీంతో పలువురు హరిత సైనికులు మొక్కల సంరక్షణను పట్టించుకోవడం లేదు. ‘నీళ్లొదిలిన’ ట్యాంకర్లు హరిత సైనికుల సంగతిలా ఉంటే, జిల్లాలోని 399 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు 325 ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. నీరు పోసినందుకు మొక్కకు 96 పైసలు చొప్పున ఇస్తారు. ప్రతీ మొక్కకు వారం, లేదా 10 రోజులకోసారి 10 లీటర్ల చొప్పున నీళ్లు పెట్టాలి. ఈ లెక్కన ట్యాంకర్‌కు ప్రభుత్వం రూ.384 చొప్పున లెక్కకట్టి చెల్లిస్తోంది. ట్యాంకరు సామర్థ్యం 5 వేల లీటర్లు. మొక్కలకు నీళ్లు పెట్టడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయని, కాబట్టి ట్యాంకర్‌కు రూ.480 చొప్పున ఇస్తే తప్ప గిట్టుబాటు కాదని వీరంటున్నారు. పెరిగిన డీజిల్, డ్రైవర్, కూలీ ఖర్చులతో రూ.384కి తాము నీళ్లు పోయలేమని అంటున్నారు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే పనిచేయలేమని తేల్చి చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడుకోవడం జిల్లా యంతాంగానికి సవాల్ కానుంది. ముంచుకొస్తున్న వేసవి మూడో విడత హరితహారం కింద 2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ పరిధిలోని 105 నర్సరీల్లో 1.60 కోట్ల మొక్కలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని 43 నర్సరీల్లో 33 లక్షల టేకు మొక్కలు పెంచారు. మరికొన్ని మొక్కల్ని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రారంభంలో కురిసిన వర్షాలకు మొక్కలు నాటుకొని ఏపుగా పెరిగాయి. చలికాలంలోనూ వాటి పరిరక్షణ విజయవంతమైంది. నాటిన వాటిలో 90 శాతానికి పైగా బతికాయి. అసలైన సవాల్ ఇప్పుడే ఎదురైంది. ఒకపక్క హరిత సైనికులు, ఇంకోపక్క వాటర్ ట్యాంకర్ల యజమానుల సహాయ నిరాకరణ.. మరోపక్క ముదురుతున్న ఎండలు అధికారులను హడలెత్తిస్తున్నాయి. ఈ వేసవిలో మొక్కల సంరక్షణపై యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. పైసా ఇవ్వలేదు నన్ను హరిత సైనికునిగా నియమించి, సైకిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైసా ఇవ్వలేదు. మూడు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను రోజూ సంరక్షిస్తున్నా. మొక్కలకు దిక్కవుతున్న మాకు ఏ దిక్కూ లేకుండాపోయింది. పైసలు అసలిస్తరో యియ్యరో అర్థం కావట్లేదు. – అస్క స్వామి, హరిత సైనికుడు, మిరుదొడ్డి రెండు నెలల జీతమే వచ్చింది ఆరు నెలలుగా పనిచేస్తున్నా. రెండు నెలల జీతమే ఇచ్చిండ్రు. రోజుకు రూ.194 ఇస్తామని చెబితే సైకిల్‌పై తిరుగుతూ మొక్కలకు పాదులు తీసి నీళ్లు పోత్తన్న. ఉపాధి హామీలో వంద రోజులు నిండిపోయిన్నై. మిగతా జీతం ఎట్ల ఇత్తరో ఏమో? పనులు చేయాలని చెబుతున్నరు. పనైతే చేత్తన్న. జీతం రాకుంటే మండల ఆఫీసుల పోయి కూర్చుంట. ఈ పని చేయబట్టి మల్లా ఏ పనీ చేయరాకుండా కావట్టే. నెలనెలా జీతమిత్తె జర ఇల్లు గడుసు. – గాలిపెల్లి శంకర్, పొట్లపల్లి నీటి బిల్లులు ఇస్తలేరు ప్రతి నెలా నాలుగైదుసార్లు మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నాం. ఒక్కో ట్రిప్పునకు రూ.500 చెల్లిస్తామని సార్లు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రూ.60 వేల బిల్లయ్యింది. నాకు రూ.23 వేలు మాత్రమే చెల్లించారు. మిగిలిన పైసల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా. ఇలా అయితే నీళ్లు బంద్ చేసుడే.. – తోట భూపాల్‌రెడ్డి, హరితహారం వాటర్ ట్యాంకర్ యజమాని, మిరుదొడ్డి మొక్కల రక్షణకు ప్రణాళిక హరితహారం 3వ విడత అవెన్యూ ప్లాంట్స్ సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. హరిత సైనికుల, వాటర్ ట్యాంకర్ బకాయిలు త్వరలో చెల్లిస్తాం. పాదులు పెద్దగా ఉండటంతో నీళ్లు ఎక్కువ పడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి ట్యాంకర్ల వారికి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. – స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
‘హరీ’తహారం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అట్టహాసంగా ప్రారంభించిన హరితహారం లక్ష్యం అభాసుపాలవుతోంది.. ప్రారంభంలో మొక్కలపై ఉన్న శ్రద్ధ ప్రస్తుతం లేకపోవడంతో పెరిగిన మొక్కలు నర్సరీల్లో బిక్కుబిక్కుమంటున్నాయి. పట్టించుకునే నాథులే లేకపోవడంతో చాలామొక్కలు నర్సరీల్లోనే చనిపోతున్నాయి. గతేడాది హరితహారం కార్యక్రమం కింద ఉత్తునూర్ గ్రామంలోని ఎల్లమ్మగుడి ఆలయ ప్రాంగణంలో ఏడాది క్రితం అటవీశాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఏర్పాటు చేసిన లక్ష మొక్కలకు నీరు పట్టే వారు లేక నర్సరీలోనే ఎండిపోయాయి. నర్సరీని ఏర్పాటు చేయడానికి తీసుకున్న స్థల నిర్వహకులకు కూడా ఇప్పటికీ డబ్బులు కూడా చెల్లించలేదు. ఇవన్ని కలిపి హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్నాయి. ప్రస్తుతం సగానికి పైకా మొక్కలు చనిపోయాయి. రికార్డుల్లో ఘనం.. గ్రామాల్లో హరితహారం కింద లక్షల్లో మొక్కలు నాటినట్లు రికార్డులు సృష్టించారే తప్పా గ్రామాల్లో మొక్కలు నాటలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అడుగడుగున నిర్వీర్యం అవుతుంది. వన నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు చెట్లుగా మారుతున్నా. పట్టింపు లేదు. అధికారుల నిర్లక్షం కూడా తోడవుతుంది. దీనంతటికి కారణం క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోక పోవడం, ఏర్పాటు చేసిన నర్సరీలపై కనీసం దృష్టి సారించక పోవడంతో హరిత లక్ష్యం హరీమంటుంది. గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలని విధించిన నిబంధన ఏ మాత్రం ప్రయోజనం లేకుండా ఉందని తెలుస్తోంది. మొక్కల సంరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పథకం అభాసుపాలవుతుంది. పథకం అమలులో సరైనా ప్రణాళిక లేకపోవడంతో హరితహారం పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి హరితహారం పథకాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలను వృథా చేశారు.. గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన లక్ష మొక్కలను వృథా చేశారు. ఎండిపోయిన మొ క్కలను అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తయారైంది. – వెంకట్రావ్, ఉత్తునూర్ ఎండబెట్టారు హరితహారంలో నాటాల్సిన మొక్కలను ఎండబెట్టారు. దీంతో ప్రభుత లక్ష్యం నీరుగారింది. నర్సరీని ఏర్పాటు చేసిన అధికారులు నర్సరీపై దృష్టి పెట్టకపోవడంతో మొక్కలు ఎండుముఖం పట్టాయి. అధికారులు దృష్టి సారించి పథకాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. – రాజు, ఉత్తునూర్ -
పూలవనం.. పాఠశాల ప్రాంగణం..
ఆ పాఠశాల ఒక నందనవనం. రకరకాల మొక్కలు ఆ చదువుల గుడికి అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. బడి ఆవరణలో అడుగుపెడితే చాలు ఆహ్లాదకరమైన వాతారణం స్ఫురిస్తోంది. అదే మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల. దీనంతటికి ఉపాధ్యాయులు ప్రోత్సాహం.. విద్యార్థుల శ్రమ తోడై పూల మొక్కలు పాఠశాలకు పచ్చని పందిరి వేశాయి. కెరమెరి : మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలల ప్రాంగాణాన్ని పూలవనంలా మార్చేశారు. దీంతో ఆ పాఠశాలలు పచ్చని వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జెడ్పీఎస్‌ఎస్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు 172 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 50 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల కృషి ఫలితమే.. సిబ్బందితో పాటు విద్యార్థులకు పూల మొక్కలను పెంచాలనే ఆతృత ఎక్కువగా ఉండడంతో నేడు పాఠశాల ప్రాంగణాలు పూల వనాలుగా మారాయి. బంతి, చేమంతి తదితర పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉన్నత పాఠశాలలో విద్యుత్ బోరు ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులే మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంగాణంలోని చేతిపుంపు నీటని ఆ పాఠశాల చిన్నారులు పూల మొక్కలకు పోస్తూ వాటిని రక్షించుకుంటున్నారు. టేకు, నీలగిరి చెట్లు కూడా.. ఒక్క పూల మొక్కలే కాదు నీలగిరి, టేకు, జామ, వేప చెట్లు కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం ఆ చెట్లు పాఠశాలలకు శోభనిస్తున్నాయి. వేసవిలో చల్లటి గాలి వీస్తున్నప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిదని విద్యార్థులు చెబుతున్నారు. సొంత ఖర్చులతో.. ప్రభుత్వం ఈ పాఠశాలలకు కంచెల నిర్మాణం చేపట్టక పోవడంతో ఉపాధ్యాయులే సొంత ఖర్చుతోనే పూలు, ఇతర మొక్కల రక్షణçకు కంచెలు ఏర్పాటు చేశారు. గతంలో ‘ఉపాధి’ అధికారులు మొక్కలకు ట్రీ గార్డులు ఇస్తారని ప్రచారం చేసినప్పటికీ పంపిణీ జరగలేదు. గతేడాది ప్రహరీలు మంజూరవుతాయని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీలు కార్యరూపం దాల్చలేదు. -
హెవీ వాటర్ ప్లాంట్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి
సాక్షి, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని సీనియర్ టెక్నీషియన్ వేల్పుల వెంకటరమణ(34) అనే కార్మికుడిగా గుర్తించారు. ఇతనిది అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం. మృతదేహాన్ని హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్యాస్ లీకేజీ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించిన వివరాలు తెలిపేందుకు ప్లాంట్ అధికారులు నిరాకరిస్తున్నారు. -
మొక్కనైనా కాకపోతిని
మొక్కల్తో పెనవేసుకున్న బంధం ఆమెను కదలనివ్వడం లేదు. కానీ భర్త రిటైర్ అయితే క్వార్టర్స్‌ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి! తప్పదు. పుణెలోని ‘మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ క్యాంపస్. అందులో ఓ విశాలమైన ఇల్లు. ఇంటి వెనుక అంతకంటే విశాలమైన తోట. ఆ తోటలో వందల యేళ్ల నాటి మహావృక్షాలు. వాటిల్లో ఒక మర్రి చెట్టు కొమ్మలకు, ఊడలతో పాటుగా ఒక ఊయల కూడా వేలాడుతుంటుంది. రోజూ ఉదయాన్నే 97 ఏళ్ల పెద్దాయన ఆ ఊయలలో కూర్చుని పేపర్ చదువుకుంటారు. సూర్య కిరణాలు ఒంటిని తాకింది ఇక చాలనిపించే వరకు అక్కడే కూర్చుని, కూతురు పెంచిన తోటను మురిపెంగా చూసుకుంటారు. ఆ పక్కనే మరో మర్రి చెట్టు చుట్టూ నేలపై వంద అడుగుల మేర రాళ్లు పరిచి, తొమ్మిది సిమెంట్ స్టూళ్లు వేసి ఉంటాయి. సాయంత్రం ఇరుగుపొరుగు క్వార్టర్ల వాళ్లు వచ్చి అక్కడ కూర్చుంటారు. గార్డెన్లో పెరిగిన క్రోటన్స్, గులాబీలు, వంకాయలు, టమాటాలు, బ్రోకలీ, కాకరకాయ తీగలు, గుమ్మడి పాదు, పాలకూర మడి, క్యాలిఫ్లవర్ తోపాటు అప్పుడెప్పుడో కాసిన నాలుగు అడుగుల సొరకాయ కూడా చర్చకు వస్తూనే ఉంటుంది. ఆవు పేడ, టీ డికాక్షన్‌తో పెరిగిన ఆర్గానిక్ గార్డెన్ అది. ఇవన్నీ.. 60 ఏళ్ల మంజు బెహెన్ చేతితో పెరిగిన తోట విశేషాలు. క్యాంపస్‌లో మంజు బెహెన్ భర్తకు కేటాయించిన క్వార్టర్ చుట్టూ ఉన్న 15 వందల చదరపు అడుగుల నేలలో ఒక్క అడుగును కూడా వృథాగా వదల్లేదామె. మర్రిచెట్ల నీడన మరే మొక్కా మొలవదు కదాని మర్రి చెట్లనూ వదల్లేదు. చెట్ల నీడను సిట్టింగ్ ఏరియాగా మలిచింది. మంజు బెహెన్‌ది ఎం.పి.లోని జబల్పూర్. తొమ్మిదేళ్ల వయసులో తల్లి ఆమెకు రోజూ రెండు పూటలా మొక్కలకు నీరు పోసే బాధ్యత అప్పగించింది. అలా మొదలైన అలవాటు ఆమెకు ఆరు పదులు నిండుతున్నా కొనసాగుతూనే ఉంది. ‘మొక్కకు నీరు పోయని రోజు ఒక్కటీ లేదు’ నా జీవితంలో అంటోందామె. అంత చక్కగా గార్డెన్ పెరిగితే పక్షులు ఊరుకుంటాయా? చిలుకలు ఆకుల్లో కలిసి తొంగి చూస్తుంటాయి. ఉడుతలు కిచకిచమంటూ కొమ్మల మధ్య విహరిస్తుంటాయి. ‘పిల్లి, ఉడుత కలిసి పెరిగేది నా తోటలోనే’ అంటుంది మంజు బెహెన్ గర్వంగా. ఆమె ఇరుగుపొరుగు వాళ్లు బయటి ఊళ్లకు వెళ్లేటప్పుడు వాళ్ల పెంపుడు కుక్కలు, పిల్లుల్ని ఈ తోటలోనే వదిలిపెడతారు. ‘మా నాన్నకు, కూతురు, కోడలు, కొడుకు, మనుమలు, మనుమరాళ్లకు తోటలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన ప్లేస్ ఉంది. ఇప్పుడు నా భర్త రిటైర్ అయితే క్వార్టర్‌ను ఖాళీ చేయాలి. ఈ తోటను వదిలి వెళ్లక తప్పదు’ అంటోంది మంజు బెహెన్. అదే ఇప్పుడామె బెంగ. -
మొక్కల దాహం చెప్పేస్తాయి...
మొక్కలు ఏపుగా పెరిగి మోపెడంత పంట ఇవ్వాలంటే నీరు బాగా అవసరం. మరి ఇదే నీరు మోతాదుకు మించి అందితే.. మొక్కలు కుళ్లిపోతాయి. లేదంటే నీరు వథా అవుతుంది. రెండింటితోనూ నష్టమే కదా.. అందుకే అయోవా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మొక్కల నీటి అవసరాలను సులువుగా గుర్తించేందుకు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. చిన్నసైజు పట్టీల్లా ఉండే గ్రాఫీన్ పొరలను మొక్కల ఆకులపై అతికిస్తే చాలు.. ఎప్పుడు నీరు పట్టాలో ఇట్టే తెలిసిపోతుంది. గ్రాఫీన్లోని కర్బన అణువులు ఒక నిర్దిష్ట పద్ధతిలో అమరి ఉంటాయి. పైగా ఇది విద్యుత్తు ప్రసారానికి బాగా సహకరిస్తుంది. ఈ లక్షణాలను ఉపయోగించుకుని లియాంగ్ డాంగ్ అనే శాస్త్రవేత్త వీటిని గ్రాఫీన్‌ను తేమను గుర్తించే సెన్సర్‌గా మార్చేశారు. అతి చౌకగా, సులువుగానూ ఉత్పత్తి చేసుకోగల ఈ సెన్సర్లు మొక్కల ఆకుల నుంచి వెలువడే నీటి ఆవిరిలో వచ్చే తేడాలను గుర్తిస్తాయి. ఇందులో వచ్చే మార్పుల ఆధారంగా మొక్కకు నీటి అవసరం ఎప్పుడు ఉంటుందో గుర్తించవచ్చు. తాము ఈ పద్ధతిని ఇప్పటికే కొన్ని మొక్కజొన్న పంటల్లో వాడి మంచి ఫలితాలు సాధించామని డాంగ్ తెలిపారు. ఈ సెన్సర్లు చాలా పలుచగా, చిన్నగా ఉండటం వల్ల మొక్కల సాధారణ ఎదుగుదలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని అంచనా. పొలంలో అక్కడక్కడా కొన్ని మొక్కలకు ఈ సెన్సర్లను అతికిస్తే పంటలకు ఎప్పుడు నీళ్లు పట్టాలో తెలుస్తుందన్నమాట! -
గంగా నది ప్రక్షాళనకు కొత్త మార్గం
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ సష్టం చేశారు. ఆ దిశగా పురోహితులు, అర్చకులు, హిందూ ఆధ్యాత్మిక నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంగా నది కలుష్యానికి కారణమవుతున్న హిందువుల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు. గంగా నదిలో అస్థికలు కలపడం అనేది ప్రతి హిందువు ఒక నమ్మకంగా భావిస్తారు. నది కాలుష్యానికి ఇదొక ప్రధాన కారణం. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు.. అస్థికలను నదీపరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి.. దానిపై ఒక మొక్క నాటాలని ఆయన అన్నారు. ఈ పనిచేయడం వల్ల కాలష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు. అస్థికలను గంగలో కలపడం అనేది ఒక అత్యున్నత విశ్వాసమే.. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత తరాలకు గంగమ్మను పవిత్రంగా అందించాలంటే ఇలా చేయడం తప్పదని ఆయన అన్నారు. విశ్వాసాల మేరకు.. చాలా తక్కువ మోతాదులో అస్థికలను గంగలో కలిపి.. మిగిలిన దానిని పూడ్చి దానిపై మొక్క నాటితే మంచిదని ఆయన తెలిపారు. ఈ దిశగా అర్చకులు, పూజారులు, హిందూ ధార్మిక నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. -
ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు: వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రపంచ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరర్ , తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ భారీ ప్రణాళికలతో దూసకువస్తోంది. భారత్‌లో తాజాగా రూ. 6 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రడీ అవుతోంది. ఆపిల్ లాంటి దిగ్గజ సంస్థలకు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థ దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని సెజ్‌లో ఒక ప్లాంట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తోంది. తద్వారా వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. తాజా సమాచారం ప్రకారం ఐ ఫోన్‌కు అతి పెద్ద సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్ ముంబైలోని జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్లాంట్‌ను నిర్మించేందుకు యోచిస్తోంది. దీని ద్వారా దాదాపు 40వేలమంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అంచనా. మరోవైపు ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఫాక్స్‌కాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. జనహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సెజ్‌కోసం దాదాపు 20, 30 కంపెనీలు ఇప్పటికే సంప్రదించాయని, దీని ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను అంచనా వేస్తున్నామని గడ్కరీ తెలిపారు. కాగా చైనాకు సమాంతరంగా భారత్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందించాలనే యోచనలో భాగంగా ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ సెజ్‌లో ఐదు ప్లాంట్లు నిర్మించింది. ప్రస్తుతం భారత్‌లో ఫాక్స్‌కాన్ సంవత్సరానికి దాదాపు 15 మిలియన్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇన్ఫోకస్, ఒప్పో, షావోమీ, నోకియా, జియోనీ తదితర కంపెనీలకు భారత్‌లోని ప్లాంట్లలో ఫాక్స్‌కాన్ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. -
కదంబ వృక్షం
కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. ఇది ఆకు రాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. -
డెట్రాయిట్లో ఎం అండ్ ఎం తొలి ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ అమెరికా ఇ-వెహికల్ మార్కెట్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో అక్కడొక నిర్మాణ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.ప్రపంచ ఆటోమొబైల్ డెట్రాయిట్లో భారీ పెట్టుబడితో తొలి ఉద్పాదక ప్లాంట్‌ను తెరిచింది. తద్వారా 25 సంవత్సరాల్లో తొలి ఆటోమోటివ్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని నెలకొల్పింది. అంతేకాదు ఈ ప్లాంట్ద్వారా అక్కడ 250 ఉద్యోగాలను కూడా సంస్థ కల్పించనుంది. ఎం అండ్ఎం అమెరికా ఎలక్ట్రానిక్ వాహనాల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డెట్రాయిట్లో 230 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక ప్లాంటును నిర్మించింది. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటానమస్ ట్రాక్టర్లు, కార్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఎం అండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. వాహనాల అమ్మకాలను ప్రారంభించడానికి ఇదే సరైన సమమని ఛైర్మన్ తెలిపారు. 2020 నాటికి, కంపెనీ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని, మరో 400 ఉద్యోగాలు సృష్టించాలని కంపెనీ భావిస్తున్నట్టు చెప్పారు. -
ప్రకృతి ఒడిలో పెళ్లి!
హంగుఆర్భాటాలను ఇష్టపడేవాళ్లు ఫంక్షన్ హాళ్లలో.. భాజాభజంత్రీల మధ్య ఘనంగా పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు ప్రకృతిని ఇష్టపడేవాళ్లు ప్రకృతి ఒడిలో కాకుండా వేరే చోట పెళ్లెలా చేసుకుంటారు...? అంటూ ప్రశ్నిస్తున్నాడు అరవింద్. అయితే అరవింద్ ఇలా ప్రశ్నించడాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అతని ‘మొక్క’వోని దీక్ష చూసి ముచ్చట పడుతున్నారు. ఇంతకీ అరవింద్ ఏం చేశాడో తెలుసా.. సేలం: నేచర్ లవర్స్ అయిన ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకొని వార్తల్లోకెక్కింది. సరస్సు మధ్యలో తాము స్వయంగా ఏర్పాటుచేసుకున్న ఓ చిన్న లంకలో పెళ్లి చేసుకొని అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరిద్దరి పెళ్లి ప్రత్యేకంగా జరగడానికి ఓ కారణముంది. అదేంటంటే.. ఇద్దరూ ప్రకృతి ప్రేమికులే! పెళ్లి తర్వాత కూడా దంపతులిద్దరూ కలిసి మొక్కలను నాటారు. పెళ్లికి వచ్చిన వారితోనూ మొక్కలు నాటించారు. ఆ జంటే తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన పూవిళీ, అరవింద్. ధర్మపురికి చెందిన పూవిళికి చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టం. ఏ మాత్రం అవకాశం వచ్చినా పచ్చని మొక్కల మధ్యే కాలక్షేపం చేసేది. ఆమెకు కొన్నాళ్లక్రితం అరవింద్ పరిచయమయ్యాడు. అతను పెద్దగా చదువుకోలేదు. కానీ సేలంలో 53 ఎకరాల మూకనేరి సరస్సును స్థానికులు కలుషితం చేస్తుంటే మరికొందరి యువకులతో కలిసి అడ్డుపడేవాడు. వీళ్లంతా కలిసి శుభ్రం చేస్తున్నా గ్రామస్థుల్లో మార్పు రాకపోవడంతో 2010 నుంచి ఈ సరస్సులో అక్కడక్కడా చిన్నచిన్న మట్టిలంకలను ఏర్పాటు చేసి మొక్కలను నాటడం ప్రారంభించాడు. ఈ ఆరేళ్లలో 46 దీవులను తయారుచేశాడు. ఇప్పటివరకూ ఆ దీవుల్లో 12 వేల మొక్కలు నాటారు. ఆ క్రమంలోనే పూవిళి, అరవింద్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఆ సరస్సు మధ్యలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సేలంలోని మూకనేరి సరస్సులో 47వ దీవిని రూపొందించి అందులోనే ఇద్దరూ ఒకటయ్యారు. తరవాత ఇద్దరూ మొక్కను నాటడమే కాదు, వాళ్లకు కానుకలుగా వచ్చిన ఎనభై రెండు వేల రూపాయల్ని ముకనేరి సరస్సు పరిరక్షణకు అందించారు. దాంతోపాటూ మరో వెయ్యి మొక్కల్ని నాటేందుకు సిద్ధమయ్యారు. అంతేనా.. పెళ్లికి వచ్చిన ప్రతి అతిథితోనూ తలా ఓ మొక్క నాటించారు. పెళ్లంతా అయ్యాక గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. -
చూచెద"రెమ్మ"!.. వింత
తెల్లగులాబీ శాంతికి, సమైక్యతకు చిహ్నం. ఈ పూవును ఒకదానిని చూస్తేనే మనసు పులకిస్తుంది. అలాంటిది ఒకేసారి మూడు పూలు.. అదీ ఒకే రెమ్మకు పూస్తే.. వాటిని చూసిన కనులకు పండగ కాదా.. మనసు పరవళ్లు తొక్కదా.. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని పఠాన్ అజ్గర్ వలీ(నన్నా) ఇంటి పెరట్లోని చెట్టుకు గులాబీ పూలు విరగబూశాయి. వీటిలో ఒకే రెమ్మకు మూడు తెల్ల గులాబీలు ఉన్నాయి. ఇవి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అన్నట్టు అజ్గర్ వలీ దంపతులకు ముగ్గురు కవల పిల్లలు(ట్రిప్లేట్స్). ఈ నేపథ్యంలో ఒకే రెమ్మకు మూడు గులాబీలు పూయడం విశేషం. – జంగారెడ్డిగూడెం రూరల్ -
లైసెన్స్ కావాలా...మొక్క నాటండి
♦ కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌కు రెండు మొక్కలు.. ♦ ఆర్టీఏ వినూత్న ప్రచారం ♦ హరితహారానికి ఊతం సాక్షి, సిటీబ్యూరో : డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల్లో హరితస్ఫూర్తిని నింపేందుకు ఆర్టీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వాహనదారుడు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనే సమయంలో తప్పనిసరిగా ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని, వాహనదారుడిగా తమ అనుభవంతో పాటే మొక్క కూడా పెరిగి పెద్దదవుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తుగా ఉండిపోతుందని ఆర్టీఏ ప్రచారం చేపట్టింది. అలాగే ‘కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రెండు మొక్కలు నాటండి. కొత్త వాహనం కొనుగోలు చేసిన మీ సంతోషం రెట్టింపవుతుంది.’ అని పేర్కొంటూ పోస్టర్లు, రేడియం స్టిక్కర్లను రవాణా అధికారులు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్కూల్ పిల్లలు తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలనే సందేశాన్నిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ నేతృత్వంలో మెహదీపట్నంలోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం–2లో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్, ఎంవీఐ టీవీ రావు, టీఎన్జీవోస్ తెలంగాణ రవాణా ఉద్యోగుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్ధులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్ధి తన పుట్టిన రోజు కానుకగా ఒక మొక్కను నాటాలని ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. హరిత హారంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టిన ఆర్టీఏ కృషిని ఆమె అభినందించారు. ఆర్టీఏ రూపొందించిన రేడియం స్టిక్కర్లు, ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. -
సీఎం నాటిన మొక్క ఎండింది!
కరీంనగర్ క్రైం: మూడో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యామ్ సమీపంలో సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండిన ఘటనలో 8 మందిపై కేసు నమోదైంది. గత జూలై 12న సీఎం హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా ‘మహగని’ మొక్క నాటారు. అçప్పటి నుంచి ఈ మొక్క సంరక్షణ బాధ్యతలను కరీంనగర్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుడు కొండ్ర సురేశ్ చూస్తున్నారు. ఈ నెల 9న రాత్రి మొక్కను పరిశీలించేందుకు సురేశ్ వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కతోపాటు కంచెను తీసేందుకు యత్నిస్తున్నారు. సురేశ్ వారించడంతో చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. తిరిగి శనివారం ఉదయం చూడగా మొక్క ఎండిపోయి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కను పీకడం వల్లే ఎండిపోయిందని, అడ్డుకున్నందుకు తనను చంపుతామని బెదరించారని సురేశ్ కరీంనగర్ టూటౌన్లో ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదుతో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
కాదేది వ్యర్థం..!
♦ దేశంలోనే మొదటగా నరసాపురంలో మలవ్యర్థ శుద్ధి కేంద్రం ♦ రూ 1.20 కోట్ల బిల్‌గేట్స్ ఫౌండేషన్ నిధులతో నిర్మాణం ♦ అమెరికా టెక్నాలజీతో నిర్వహణ ♦ అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ప్లాంట్ నరసాపురం : దేశంలోనే మొదటిగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నరసాపురంలో మల వ్యర్థ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛాంధ్రమిషన్ పర్యవేక్షణలో వినియోగంలోకి రానున్న ఈ ప్లాంట్‌కు శానిటేషన్ రీసోర్స్పార్కుగా నామకరణం చేశారు. అక్టోబర్ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మీ సెప్టిక్‌ట్యాంక్ నిండిందా అంటూ.. ఇళ్ల వద్దకు వచ్చి మలాన్ని తీసుకెళ్లే వారు. ఆ వ్యర్థాలను ఎవరూ చూడకుండా నదులు, కాలువల్లో కలిపేస్తున్నారు. దీంతో జలకాలుష్యం ప్రమాదస్థాయికి చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ముప్పును తప్పించడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, కేంద్రప్రభుత్వ స్వచ్ఛ భారత్ సంకల్ప్ సంకల్పించాయి. ఈ క్రమంలో మలవ్యర్థాలను శుద్ధి చేయడంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మలవ్యర్థం మొత్తం కార్బన్శాతం అత్యధికంగా ఉండే ఎరువుగా మారబోతుంది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక అమెరికాలోని బిల్‌గేట్స్ సేవాసంస్థకు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మనదేశంలో మోడల్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించి జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు మునిసిపాలిటీల్లో ప్లాంట్స్ నెలకొల్పాలని నిర్ణయించారు. అయితే పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో స్థల సేకరణ జరగకపోవడంతో నరసాపురంలో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. బిల్‌గేట్స్ ఫౌండేషన్ ప్లాంట్ నిర్మాణానికి 1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. స్వచ్ఛాంధ్ర మిషన్ పర్యవేక్షణలో పట్టణంలోని 15వ వార్డు గోదావరిగట్టున గత మే నెల 24వ తేదీన ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఇటువంటి ప్లాంట్ అమెరికాలోనే ఉంది. ఆ తరహాలోనే ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలో ప్లాంట్‌ను వినియోగంలోకి తెస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ ఫౌండేషన్ వారు ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతను బెంగళూరుకు చెందిన టైడ్ టెక్నో క్రాప్ట్స్ ప్రైయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పగించారు. అంతేకాకుండా ప్లాంట్ నిర్వహణలో పలు అంతర్జాతీయ సేవాసంస్థలను భాగస్వాములను చేశారు. 15 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్‌లో మొత్తం నలుగురు పని చేస్తారు. ఎకరం స్థలంలో ప్లాంట్ నిర్మిస్తారు. 30 సెంట్ల స్థలంలో ప్లాంట్, మిగిలిన 70 సెంట్లలో పార్కును అభివృద్ధి చేస్తారు. ప్లాంట్‌కు రోడ్డు సౌకర్యం, మంచినీరు, విద్యుత్ సదుపాయం మాత్రమే మునిసిపాలిటీ అందించాల్సి ఉంటుంది. మిగిలిన నిర్వహణ అంతా టైడ్ టెక్నోక్రాప్ట్స్ సంస్థ ప్రతినిధులు చూసుకుంటారు. ఇలా పని చేస్తుంది సెప్టిక్‌ట్యాంకు నుంచి సేకరించి తీసుకొచ్చిన ఘన, ద్రవ వ్యర్థాలను ప్లాంట్‌లో దశలవారీగా శుభ్రం చేస్తారు. మొత్తం ప్రక్రియ 5 గంటల్లో పూర్తవుతుంది. ద్రవరూపంలో ఉండే మురుగు శుభ్రమైన నీరుగా మారుతుంది. ఘనరూపంలో ఉండే మలవ్యర్థాన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ప్లాంట్‌లో వేడి చేయడం ద్వారా వాటిలో ఉండే మలినాలు నాశనమవుతాయి. వివిధ ప్రక్రియల్లో శుభ్రం చేయడం ద్వారా తెల్లని పొడి రూపంలో ఉండే ఎరువుగా బయటకు వస్తుంది. శానిటేషన్‌లో ఇదో విప్లవం శానిటేషన్‌లో ఇదో విప్లవం. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లోనూ ఇటువంటి ప్లాంటులు నిర్మిస్తాం. ఇందులో తయారయ్యే ఎరువు మామూలు రసాయన ఎరువులు కంటే మంచిది. పాలకొల్లు, కొవ్వూరుల్లో కూడా ప్లాంటు ఏర్పాటుకు స్థలాలు దొరికాయి. మునిసిపాలిటీలకు ఖర్చు ఉండదు. –డాక్టర్ సీఎల్ వెంకటరావు, స్వచ్ఛాంధ్రమిషన్, ఏపీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మా పట్టణానికే గర్వకారణం బృహత్తర ప్రాజెక్ట్ దేశంలోనే ప్రయోగాత్మకంగా నరసాపురం పట్టణంలో పెట్టడం గర్వకారణం. ఇప్పటి వరకూ మలవ్యర్థాలను దొంగచాటుగా గోదావరిలో కలిపేస్తున్నారు. నది కలుషితం అవుతోంది. ఇక ఆ సమస్య ఉండదు –పి.రత్నమాల, మునిసిపల్ చైర్పర్సన్ చేతితో ముట్టుకునే పనిలేదు ప్లాంట్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణమవుతుంది. ప్లాంట్‌లో కేవలం నలుగురు సిబ్బంది ఉంటారు. మలవ్యర్థాన్ని చేతితో ముట్టుకునే పని ఉండదు. అంతా మిషన్ల ద్వారానే జరుగుతుంది. అసలు చుట్టు పక్కల వారికి కాలుష్యం అనే సమస్య ఉండదు. పైపెచ్చు ఇక్కడ తయారయ్యే ఎరువుతో పక్కన పార్కులో వివిధ రకాల మొక్కలు పెంచుతాం. పాలకొల్లు, కొవ్వూరు పట్టణాల్లో కూడా త్వరలో పనులు చేపడతాం. –పి.లక్ష్మీప్రసన్న, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అర్బన్ ప్లానర్ -
రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్‌సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
సుజలం.. నిష్పలం!
1003 - పంచాయతీలు 3,312 - గ్రామాలు 39 - ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు సమస్యలు: నిర్వహణ, బోర్లు ఎండిపోవడం, విద్యుత్ ప్రభుత్వ హామీ : ప్రతి గ్రామంలో ఒక వాటర్‌ప్లాంట్ ఇది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామంలో ఒక శుద్ధ నీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే భాగ్యంగా మారింది. ఈ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. ఆయన మాత్రం సినిమాలకే పరిమితం కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రామాల్లో వేలల్లో ఉండగా.. ప్లాంట్లు యాభై కూడా దాటని పరిస్థితి. ఇవి కూడా సక్రమంగా పని చేయకపోవడంతో ప్రజలకు ‘పానీ’పట్టు యుద్ధం తప్పడం లేదు. మామూలు నీళ్లిస్తే చాలు ఎన్నికల సమయంలో అన్ని పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అయితే లేపాక్షిలో మత్రమే ప్లాంట్ ఏర్పాటయింది. అక్కడ కూడా నీటి సరఫరా అరకొరగానే ఉంటోంది. ప్రైవేటు వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి బిందె నీరు రూ.10, క్యాన్ రూ. 15లతో కొంటున్నాం. మినరల్ వాటర్ కాకపోయినా.. మామూలు నీళ్లిస్తే చాలు. - హనుమంతు, లేపాక్షి -
మొక్కల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి
కరీంనగర్ క్రైం: మొక్కల రక్షణకు ప్రాధాన్యతమివ్వాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ పీటీసీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని లక్ష మొక్కలను నాటే లక్ష్యం పూర్తికావచ్చిందన్నారు. ప్రతి పౌరుడు తమ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలను నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు సామాజిక భాద్యతగా గుర్తించి హరితహరం కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నాటుతున్న ప్రతి మొక్క రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రహరీ ఉన్న ప్రాంతాల్లో మొక్కలను రక్షించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శశాంక, డీఎఫ్‌వో శ్రీనివాస్, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రాంరెడ్డి, డీఎస్పీలు భీంరావ్, లక్ష్మినారాయణ, సీఎల్‌ఐలు కమలాకర్, చంద్రయ్య, నవీన్, రమణబాబు, ఆర్ఐలు నర్సయ్య, నవీన్, ఇన్స్పెక్టర్లు మహేశ్‌గౌడ్, రంగయ్య, ఇండోర్, అవుట్డోర్ విభాగాలకు చెందని పోలీసులు పాల్గొన్నారు. హరితహారం వేగం పెంచాలి కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంలో వేగాన్ని పెంచి జిల్లా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాలకు నిర్ణయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటుటకు అంచనాలు తయారు చేయాలని, నాటిన మొక్కలకు వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంత వరకు నాటిన మొక్కలన్నింటికి వారంరోజుల్లో జియోట్యాగింగ్ పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో రైల్వేలైన్, పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామాలలో ఉన్న మట్టిరోడ్లు, కెనాల్ రోడ్లు, ఒర్రెలు, వాగులు, మానేరు నది వెంబడి ఎన్ని మొక్కలు నాటుతారో అంచనాలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో 51 మంది గ్రీన్ బ్రిగ్రేడియర్లను నియమించాలని అన్నారు. అందులో మహిళలు, అన్ని కులాలకు చెందిన వారు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని వారికి ఎంపీడీఓలు ఉత్తర్వులు జారీ చేయాలని, వారం రోజుల్లో వారి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గ్రీన్ బ్రిగేడియర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మూడవ విడత హరితహారంలో నాటిన మొక్కలకు వరుసగా ఏడురోజులు వర్షాలు లేకుంటే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, అందుకు రవాణా చార్జీలు చెల్లిస్తామని తెలిపారు. ఇళ్లలో మహిళలకు కావాల్సిన పూలు, పండ్ల మొక్కలు ఎన్ని కావాల్సినా తెప్పించి ఇస్తామని, వాటిని ప్రజల భాగస్వామ్యంతో నాటించి రక్షించే ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల పొలాల గట్లపైన నాటుకునేందుకు మొక్కలు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్‌ఖానమ్, అటవీ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీధర్, సీపీవో సుబ్బారావు, డీపీఓ నారాయణరావు, హర్టికల్చర్ ఏడీ శ్రీనివాస్, డీఈవో రాజీవ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెప్మా పీడీ పవన్‌కుమార్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
95 వేల మొక్కలు నాటాం..
► 50 వేల పండ్లు, పూల మొక్కల పంపిణీ చేపడతాం ► మొక్కలు, ట్రీగార్డులు ఎత్తుకెళితే కఠిన చర్యలు ► నగర పాలక కమిషనర్ కె.శశాంక కరీంనగర్‌కార్పొరేషన్: తెలంగాణకు హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇప్పటివరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 350 లొకేషన్లలో 95 వేల మొక్కలు నాటినట్లు నగరపాలక కమిషనర్ కె.శశాంక వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 66 వేల మొక్కలను మున్సిపల్ తరఫున నాటగా, 28 వేల మొక్కలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నాటామని వివరించారు. ఇందులో 15 వేల మొక్కలు మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లోనే నాటామన్నారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మొక్కలకు నీటి సరఫరా చేసేందుకు మున్సి పల్కు చెందిన 4 ట్యాంకర్లను వాడుతున్నామన్నారు. మరో 5 ట్యాంకర్లను అద్దెకు తీసుకొని సెగ్మెంట్‌కు ఒకటి అందుబాటులో ఉంచుతామన్నారు. మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లోని మొ క్కలను కాపాడేందుకు ఫెన్సింగ్ వేయడంతోపాటు నీటి సరఫరా కోసం బోర్వెల్ ఏర్పాటు చేసి డ్రిప్ పద్ధతిన నీరందిస్తామన్నారు. డి విజన్లలోని ఇళ్ల పరిసరాల్లో నాటిన మొక్కలను కాపాడేందుకు స్థానిక ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఇప్పటివరకు 35 వేల హెచ్డీపీఈ ట్రీగార్డులు తెప్పించి 28 వేలు వాడామన్నారు. అవసరమైతే మరిన్ని ట్రీగార్డులు తెప్పిస్తామన్నారు. రెండు రోజు ల్లో 50 వేల పూల, పండ్ల మొక్కలు వస్తాయని వా టిని ఇళ్లలో పంచుతామన్నారు. ఎండిపోయిన, తొలగించిన స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామన్నారు. డివైడర్లలో ఏర్పాటు చేసిన మొక్కలు, కొన్ని ప్రాంతాల్లో ట్రీగార్డులు ఎత్తుకెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో హరితహారం ప్రత్యేకాధికారి ఆంజనేయులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఇప్పటికి 31 శాతం వరినాట్లు
-నెలాఖరుకల్లా పూర్తిచేయాలి -వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్ కరప(కాకినాడ రూరల్) : జిల్లాలో ఇంతవరకు 31 శాతం మేర ఖరీఫ్ వరినాట్లు పడ్డాయని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జేవీఎస్ ప్రసాద్ తెలిపారు. కరప మండలం వలసపాకలలో బుధవారం ఆయన డీడీఏ వీటీ రామారావుతో కలిసి వెదజల్లిన పంటపొలాలను, నారుమళ్లను పరిశీలించి, రైతులకు సూచనలుచేశారు. సార్వాలో 2.32 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయాల్సి ఉండగా 71,568 హెక్టార్లలో నాట్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. నెలాఖరుకల్లా వరినాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. ప్రత్తినాట్లు 35 శాతం వేశారన్నారు. వరిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టేందుకు నూరుశాతం రాయితీపై ఇస్తున్న జిప్సం, జింకు, బోరాన్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్దగా నష్టం జరగలేదన్నారు. వెదజల్లిన పొలాలు ముంపునకు గురైతే మళ్లల్లోంచి నీరుపోయేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా గోతుల్లో పడిన విత్తనాల మొలకశాతం దెబ్బతింటే మళ్లీ జల్లుకుంటే సరిపోతుందని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లో వరినాట్లు వేసిన పొలాలు ముంపుకు గురైతే నీరుతీసేసి, బూస్టర్ డోస్‌గా 10 కిలోల యూరియా, 15 కిలోలు పొటాష్ వేయాలన్నారు. శిలీంధ్ర, కీటకనాశిని మందులు హెక్సాకొనజోల్, కార్బండిజమ్, క్లోరిఫైరిపాస్, మోనోక్రోటోపాస్ మందులలో ఏదో ఒకటి పిచికారీ చేస్తే పంటతెగుళ్లు అదుపుచేయవచ్చన్నారు. కౌలు రైతులకు రూ.101 కోట్ల రుణాలు జిల్లాలో 1,34,777 కౌలురైతులు ఉండగా 81,820 మందికి రుణఅర్హత కార్డులు ఇచ్చి, వివిధ బ్యాంకుల ద్వారా రూ 101.73 కోట్లు పంటరుణాలు అందజేశామని ప్రసాద్ తెలిపారు. 59,600 మంది సాగురైతులకు సీఓసీ కార్డులు ఇవ్వగా రూ.58 కోట్లు రుణాలు ఇచ్చారన్నారు. రుణాలు తీసుకునే రైతులు ప్రధానమంత్రి ఫసలీ బీమా పథకం ప్రీమియం ఆగష్టు 21లోగా చెల్లించాలని, రుణాలు తీసుకోని రైతులు ఎకరానికి రూ.587 లు ప్రీమియంగా ఈనెలాఖరులోగా చెల్లించాలని సూచించారు. రైతురథంలో 680 ట్రాక్టర్లు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై ట్రాక్టర్లు ఇచ్చేందుకు రైతురథం పథకంలో జిల్లాకు 680 ట్రాక్టర్లు మంజూరయ్యాయని జేడీ తెలిపారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన ట్రాక్టర్ల కోసం జిల్లాఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఏఓ ఎ.అచ్యుతరావు, ఏఈఓలు ఎస్.సత్యనారాయణస్వామి, ఐ.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీఈఓలు కె.దివ్య, కె.సాయిశరణ్య, సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, సర్పంచ్ వాసంశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం వేళ మడమ నొప్పి!
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 35 ఏళ్లు. నా బరువు 75 కేజీలు. ఆర్నెల్ల నుంచి ఉదయం లేవగానే మడమలో విపరీతమైన నొప్పి కారణంగా నడవలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే బరువు తగ్గాలని అన్నారు. ఎక్స్–రే తీసి, ఎముక పెరిగిందని అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – మాలతి, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మడమ సమస్య. మన కాళ్లలో ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. మడమలో మేకులతో గుచ్చినట్లు, కత్తులతో పొడిచినట్లుగా ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది అరుదైన సమస్య కాదు. ప్రతి పదిమందిలో ఒకరు దీనితో బాధపడుతుంటారు. కారణాలు : ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ఎక్కువసేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యకారణం). లక్షణాలు : ∙మడమలో నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్ చికిత్స : హోమియో విధానంలో ప్లాంటార్ ఫేషిౖయెటిస్కి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో రస్టాక్, పల్సటిల్లా, బ్రయోనియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ఫిషర్ తగ్గుతుందా? నా వయసు 63 ఏళ్లు. మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. ఆపరేషన్ లేకుండా హోమియోలో దీనికి చికిత్స ఉందా? – హనుమంతరావు, కాకినాడ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం కారణంగా మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువ. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన తర్వాత మరో రెండు గంటల పాటు మలద్వారం దగ్గర నొప్పి, మంట. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ మాటిమాటికీ యూరినరీ ఇన్ఫెక్షన్... మళ్లీ రాకుండా ఉంటుందా? నా వయసు 28 ఏళ్లు. బరువు నార్మల్‌గానే ఉన్నాను.కానీ ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. డాక్టర్ని సంప్రదిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ అన్నారు. ఇది మళ్లీ రాకుండా తగ్గుతుందా?– ఒక సోదరి, ఖమ్మం మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు : మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమియో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
‘హరితహారం’పై హ్యాండ్ బుక్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మొదటివారంలో మొదలుకానున్న మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న మొక్కల వివరాలపై అటవీశాఖ ఒక హ్యాండ్ బుక్‌ను రూపొందిస్తోంది. త్వరలోనే జిల్లాల వారీగా నర్సరీ డైరెక్టరీలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విడత హరితహారం ప్రత్యేకత, ఏయే మొక్కలు ఎక్కడెక్కడ దొరుకుతాయన్న వివరాలను దీనిలో పొందుపరుస్తున్నారు. ఒక్కో జిల్లాలోని నర్సరీల వివరాలు మండలాలు, గ్రామాల వారీగా ఆయా నర్సరీల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మొక్కల వివరాలు, ఆ నర్సరీ ఏ మండలానికి, గ్రామానికి అనుసంధానం చేయబడిందన్న వివరాలు ఇందులో ఉంటాయి. దీనిని హరితహారానికి సంబంధించిన ప్రతి అధికారి వద్ద అందుబాటులో ఉంచటంతో పాటు, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మంత్రి మొదలుకుని ఎమ్మెల్యే, సర్పంచ్ దాకా ఈ పుస్తకాన్ని చేరవేయనున్నారు. మొక్కలను నాటడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంరక్షణ చర్యలు, తదితరాలను పొందుపరుస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏ జిల్లాకు ఆ జిల్లాలో నాటాల్సిన మొక్కల లక్ష్యం ఎంత, ఏ ఏ మొక్కలు ఏ నర్సరీలో ఉన్నాయి వాటి సంఖ్య లాంటి వివరాలు కూడా ఈ హ్యాండ్ బుక్ లో ఉంటాయి. ఒక్కో జిల్లాకు ఇక ప్రత్యేక బుక్ లెట్ అంటుబాటులో తెచ్చే ప్రయత్నం అటవీ శాఖ చేస్తోంది. ఆ జిల్లాకు సంబంధించిన నర్సరీలు, వాటి ఇన్చార్జీల పేరు, సెల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. -
మొక్కను ఆదర్శంగా తీసుకుందాం
ఆత్మీయం అవాంతరాలు, అడ్డంకులు ఎదురు కాని మనిషి ఉండడు. ఆ మాటకొస్తే ఇబ్బందులు ఎదుర్కొనని జీవే ఉండదు. విత్తనం ఒక జీవమున్న పదార్థం అనుకుందాం. మర్రి విత్తనం ఎంతో చిన్నది. అది మొలకెత్తి ఎన్నో ఊడలున్న పెద్ద చెట్టుగా మారుతుందని మనకు తెలుసు. అయితే అది అంత తేలికగా ఏమీ జరగడం లేదు. విత్తనం చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు... మొదట విత్తనం మట్టిలో పడగానే చీమలు, చిన్న పురుగుల వంటివి దానిని తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటుంది. ఈలోగా పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేసేందుకు ప్రయత్నిస్తాయి. వాటి బారిన పడకుండా అది ఆకులూ మారాకులూ వేస్తూ పెరుగుతూ ఉంటే, పశువులు దానిని ఫలహారం చేయబోతాయి. అయినా సరే, అది ఎదిగి కొమ్మలూ రెమ్మలూ వేస్తుంది... క్రమంగా ఊడలు పాతుకునిæ... భూమిలో బలంగా వేళ్లూనుకుంటుంది. చాలా చిత్రంగా అది చిన్న విత్తుగా భూమిలో ఉన్నప్పుడు దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. దాని మీద గూళ్లు కట్టుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా అటువంటిదే. అంత చిన్న విత్తనమే అన్ని అవరోధాలనుంచి తప్పించుకుని మొక్కగా పెరిగి మానుగా ఎదుగుతోందంటే... మనిషెలా ఉండాలి? అందుకే చిన్న చిన్న అడ్డంకులతో మన ఎదుగుదల ఆగిపోయిందని బాధపడకుండా మరింతగా పెరిగేందుకు ప్రయత్నించాలి. -
కొడుకు పుట్టిన రోజున వెయ్యి మొక్కలు
-
మొక్కలో ఊపిరి పోసుకొని...
ఓ మనిషి చనిపోయాక అతను చిహ్నంగా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి? వాళ్లకో స్మారకం కట్టాలి. అందుకు ఎంతో ఖర్చవుతుంది. ఆ అవసరం లేకుండా చనిపోయిన వ్యక్తి ఏదో రూపంలో ఓ జ్ఞాపకంగా కనిపిస్తే.. ఇదే ఇటలీకి చెందిన డిజైనర్లు రాహుల్ బ్రెడ్జెల్, అన్నా సిటెల్లీలకు వచ్చిన ఓ మంచి ఐడియా. వెంటనే వారు సేంద్రియ పదార్థాలతో కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ శవ పేటికను తయారు చేశారు. ఈ పేటికలో వ్యక్తి మృతదేహాన్ని లేదా అంత్యక్రియల అనంతరం వారి అస్థికలను పెట్టి, వాటిలో తమకిష్టమైన మొక్క విత్తనం నాటి భూమిలో పాతిపెడితే కొంత కాలానికి ఆ పేటిక నుంచి భూమిపైకి విత్తు మొలకెత్తుతుంది. అది కాస్తా మొక్కై పెరుగుతుంది. అలా మనల్ని వీడిని వ్యక్తి జ్ఞాపక చిహ్నంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. డిజైనర్లు ఇటలీ భాషలో ’క్యాప్సులా ముండీ (ప్రపంచ క్యాప్సుల్)’గా పిలుస్తున్న ఈ శవపేటికను తయారు చేయడానికి సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తారు. మానవ అస్థికలు కూడా మొక్కలకు బలాన్ని ఇస్తాయి కనుక మనం నాటే విత్తనాలు చెట్లుగా మంచిగా ఎదుగుతాయని వారు చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు శ్మశానాలను పచ్చటి వనాలుగా మారుస్తున్న నేటి కాలంలో మృతదేహాలే వృక్షాలుగా పెరగడం అద్భుతమని డిజైనర్లు అంటున్నారు. తాము అస్థికలను పెట్టి విత్తును నాటే పేటికలనే తయారు చేశామని, ఇకముందు మృతదేహాలను పెట్టే పేటికలను తయారు చేస్తామన్నారు. -
ఆక్వా ప్రకంపన
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు. ఇంటింటా ఇదే చర్చ సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. -
విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లకు కోడ్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: విత్తన ప్రాసెసింగ్ ప్లాం ట్లకు కోడ్ నంబర్లు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ వ్యవసాయశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థకు ఈ అధికారాన్ని కల్పిం చింది. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్త ర్వులో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రమా ణాలు పాటించకుండా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు నడుస్తున్నాయన్న అంశం వ్యవసా య శాఖ దృష్టికి వచ్చింది. వాటిల్లో ప్రాసెస్ అయిన విత్తనాలు నాణ్యంగా ఉండటం లేదు. పైగా రిజిస్ట్రేషన్ లేకుండానే అనేక విత్తన ప్రాసెస్ ప్లాంట్లునడుస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది వాటిని నియంత్రించేం దుకు రిజిస్ట్రేషన్, కోడ్ నంబర్ తప్పనిసరి చేస్తున్నాము’అని ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ‘సాక్షి’కి తెలిపారు. కోడ్ నంబరు ఉన్న విత్తనాన్నే కంపెనీలు రైతుల కు విక్రయించాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. -
ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు
చెరువులు ధ్వంసం మాముళ్ల మత్తులో ఇరిగేషన్ శాఖ అధికారులు ఓజిలి : స్వర్ణముఖినది పొర్లుకట్ట పేరుతో చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చెరువుల్లో అధికంగా మట్టిని ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. చెరువులు నుంచి పొర్లుకట్టలకు మట్టిని భారీగా తరలించి రూ.లక్షలు జేబులు నింపుకుంటున్నారు. ఈ మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు అలసత్వంతో జోరుగా వ్యాపారం సాగుతోంది. నాయుడుపేట, ఓజిలి మండలాల పరిధిలోని సుమారుగా 6 కిలోమీటర్లు పొర్లుకట్టలకు అధికారులు టెండర్లు నిర్వహించారు. నెల్లూరు నగరానికి చెందిన కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. జోష్యులవారి కండ్రిగ, తిమ్మాజికండ్రిగ గ్రామాల పరిదిలో మూడు కిలోమీటర్లు, కొత్తపేట, పున్నేపల్లి గ్రామాల పరిదిలో 1.50 కిలోమీటర్లు పొర్లుకట్టలను నిర్మించాల్సి ఉంది. అయితే తిమ్మాజికండ్రిగ, జోష్యులవారికండిగ పొర్లు కట్టలకు జోష్యులవారికండిగ చెరువు నుంచి 3లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారు. అలాగే పున్నేపల్లి, కొత్తపేట వద్ద పొర్లుకట్టల పనులను నెల్లూరుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ నుంచి మల్లాం గ్రామానికి చెందిన మరో నాయకుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో ఒకటన్నర కిలోమీటరుకు ఇప్పటి వరకు 50 వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వేశారు. దీంతో చెరువులో భారీగా గోతులు ఏర్పడ్డాయి. చెరువుల్లో సుమారుగా మూడు అడుగులు లోతు మాత్రమే మట్టిని తీయాలని అధికారులు నిబంధనలు ఉన్నా, కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా ఆరు అడుగుల లోతు వరకు మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల చిన్నపాటి వర్షంకు ఈ గోతులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ నీటి గుంతల్లో పశువులు, చిన్న పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాలు భారిన పడే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. -
ష్నైడర్‌కు కీలకంగా హైదరాబాద్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ పరికరాల తయారీ దిగ్గజం ష్నైడర్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంటు కీలకంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పిన ఈ ప్లాంటు నుంచి లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. గతేడాదే ప్లాంటు సామర్థ్యాన్ని రెండింతలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ష్నైడర్ తయారు చేస్తున్న పరిమాణంలో 10 శాతం హైదరాబాద్ యూనిట్ సమకూరుస్తోంది. ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్, మౌల్డెడ్ సర్క్యూట్ బ్రేకర్స్, పుష్ బటన్స్ వంటివి ఇక్కడ తయారు చేస్తున్నామని కంపెనీ ఎకో బిల్డింగ్స్ విభాగం ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెబ్బి గురువారమిక్కడ తెలిపారు. పర్యావరణ అనుకూల కాంటాక్టర్స్, లో–వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను ఇక్కడ విడుదల చేసిన సందర్భంగా ఎస్వీపీ దీపక్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొత్త ఉత్పత్తులను హైదరాబాద్ ప్లాంటులోనూ రానున్న రోజుల్లో తయారు చేస్తామన్నారు. -
ప్రియురాలిపై పగతీర్చుకోబోయి ఇరుక్కుపోయాడు
అహ్మదాబాద్: తనపై అత్యాచారం కేసు పెట్టిన ప్రియురాలిపై పగతీర్చుకునేందుకు పథకం పన్నిన ఓ ప్రియుడు.. కథం అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయాడు. ఆమెను అరెస్ట్ చేయించాలని కుట్ర పన్ని చివరకు తానే అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. వెజల్పూర్కు చెందిన దినేశ్ ప్రజాపతి అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అతను నిరాకరించాడు. పెళ్లి చేసుకోకుండా సంబంధం కొనసాగిస్తామని కోరగా, ఆమె నిరాకరించింది. ఆ యువతి దినేశ్‌పై అత్యాచారం కేసు పెట్టింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన దినేశ్.. ప్రియురాలి ఇంట్లో ఆమెకు తెలియకుండా 3 లక్షల రూపాయల విలువైన 580 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలను ఉంచాడు. తర్వాత ఇన్ఫార్మర్ పేరుతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందించాడు. అధికారులు యువతి ఇంటిని సోదా చేసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆ యువతి చెప్పింది. దినేశ్‌పై తాను అత్యాచారం కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించింది. అధికారులు ఆరా తీయగా, ఇద్దరికి రిలేషన్ ఉన్నట్టు తేలింది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని దినేశ్ ఆ యువతికి చెప్పాడు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. వివాహం చేసుకోకుండా సంబంధం కొనసాగిద్దామని అతను చెప్పగా, ఆమె అతనిపై రేప్ కేసు పెట్టింది. అధికారులు దినేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఇంట్లో రహస్యంగా మత్తుపదార్థాలు ఉంచినట్టు అంగీకరించాడు. ఎన్సీబీ అధికారులు దినేశ్‌ను అరెస్ట్ చేశారు. -
కూలీలుగా.. రాజధాని రైతులు!
-
రాజధాని కూలీలు!
సమీకరణలో భూములు కోల్పోయి కూలీలుగా రైతులు 40 వేల ఎకరాలకు పైగా బీడు పడ్డ రాజధాని భూములు ధాన్యం, కూరగాయల ఉత్పత్తీ లేదు.. రాజధాని నిర్మాణమూ లేదు ఇప్పటికే ఉపాధి కోల్పోయిన రైతులు, కూలీలు సాక్షి ప్రతినిధి/సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే భూములు నేడు పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. పదిమందికి ఉపాధినిచ్చే రైతన్న నేడు కూలీగా మారాడు. రైతు కూలీలకు పనులు దొరక్క పస్తులతో అల్లాడుతున్నారు. రాజధాని గ్రామాల్లో సంపన్న రైతులు కొందరు మినహా.. మిగిలిన వారెవరిని పలుకరించినా బతుకుపై భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో 54 వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో 27వేల ఎకరాలను సమీకరించింది. సమీకరించిన భూమిలో ఇప్పటివరకు ఒక్క ‘తాత్కాలిక సచివాలయ భవనం’ మినహా మరే నిర్మాణం చేపట్టలేదు. సమీకరించిన భూమిని వినియోగించే ప్రయత్నమే చేయకుండా, సమీకరణకు ఇవ్వని భూములను బలవంతంగా లాక్కోవడానికి ‘భూ సేకరణ’ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అటు సమీకరణలో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రైతులు, కూలీలు ఉపాధి కోసం అర్ధరాత్రి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ కొత్తగా సేకరణ అస్త్రం ప్రయోగిస్తే.. రైతులు, సమీకరణ చేయని పొలాల్లో కొంతమేర అయినా కూలీ పనులు చేసుకొని బతుకీడిస్తున్న కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందనే ఆందోళనను అధికార వర్గాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సమీకరణలో భూములు కోల్పోయి అల్లాడుతున్న రైతులు, కూలీల స్థితిగతులను తెలుసుకోవడానికి ‘సాక్షి’ ప్రతినిధుల బృందం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. వారి కన్నీటి గాథలివీ. పంటలు లేక వెలవెల... రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణానికి 54 వేల ఎకరాలు ల్యాండ్‌పూలింగ్ కింద సమీకరించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న మరో 33 వేల ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చెయ్యమని కేంద్రప్రభుత్వానికి ఇప్పటికి రెండు పర్యాయాలు లేఖ రాసింది. కేంద్రప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 54వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి 21వేల ఎకరాలు పోను రైతుల నుంచి సుమారు 33వేల ఎకరాలను సమీకరించాలని భావించింది. అయితే రైతులు ఎదురు తిరగటంతో 27వేల ఎకరాలతో సమీకరణకు బ్రేక్ పడింది. ► ‘భూ సమీకరణ’ పేరిట తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు కలిపి.. మొత్తం 40 వేల ఎకరాల్లో పంట లేకుండా బీళ్లుపడ్డాయి. ఇక్కడ 12,820 ఎకరాల్లో ధాన్యం, 11,675 ఎకరాల్లో పత్తి సాగుచేసేవారు. మిగతా భూముల్లో పూలు, కూరగాయలు, పండ్లు పండించేవారు. ఉపాధి లేదు... పింఛన్లు రావు... రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మొత్తం 22వేల మంది రైతులు ఉన్నారు. ఇందులో రెండెకరాల లోపు ఉన్న రైతులు 15వేల మంది ఉన్నారు. అదే విధంగా 22వేల కుటుంబాలకుపైగా రైతు కూలీలు జీవిస్తున్నారు. రైతు కూలీలకు ప్రతినెలా ఒక్కో కుటుంబానికి రూ.2,500 పింఛను చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పించన్లు 3, 4 నెలలకొకసారి చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల ద్వారా జరిగింది. ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకోవడంతో అనేకమంది లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ► ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ.20 లక్షలు బ్యాంకు షూరిటీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూములు తీసుకునే రోజున ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు. ► ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగం గా ప్రతి పంచాయితీకి రూ.30 లక్షలు నిధులు మంజూరు చేస్తామని భూములు తీసుకునే సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికి ఏ ఒక్క గ్రామానికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయలేదు. 3.8 కోట్ల కేజీల బియ్యం దిగుబడి కోల్పోయాం రాజధాని ప్రాంతంలో 12,820 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. సరాసరిన ఖరీఫ్‌లో ఎకరాలకు 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తాలో 58 కేజీల ధాన్యం నింపుతారు. భూమి సారవంతమైనది కావడం, సాగునీటి సమస్య లేకపోవడం వల్ల దిగుబడికి గ్యారంటీ ఉండేది. 100 కేజీల ధాన్యాన్ని మర పట్టిస్తే 68 కేజీల బియ్యం వస్తాయి. నూక, తౌడు.. ఉప ఉత్పత్తులు. ఈ లెక్కన చూస్తే.. రాజధాని ప్రాంతంలో ఏటా 3.8 కోట్ల కేజీల బియ్యం ఉత్పత్తిని కోల్పోయాం. అంటే దాదాపు 19 కోట్ల మందికి ఒక పూట భోజనానికి సరిపోయే బియ్యాన్ని ఉత్పత్తి కాకుండా.. దాదాపు అంతేమందికి ఒక పూట కూరగాయలు ఇచ్చే భూమిని రాజధాని కోసం తీసుకొని నిరుపయోగంగా వదిలిపెట్టేశారు. 19 కోట్ల మందికి ఒక పూట భోజనం పెట్టడానికి సరిపోయే బియ్యం, కూరగాయలు ఉత్పత్తి కాకుండా ఆగిపోయిన సంగతి అటుంచితే... రాజధాని నిర్మాణమైనా అడుగు ముందుకు పడిందా అంటే అదీ లేదు. అమరావతి ఇప్పుడు రెండింటికీ చెడిపోయిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ► రాజధానిలో గ్రామాలు: 29 ► రైతుకుటుంబాలు: 22 వేలు ► 2 ఎకరాల్లోపున్న కుటుంబాలు: 15 వేలు ► రైతు కూలీల కుటుంబాలు: 22 వేలు ► సమీకరించనున్న∙విస్తీర్ణం: 54 వేల ఎకరాలు ► ప్రభుత్వ భూమి: 21 వేల ఎకరాలు ► రైతుల నుంచి సమీకరించాలనుకున్న భూమి: 33 వేల ఎకరాలు ► సమీకరించిన భూమి: 27 వేల ఎకరాలు ► బలవంతంగా సేకరించాలనుకుంటున్న భూమి: 6 వేల ఎకరాలు కూలికీ దూరాభారమే రాజధాని గ్రామాల నుంచి 20–30 కిలోమీటర్లు ట్రాక్టర్ మీద తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లి సాయంత్రానికి ఇళ్లు చేరుతున్న కూలీలు ఎంతోమంది ఉన్నారు. శాఖమూరు గ్రామానికి చెందిన రైతులు, కూలీలు 30 కి.మీ దూరంలో ఉన్న రావెలకు కూలీ పనికి వెళ్లి ట్రాక్టర్ ట్రక్కులో వస్తున్న దృశ్యం సాక్షి కంట పడింది. ట్రాక్టర్లో ఉన్న ఎవరిని కదిలించినా.. ఆవేదన పెల్లుబికి వచ్చింది. అందులో ఒకరు అశోక్. ఆయన ఏమన్నారంటే.. ‘‘రోజూ వేకువ జామునే లేచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావెల చుట్టుపక్కల గ్రామాల్లో పత్తి కోత పనికి వెళ్తున్నాం. కిలో పత్తి కోస్తే రూ.8 చొప్పున చెల్లిస్తారు. వచ్చిన కూలీ డబ్బులతో రానుపోను ఆటో, భోజనం ఖర్చుపోను మిగిలింది ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. రాజధానికి భూములు తీసుకోకమునుపు శాఖమూరు గ్రామం చుట్టుపక్కలే కూలి పనులకు భార్యతో కలిసి వెళితే రోజుకు రూ. 1,300 సంపాదించేవాళ్లం. ఇప్పుడు ఇద్దరు కలిసి కూలీ పనికి వెళ్లినా రూ.500 రావటం లేదు’’. – అశోక్, శాఖమూరు కూలీలుగా మారిన రైతన్నలు.. తుళ్లూరు మండలం మోదుగు లింగాయపాలెంలో 25 మంది రైతులు, 250 మంది కూలీలు ఉన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించడంతో రైతులు జీవనాధారాన్ని కోల్పోయారు. భూములన్నీ ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికిచ్చేయడంతో సాగు నిల్చిపోయింది. చిన్న, సన్నకారు రైతులకు, కూలీలకు ఉపాధి కరువైంది. రైతులంతా కూలీలుగా మారిపోయారు. సాక్షి బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించినప్పుడు మోదుగులింగాయపాలెం రైతులు లంక పొలాల్లో కూలి చేసుకుంటూ కనిపించారు. అందులో మదిరపల్లి కన్నారావు ఒకరు. సాక్షి బృందం ఆయనను పలకరిస్తే కన్నీరుమున్నీరయ్యారు. ‘‘మా కుటుంబానికి మూడెకరాల పొలం ఉండేది. ముగ్గురు అన్నదమ్ములు ఎకరం చొప్పున పంచుకున్నాం. ముగ్గురు అన్నదమ్ములు కలసి 10 ఎకరాలు కౌలుకు తీసుకొని దొండ సాగుచేసేవాళ్లం. ప్రతిరోజూ 15 మంది కూలీలకు ఉపాధి కల్పించేవాళ్లం. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వకూడదని తొలుత అనుకున్నా... పొలంలో బొంగులు, ఇతరత్రా వాటిని తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. చేసేదిలేక ల్యాండ్‌పూలింగ్‌కు మా భూమి ఇచ్చేశాం. చేతిలో ఉన్న డబ్బుతో కొన్నాళ్లు కుటుంబాన్ని నడుపుకున్నాం. ప్రభుత్వం ఇస్తున్న కౌలు డబ్బులు ఖర్చులకు సరిపోవడం లేదు. అది కూడా ప్రతినెలా కాకుండా, మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇస్తుండటం కూడా ఇబ్బందిగా మారింది. కుటుంబ జీవనం కష్టమైంది’’ అని చెప్పారు. గత్యంతరం లేక ప్రస్తుతం లంక భూముల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నామని వాపోయారు. రోజుకు 15 మందికి ఉపాధి కల్పించే తమ కుటుంబం మొత్తం ఈ ప్రభుత్వం వల్ల కూలీలుగా మారిపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మొక్కంటే.. ‘లెక్క’లేదు..
నాటిన మొక్కలకు సంరక్షణ కరువు ఎండిపోతున్న వైనం.. రక్షణ పేరిట నిధులు దుర్వినియోగం డివైడర్ల మధ్య మళ్లీ మొక్కలు నాటేందుకు నిధులు మంచిర్యాల టౌన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం అమలుచేస్తోంది. భవిష్యత్తు సంక్షేమ దృష్ట్యా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ.. ఏం లాభం జిల్లాలకు వస్తే ఆ పరిస్థితి తారుమారు అవుతోంది. జిల్లాలో లక్షకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. గుంతలూ తవ్వారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. ఎక్కడ చూసినా మొక్కలు కనిపించడం లేదు. మొక్కల కోసం తవ్విన గుంతలు మాత్రం ఖాళీగా దర్శనమిస్తూ.. అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. కనిపించని మొదటి విడత మొక్కలు.. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో హరితహారం అపహాస్యం పాలవుతోంది. గత ఏడాది నాటిన మొక్కలు ఎండిపోయి కనిపించకుండా పోగా.. ఈ ఏడాది లక్ష్యాన్ని పెంచి ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేసినా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటినట్లు కనిపించడం లేదు. మొదటి విడతలో నాటిన మొక్కలు ఎక్కడా – మిగతా 2లోu కనిపించకుండా పోయాయి. దీంతో రెండో విడత లో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడమూ అంతే ముఖ్యమన్న నినాదం తో ముందు నుంచి ప్రభుత్వం రెండో విడత హరితహారానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో సమన్వయం చేయడంతో, నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగానే మొక్కలు నాటేందుకు ఉత్సాహం చూపారు. అం దుకు అనుగుణంగానే మున్సిపాలిటీ పరిధిలో మొ క్కలు నాటేందుకు గుంతలను సైతం తవ్వారు. మున్సిపాలిటీకి మొదట 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. మంచిర్యాల పోలీసులే పది వేలకు పైగా మొక్కలు నాటారు. వీరికి తోడు మహిళా సంఘాల సభ్యులు 50 వేలకు పైగా మొ క్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపాలిటీ లక్ష్యాన్ని 1,13,417గా నిర్ణయించారు. అం దుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. 1,36,542 మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. తవ్విన గుంతలే దర్శనమిస్తున్నాయి. కానరాని ట్రీగార్డులు : మొక్కలను కాపాడేం దుకు మున్సిపల్ అధికారులు 90 బెండెల్స్ ప్లాస్టిక్‌తో కూడిన 1500 ట్రీగార్డులు, తడకలతో చేసిన 4,357 ట్రీగార్డులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్న అధికారులు, ట్రీగార్డుల ఏర్పాటులో మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదోనని, పట్టణ ప్రజలు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడంతోనే సరిపోదు.. దానికి రక్షణ ఏర్పాటు చేయాలి. మొ క్క సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉ న్నా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనా ర్హం. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, నీరందించి వాటి ఎదుగుదలకు దోహదపడే చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు మున్సిపల్ సిబ్బంది మూటగట్టుకుంటున్నారు. దీంతో రెండో విడతలో నాటినా అవి ఎంతవరకు దక్కుతాయో తెలియదు. సంరక్షణ గాలికి.. : 1.13 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించి 1.36 లక్షల మొక్కలు నాటామని చెబుతున్న మున్సిపల్ అధికారులు, వాటిలో ఎన్ని మొక్కలు ప్రస్తుతం బతికి ఉన్నాయన్న లెక్కలను మాత్రం చూపడం లేదు. ఉద్యమంగా తీసుకుని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మొక్క లు నాటినా.. వాటిలో ఇప్పటికే చాలా వరకు మొక్కలు ఎండిపోయాయి. మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోగా, వాటికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. కనీసం రెండో విడతలోనైనా, ప్రభుత్వం హరితహారానికి కేటాయించిన నిధులు, మొక్కలు ఎండిపోవడంతో దుర్వినియోగం అవుతున్నాయి. మొ క్కలను సంరక్షించేందుకు ప్రతిరోజూ రెండు ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నా, మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయో వారికే తెలియాల్సి ఉంది. నాటిన మొక్క నాటినట్లుగా ఎండిపోతుండగా, రికార్డుల్లోనూ ఎ క్కువ మొక్కలు నాటినట్లుగా అధికారులు చూపిస్తున్నారు. మరి లక్షలాది నిధులను ఖర్చు చేసి నా టుతున్న మొక్కలను ఎందుకు సంరక్షించడంలేదో అధికారులకే తెలియాలి. ‘మొక్కలను సంరక్షించేం దుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ట్రీగార్డుల ఏర్పాటులో జరిగిన ఆలస్యంతో కొన్ని మొక్కలు పశువుల పాలయ్యాయి. హరితహారంపై నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర అన్నారు. -
వనంగల్
మూడో విడత హరితహారానికి సన్నాహాలు 67 నర్సరీల్లో 1.26 కోట్ల మొక్కల పెంపకం ఈత, ఖర్జూరా, హైబ్రిడ్ మునగ, బొప్పాయికి ప్రాధాన్యం 200 కిలోమీటర్ల వరకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఓరుగల్లు :పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు.. అనే నినాదం స్ఫూర్తితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం మూడో విడత అమలు కోసం రూరల్ జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రెండు విడతల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో కొత్తగా ఏర్పాటైన వరంగల్ రూరల్ జిల్లాను ఈసారి మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఇప్పటికే అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించడంతో పాటు మొక్కలు పెంచుతున్న నర్సరీలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 67 నర్సరీల్లో పెంపకం.. జిల్లాలో వచ్చే సీజన్లో 1.08 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందుకోసం 67 నర్సీల్లో 1.26 కోట్ల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో 29, అటవీ శాఖ ఆధ్వర్యంలో 38 నర్సరీలు ఏర్పాటు చేశారు. అటవీశాఖ నర్సరీల్లో నాలుగు మాత్రమే ప్రభుత్వానివి కాగా, మిగతావి ప్రైవేట్ నర్సరీలు ఉన్నాయి. మొత్తం మొక్కల్లో 65 లక్షల టేకు ఉంటాయి. వీటితో పాటు కలెక్టర్ ప్రత్యేక చొరవతో హైబ్రీడ్ జాతి బొప్పాయి, మునగ విత్తనాలు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్లో మేలు జాతి పండ్లు, పూల మొక్కలకుప్రజల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా మొక్కలు పెంపకం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈసారి ఎక్కువగా కడెం, తమిళనాడు ప్రాంతాల నుంచి హైబ్రీడ్ సీడ్ తీసుకొచ్చి మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 200 కిలోమీటర్ల వరకు ప్లాంటేషన్ జిల్లాలో సుమారు 200 కిలోమీటర్లకు తగ్గకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఎక్కువ నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. చెరువు కట్టలు ప్రభుత్వ స్థలాలు, గౌడ సొసైటీల భూముల్లో ఈత, ఖర్జూరా మొక్కలు, జిల్లా సరిహద్దు ప్రదేశాల వద్ద టేకు, ఇతర మొక్కలు నాటునున్నారు. అటవీ భూముల్లో అడవి జాతి మొక్కలు, నల్లమద్ది, మారేడు, ఉసిరి, జిన్న, ఏరుమద్ది వంటి మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. జూలై మొదటివారంలో.... వాతావరణం అనుకూలంగా ఉన్నట్లయితే జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని జూలై మొదటివారంలో ప్రారంభించవచ్చనే అంచనాతో అధికారులు పనులు చేస్తున్నారు. అప్పటివరకు నర్సరీల్లో మొక్కలు సుమారు 75 సెంటీమీటర్ల ఎదుగుదల ఉంటుందని అటవీ అధికారుల అంచనా. మొక్కల నాటుకునే విషయంలో ప్రజల డిమాండ్ మేరకు హైబ్రిడ్ వంగడాలు నర్సరీల్లో కొనుగోలు చేసి ఇచ్చేందుకు సైతం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మొక్కల పెంపకం బాధ్యతలు హార్టికల్చర్, సెరికల్చ ర్, ఎక్సైజ్, అటవీశాఖ, డీఆర్డీఓలు సమన్వయంతో పెంపకం చేపట్టనున్నారు. -
వనం.. సురక్షితం..
పశువులు, మనుషులకు నో ఎంట్రీ అగ్ని నుంచి అడవిని కాపాడేందుకు యత్నం డివిజన్‌కు రూ.50లక్షల వ్యయంతో పనులు అడవుల అభివృద్ధి కోసం అటవీ శాఖ చర్యలు ఇల్లెందు : మహా వృక్షాలు, మొక్కలు, పక్షులు, జంతువులు.. వీటికే అడవులు పరిమితం. పశువులు, జనసంచారం ఊసే ఉండొద్దు.. ఇదీ నిబంధన. వీటిని కఠినతరం చేసేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. అడవులు అగ్నికి ఆహుతి కాకుండా.. నిరంతరం అధికారులు పర్యటించేందుకు బాటలు వేయడం.. ఉన్న వృక్షాలను వృద్ధి చేయడం కోసం ముమ్మర చర్యలు చేపట్టింది. ట్రెంచ్ కటింగ్ పనులు మొదలుపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డివిజన్‌కు వెయ్యి హెక్టార్లలో అడవుల రక్షణకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, పాల్వంచ వన్యప్రాణి విభాగం డివిజన్లలో నెల రోజులుగా అడవుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. హరితహారంలో భాగంగా 230కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. గడిచిన రెండేళ్లలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. దీంతో అటవీ శాఖ ఆధీనంలో గల అడవులను అభివృద్ధి చేయటం వల్ల 25 శాతం ఉన్న అడవిని.. 3 శాతం పెంపొందించవచ్చని అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఒక్కో డివిజన్‌కు వెయ్యి హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి.. అడవుల పునరుద్ధరణ ఉత్పత్తి(ఏఎన్ఆర్) ప్లాంటేషన్ పనులు చేపట్టారు. డివిజ¯Œకు రూ.50లక్షల చొప్పున నిధులు వెచ్చిస్తున్నారు. వీటితో ఏఎన్ఆర్ ప్లాంటేషన్ పనులు చేపట్టారు. నిర్దేశించిన అటవీ ప్రాంతంలో పశువులు సంచరించకుండా రెండు మీటర్ల వెడల్పుతో ట్రెంచ్(కందకాలు) తవ్విస్తున్నారు. వేసవిలో అడవులు దహనం కాకుండా.. చిన్నచిన్న మొక్కలు తొలగిస్తూ.. నిర్దేశించిన అటవీ ప్రాంతంలో పాయలు(బాటలు) ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మరో ప్రాంతానికి విస్తరించకుండా పకడ్బందీగా పనులు చేపట్టారు. భూమికి అతి సమీపంలో నేలమీద వాలి ఉన్న మొక్కలు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆహుతి కాకుండా ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. అలాగే చెట్లు, మొక్కలు ఏపుగా, బలంగా వృద్ధి చెందేందుకు అడవుల మధ్య చెత్తాచెదారం తొలగిస్తున్నారు. అడవిలో చెట్ల మధ్య దూరం వల్ల గాలి, వెలుతురు లభించేలా చిన్న మొక్కలు తొలగించి.. శుభ్రం చేస్తున్నారు. దీంతో చెట్లు, వృక్షాలు నరికితే సుదూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా గుర్తించేందుకు వీలవుతుంది. అడవుల విస్తీర్ణం ఇలా.. జిల్లా విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6.02 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఉంది. కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు డివిజన్లతోపాటు పాల్వంచ వన్యప్రాణి సంరక్షణ విభా గం, అభయారణ్యం కూడా ఇక్కడే ఉంది. ఒక్క వన్యప్రాణి సంరక్షణ విభాగంలోనే 68,638 హెక్టార్ల భూమి ఉంది. అటవీ శాఖ రేంజ్‌లు, సెక్షన్లు, బీట్ల వైశాల్యం ఎక్కువగా ఉండటంతో పర్యవేక్షణ కష్టతరంగా ఉందని భావించి వాటి పరిధిని తగ్గించింది. ప్రస్తుతం ఒక్కో బీటు వైశాల్యం వెయ్యి హెక్టార్ల వరకు విస్తరించింది. గతంలో ఒక్కో బీట్ ఆఫీసర్ 5వేల హెక్లార్ల అడవిని కాపాడలేకపోవటం వల్ల కొత్తగూడెం డివిజన్లో సుమారు 50 హెక్లార్ల భూమి అన్యాక్రాంతమైంది. -
బ్యాక్టీరియాతో జాగ్రత్త!
దానిమ్మలో సమగ్ర సస్యరక్షణ అవసరం 'మహానంది' ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం దానిమ్మ తోటలు సాగు చేసిన రైతులకు నష్టాలు తెచ్చిపెడుతున్న వాటిలో బ్యాక్టీరియా మచ్చ తెగులు ప్రమాదకరమైనందున సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నివారించుకోవాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా ఆధ్వర్యంలో దానిమ్మ తోటలపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు, మరో శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు హాజరై అవగాహన కల్పించారు. రోగం లేని మొక్కలు ఎంపిక ఇటీవల దానిమ్మ తోటలకు బ్యాక్టీరియా మచ్చతెగులు బాగా దెబ్బతీస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఆకులు, కాండం, కాయలపై విస్తరించి తీవ్ర నష్టం కలిగిస్తున్నందన ముందుస్తు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నర్సరీల నుంచి, వర్షంతో కూడిన గాలులు ద్వారా, కత్తిరింపులు చేసే సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇందుకోసం పంట పెట్టాలనుకున్నపుడే రోగ రహిత మొక్కలు ఎంపిక చేసుకోవాలి. నర్సరీల్లో మొక్కల ఆకులు, లేత కొమ్మలపై నీటితో తడచినట్లు మచ్చలు కనిపిస్తే రోగం ఉన్నట్లుగా గుర్తించాలి. టిష్యూకల్చర్ మొక్కలు బాగున్నా వాటిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కత్తిరింపుల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కత్తిరించే ప్రతిసారీ కత్తెరలను డెటాల్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ముంచి శుభ్రం చేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ కత్తిరింపుల తర్వాత ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలి. కొత్త ఆకులు వచ్చిన తర్వాత మూడు గ్రాములు శాలిసిలిక్ యాసిడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే కాయ ఊరేదశలో కూడా శాలిసిలిక్ యాసిడ్ నెల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా మచ్చ తెగులుకు సంబంధించి లక్షణాలు కనిపిస్తే 25 గ్రాములు బ్లైటాక్స్ + 5 గ్రాములు స్టెప్టోసైక్లీన్ + 5 గ్రాములు బ్యాక్టీరొనాల్+ జిగురు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేత ఇగుర్లు వచ్చిన తర్వాత 2 మి.లీ రీజెంట్ ఒక లీటర్ నీటికి లేదా 3 గ్రాములు ప్రైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీనికి 2 మి.లీ వేపనూనె కలుపుకోవాలి. కాయలపై శిలీంధ్రపు మచ్చ తెగులు కనిపిస్తే గ్రాము బావిస్టన్ లేదా 2.5 గ్రాములు ఎం–45 లేదా 1 మి.లీ టిల్ట్ లేదా 1 మి.లీ స్కోర్ లేదా 2 గ్రాములు అవతార్ లేదా 2 గ్రాములు మిర్జ్ మందులు 20 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోగ లక్షణాలు కనిపించిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు, మొక్కలు పీకేసి కాల్చివేయాలి. తోటలను ఎపుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకుంటే దానిమ్మ రైతు ఇంట ప్రధాన వాణిజ్యపంటగా లాభదాయకంగా మారుతుంది. -
భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం
రైల్వే కోడూరు: వర్దా తుపాను కారణంగా వైఎస్సార్‌జిల్లాలో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. రైల్వే కోడూరు మండలంలో అరటి, బొప్పాయి తోటలు నేలకురాయి. సుమారు 1200 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి. రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
14 అడుగుల జనప మొక్క
చినలింగాయపాలెం(కాకుమాను): పంట పొలాల్లో వరి పైరు తర్వాత పశువుల మేత కోసం పండించే జనప పంట సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాకుమాను మండలం చినలింగాయపాలెంకు చెందిన రైతు వేల్పూరి సోమయ్య మూడు నెలల క్రితం పొన్నూరు నుండి జనప విత్తనాలు కొనుగోలు చేసి తెచ్చి పంటపొలంలో చల్లాడు. రెండు విత్తనాలను ఇంటి పెరట్లోనూ చల్లాడు. అందులో ఓ మొక్క దాదాపు 14 అడుగులకు మించి పెరగడంతో ఆ మొక్కను గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. భూమి సారవంతంగా ఉండటం, విత్తనాలలో జన్యుపర లోపాలు జరగటం వలన మొక్కలు ఇలా అధిక ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని మండల వ్యవసాయాధికారిణి సిహెచ్.సునీత తెలిపారు. -
హైదరాబాద్‌లో డేటావిండ్ ప్లాంట్..
• ఏటా 20 లక్షల యూనిట్ల తయారీ • ప్రారంభించిన మంత్రి కేటీఆర్... • టెలికంలోకి రానున్న కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న డేటావిండ్ హైదరాబాద్‌లో ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, కెనడా హై కమిషనర్ నదీర్ పటేల్ ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్లాంటులో ప్రస్తుతం 500 మంది పని చేస్తున్నారు. 2017 మార్చికల్లా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులను మొబైల్ తయారీ కంపెనీలు నియమించుకోవడం అభినందనీయమని అన్నారు. ‘ రాష్ట్రంలో ఒక లక్షకుపైగా ఐటీఐ అభ్యర్థులు ఉన్నారు. మొబైల్ ఫోన్ల తయారీకి అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాం. తెలంగాణ ఎలక్ట్రానిక్ తయారీ విధానం విజయవంతం అరుుంది. మైక్రోమ్యాక్స్, సెల్కాన్లతోపాటు ఇప్పుడు డేటావిండ్ యూనిట్ ఏర్పాటైంది. టీవీల తయారీలో ఉన్న థామ్సన్ సైతం ఇక్కడ అడుగు పెట్టబోతోంది’ అని ఆయన గుర్తు చేశారు. కెనడాకు విమాన సర్వీసులు.. హైదరాబాద్ నుంచి కెనడాకు విమాన సర్వీసులు నడిపేలా ఎరుుర్ కెనడాను ఆదేశించాలని నదీర్ పటేల్‌ను కేటీఆర్ కోరారు. భారత పర్యటనలో భాగంగా కెనడా ప్రధానిని తెలంగాణకు తీసుకు రావాల్సిందిగా విన్నవించారు. ఆ దేశానికి చెందిన 40కి పైగా కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని గుర్తు చేశారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కంటెంట్, ట్యాబ్లెట్స్, టూల్స్ అవసరమని, ఈ విషయంలో డేటావిండ్ మద్ధతు ఇవ్వొచ్చని చెప్పారు. దశలవారీగా రూ.100 కోట్లు.. డేటావిండ్ 20 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో శంషాబాద్‌లోని జీఎంఆర్ కాంప్లెక్స్‌లో తయారీ కేంద్రం నెలకొల్పింది. దశలవారీగా రూ.100 కోట్లను వెచ్చించనున్నట్టు కంపెనీ సీఈవో సునీత్ సింగ్ తులి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే భారీ కాంప్లెక్సును ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాంటులో మినీ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్లను రూపొందిస్తారు. టెలికంలోకి డేటావిండ్.. దేశంలో టెలికం సేవలు అందించేందుకు వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) లెసైన్సుకు దరఖాస్తు చేసుకున్నట్టు డేటావిండ్ వెల్లడించింది. ఈ సర్వీసులకై రూ.80 కోట్లదాకా వెచ్చించనున్నట్టు సీఈవో వెల్లడించారు. సొంతంగా సిమ్ల జారీతోపాటు రూ.20లకే అన్లిమిటెడ్ బ్రౌజింగ్ ప్లాన్లను అందిస్తామన్నారు. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. ఒక టెలికం కంపెనీతో చేతులు కలిపి సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టెలికం సర్వీసులు అందించే సంస్థలకు రిటైలర్లుగా వీఎన్‌వోలు వ్యవహరిస్తారుు. -
రాష్ట్రానికంతటికీ కడప పెరటికోళ్లు
కడప అగ్రికల్చర్ : రాష్ట్రానికంతటికీ సరిపడేలా పెరటికోళ్లు వైఎస్సార్ జిల్లా కడప నుంచి ఉత్పత్తి చేయడానికి అనుకూల వాతావరణం ఉందని, అయితే ఇంకా విస్తరించి ఉత్పత్తిని పెంచే మార్గాలు ఆలోచిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ సోమశేఖరం అన్నారు. శుక్రవారం జిల్లా సందర్శనకు వచ్చిన డైరెక్టర్ ఊటుకూరులోని పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఊటుకూరులో ఉన్న పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రం పిల్లలను ఉత్పత్తి చేయడానికి వనరులు పూర్తిస్థాయిలో సమకూర్చుతామన్నారు. విడతల వారీగా పిల్లలను అన్ని జిల్లాలకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పెరటికోళ్ల పెంపకంపై గ్రామీణ ప్రజలు మక్కువ పెంచుకున్నారని, చిన్న కుటుంబాలకు ఇది మంచి ఆదాయ వనరుగా ఉందన్నారు. నిరంతరాయంగా పిల్లల ఉత్పత్తి చేపట్టాలని ఆదేశించారు. పశువైద్యానికి నిధుల కొరత లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశుమిత్రల వ్యవస్థను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పశుగ్రాసాన్ని దుబారా చేయకుండా పొదుపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు. పశువుల్లో సంకరజాతి దూడలను పుట్టించడానికి గర్భధారణ సూది మందు (పశువుల వీర్యం) 15వేల డోసులు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి ప«థకంలో పశుగ్రాసాల పెంపకం చేపట్టాలని ప్రభుత్వానికి నివేదికలు పంపామని తెలిపారు. కొత్తగా 600 పోస్టులు రాష్ట్రంలో భర్తీ చేయనున్నామన్నారు. గాలికుంటు రహిత రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు వచ్చిందన్నారు. దీంతో పశువుల ఉప ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. వచ్చేనెల 15వ తేదీ నుంచి దూడలను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి, వాటిని ఇక్కడ స్పెషల్ ప్యాకేజీలో పంపిణీ చేస్తామన్నారు. అనంతరం పశుగణాభివృద్ధి కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా జేడీ వెంకట్రావు పాల్గొన్నారు. -
భద్రాద్రికి ‘గ్రీన్’ సిగ్నల్
- కమిటీ నివేదిక నిర్మాణానికి అనుకూలం - అనుమతుల మంజూరుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు - పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా కాంట్రాక్టర్లు - ఆనందంలో నిర్వాసిత యువత పినపాక : ఆర్నెల్లుగా ఆగిపోయిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ కొనసాగనుంది. దీనికి అనుకూలంగా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కమిటీ నివేదిక సమర్పించింది. కేవలం 30 శాతం మాత్రమే పర్యావరణానికి హాని జరుగుతున్నట్లు.. మిగిలిన 70 శాతం ఎటువంటి ముప్పులేదని నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ అనుమతులతో కాంట్రాక్టర్లు, కూలీలు పనులకు సిద్ధమవుతుండగా... నిర్వాసిత నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పినపాక, మణుగూరు మండలాల సరిహద్దు ఉప్పాక పంచాయతీ సీతారాంపురం వద్ద తలపెట్టిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆర్నెల్లుగా నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా కమిటీ నివేదిక సమర్పించినట్లు తేలడంతో ప్రభావిత గ్రామాల్లో యువత హర్షం వెలిబుచ్చుతోంది. రెండు మండలాల సరిహద్దులో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఒకే ప్రాంతంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ బీహెచ్ఈఎల్కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. భూసేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం, నిర్వాసిత యువతకు ఐటీఐలో శిక్షణ తదితర కార్యకలాపాలు చకచకా సాగిపోయాయి. పవర్ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని, గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు దాఖలు కావడంతో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు 6 నెలల క్రితం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలు సందర్భాల్లో పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు నియమించిన కమిటీ సందర్శించింది. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలు పవర్ప్రాజెక్టు నిర్మాణప్రాంతంలో చేసిన పనులు, తీసుకున్న జాగ్రత్తలు, పర్యావరణానికి కలిగే నష్టం తదితర అంశాలపై అధ్యయనం చేశారు. కమిటీ నివేదిక అనుకూలం భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి వాటిల్లే నష్టం చాలా తక్కువని కమిటీ నివేదికలో పేర్కొనట్లు సమాచారం. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు సీఆర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులు భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం జరిగే సుమారు 200 ఎకరాలను పరిశీలించారు. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న జల వనరులు, వాటికి కలిగే నష్టం, ప్రాజెక్టు నిర్మిస్తే వెలువడే కాలుష్యం తదితర అంశాలపై కమిటీ సభ్యులు లోతుగా పరిశీలన చేశారు. దీని ప్రకారం పర్యావరణానికి పెద్దగా ముప్పు వాటిల్లదని నిర్ధారించినట్లు సమాచారం. కమిటీ కాలపరిమితి కేవలం 8 వారాలు మాత్రమే ఉండటంతో నివేదిక సమర్పించడానికి కాస్త ఆలస్యమైంది. కాలపరిమితి ముగిసిందనే పేరుతో వెంటనే నూతన కమిటీని నియమించినట్లు తెలిసింది. పాత కమిటీ సేకరించిన సమాచారం ఆధారంగా నూతన కమిటీ కేంద్రమంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. అనుమతులు మంజూరు చేయనున్న కేంద్రం! భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ ప్రాంతంలో పర్యటించి సేకరించిన సమాచారం ఆధారంగా కమిటీ అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పలు దఫాలు కేంద్రమంత్రులను కలిసినట్లు వినికిడి. నూతన కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు రాన్నుట్లు ఇప్పటికే రాష్ట్రమంత్రులు బహిరంగ సభల్లో కూడా ప్రకటించారు. సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు ఆర్నెల్లుగా ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు, కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. కమిటీ నివేదిక అనుకూలంగా ఉందని, అనుమతులు వస్తాయని తెలియడంతో కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టేందుకు కార్యాచరణ తయారు చేసుకుంటున్నారు. కూలీల సేకరణ, యంత్రాల మరమ్మతులు చేసుకుంటున్నారు. అధికారికంగా అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు మైనర్ పనులు చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. నిర్వాసిత యువతలో హర్షాతిరేకం భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరవుతాయనే సమాచారంతో నిర్వాసిత యువత హర్షం వ్యక్తం చేస్తోంది. పవర్‌ప్లాంట్ పరిధిలో సుమారు 350 మంది నిర్వాసిత యువత భూములు కోల్పోయింది. ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పిస్తామనడంతో మణుగూరు, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిన తర్వాత వారంతా ఆందోళనలో పడ్డారు. అనుమతులు వస్తాయనే సమాచారంతో వారిలో ఆనందం తొణికిసలాడుతోంది. తాజా కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. -
మెుక్కలకు రక్షణేది ?
సంరక్షణ మరిచిన అధికారులు ట్రీగార్డులు కరువు ఎండిపోతున్న మెుక్కలు పట్టించుకోని బల్దియా యంత్రాంగం కరీంనగర్ కార్పొరేషన్ : లక్ష్యం కోసం లక్షకు పైగా మెుక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణమాత్రం మరిచారు. ఫలితంగా మెుక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. పచ్చగా పెరిగిన వాటికి ట్రీగార్డులు లేక పశువుల పాలవుతున్నాయి. జూలై 18న తెలంగాణకు హరితహరంలో భాగంగా నగరంలో లక్షకు పైగా మెుక్కలు నాటారు. పలు డివిజన్లలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, పందులు తినిశాయి. కొన్ని వాడిపోగా, మరికొన్ని ఎండిపోయి మెుండాలు ఎక్కిరిస్తున్నాయి. ట్రీగార్డుల కొనుగోలు జాప్యం నగరపాలక సంస్థ పరిధిలో ట్రీగార్డుల కొరత ఏర్పడింది. మొక్కలు నాటిన నెల రోజుల వరకు ట్రీగార్డులను సమకూర్చలేకపోయారు. దాతలు సహకారం అందించినా సరైన సమయానికి స్పందించకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. దాతల నుంచి సేకరించిన నిధులను బల్దియా అకౌంట్‌కు జమచేస్తే టెండర్ల ప్రాసెస్ ఆలస్యమవుతుందని, నేరుగా ట్రీగార్డుల తయారీకి ఉపయోగించారు. రెండు వేలకు మించి ట్రీగార్డులు కూడా అందించలేకపోయారు. మొక్కలు నాటిన తర్వాత అధికారులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నీరు లేక మొక్కలు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే ట్రీగార్డులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటికి నీరు దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. నగరాన్ని జోన్లుగా విడదీసి అధికారులను బాధ్యులుగా నియమించినా మెుక్కల సంరక్షణ మాత్రం మరిచారు. ఆలస్యంగా వర్షాలు జూలైలో మొక్కలు నాటితే ఆగస్టు నెలంతా వర్షాలు లేకపోవడంతో మెజారిటీ మొక్కలు ఎండిపోయాయి. ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నా, సరైన సమయంలో నీరు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. జియో ట్యాగింగ్‌తో మొక్కల లెక్కలు ఖచ్చితంగా చెబుతామని అప్లికేషన్ తయారు చేసినప్పటికీ దాని ఉపయోగం శూన్యం. గుంతల బిల్లులు స్వాహా మొక్కల పరిస్థితి ఇలా ఉంటే గుంతల తవ్వి వాటి బిల్లులు మాత్రం వెంటనే తీసేసుకున్నారు. కొన్ని డివిజన్లలో అసలు గుంతలు తవ్వకుండానే బిల్లులు నొక్కేశారు. 82 వేల గుంతలు తవ్వినట్టు లెక్కలు చూసి హడావిడిగా రూ.16.5 లక్షల బిల్లులు పొందారు. ఈ విషయం తెలిసిన పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో అసలు గుంతలే తవ్వలేదని, వందల సంఖ్యలో రికార్డు చేయడం విడ్డూరంగా ఉందని విస్తుపోయారు. హరితహారం మహోద్యమంలా సాగాలని ప్రభుత్వం భావిస్తే, కొందరి జేబుల్లోకి నిధుల వరద సాగింది. -
నాటిన ప్రతి మొక్క బతకాలి
జడ్చర్ల టౌన్ : హరితహారం, ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షిస్తేనే ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరినట్టు.. అవసరమైతే జాబ్‌కార్డున్న ఒక కుటుంబానికి పూర్తి బాధ్యత అప్పగించండి.. వారికి ఈజీఎస్ద్వారా కూలి చెల్లిద్దాం.. అని పంచాయతీరాజ్ కమిషనర్ అనితారాంచంద్రన్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దపల్లి, పోలీసుశిక్షణకేంద్రం సమీపంలోని రోడ్డు, అల్వాన్‌పల్లి గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో 90శాతం మొక్కలు జీవించి ఉండటాన్ని చూసి నిర్వాహకులను ప్రశంసించారు. కొన్నిచోట్ల చెట్లకు కంచె వేయకపోవటం, రక్షణ చర్యలు తీసుకోకపోవటంతో అసంతప్తి వ్యక్తం చేశారు. నాటిన ప్రతి మొక్క విలువైనదేనని, వాటిని బతికించుకోవడానికి గ్రామాల్లో కూలీల కుటుంబాలను ఎంపిక చేసి వారి ద్వారా చెట్లను కాపాడాలన్నారు. 400 మొక్కలకు జాబ్‌కార్డు కలిగిన భార్యాభర్తలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్æకమిషనర్ ఆశ, పీడీ దామోదర్‌రెడ్డి, అడీషల్ పీడీ గణేష్, ఏపీడీ జకియాసుల్తాన, ఏపీఓ భారతి, టీఏ విజయభాస్కర్‌లు ఉన్నారు. -
మెదక్ జిల్లాలో హెచ్ఎస్ఐఎల్ మరో రెండు ప్లాంట్లు
♦ 2017 జూన్ నాటికి ఉత్పత్తి ప్రారంభం ♦ హెచ్ఎస్ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శానిటరీ వేర్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. మెదక్ జిల్లాలో రూ.240 కోట్లతో వీటిని నిర్మిస్తోంది. సీపీవీసీ పైపులతోపాటు సెక్యూరిటీ క్యాప్స్, క్లోజర్స్ ఉత్పత్తులను ఈ ప్లాంట్లలో తయారు చేస్తారు. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 1,000 మందికిపైగా ఉపాధి లభించనుంది. 2017 ఏప్రిల్-జూన్‌లో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయని హెచ్ఎస్ఐఎల్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ మనీష్ భాటియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. పైప్స్ ప్లాంటు అందుబాటులోకి వస్తే బాత్రూం విభాగంలో భారత ఉపఖండంలో పూర్తి స్థాయి ఉత్పత్తులు అందించే ఏకైక కంపెనీగా అవతరిస్తామని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండలో ప్లాంట్లు ఉన్నాయి. భారత్‌లో తయారీ... వాటర్ హీటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ప్రస్తుతం కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. వీటి తయారీని దేశీయంగా చేపట్టాలని భావిస్తున్నట్టు మనీష్ వెల్లడించారు. కొద్ది రోజుల్లో కంపెనీ నుంచి ప్రకటన వెలువడనుందని చెప్పారు. హెచ్ఎస్ఐఎల్ 2015లో ఫాసెట్స్, సానిటరీవేర్ విభాగంలో 174 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఏడాది 200లకుపైగా ఉత్పత్తులను తీసుకు రానుంది. హెచ్ఎస్ఐఎల్ ఉత్పత్తులు లభించే గ్యాలెరియా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు దేశవ్యాప్తంగా 150 ఉన్నాయి. మూడేళ్లలో మరో 250 ఔట్లెట్లను ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. స్టోర్లు అన్నీ కూడా ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. హింద్‌వేర్ డ్రీమ్ బాత్ యాప్ ద్వారా కస్టమర్లు తమ ఇంటి బాత్రూంను వర్చువల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. -
పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
మఠంపల్లి : పుష్కరాల కోసం మండలంలోని మట్టపల్లి వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అధికారులు మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం వర్ధాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సైట్ ఇన్చార్జి బి.మురళి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చింతలమ్మగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమిలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఇటీవల 20 వేల గుంతలు తవ్వారు వీటిలో వేప, గానుగ, దిరిసిన, నారవేప, నెమలినార, సీమతంగేడు వంటి 12 వేల మెుక్కలు నాటినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.మురళి తెలిపారు. -
వంగలో సస్యరక్షణ పాటించాలి
నడిగూడెం : ప్రస్తుతం వాతావరణం చల్లబడుతుండడంతో వంగ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టకపోతే పంట దిగుబడిపై ప్రభావం అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక పంట దిగుబడులు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి రవినాయక్ తెలిపారు. పురుగులు, తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ఆశించే పురుగులు.. నివారణ చర్యలు మొవ్వు, కాయతొలుచు పురుగు ఈ పురుగు నాటిన 30–40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి. తొలిదశలో వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ లేదా కార్బరిల్ 50 శాతం 3 గ్రాములు, లీటరు నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు( దీపపు పురుగులు, పేనుబంక, లె ల్లదోమ) ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారి, పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమీధోయేట్ లేదా మిథైల్‌డెమటాన్ లేదా ఫిప్రోనిల్ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలె గూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆశించే తెగుళ్లు.. నివారణ చర్యలు ఆకుమాడు తెగులు నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు, లేదా కార్బెండిజమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమాడు, కాయకుళ్లు తెగులు ఆకులపై అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపురంగుకు మారి, కుళ్లిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తేముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వీటిలో విత్తనాలను 30 నిమిషాలపాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు సోకిన పొలంలో పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. దీని నివారణకు ఆశించిన మొక్కలను తొలగించి, నాశనం చేయాలి. నారుదశలో నాటడానికి ముందు 250 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలను 100 చ.మీ నారుమడికి వేయాలి. జాగ్రత్తలు.. ప్రధానంగా పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతరపంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున పెట్టాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి. -
మహారాష్ట్రలో మొక్కలు నాటిన సర్పంచ్
సిద్దిపేట రూరల్: మహారాష్ట్రలోని పర్లీ నియోజకవర్గంలో గల గోపాల్పూర్ గ్రామంలో ఆదివారం సిద్దిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మొక్కలు నాటారు. గతంలో గోపాల్పూర్ సర్పంచ్ అశోక్‌డిగోలె సిద్దిపేటలో పర్యటించి మొక్కలు నాటిన విధానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చిన్నగుండవెల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఆహ్వానించి మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో నాటిన మొక్కల తీరుపై ప్రశంసలు కురిపించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో చేపడుతున్న అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అక్కడి ప్రజలకు వివరించినట్లు చెప్పారు. అదే విధంగా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల విధానంపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. అలాగే గోపాల్‌పూర్‌లో వివిధ రకాల సుమారు వెయ్యి మొక్కలు నాటినట్లు చెప్పారు. -
నూతన ఫారెస్ట్రేంజ్గా ‘నాగిరెడ్డిపేట్’
నాగిరెడ్డిపేట్ : జిల్లాల పునర్విభజన పక్రియలో భాగంగా నూతనంగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ను ఫారెస్ట్ రేంజ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు కామారెడ్డి డీఎఫ్‌వో జోజి తెలిపారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట్‌లో కొన్నేళ్లుగా వృథాగా మారిన అటవీశాఖ కార్యాలయ భవనాన్ని, స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీశాఖ స్థలంలో పెరిగిన చెట్లను వెంటనే తొలగింపజేయాలని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రాధాకృష్ణను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అటవీశాఖలో నాగిరెడ్డిపేటలో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ క్రమంలో తమ శాఖకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. కాగా నూతనంగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్తో పాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్‌లు ఉండనున్నాయని ఆయన చెప్పారు. ఇది వరకు ఉన్న గాంధారి రేంజ్ బాన్సువాడ డివిజన్‌లోకి మారబోతుందన్నారు. అంతకు ముందు నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం, బంజెర తండాల్లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లలో మొక్కలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి, ఎఫ్ఆర్వోతో పాటు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేశ్ ఉన్నారు. -
ముమ్మరంగా మొక్కలు నాటాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ముమ్మరంగా మొక్కలు నాటాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు సూచించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులతో గురువారం హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 35 లక్షల టేకు స్టంపులను అన్ని మండలాలకు పంపించామని, రెండు, మూడురోజుల్లో నాటాలని ఆదేశించారు. అన్ని మొక్కలకు రిజిస్టర్, జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. మెుక్కల సంరక్షణకు బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి డ్వామా ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత 3 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని తెలిపారు. ఇంకుడుగుంతలు, ఐఎస్ఎల్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు. -
జియోట్యాంగింగ్ చేయాలి
ముకరంపుర : హరితహారంలో భాగంగా వివిధ శాఖల ద్వారా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలన్నింటికీ వెంటనే జియోట్యాగింగ్ చేయాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నాటిన మొక్కలన్నింటికీ రిజిస్టర్ చేయాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మొక్కలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ విధానంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారులు తమ కంప్యూటర్ ఆపరేటర్‌ను శిక్షణకు పంపించాలని ఆదేశించారు. -
మీ ఇల్లు చల్లగుండ
మొక్కే కదా అని పీకేశామో మన పీక కోసేవారెవరూ ఉండకపోకవచ్చు గాని, మన పరిసరాల్లోని మొక్కలను పీకి పారేస్తే మన పీక మనమే కోసుకున్నంత పని అవుతుంది. మొక్కలను పెంచడం మన ప్రాణావసరం. మొక్కలే మనకు ప్రాణదాతలు. మీ ఇల్లు, ఇంటిల్లిపాదీ చల్లగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే. మొక్కలే లేకుంటే భూమి కూడా మరో నిర్జీవ గ్రహంగా మిగిలిపోతుంది. మొక్కల అవసరాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. అలాగని మొక్కల పెంపకం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత కూడా! ఇది వానాకాలం. మొక్కలు నాటడానికి అనువైన కాలం. ఈ వానాకాలాన్ని ఊరకే కరిగిపోనివ్వకుండా మొక్కవోని దీక్షతో మొక్కలను నాటుదాం. మన వంతుగా పచ్చదనాన్ని పెంపొందిద్దాం. ఇళ్లలో అందం కోసం, అలంకరణ కోసం తీగలు, పూల మొక్కలు, ముళ్ల చెట్లు మాత్రమే కాదు, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం ఆకు కూరలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు వంటివి పెంచుకోవడానికి కొద్దిపాటి స్థలం చాలు. వీటిలో చాలా రకాల మొక్కలను చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముందు ఎలాంటి ఆవరణ లేని అపార్ట్మెంట్లలో నివసించే వారికి ఇలాంటి మొక్కలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలపై ఆసక్తి ఉంటే అపార్ట్మెంట్ వాసులు కుండీల్లో బోన్సాయ్ వృక్షాలను పెంచుకోవచ్చు. వీటిలో పండ్లు, కాయలు కాసే రకాలు కూడా దొరుకుతాయి. ఇంటి ముందు కొంచెం విశాలమైన ఆవరణ ఉన్నట్లయితే నీడనిచ్చే రకరకాల చెట్లు పెంచుకోవచ్చు. నీడతో పాటు పండ్లు, కాయలు ఇచ్చే చెట్లు కూడా పెంచుకోవచ్చు. తీగ మొక్కలతో పందిరి వేసుకోవచ్చు. ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. ఖర్చుతో కూడిన పని కూడా కాదు. వాటి పెంపకానికి ఖర్చుతో కూడిన రసాయన ఎరువుల వంటివేవీ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో వాడి పారేసిన కూరగాయల తొక్కలు, కాఫీ పొడి, టీ పొడినే ఎరువుగా కాస్త తీరిక చేసుకుని మొక్కలను పెంచితే వాటితో వచ్చే ఆనందమే వేరు. ఇళ్లలో పెంచుకోదగ్గ వివిధ వృక్షజాతుల గురించి... తీగ మొక్కలు * తీగజాతి మొక్కల్లో కొన్ని రకాలు అలంకరణ కోసం ఉపయోగపడతాయి. మరికొన్ని రకాల కూరగాయల మొక్కలు కూడా తీగలుగా పెరిగి ఆహార అవసరాలకు ఉపయోగపడతాయి. * మల్లె, జాజి,మాలతి, గోకర్ణ, శంఖపుష్పి, లిల్లీ, మనీప్లాంట్, బోగన్విల్లా, అల్లామందా క్రీపర్, రంగూన్ క్రీపర్, మండెవిల్లా వంటి తీగజాతి మొక్కలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మనీప్లాంట్లోని వివిధ రకాల తీగ మొక్కలకు పూలు పూయవు. అయితే, చాలా వరకు తీగ మొక్కలకు అందమైన పూలు పూస్తాయి. * తీగ మొక్కలను కుండీల్లో నాటుకుని ఇళ్లల్లో కిటికీలకు పాకేలా పెంచుకోవచ్చు. కొంత స్థలం ఉన్నట్లయితే, పందిరి వేసి ఈ తీగలను పందిరి మీదకు పాకించవచ్చు. తీగ మొక్కలను పందిరిగా వేసుకుంటే చల్లని నీడ కూడా దొరుకుతుంది. * బచ్చలి, తమలపాకు, బఠాణీ, చిక్కుడు, కాకర, దోస, ఆనప, పొట్ల, బీర, టొమాటో, గుమ్మడి వంటి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు తీగలుగా పెరుగుతాయి. * తీగ మొక్కలకు పందిరి ఏర్పాటు చేయవచ్చు. లేకుంటే పైకప్పుల మీదకు పాకేలా కూడా ఏర్పాటు చేయవచ్చు. * ఇంటి చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నట్లయితే, ప్రహారీని ఆనుకున్న స్థలంలో వెదురు పొదలను తీగ మొక్కలకు ఆసరాగా పెంచవచ్చు. ఇంటికి నలువైపులా దట్టంగా పొదలను పెంచినట్లయితే శబ్దకాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు, ఇంటి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. పుష్ప విలాసం పూల మొక్కలను పెంచుకోవడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. పూలనిచ్చే వృక్షజాతుల్లో కొన్ని లతలు, తీగలుగా పెరిగితే, ఇంకొన్ని చిన్న చిన్న మొక్కలుగా, మరికొన్ని గట్టి కాండంతో చెట్లుగా ఎదుగుతాయి. చిన్న చిన్న మొక్కలుగా ఎదిగేవాటిని కుండీల్లో పెంచుకోవచ్చు. బాల్కనీల్లో, టైపై కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవడానికి గులాబి, బంతి, చామంతి, కనకాంబరం, చంద్రకాంతం, దాలియా, తులిప్, లావెండర్ వంటి పూల మొక్కలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఆరుబయట స్థలంలో కూడా వీటిని పెంచుకోవచ్చు. మందార, గన్నేరు, నందివర్ధనం, సంపెంగ, పొగడ, పారిజాతం, నూరు వరహాలు, గుల్మొహర్ వంటి పూల చెట్లు కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉండవు. ఇవి గట్టి కాండంతో ఏపుగా ఎదుగుతాయి. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో కాస్తంత స్థలం ఉంటే వీటిని పెంచుకోవచ్చు. * పూల మొక్కలను సాధారణంగా అలంకారం కోసం పెంచుకుంటారు. మన దేశంలోనైతే పూజాదికాలకు పనికొస్తాయనే ఉద్దేశంతో కూడా పూల మొక్కలను పెంచుకుంటారు. * మల్లె, జాజి, సంపెంగ, లావెండర్, నైట్ క్వీన్ వంటి కొన్ని పూలు సుగంధ పరిమళాలతో ఆకట్టుకుంటాయి. తోటకు అందానివ్వడమే కాకుండా, ఆహ్లాదభరితమైన పరిమళాల కోసం ఇలాంటి పూల మొక్కలను చాలామంది ఇష్టపడతారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు * మొక్కలకు తగిన కుండీలను ఎంపిక చేసుకోవాలి. కుండీల్లో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండేందుకు వాటి అడుగున చిన్న చిన్న రంధ్రాలు ఉండాలి కుండీల్లో పెంచుకునే మొక్కలు అడ్డదిడ్డంగా ఎదిగిపోకుండా, వాటిని అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. వాటికి కాస్త ఎండ సోకే ప్రదేశంలో ఉంచాలి మొక్కలకు అవసరం మేరకు తగుమాత్రంగా నీరు పోస్తూ ఉండాలి. వాటికి పోషకాలను అందించేందుకు సేంద్రియ ఎరువులను వాడవచ్చు వంటింటి సేంద్రియ వ్యర్థాలను మొక్కల కుండీల్లో నేరుగా వేయకూడదు. వాటిని ఒక కుండీలో నింపి నేలలో తవ్విన గొయ్యిలో వేసి కంపోస్టుగా మార్చాలి. ఆ తర్వాతే మొక్కలకు వేయాలి. పెరటి మొక్కల పెంపకంలోనూ దాదాపు ఇవే పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మొక్కల వద్ద నీరు ఎక్కువగా నిల్వ చేరకుండా చూసుకుంటూ ఉండాలి. * మట్టిని గుల్లగా తవ్వుకుని, సేంద్రియ ఎరువు కలిపిన తర్వాత మొక్కలు నాటుకుంటే అవి బాగా ఎదుగుతాయి. ఇళ్లల్లో చెట్లు ఉంటే... ≈ భూమ్మీద దాదాపు 80 వేలకు పైగా వృక్షజాతులు మన ఆహార అవసరాలకు ఉపయోగపడగలవు. అయితే, వీటిలో 30 శాతం వృక్షజాతులను మాత్రమే మనుషులు ఆహార అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇవి కాకుండా, భూమ్మీద 70 వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ≈ ప్రపంచంలోనే అతి పురాతనమైన చెట్టు ‘మెథుసెలా’ కాలిఫోర్నియాలో ఉన్న ఈ చెట్టు వయసు 4848 సంవత్సరాలు. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెయిన్స్‌లో ఉన్న బ్రిసెల్కోన్ పైన్ అడవుల్లో ఈ ప్రాచీన వృక్షం ఉంది. ఇది కచ్చితంగా ఎక్కడ ఉందో కొద్దిమంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ≈ భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చూడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ≈ చెట్లు లేని చోట వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు తగిన ఆస్కారం ఉండదు. విస్తారంగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో భూగర్భ జలాలకు లోటు ఉండదు. ≈ సుగంధాలను వెదజల్లే వాటిలో చెప్పుకోవాలంటే, పూలు పూయకపోయినా మరువం, దవనం వంటి మొక్కలను కూడా చేర్చుకోవచ్చు. సుగంధం కారణంగానే మరువం, దవనం వంటి ఆకులను పూలతో కలిపి మాలలుగా అల్లి అలంకరణలో ఉపయోగిస్తుంటారు. ≈ పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 260 పౌండ్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. అంటే, ఇద్దరు మనుషులకు ఏడాది మొత్తానికి సరిపోయేటంత ప్రాణవాయువు అన్నమాట. నలుగురు మనుషుల కుటుంబం ఉండే ఒక ఇంటి ఆవరణలో కనీసం రెండు చెట్లు ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ప్రాణవాయువుకు లోటు ఉండదు. ≈ చెట్టును నరికి ఆ కలప అమ్మితే అంత మొత్తం రాకపోవచ్చు, పండ్ల చెట్టయితే ఆ చెట్టు ఇచ్చే పండ్ల నుంచి కూడా అంత ఆదాయం రాకపోవచ్చు. చెట్ల నుంచి పరోక్షంగా లభించే పర్యావరణ సేవలకు విలువ కడితే పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు విలువ 10 వేల డాలర్లు (రూ.6.69 లక్షలు) ఉంటుందని నిపుణుల అంచనా. ≈ ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు పెంచినట్లయితే ఇంట్లో ఏసీ వినియోగించాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. వీటి వల్ల ఏసీ కోసం అయ్యే ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుంది. ఆరుబయటి వాతావరణం కంటే దట్టంగా చెట్లు ఉన్న చోట వాతావరణం చల్లగా ఉంటుంది. ≈ కర్బన ఉద్గారాల కట్టడికి చెట్టును మించిన విరుగుడు ఇంకేదీ లేదు. జీవితకాలంలో ఒక చెట్టు దాదాపు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలదు. వాయుకాలుష్యాన్ని నివారించడంలో చెట్లను మించినవేవీ లేవు. ≈ పూర్తిగా ఎదిగిన చెట్టు తన నీడలో ఉన్న మనుషులపై అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ప్రభావాన్ని దాదాపు 50 శాతం మేరకు నివారించగలదు. పూర్తిగా ఆరుబయట ఆడుకోవడం కంటే చెట్ల నీడన ఆటలాడుకోవడం పిల్లలకు క్షేమంగా ఉంటుంది. ≈ చెట్ల వల్ల గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. పూర్తిగా ఎదిగిన చెట్టు గాలిలోని ధూళి కణాలను 20 శాతం మేరకు, బ్యాక్టీరియాను 50 శాతం మేరకు అరికట్టగలదు. ఇలా చెట్లు మన ఆరోగ్యానికి కూడా రక్షణ ఇస్తాయి. ≈ ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో లేదా పైకప్పు మీద కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, ఆకుకూరల మొక్కలు వంటివి పెంచితే అవి చాలా వరకు ఆహార అవసరాలు తీరుస్తాయి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల చెట్లు పెంచితే అవి చల్లని నీడనివ్వడమే కాకుండా, పోషకాలనిచ్చే పండ్లను ఇస్తాయి. ≈ మొక్కలు, చెట్లు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయి. ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి బయటకు చూస్తూ చుట్టూ పచ్చదనం కనిపిస్తే మనసు ఆహ్లాదంగా మారుతుంది. పచ్చని వాతావరణం వల్ల దిగులు, గుబులు, ఆందోళన, అలజడి వంటి ప్రతికూల భావోద్వేగాలు సద్దుమణుగుతాయి. ≈ దృఢమైన కాండంతో పెద్దగా ఎదిగే చెట్లను పెరట్లో నాటినట్లయితే, అవి కొంత ఎదిగేంత వరకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏపుగా ఎదిగిన తర్వాత చాలా చెట్లకు రోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ≈ కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు ఇంట్లోనే పెంచుకుంటే ఖర్చు కన్నా ముందు ఆరోగ్యాన్ని విషరసాయనాల బారి నుండి చాలావరకు కాపాడుకోవచ్చు. నిత్యం బజారుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ≈ ఇంట్లో పెంచుకున్న మొక్కలు, చెట్ల నుంచి ఒకవేళ అవసరానికి మించి పండ్లు, కూరగాయల దిగుబడి వచ్చినట్లయితే వాటిని అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు. ≈ వృక్షసంపద శాంతిభద్రతలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చదనమే లేని కాంక్రీట్ వనాలను తలపించే పట్టణాల కంటే పచ్చని పరిసరాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. పచ్చదనం వల్ల మానసిక ప్రశాంతత నెలకొనడమే దీనికి కారణమని ఫిలడెల్ఫియాలోని టెంపుల్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్ల చెట్లు పూల మొక్కల తర్వాత ఇళ్లలో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడేది పండ్ల చెట్లనే. ఇంటి ఆవరణలోనో, పెరట్లోనో కొంచెం స్థలం ఉంటే ఇష్టమైన పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. పండ్ల చెట్లను కుండీల్లో పెంచుకునే అవకాశాలు తక్కువ. వీటిని పెంచుకోవాలంటే ఇంటి ఆవరణలోనైనా, పెరట్లోనైనా, డాబాలపైనా అన్నిరకాల పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. మామిడి, జామ, పనస, బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, దానిమ్మ, నేరేడు, మారేడు, సపోటా, సీతాఫలం, రేగు, అంజీర, ఉసిరి, నేల ఉసిరి, వెలగ, బొప్పాయి, అరటి వంటి పండ్ల చెట్లు ఇళ్లలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. పండ్ల చెట్ల వల్ల చల్లని నీడ దొరకడమే కాకుండా, రుచికరమైన పండ్లు లభించడం అదనపు లాభం. అంతేనా! పండ్ల చెట్లు రక రకాల పక్షులకూ ఆవాసంగా ఉంటాయి. దృఢమైన కాండం గల పండ్ల చెట్ల మీదకు పాకేలా రకరకాల తీగమొక్కలనూ పెంచుకోవచ్చు. పండ్ల వర్గంలో చేర్చకపోయినా, కొంత విశాలమైన స్థలం ఉన్నట్లయితే ఏపుగా ఎదిగే కొబ్బరి, పోక, బాదం వంటి చెట్లు కూడా పెరటి తోటల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి కాకుండా, తీగలుగా పాకే పుచ్చ, కర్బూజా వంటి మొక్కలను పందిరి పైకి లేదా పైకప్పు పైకి పాకించి పెంచుకోవచ్చు. కుండీల్లో పెంచుకోదగ్గ పండ్ల రకాలు చాలావరకు పండ్ల చెట్లను ఆరుబయటే పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని రకాల పండ్ల చెట్లను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుంటే పీచ్, ఆప్రికాట్, మల్బరీ, కేప్ గూస్బెర్రీ, చిన్న దానిమ్మ (డ్వార్ఫ్ పోమగ్రనేట్), ఫిగ్ వంటి చెట్లను పెంచుకోవచ్చు. ఇవి కాస్త గట్టి కాండంతో చెట్లుగా ఎదిగే రకాలే అయినా, వీటి ఎత్తు మూడు నాలుగు అడుగులకు మించి ఉండదు. అందువల్ల వీటిని విశాలమైన వరండాల్లో, బాల్కనీల్లో లేదా పైకప్పు మీద కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవచ్చు. ఇవే కాకుండా తీగజాతికి చెందిన ద్రాక్ష మొక్కలను కూడా కుండీల్లో పెంచుకోవచ్చు. కూరగాయల మొక్కలు కూరగాయలు, ఆకు కూరల మొక్కల్లో చాలావరకు ఇళ్లలో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. రోజువారీ వినియోగించే కూరగాయలు, ఆకు కూరల్లో చాలా రకాలను కుండీల్లో సైతం తేలికపాటి పద్ధతుల్లో పెంచుకోవచ్చు. కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే పెరటి తోటలుగా కూడా కూరగాయల మొక్కలను సాగు చేయవచ్చు. బయట కొనుగోలు చేసే కూరగాయలు, ఆకుకూరల కంటే ఇంట్లో పెంచుకునే మొక్కల నుంచి సేకరించే కూరగాయలు, ఆకుకూరలు సురక్షితంగా ఉంటాయి. బయట పొలాల్లో వీటి సాగు కోసం యథేచ్ఛగా పురుగు మందులు, రసాయనిక ఎరువులు వినియోగిస్తుంటారు. ఇళ్లలో పెంచుకున్నట్లయితే, పురుగు మందులు, రసాయనాలు వాడకుండానే వీటిని సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇళ్లలో పెంచుకోవడానికి అనువైన కొన్ని కూరగాయల రకాల గురించి... * బచ్చలి, బఠాణీ, చిక్కుడు, దొండ, దోస, ఆనప, పొట్ల, బీర, గుమ్మడి వంటి తీగజాతి మొక్కలను కుండీల్లో నాటుకుని, వాటి తీగలను ఇంటి పైకి పాకించవచ్చు. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఆరుబయట స్థలం ఉంటే వాటికి పందిరి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. * ఆవాలు, మెంతులు, ధనియాలు, పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, మిర్చి, టొమాటో, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం, వంగ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకు కూరలు, కూరగాయలను వాటిని కుండీల్లో తేలికగా పెంచుకోవచ్చు. * బాల్కనీల్లో లేదా టైపై, బీమ్లపైన కాస్త పెద్దసైజు కుండీలను, తొట్టెలను ఏర్పాటు చేసుకోగలిగితే ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, చిలకడ దుంప, కంద, చేమ, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి నేలలో పెరిగే కూరగాయలనూ సాగు చేసుకోవచ్చు. పెరట్లో తగినంత స్థలం ఉన్నట్లయితే, వీటిని నేరుగా మట్టిలోనే పెంచుకోవచ్చు. కూరగాయలు, పండ్లు... ప్రపంచ రికార్డులు కూరగాయల మొక్కలను, పండ్ల చెట్లను ఇళ్లల్లో పెంచుకునే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొందరు ఔత్సాహికులు ఎంతో శ్రద్ధాసక్తులతో వీటిని పెంచుకుంటూ ఉంటారు. కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన వారు కూడా ఉన్నారు. రికార్డులకెక్కిన అలాంటి విశేషాలు కొన్ని... అతిపెద్ద చిలకడ దుంప: చిలకడ దుంప ఎంత పెద్దగా కనిపించినా మహా అయితే దాని బరువు పావు కిలోకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయితే, ఇది అలాంటిలాంటి చిలకడ దుంప కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మహా భారీ చిలకడ దుంప. దీని బరువు ఏకంగా 11.2 కిలోలు. లెబనాన్‌లోని టైర్ నగరంలో ఖలీల్ సెమ్హాట్ అనే ఔత్సాహికుడి పెరటి తోటలో పండింది ఈ చిలకడ దుంప. అతిపెద్ద పనసపండు: పనసపండు సాధారణంగానే పెద్దగా ఉంటుంది. కాస్త పెద్దసైజు పనసపండు అయితే అయిదారు కిలోలు కూడా తూగుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత భారీ పనసపండు. దీని బరువు 34.6 కిలోలు. హవాయిలోని జార్జ్, మార్గరెట్ షాట్యూర్ దంపతుల ఇంటి ఆవరణలోని చెట్టుకు కాసింది ఈ బకాసుర పనసపండు. అతిపెద్ద క్యాబేజీ: క్యాబేజీ సాధారణంగా ఎంత పెద్దగా కనిపించినా ఒకటి రెండు కిలోల వరకు ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి భారీ క్యాబేజీ. అమెరికాలో అలాస్కా రాష్ట్రంలోని పామేర్ ప్రాంతంలో జాన్ ఇవాన్స్ అనే మెకానికల్ డిజైనర్ పెరటి తోటలో కాసింది ఈ రాకాసి క్యాబేజీ. దీని బరువు ఎంతంటారా? కేవలం 34.4 కిలోలు మాత్రమే! అతిపెద్ద పుచ్చకాయ: చూడగానే భూగోళాన్ని తలపించే పుచ్చకాయలు సాధారణంగానే పెద్దగా ఉంటాయి. కాస్త పెద్దసైజు పుచ్చకాయలు ఐదారు కిలోల వరకు కూడా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పుచ్చకాయ. దీనిని ఒక మనిషి మోయడం అసాధ్యం. దీని బరువు ఏకంగా 122 కిలోలు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రానికి చెందిన లాయిడ్ బ్రైట్ కుటుంబానికి చెందిన పొలంలో పండింది ఇది. అతిపెద్ద క్యారెట్: అతిపెద్ద క్యారెట్ రికార్డు కూడా అతిపెద్ద క్యాబేజీని పండించిన జాన్ ఇవాన్స్ పేరు మీదే ఉంది. అలాస్కాలోని ఈ పామేర్ పెద్దమనిషి తన పెరటితోటలో పండించాడు దీన్ని. దీని బరువు ఏకంగా 8.5 కిలోలు. అతిపెద్ద గుమ్మడిపండు: గుమ్మడిపండ్లు సహజంగానే పెద్దగా ఉంటాయి. ఎంత పెద్ద గుమ్మడిపండునైనా ఒక మనిషి కాస్త కష్టంగానైనా మోసేందుకు వీలవుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న గుమ్మడి పండును మోయాలంటే మనుషులు చాలరు. క్రేన్లు ఉపయోగించాల్సిందే! ఎందుకంటే దీని బరువు 951 కిలోలు మరి. బెన్ మీయర్ అనే స్విస్ తోటమాలి తోటలో పండింది ఇది. అతిపెద్ద కాలిఫ్లవర్: ఇది కూడా అలాస్కాలోని పామేర్ పెద్దమనిషి జాన్ ఇవాన్స్ పెరటితోటలో పూసినదే. ఎంత పెద్ద కాలిఫ్లవర్ అయినా ఒకటి రెండు కిలోలకు మించి ఉండదు. అయితే ఇవాన్స్ తోటలో పూసిన ఈ కాలిఫ్లవర్ మాత్రం ఏకంగా 14.1 కిలోలు తూగింది. అతిపెద్ద బ్రకోలి: కాలిఫ్లవర్ మాదిరిగానే ముదురాకుపచ్చ రంగులో కనిపించే బ్రకోలీ విషయంలోనూ అలాస్కాలోని పామేర్కు చెందిన జాన్ ఇవాన్స్దే రికార్డు. ఆయన పెరటితోటలో పండిన ఈ బ్రకోలి బరువు 15.8 కిలోలు. అతిపెద్ద యాపిల్: ఎర్రగా బుర్రగా కనిపించే యాపిల్ పండు సాధారణంగా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటుంది. జపాన్‌లోని హీరోసాకి నగరంలో చిసాతో ఇవాసాకి అనే రైతు తోటలో పండిన ఈ యాపిల్‌ను పట్టుకోవడానికి రెండుచేతులు చాలవు. దీని బరువు 1.849 కిలోలు. అతిపెద్ద నిమ్మకాయ: నిమ్మకాయలు మామూలుగా ఎంత ఉంటాయి? గుప్పిట్లో రెండు మూడు నిమ్మకాయల వరకు అవలీలగా ఇమిడిపోతాయి. ఇజ్రాయెలీ రైతు కఫార్ జీతిమ్ తోటలో పండిన ‘గజ’నిమ్మకాయను పెకైత్తాలంటే కాస్త ప్రయాస పడాల్సిందే! ఈ నిమ్మకాయ బరువు 5.265 కిలోలు మరి. అతిపెద్ద ఉల్లిపాయ: సాధారణంగా బజారులో దొరికే ఉల్లిపాయల్లో ఎంత పెద్ద ఉల్లిపాయ అయినా మహా అయితే అరకిలోకు కాస్త అటు ఇటుగా తూగుతుందేమో! ఇంగ్లాండ్‌లోని పీటర్ గ్లేజ్బ్రూక్ అనే పెద్దాయన తన తోటలో పండించిన ఉల్లిపాయ ప్రపంచంలోనే అతి భారీ ఉల్లిపాయ. దీని బరువు 7.7 కిలోలు. అతిపెద్ద బంగాళదుంప: ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళదుంపను పండించిన ఘనత కూడా అతిపెద్ద ఉల్లిపాయను పండించిన ఇంగ్లాండ్ పెద్దాయన పీటర్ గ్లేజ్బ్రూక్కే దక్కుతుంది. ఆయన తోటలో పండిన ఈ బంగాళ దుంప బరువు 3.8 కిలోలు. ఇళ్లలో పెంచుకోగల ఔషధ మొక్కలు పెరటి తోటల్లోను, కుండీల్లోను చాలా రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే సామెత ఉంది గాని, అదంతా ఉత్తుత్తదే! పెరట్లోనో, ఇంట్లో కుండీల్లోనో పెంచుకున్న ఔషధ మొక్కలు కూడా వైద్యానికి భేషుగ్గానే పనికొస్తాయి. అత్యవసరమైన ఔషధ మొక్కలు కొన్నయినా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి అనువైన కొన్ని ఔషధ మొక్కల గురించి... * తులసి, పుదీనా, కొత్తిమిర, మెంతికూర, లావెండర్, రోజ్మేరీ, కలబంద వంటివి చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. * మన దేశంలో దాదాపు హిందువులందరి ఇళ్లల్లోనూ తులసి కోట ఉంటుంది. పూజ కోసం తులసి మాలలు, తీర్థంలోకి తులసి ఆకులను విరివిగా వాడుతుంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు తులసిలో చలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. * తులసి ఆకులను నమిలి తిన్నా, తులసి ఆకుల రసంలో కాస్త తేనె కలిపి తీసుకున్నా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు నయమవుతాయి. ఆకలి తగ్గుదల, వికారం, తలనొప్పి, మొటిమలు, చిన్న చిన్న గాయాలు వంటివి నయం చేయడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది. * యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు గల పుదీనాను వాంతులు, కడుపునొప్పి, అజీర్ణం, నోటి దుర్వాసన, తలనొప్పి వంటివి నయం చేయడానికి ఉపయోగిస్తారు. * యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా గల కొత్తిమీరను మూత్రాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, జాండిస్, రక్తపోటు, డయాబెటిస్, ఉబ్బసం, కీళ్లనొప్పులు నయం చేయడానికి వాడతారు. * మెంతికూరలోనూ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, అజీర్తి, కడుపునొప్పి, చిగుళ్లవాపు వంటివి నయం చేయడానికి మెంతికూర ఉపయోగపడుతుంది. * సుగంధం వెదజల్లే రోజ్మేరీ మొక్క వాతావరణంలోని ఎలాంటి హెచ్చుతగ్గులనైనా తట్టుకోగలదు. జలుబు, తలనొప్పి, అజీర్తి, బట్టతల, చుండ్రు, కండరాల నొప్పులు, డిప్రెషన్ నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. * సుగంధాలు వెదజల్లే లావెండర్‌ను సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. యాంటీ సెప్టిక్ లక్షణాలు, యాంటీ డిప్రెసంట్ లక్షణాలు లావెండర్లో పుష్కలంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, వాంతులు, మైగ్రేన్, పంటినొప్పి, జుట్టురాలడం వంటి సమస్యలను లావెండర్ సమర్థంగా నయం చేయగలదు. * దళసరిగా కనిపించే కలబంద ఆకులు తోటకు అందానివ్వడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇళ్లలో పండించే కూరగాయల మొక్కలకు కాసే కూరగాయలకు కలబంద గుజ్జును పట్టిస్తే, చాలా రకాల బ్యాక్టీరియా వాటికి సోకకుండా ఉంటుంది. * విటమిన్-సి పుష్కలంగా ఉండే కలబంద గుజ్జు మౌత్‌వాష్‌గా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోను, జీర్ణకోశ సమస్యలను నియంత్రించడంలోను, గాయాలను నయం చేయడంలోను కలబంద సమర్థంగా పనిచేస్తుంది. * కుండీలో పెంచుకోగల మరో అద్భుతమైన ఔషధ మొక్క చెంగల్వ కోష్టు. దీని మూలిక డయాబెటిస్‌ను అదుపు చేయడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ‘ఇన్సులిన్ ప్లాంట్’ అని కూడా అంటారు. ఇది చర్మవ్యాధులను, అధిక రక్తపోటును కూడా అరికడుతుంది. * కుండీలో పెంచుకునే అవకాశం లేకపోయినా, ఇంటి వద్ద కొంత ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా పెంచాల్సిన ఔషధ వృక్షం వేపచెట్టు. వేప ఆకులు, బెరడు, పూతలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. * చుండ్రు, మొటిమలు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కడుపులోని క్రిమిదోషాలు, మలేరియా, డయాబెటిస్ వంటివి నయం చేయడంలో, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో వేప సాటిలేనిది. * ఔషధ గుణాలు గల వృక్షాల్లో ఉసిరి చెట్టు కూడా ముఖ్యమైనది. ఆయుర్వేద ఔషధాల తయారీలో త్రిఫలాల్లో ఒకటైన ఉసిరిని విరివిగా వాడతారు. * విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. జుట్టురాలడం, కంటి జబ్బులు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులను నయం చేయడంలోనూ ఉసిరి సమర్థంగా పనిచేస్తుంది. ♦ పండ్లు, కాయలు ఇవ్వకున్నా, కేవలం నీడనిచ్చే చెట్లను కూడా పెరటి తోటల్లో పెంచుకోవచ్చు. కాస్త విశాలమైన స్థలం ఉన్నట్లయితే దేవదారు, అశోక, వేప, రావి, జమ్మి, మద్ది, టేకు, సరుగుడు, నీలగిరి వంటి చెట్లను పెరట్లో పెంచుకోవచ్చు. బలమైన కాండంతో ఎదిగే ఇలాంటి చెట్లపైకి వివిధ రకాల తీగ మొక్కలను పాకించవచ్చు. చల్లని నీడనిచ్చే ఇలాంటి చెట్లు దీర్ఘకాలంలో కలప కోసం ఉపయోగపడతాయి. వీటి ద్వారా వచ్చే కలపను వంటచెరకు కోసం, ఫర్నిచర్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ♦ కొన్ని పెరటి మొక్కలు అత్యంత అరుదుగా దొరుకుతాయి. వీటిని పెంచడం వల్ల పెరటి తోటకే ఒక అందం వస్తుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే బ్రహ్మకమలం మొక్కలను అక్కడక్కడా కొందరు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ♦ అరుదైన మొక్కల్లో కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయని వృక్ష శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ♦ మెజెంటా ఘోస్ట్ ఫ్లవర్, మౌంటైన్ బాల్సాన్, సిరోయి లిల్లీ, స్ట్రైప్డ్ డ్యూ ఫ్లవర్ వంటి పూల మొక్కలు మన దేశంలో అరుదుగా కనిపిస్తాయి. ఈ మొక్కలు కుండీల్లో కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ♦ అరుదైన మొక్కలను అంతరించిపోకుండా కాపాడుకుంటేనే పర్యావరణ సమతుల్యత బాగుంటుందని చెబుతున్నారు. ఉద్యాన ఉత్పత్తుల్లో మనది రెండోస్థానం హరిత విప్లవం ప్రభావంతో మన దేశంలో 1960, 70 దశకాల నాటి ఆహార కొరత పరిస్థితి చాలా వరకు తీరింది. వ్యవసాయ విధానంలో మన ప్రభుత్వాలు ఇప్పటికీ తిండిగింజలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నా, ఉద్యాన ఉత్పత్తుల్లోనూ మన దేశం గడచిన నాలుగు దశాబ్దాలలో గణనీయమైన పురోగతినే సాధించింది. ఉద్యాన ఉత్పత్తుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు వంటి ఉద్యాన ఉత్పత్తుల సాగు విస్తీర్ణం 2014-15 నాటికి 2.34 కోట్ల హెక్టార్లు కాగా, ఈ ఉత్పత్తుల పరిమాణం 283.5 మిలియన్ టన్నులు. మన దేశంలో ఉద్యాన ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని నల్లగొండ, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా, మధ్యప్రదేశ్‌లోని సాగర్, షాదోయి, పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్, మహారాష్ట్రలోని పుణే, ఔరంగాబాద్, జల్గాంవ్, సాంగిల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. మొక్కలు - వాస్తు చల్లని నీడ కోసం, పరిమళాలు వెదజల్లే పూల కోసం, ఆహార అవసరాలు తీర్చే కూరగాయలు, పండ్లు వంటి వాటి కోసం చాలామంది మొక్కలను పెంచుతుంటారు. అయితే, కొందరు వాస్తుపరమైన నమ్మకాలతో కూడా ఇళ్లలో మొక్కలను పెంచుతూ ఉంటారు. భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ ‘ఫెంగ్‌షుయి’ నమ్మకాల ఆధారంగా అరిష్టాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో, అదృష్టం కలసి వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు. నమ్మకాలతో ముడిపడ్డ కొన్ని మొక్కల గురించి... * ‘ఫెంగ్‌షుయి’ ప్రకారం కుండీలో లాటస్బాంబూ మొక్కను పెంచితే అదృష్టం కలసి వస్తుందని చాలామంది నమ్ముతారు. * జెండాలా రెపరెపలాడే పూలు పూసే పీస్లిల్లీ మొక్కలను కుండీలో పెంచుకున్నట్లయితే ఇంటికి లేదా కార్యాలయానికి ఆకర్షణశక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది. * మనీప్లాంట్‌ను ఇంటి గుమ్మం వద్ద కుండీలో పెంచుకున్నట్లయితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారు. * ఇంట్లో లేదా కార్యాలయంలో అంబ్రెల్లా ప్లాంట్‌ను పెంచుకుంటే కార్యసాఫల్యతతో పాటు అదృష్టం కలసి వస్తుందనే నమ్మకం ఉంది. * తులసిచెట్టు ప్రతి ఇంటా ఉండి తీరవలసిందని, దీనివల్ల సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. * ఇంటికి తూర్పు, ఉత్తర దిశలలో చిన్న చిన్న మొక్కలను పెంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే, ఈశాన్య మూలలో మాత్రం ఎలాంటి మొక్కలు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోవాలనేది వాస్తు నిబంధన. * గులాబీని మినహాయిస్తే మిగిలిన ఎలాంటి ముళ్ల చెట్లను ఇళ్లలో పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తుమ్మ వంటి ముళ్ల చెట్లను ఇంట్లో పెంచితే అవి ప్రతికూల శక్తులకు ఆలవాలంగా మారుతాయనే నమ్మకం ఉంది. * ఇంటికి నైరుతి దిశలో పూల మొక్కలను పెంచడం వల్ల అదృష్టం కలసి వస్తుందని వాస్తుశాస్త్ర నమ్మకం. * రాతి నిర్మాణాలతో కూడిన రాక్‌గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి నైరుతి మూల అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, రాక్ గార్డెన్స్‌ను ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. -
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
డిండి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. గురువారం మండలంలోని తవక్లాపూర్ గ్రామంలో ఆయన మెుక్కలు నాటి మాట్లాడారు. మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలనే సదుద్ధేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు రాజనేని వెంకటేశ్వరరావు, బల్ముల తిరుపతయ్య, జయానందం, బయ్య వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
నందిగామ(కొత్తూరు): మొక్కల సంరక్షించి అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని మండల పరిధిలోని నందిగామ సర్పంచ్ కొమ్ముకష్ణ కోరారు. గురువారం పంచాయతీ పరిధిలోని పెద్దగుట్టతాండ, బండకుంటతాండలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం తాండలో పలుచోట్ల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాండవాసులు, మహిళసంఘం సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. -
పోడు చేస్తే పాడే..
పోడు భూముల్లో పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ భారీగా భూములు స్వాధీనం మెుక్కలు నాటేందుకు ఏర్పాట్లు మంత్రి చెప్పినా వినని అధికారులు లబోదిబోమంటున్న పోడు రైతులు కొత్తగూడ : కొత్తగూడ ఏజెన్సీలో భారీ ఎత్తున పోడు భూములను స్వాధీనం చేసుకుని మెుక్కలు నాటేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ మాసానికి ముందే వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని పంటలు వేయకుండా అడ్డుకుని మెుక్కలు నాటారు. ఇప్పుడు పంటలు వేసిన భూముల్లో సైతం డోజర్ ట్రాక్టర్లతో పంటలు ధ్వంసం చేసి ప్లాంటేషన్ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈశ్వరగూడెం గ్రామ సమీపంలో అటవీ భూముల్లో వేసిన పంటలను తొలగించారు. అడవికి మారు పేరు ఏజెన్సీ ప్రాంతం.. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ప్రధాన జీవనాధారం పోడు వ్యవసాయం. అయితే ప్రతీ సంవత్సరం పోడు పెరుగుతుండటం, అడవి తరుగుతుండటంతో ప్రభుత్వాదేశానుసారమే పోడు భూముల స్వాధీనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు వారించినా.. వివిధ పార్టీలు, పోడుదారులు ఆందోళనలు చేసినా ప్లాంటేషన్ పనులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వారు ఇంటర్నెట్ ఆధారంగా 2014 వరకు అడవి ఉండి ఆ తరువాత సాగులోకి వచ్చిన భూముల వివరాలు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అందించే నెంబర్ల ఆధారంగా పోడు భూములను గుర్తిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలాంటి సమాచారమూ బయటకు తెలియకుండా ఒక్కసారిగా యంత్రాలతో దాడులు చేసి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. పది ఎకరాలకు మించి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారిని గుర్తించి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. పోడు భూముల ఆక్రమణలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు తేలితే భూముల స్వాధీనంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు మండలానికి చెందిన వార్డెన్ ఈసం స్వామి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును గత సంవత్సరం సస్పెండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జంగాల విశ్వనాథంకు చెందిన 24 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెట్టారు. ఆ భూమిని ఆదివాసీలకు ఇవ్వాలని హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోకుండా కోర్టులో కూడా శాఖాపరంగా కేసుకు వెళ్తూ భూమిని మాత్రం వదలకపోవడం విశేషం. అదే విదంగా గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసీంను ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగూడ మండలానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధిపై కూడా ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది. భారీగా పోడు చేసిన బావురుగొండ గ్రామానికి చెందిన పలువురు నుంచి అటవీ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్లాంటేషన్ ఇలా.. కొత్తగూడ మండలంలో నర్సంపేట రేంజ్ పరిధి కొత్తపల్లి బీట్‌లో 13 హెక్టార్లు, కర్నెగండిలో 5 హెక్టార్లు, ముస్మి–1 బీట్‌లో 10హెక్టార్లు, ముస్మి–2 బీట్‌లో 5 హెక్టార్లు, ఎంచగూడెం నార్త్, సౌత్ బీట్లల్లో 5 హెక్టార్ల చొప్పున ప్లాంటేషన్ చేశారు. కొత్తగూడ రేంజ్ పరిధిలో మర్రిగూడెం బీట్‌లో 50 హెక్టార్లు, కొత్తగూడ బీట్‌లో 28 హెక్టార్లు, తిరుమళగండి బీట్‌లో 10 హెక్టార్లు, పందెం బీట్‌లో 3 హెక్టార్లు, బత్తులపల్లి బీట్‌లో 5 హెక్టార్లలో ప్లాంటేషన్ చేశారు. అదే బీట్‌లో మరో 5హెక్టార్లు, పోలారం బీట్‌లో 20 హెక్టార్లు ప్లాంటేషన్ చేసేందుకు చదును చేసి గుంతలు తవ్వారు. వర్షాలు లేక పనులు ఆపారు. మంత్రి చెప్పినా.. ఇప్పటి వరకు ఎన్నడూలేని విధంగా పోడు భూములపై అటవీ శాఖ కన్నెర్ర చేయడంతో స్థానిక అధికార పార్టీ నాయకులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫారెస్ట్ శాఖ దాడులు ఆపేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రయత్నాలు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఆదివాసీ నిరుపేద రైతులు 2005 కంటే ముందు సాగు చేసిన భూములలో సాగుకు అడ్డు తగలబోమని ఆ తరువాత సాగు చేసిన పోడు భూములను, పది ఎకరాలకంటే ఎక్కువ సాగుచేస్తున్న రైతులను మాత్రం వదలబోమని ఫారెస్ట్ ఉన్నతాధికారులు కరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఆదివాసీ కుల సంఘాలు, ప్రతిపక్షాలు, విప్లవ పార్టీలు రైతుల పక్షాన ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోగా ప్లాంటేషన్ పనులను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండటంతో ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది. -
మరో 10 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం
మరో 10 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం గొలుగొండ: కేడీపేట– నర్సీపట్నం మార్గంలోని ఆరిల్లోవ అటవీప్రాంతంలో మరో పది హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకానికి అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 20 హెక్టారల్లో ఔషధ మొక్కల పెంపకాన్ని అధికారులు చేపట్టారు. అదనంగా మరో పది హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం చేపట్టేందుకు అటవీభూమిని సిద్ధం చేస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి. -
జిల్లాలో 2.76 కోట్ల మెుక్కలు నాటాం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.76 కోట్లు నాటినట్లు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో 95 శాతం మొక్కలు సరై్వవల్ అయినట్లు తెలిపారు. జియో టాగింగ్ విధానం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత జిల్లాకు రూ.11.66 కోట్లు నిధులు అవసరమని తెలిపారు. మండల ప్రత్యేక అధికారుల ద్వారా నివేదికలు తీసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పీసీ సుధార్‌బాబు, కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అటవీశాఖ అధికారులు రాజారావు, అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 4.5కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్: జిల్లాలో నాలుగున్నర కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 3.70 కోట్లు నాటినట్లు చెప్పారు. వాతావరణ కాలుష్యాన్ని తొలగించి, మానవ మనుగడకు సహకరించే అడవులతో వర్షాలు కురిసి కరువుకాటకాలు దూరమవుతాయన్నారు. రోడ్లకిరువైలా మెుక్కలు నాటేందుకు ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జెడ్పీటీసీ లంక సదయ్య, వైస్ ఎంపీపీ కొంకటి మల్లారెడ్డి, సర్పంచులు సత్యనారాయణ రెడ్డి, సతీష్, ఉప సర్పంచు పెంతల మల్లయ్య, పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
డీపీఓ అరుణ శామీర్‌పేట్: ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని డీపీఓ అరుణ అన్నారు. ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమాల గురించి తెలుసుకుని మాట్లాడారు. గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మండలంలోని 8 గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది డీపీఓను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీడీఓ జ్యోతి, ఈఓపీఆర్డీ శ్రీనివాస్ గుప్త, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల పరిరక్షణకు తోడ్పాటును అందించాలి
జడ్చర్ల : బాదేపల్లి నగర పంచాయతీలో హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు పట్టణ వాసులు, ప్రముఖులు తోడ్పాటునందించాలని నగర పంచాయతీ కమిషనర్ గంగారాం పేర్కొన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు బాదేపల్లి రంజిత్‌బాబు హరితహారం కార్యక్రమానికి తన వంతుగా రూ.10వేల నగదును కమిషనర్‌కు అందజేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు మొక్కల పరిరక్షణకు ట్రీగార్డ్‌లను ఏర్పాటు చేసేందుకు సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గంగారాం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీలు, రహదారులు తదితర ప్రాంతాల్లోదాదాపు 50 వేల మొక్కలకు పైగా నాటామని తెలిపారు. ట్రీగార్డుల ఏర్పాటుకు వ్యాపారులు, ప్రముఖులు తదితరులు మొక్కలను కాపాడేందుకు తమ వంతు సహాయం చేయాలని కోరారు. -
జనం డబ్బేగా.. మనది కాదుగా!
* వనం–మనం పేరుతో మొక్కల కొనుగోళ్ళు * కల్యాణవేదిక ఆవరణలో పడేసిన వైనం * ఎండిపోతున్న మొక్కలు మంగళగిరి : మున్సిపల్ పాలకులు, అధికారులు ప్రజా ధనాన్ని వృథా చేయడం, స్వాహా చేయడంలో వారికెవరు సాటిరారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాన్ని పచ్చదనంతో సుందరీకరించడంతో పాటు ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘వనం – మనం’ కార్యక్రమానికి మున్సిపాల్టీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మొక్కలను రూ 2.50 లక్షలతో కొనుగోలు చేశారు. తొలుత నాలుగు రోజులు మొక్కలు నాటుతూ ఫొటోలకు ఫోజులిచ్చి ఆర్భాటపు ప్రచారం చేసుకున్నారు. తర్వాత మిగిలిన మొక్కలను నాటలేదు. వాటిని వృథాగా పడేయడంతో అవి పూర్తిగా ఎండిపోతున్నాయి. వాటిని నసింహుడి కల్యాణ వేదిక ఆవరణలోని కళామండపం పక్కన పడేశారు. దీంతో ఆ మొక్కలకు నీరు లేక ఎండిపోతున్నాయి. కష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో కల్యాణ వేదిక ఆవరణలో భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు వసతి కల్పిస్తున్నారు. దీంతో మొక్కలు అడ్డంకిగా మారాయి. తీసుకెళ్లాని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. -
3.43 కోట్ల మొక్కలు నాటాం
కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహరం కింద జిల్లాకు నిర్ధేశించిన 3.50 కోట్ల మొక్కల లక్ష్యానికిగాను ఇప్పటివరకు 3.43 కోట్లు నాటినట్టు కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. హరితహరంపై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారం లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు బాధ్యతగా, అంకితభావంతో కృషి చేసి; రాష్ట్రంలో జిల్లాను ప్ర«థమ స్థానంలో నిలిపారంటూ అభినందించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో సుమారు కోటిన్నర మొక్కలను నాటించాలని అటవీశాఖ అధికారులను కోరారు. పొలం గట్లపై, పంట భూములలో ఎక్కువ మొక్కలు నాటించాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ సామాజిక వన విభాగం అటవీ సంర„ý ణాధికారి రాజారావు, ఖమ్మం అటవీ సంరక్షణాధికారి నర్సయ్య, డీఎఫ్ఓలు సతీష్‌కుమార్, శార్వానన్, శాంతారామ్, డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అణు కేంద్రం వద్దు
కావలి : ప్రజల మారణకాండకు కారణమయ్యే అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయొద్దని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గొట్టిపాటి సునీత అన్నారు. పట్టణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అణు విద్యుత్‌ప్లాంటు నిర్మించడానికి లోలోపల ప్రభుత్వాలు ప్రయత్నించడం చూస్తుంటే జిల్లా ప్రజలపై కక్ష సాధిస్తున్నట్లు ఉందన్నారు. దీనిని అడ్డుకోవడానికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. చాలాదేశాల్లో ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించడంతో అణు విద్యుత్ కేంద్రాలను మూసివేశారన్నారు. మనదేశంలో బెంగాల్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కేంద్రాలు పెట్టేందుకు ప్రయత్నిస్తే అక్కడి ప్రజలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య, నవయువ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటాం
పరిరక్షణకు నోడల్ అధికారుల నియామకం వరంగల్ సీపీ సుధీర్‌బాబు కమిషనరేట్ పరేడ్ మైదానంలో హరితహారం వరంగల్æ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల మంతా నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటామని సీపీ సుధీర్‌బాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్ కా ర్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం సీపీ పది లక్షల మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో భాగంగా గత నెల 8వ తేదీ నుంచి మొక్కలు నాటుతున్నామన్నారు. పోలీ సు అధికారులు, సిబ్బంది సమష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, 10 లక్షల మొక్కను కమిషనరేట్ పరిధిలో నాటినట్లు తెలిపారు. తెలంగాణ రా ష్ట్ర వృక్షం జమ్మి చెట్టును పరిరక్షించాలన్న ధ్యేయం తో.. 2వేల జమ్మి మొక్కలను దేవాలయ ప్రాంగణా ల్లో నాటించామన్నారు. ఇప్పటి వరకు మామునూరు పోలీసు డివిజన్ పరిధిలో 3,96,546, కాజీపేట పరి ధిలో 3,26,775, వరంగల్ పరిధిలో 1,66,880, హన్మకొండ పరిధిలో 1,03,926, క్రైం, ట్రాఫిక్ విభాగాలు 17,400 మొక్కలు నాటారన్నారు. మొత్తం 10 లక్షల మొక్కలు కమిషనరేట్ పరిధిలో నాటించినట్లు వివరించారు. నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక నోడల్ అధికారిని నియమించి, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, సీఐలు కిషన్, రాజిరెడ్డి, విష్ణుమూర్తి, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, ఆర్ఎస్సైలు శ్రీధర్, సంపత్, యాదగిరి, తాహేర్, వేణు, శివకేశవులు, రమేష్, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. -
నేటి నుంచి రెండో దశ మెగా ప్లాంటేషన్
కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలంలో గురువారం నుంచి 15 వరకు రెండో దశ మెగా ప్లాంటేషన్ చేపడుతున్నట్లు ఆర్డీవో చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిషత్‌లో బుధవారం హరితహారం నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 15 వరకు 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడతలో నాటిన 4లక్షల మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో దేవేందర్‌రాజు, ఈవోపీఆర్డీ దేవకిదేవి, ఈజీఎస్ ఏపీవో శోభ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలో 500 గన్నేరు మొక్కలు రేకుర్తిలో రాజమండ్రి నుంచి తెప్పించిన 500 గన్నేరు మొక్కలను నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ నందెల్లి పద్మ ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ నుంచి జగిత్యాల ఆర్అండ్బీ రోడ్డు వరకు గల డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు. ఉపసర్పంచ్ ఎస్.కష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, పీఆర్ ఏఈ, నోడల్ అధికారి జగదీశ్, వార్డుసభ్యులు ఎస్.నారాయణ, మాజీద్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే బాన్సువాడ ఫస్ట్
హరితహారం అమలులో మొదటి స్థానం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి బాన్సువాడ టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మరితహారం అమలుపై ఫారెస్ట్, మునిసిపల్, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు బీఆర్ మీనా, గోపాల్, అజయ్ మిశ్రా మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడ తహసీల్ కార్యాలయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పడావుగా ఉన్న రెవెన్యూ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో బండ్ ప్లాంటేషన్ మొక్కలను నాటాలని, నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3.35 కోట్ల మొక్కల లక్షల లక్ష్యం కాగా, ఈ నెల 8 వరకు 3,31,315 మొక్కలు నాటామని అన్నారు. జిల్లాలో 90 శాతం మొక్కలను నాటినట్లు వివరించారు. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, కోటగిరి, పిట్లం, నిజాంసాగర్, వేల్పూర్, డిచ్పల్లి, భీమ్‌గల్, ఆర్మూర్ మండలాల్లో వంద శాతం మొక్కలు నాటినట్లు, ఇటీవల గిరిరాజ్ కళాశాల విద్యార్థులతో సర్వే చేయించామని, అందులో 95 శాతం అనుకులంగా వచ్చిందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, మార్చి వరకు మొక్కలను నాటాలని ఆయన సూచించారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలని, అందుకోసం ట్రీగార్డులు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, ఎజాస్, అలిమోద్దీన్బాబా, ఆర్ఐలు సంగమేశ్వర్, వసీం, వీఆర్వోలు సాయిబాబా, లక్ష్మికాంత్, ఏపీఎం గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
మొక్కోద్యమం
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం.. ప్రగతికి మెట్లు.. పచ్చని చెట్లు.. అంటూ వందలాది గొంతులు గళమెత్తాయి. గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో విద్యార్థులు మానవహారం చేపట్టారు. ప్రకృతిని పరిరక్షిస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల ఆవరణలు, రోడ్డుకిరువైపులా లక్ష మొక్కలు నాటారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, కౌన్సిలర్లు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, తమ్మినీడి సత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
మెుక్కల సంరక్షణకు జియోటాగింగ్
అధికారులకు కలెక్టర్ కరుణ ఆదేశం హన్మకొండ అర్బన్ : జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు, మొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జియోటాగింగ్ విధానం అమలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి అటవీశాఖ సాంకేతిక నిపుణుడు బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జియోటాగింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన మొక్కలను ప్రదేశాల వారీగా మూడు రోజుల్లో జియోటాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ప్రతి శాఖకు కేటాయించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో మొక్కల వివరాలు ఆన్లైన్లో మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం సాగునీటి పారుదల, విద్యాశాఖ, ఎక్సైజ్, ఉద్యాన వన శాఖ, ఇంజనీరింగ్ శాఖల వారీగా లక్ష్యాలను సమీక్షించారు. జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీఓ బీఆర్‌రావు, డీఎఫ్ఓ శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
నియోజకవర్గ అధికారులదే బాధ్యత కన్జర్వేటర్ ఆఫ్ పారెస్టర్ ఎంజే.అక్బర్ ముకరంపుర : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు 4.25 కోట్ల మొక్కలను నాటాలని వరంగల్ రేంజ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ ఎంజే.అక్బర్ అన్నారు. సోమవారం నియోజకవర్గ స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు మెుక్కలు నాటించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటడం మెల్లగా సాగుతోందని, వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. టేకు, యూకలిప్టస్, ఈత మొక్కలు కొనుగోలు చేస్తున్నామని, రెండుమూడు రోజుల్లో నేరుగా మండల కేంద్రాలకు పంపుతామని తెలిపారు. జిల్లాలోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు కోటి వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జేసీ శ్రీదేవసేన మాట్లాడుతూ ఉపాధిహామీలో మంజూరు చేసిన మేరకు గుంతలు తవ్వాలన్నారు. ఉపాధిహామీలో తదుపరి మంజూరు ఉత్తర్వులు రావని తెలిపారు. ఏజేసీ నాగేంద్ర, డీఎఫ్‌వోలు, సోషల్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. -
వారం రోజుల్లో కోటి మొక్కలు నాటాలి
హరితహారంలో జిల్లా నెంబర్ వన్ కావాలి విద్యార్థులు, వృత్తికులాల వారిదే ఈ బాధ్యత అవసరమైనన్ని మెుక్కలు పంపిణీ చేస్తాం 10వేల మెుక్కలు నాటిన చోట బోర్లు వేయిస్తాం హరితహారం చైతన్య సదస్సుల్లో మంత్రి ఈటల కరీంనగర్ సిటీ : హరితహారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో వృత్తి కులసంఘాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, మహిళా సంఘాలతో జెడ్పీ సమావేశమందిరం, రెవెన్యూగార్డెన్స్‌లో వేర్వేరుగా హరితహారం చైతన్య సదస్సులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 2.28 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా నాల్గవ స్థానంలో ఉందన్నారు. సమష్టిగా కష్టపడి జిల్లాను మొదటి స్థానంలో నిలిపాలన్నారు. విద్యార్థులు భాగస్వాములు అయితేనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. జిల్లాలో 5.50 లక్షల మంది విద్యార్థులున్నారని, వీరిలో కనీసం 4లక్షల మంది 25 చొప్పున వారం రోజుల్లో కోటి మొక్కలు నాటాలని సూచించారు. పంచాయతీరాజ్ ఏఈలు, అటవీశాఖ అధికారులు పాఠశాలలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలోని రైల్వేట్రాక్‌లకు రెండు వైపులా 200 కిలోమీటర్ల మేర 10 లక్షల మొక్కలు, ఎస్సారెస్పీ కాలువల పక్కన 30 లక్షల మొక్కలతోపాటు రోడ్లు, వాగుల పక్కన విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం తరపున గుంతలు తవ్విస్తామని, మొక్కలు సరఫరా చేస్తామని, నాటాల్సిన, కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదేన ని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంపై డీఈఓ సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. గీతకార్మికులు చెరువులు, కుంటల కట్టలపై 10 లక్షల ఈత మొక్కలు నాటాలని, ముదిరాజ్‌లు గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, సీతాఫలం, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మెుక్కలు, యాదవులు వాగులు, చెరువుల పక్కన గొర్రెలకు అవసరమైన తుమ్మ, తదితర మొక్కలు నాటాలని కోరారు. ఆ మెుక్కలు చెట్లు ఎదిగిన తర్వాత వాటిపై పూర్తి హక్కు వృత్తి కులాలదేనని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపిస్తే ఐదు రోజుల్లో మొక్కలు అందిస్తామన్నారు. ఐదు నుంచి పదివేల మొక్కలు నాటిన చోట ప్రభుత్వ తరపున బోర్లు వేయిస్తామన్నారు. వేసవిలో అగ్నిమాపక వాహనాలు, ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయిస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ అడవులు అంతరించిపోయిన కారణంగానే జిల్లాలో సరిపడా వర్షాలు కురవడం లేదన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, డీఎఫ్ఓలు రవికిరణ్, వినోద్‌కుమార్, కె.మహేందర్‌రాజు, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్ఈ దశరథం, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ట్రస్మా నాయకులు యాదగిరి శేఖర్‌రావు, కడారి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో భాగస్వామ్యం కావాలి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఎల్లారెడ్డిపేటలో మొక్కలు నాటిన కలెక్టర్ ఎల్లారెడ్డిపేట : హరితహారం ద్వారా మండలంలో 40 లక్షల మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మండలంలోని దేవునిగుట్ట, చింతకుంటతండాల్లో కలెక్టర్ మొక్కలు నాటారు. పీఎల్డీపీ పథకం ద్వారా ఒడ్డెర కులస్తులకు కేటాయించిన 32 ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకానికి అవసరమైన బోరుమోటార్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఒడ్డెర కులస్తులకు కేటాయించిన భూమిలో పండ్లతోటలు పెంచుకుని జీవనోపాధి పొందాలన్నారు. రూ.6లక్షలతో నాలుగు బోర్లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను బిగించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, సర్పంచ్ నాజీం, ఎంపీటీసీ పెంటయ్య, తహశీల్దార్ పవన్‌కుమార్, ఎంపీడీవో చిరంజీవి, ఎంఈవో రాజయ్య, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ కొండ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. చెరువు భూములను కబ్జాచేస్తే చర్యలు చెరువులను అన్యక్రాంతం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రాచర్లగొల్లపల్లిలోని గోదుమకుంట చెరువు భూములను కొందరు కబ్జా చేసి పంటలు సాగుచేస్తున్నార ని రైతులు, యువకులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువులను అన్యక్రాంతం చేసేవాళ్లపై క్షేత్రస్థాయిలో విచారణచేసి తగుచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు భూములను కాపాడాలని తహశీల్దార్ పవన్‌కుమార్, వీఆర్వో శ్రీనివాస్‌ను ఆదేశించారు. -
మెుక్కల పెంపకంతోనే మానవ మనుగడ
ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి మడికొండ : మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్ఆర్ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా పాఠశా ల అవరణలో సుమారుగా 750 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజ్మెం ట్ సభ్యులు సీతారాంరెడ్డి, రమణరెడ్డి, శ్రీనివాసురెడ్డి, జోనల్ ఇన్చార్జి సదన్‌రావు, ప్రేమ్‌చరణ్, ప్రిన్సిపాల్ రాజు, సుస్మి త, ఉపాధ్యాయులు,పాఠశాలవిద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
దేవరకొండ : హరిత తెలంగాణే లక్ష్యంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డు, రిటైర్డ్ ఉద్యోగుల భవనం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, శిరందాసు కష్ణయ్య, వడ్త్య దేవేందర్, చీదెళ్ళ గోపి, బురాన్, వెంకటేశ్వర్రావు, టీవీఎన్.రెడ్డి, ఎలిమినేటి సాయి, వస్కుల కాశయ్య, యాదగిరి, వేముల రాజు, బొడ్డుపల్లి కష్ణ తదితరులున్నారు. -
నాటిన ప్రతిమొక్కను బతికించాలి
దేవరకద్ర : హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బ తికిస్తేనే కార్యక్రమం, లక్ష్యం విజయవంతమైనట్లని క లెక్టర్ టీకే.శ్రీదేవి అన్నారు. బుధవారం మండలంలో ని గూరకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అ వరణలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మొక్కలు నాటితే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మానవుడు మొక్కలు నాటి సంరక్షిం చడం సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చే పట్టిందని, ఇందుకోసం కోట్ల ప్రజాధనం కేటాయిం చిందని, అందరు భాగస్వాములైతేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థులు, పాఠశాలలు, ఇంటి ఆవరణలో, రైతులు పొలం గట్ల వెంట, యువకులు రహదారుల వెంట మొక్కలు నాటడానికి ముందుకు రావాలని కోరారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులచే కలెక్టర్ హరిత హారంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇవీ.గోపాల్, మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, ఎంపీడీఓ భాగ్యలక్ష్మీ, ఏపీఓ లత, హెచ్ఎం గోపాల్‌రెడ్డి, సర్పంచ్ కాలే బుచ్చన్న, శ్రీకాంత్‌యాదవ్, దాసరి లక్ష్మమ్మ పాల్గొన్నారు. -
గట్టుపై చెట్టు.. చేనుకు చేదోడు
పొలం గట్లపై పెంపకం.. పర్యావరణానికి మేలు రైతులకు అదనపు ఆదాయం మొక్కల పెంపకంతో బహుళ ప్రయోజనాలు జగదేవ్‌పూర్: అడవులు అంతరించిపోవడంతో సరైన వర్షాలు లేవు. వర్షాలు సరిగా కురవక వాతావరణం నానాటికీ వేడెక్కిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు జలాశయాలు, చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతున్నాయి. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు పొలం గట్లపై విధిగా చెట్లు పెంచితే రాబోయే రోజుల్లో వర్షపాతం పెరగడంతో పాటు రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. హరితహారంలో మొక్కలు పంపిణీ చాలా వరకు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకుని ఆకాశం వైపు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడా సాధారణ వర్షపాతాలు సైతం నమోదు కాని పరిస్థితి ఉంది. సరిపడా అడవులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్క లు నాటే కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం టేకు, తెల్లదుద్ది, వేప, నేరేడు, జామ, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, మొక్కలతో పాటు గడ్డిజాతి మొక్కలను పంపిణీ చేస్తుంది. రైతులు పొలం గట్లపై పెంచుకోవడానికి ఈ మొక్కలన్నీ కూడా అనుకూలమైనవే. వీటి వల్ల పంటకు రక్షణ లభిస్తుంది. అటు కొన్ని సంవత్సరాల తర్వాత వాటిపై ఆదాయం కూడా పొందవచ్చు. రైతులు ఖాళీ భూముల్లో మొక్కలు నాటుకోవడం వల్ల పెద్దగా శ్రమ లేకుండానే ఆదాయం అభిస్తుంది. వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల్లో ఎర్ర చందనం, టేకు, సుబాబుల్ లాంటి మొక్కలను ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు. పర్యావరణ లాభాలు రైతులు మొక్కల పెంపకం ద్వారా తనకు తాను ఆదాయం పొందడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో రూ. 2.50 నుండి రూ.5 లక్షల విలువ చేసే ఆక్సిజ¯ŒS అందిస్తుంది. విషవాయువులను పీల్చి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. నీటినిల్వ చేయడం, నీటి ఆవిరి ఉత్పాదకత, మేఘాల ఏర్పాటుకు చెట్లు ఎంతో దోహదం చేస్తాయి. పంటకు కంచె అడవులు అంతరించిపోవడం మూలంగా అడవి జంతువులు పంట చేలల్లోకి వచ్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి చేను చుట్టూ కొన్ని రకాల మొక్కలు పెంచితే ఈ బెడద నుంచి కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట చుట్టూ స్తంభాలు, కడీలు పాతి ముళ్లకంచె వేస్తుంటారు. దీనికి బదులు ఏక వృక్ష చెట్లు నాటి, వాటికి మూడేళ్ల వయసు వచ్చిన అనంతరం ముళ్ల కంచె వేసుకుంటే చేనుకు పటిష్ట రక్షణ లభిస్తుంది. 25 సంవత్సరాల అవే చెట్ల ద్వారా ఆదాయం పొందవచ్చు. స్థానికంగానే మొక్కలు లభ్యం రైతులు స్థానిక నర్సరీల నుండి మొక్కలను పొందవచ్చు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై చెట్ల పెంపకం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామంలో ఈజీఎస్ ఎఫ్ఏ వద్ద మొక్కల కోసం ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. మొక్కల పంపిణీతో పాటు ఈజీఎస్ కూలీలు రైతుల పొలం గట్లపై మొక్కలను నాటుతారు. మొక్కలు నాటడం ఇలా... ప్రతి మూడు మీటర్లకు ఒకటి చొప్పున గుంతలు తవ్వాలి. ఇవి ఒకటిన్నర లేదా రెండు అడుగుల లోతు–వెడల్పు ఉండేలా తీయాలి. మొక్కలు నాటే ముందు పశువుల ఎరువును కొంచెం వేసుకోవాలి. మొక్కను ప్లాస్టిక్ కవరు నుండి తీసేటప్పుడు మొక్కల వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా బయటకు తీయాలి. గుంతలో ముందే కొంత మట్టి పోసి తర్వాత మొక్కను పెట్టి చుట్టూ మట్టిని నింపాలి. ఆ తర్వాత గుంత చుట్టూ గట్టిగా రెండు కాళ్లతో తొక్కాలి. అనంతరం నీళ్లు పోయాలి. ఇలా అయితే మొక్క బాగా పెరుగుతుంది. గట్లపై చెట్లతో ప్రయోజనం పండ్ల జాతికి చెందిన జామ, నిమ్మ, బొప్పాయి, నేరేడుతో పాటు టేకు, వేప, తెల్లదుద్ది తదితర మొక్కలను ప్రభుత్వం అందిస్తోంది. పొలంలో పంటతో పాటు గట్లపై మొక్కలు పెంచుకుని కొన్ని ఏళ్ల తర్వాత రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు. పండ్ల మొక్కలైన జామ, ఉసిరి, నేరేడు, నిమ్మ ఎత్తు తక్కువగా పెరగడంతో పాటు కాయలు కూడా రెండేళ్లలోనే చేతికి అందుతాయి. టేకు, వేప, తెల్లదుద్ది చెట్లు పదేళ్లలో పెరుగుతాయి. వీటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. గట్లపై చెట్టు రైతు భూమి సరిహద్దును గుర్తించడానికి కూడా ఉపయోగపడుతాయి. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు పొలంలో నీటి పదును తగ్గకుండా కూడా దోహదం చేస్తాయి. నేలకోతలను నివారిస్తాయి పంట సాగు చేసే నేల గట్టు దెబ్బతినకుండా ఆ గట్లపై ఉండే చెట్లు కాపాడతాయి. అలాగే, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు చెట్ల కారణంగా చల్లని వాతావరణం ఏర్పడి పంటకు మేలు కలుగుతుంది. నీటి నిల్వలు తొందరగా వాడిపోవు. పెసర, మినుము, వేరుశనగ, శనగ వంటి పంటలను ఎక్కువగా ఆశించే లద్దెపురుగు, అంక్షిత పురుగులు వంటి వాటికి గట్లపై ఉండే చెట్ల వల్ల అడ్డుకట్ట పడుతుంది. గట్లపై చెట్లను పెంచడం వల్ల పక్షులు చెట్టు కొమ్మలపై గూళ్లు కట్టుకుని ఉండి, చేనును ఆశించే వివిధ పురుగులను తిని మేలు చేస్తాయి. -
టిఫిన్ చేస్తే.. మెుక్క ఫ్రీ
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న చిరువ్యాపారి వర్ధన్నపేట టౌన్ : ఆయన ఓ టిఫిన్ సెంటర్ నడుపుకునే చిరు వ్యాపారి. అయితే ఆయన అందరిలా కేవలం టిఫిన్ పెట్టి డబ్బులు మాత్రమే తీసుకోడు. ఒక మెుక్క ఇచ్చి వాగ్దానం కూడా తీసుకుంటాడు. ఎందుకు.. ఏమిటి అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు మాత్రమే కృషి చేస్తే సరిపోదు అందరం శ్రమించాలి అంటూ మెుక్కలను ఉచితంగా అందజేస్తున్నాడు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పులుమాటి శంకర్, హైమావతి దంపతులు కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఓ చిన్న టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. విభిన్న వంటకాలను రుచికరంగా చేయగలిగే ఆయనకు చెట్ల పెంపకం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తన ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా ఇంటి ఆవరణలో మొక్కలను పెంచి తన టిఫిన్ సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు వాటిని అందజేస్తూ నాటి పరిరక్షించేలా వాగ్దానం తీసుకుంటున్నాడు. విశేషమేమిటంటే తను పెంచిన మొక్కలు సమయానికి సరిపడా లేకుంటే కూరగాయ విత్తనాలను సైతం ఇస్తూ వినియోగదారులను పర్యావరణం పట్ల చైతన్యవంతులను చేస్తున్నాడు. ఉన్నంతలో ఊరందరికీ ఉపయోగపడుతున్న ఈ వన ప్రేమికుడిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటే కాలుష్యం అనే మాటే ఉండదేమో. -
ఏఎంసీల పరిధిలో భారీగా మొక్కల పెంపకం
5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు రావులపాలెం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో వనం–మనం పథకం ద్వారా ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. వనం–మనంలో భాగంగా రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఏఎంసీ చైర్మన్ బండారు వెంకట సత్తిబాబు ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవం జరిగింది. యార్డు ప్రాంగణంలో జేడీ శ్రీనివాసరావు, చైర్మన్ సత్తిబాబులు పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏవీ శ్రీధర్, సూపర్వైజర్లు పి.సుబ్బరాజు, ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గుతు ్తల ఏడుకొండలు పాల్గొన్నారు. స్థానిక డాన్‌బాస్కో స్కూల్లో కరస్పాండెంట్ బాలరాజు ప్రిన్సిపాల్ బల్తాజార్ ఆధ్వర్యంలో 550 మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ
మునగాల : హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మెుక్కలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిదని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానక తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంఓ జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు, ఎంపీపీ ప్రమీల, తహసీల్దార్ కె.ఆంజనేయులు, ఆర్ఐ స్వప్న, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ అమరబోయిన మట్టయ్య పాల్గొన్నారు. -
వైవీయూలో ఘనంగా వనం–మనం
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘వనం–మనం’ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయం ఆవరణంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా భారీ ర్యాలీగా తరలివచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్టెప్ సీఈఓ మమత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి సంరక్షించాలని సూచించారు. భూతాపాన్ని తగ్గించడంలోను, మంచి పర్యావరణం ఏర్పాటు చేయడంలో చెట్లు ఎంతో కీలకమన్నారు. విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య ఎం. ధనుంజయనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యత భావించి, భావితరాలకు మంచి పర్యావరణం అందించడానికి మొక్కలు నాటడమే సరైన మార్గమన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రకృతి పరిరక్షణా సమితి అధ్యక్షులు సిద్ధప్ప మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కనీసం మూడు సంవత్సరాల వరకు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి. గులాంతారీఖ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య టి. రాంప్రసాద్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, హరినాథ్, వెంకటేశ్వర్లు, విజయభారతి తదితరులు పాల్గొన్నారు. -
'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు
నూజివీడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం 'వనం-మనం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్ తండా వద్ద ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలకు వనం-మనం ఆరంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఔషద, రావి, వేప చెట్లను నాటారు. కాగా హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. -
డీల్స్..
కిర్లోస్కర్ చేతికి వీఎస్ఎల్ స్టీల్స్ పిగ్ ఐరన్ ప్లాంట్ న్యూఢిల్లీ: వీఎస్ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్(దుక్క ఇనుము) ప్లాంట్‌ను రూ.155 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కిర్లోస్కర్ ఫై ఇండస్ట్రీస్ తెలిపింది. గురువారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొంది. వీఎస్ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్ ప్లాంట్ సంబంధిత చర, స్థిర ఆస్తులన్నింటిని రూ.155 కోట్లకు కొనుగోలు చేయాలని డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని తెలిపింది. ఐడియా కూషర్ని కొనుగోలు చేసిన కాగ్నిజంట్ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని కొనుగోలు చేసింది. డిజిటల్ టెక్నాలజీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఐడియా కూషర్ను కొనుగోలు చేశామని కాగ్నిజంట్ పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను కాగ్నిజంట్ వెల్లడించలేదు. ప్రొటొటైపింగ్ ఉత్పత్తుల డిజైనింగ్, వ్యాపార విధానాల్లో ప్రత్యేకీకరణ సాధించిన ఐడియా కూషర్ ఇక కాగ్నిజంట్ డిజిటల్ వర్క్స్‌లో భాగమవుతుంది. -
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
రాజాపేట : మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని హరితహారం ప్రత్యేక అధికారి, అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మోహన్‌చంద్ ఫర్గెయిన్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఇప్పటివరకు నాటిన మొక్కలు, వాటి పరిస్థితి, సంరక్షణ తదితర వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారం క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల 29 లక్షల మొక్కలు నాటగా జిల్లాలో కోటి 41లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన మొక్కలు స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ కొమ్మగల్ల యాదగిరి, ఏపీఓ రాములు తదితరులు పాల్గొన్నారు. -
2లక్షల73వేల మొక్కలు నాటాం : డీఈఓ
నార్కట్‌పల్లి: హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ అధ్వర్యంలో జిలాల్లో 2లక్షల 66 వేల మొక్కలు నాటవలసి ఉండగా ప్రస్తుతానికి 2లక్షల 73 వేల 4వందల మొక్కలు నాటినాట్లు డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చిన్ననారయణపురం గ్రామంలోని ప్రా«థమిక పాఠశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. వీరి వెంట ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీడీఓ గుర్రం సురేశ్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎపీఓ వెంకటేశం, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ లింగయ్యలున్నారు, -
మొక్క...లెక్క
టార్గెట్ 3.54 కోట్లు.. నాటింది 2.42 కోట్లు లక్ష్యాన్ని చేరుకోని పలు శాఖలు సాక్షిప్రతినిధి, ఖమ్మం జిల్లాలో హరితహారం టార్గెట్ చేరుకోలేదు. దీంతో జిల్లా నుంచి ప్రభుత్వానికి పంపిన టార్గెట్‌ను పూర్తి చేసేవరకు మొక్కలు నాటాలని కలెక్టర్ అన్ని శాఖల ఆధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన హరితహారంలో ఇప్పటి వరకు 2.42 కోట్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న జిల్లా, మండల స్థాయి అధికారులపై హరితహారం ముగిసిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు పంపే అవకాశముంది. హరితహారం కింద జిల్లాలో 3.54 కోట్ల మొక్కలు నాటాలనుకున్నారు. అటవీశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 214 నర్సరీల ద్వారా మొక్కలు పంపిణీ చేశారు. అయితే గ్రామాల్లో టేకు, మామిడి, జామ, ఉసిరి ఇతర పండ్ల మొక్కలు కావాలని డిమాండ్ ఉండడంతో 26 లక్షల మెుక్కలు కొనుగోలు చేయడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. రాష్ట్రం మొత్తం మీద జిల్లాలోనే అటవీ విస్తీర్ణం తగ్గిందని.. మొక్కలు ఎక్కువగా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా, పలు శాఖలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినా, కొన్ని శాఖలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ఈ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని, అధికారుల పనితీరుకు ఇది గీటురాయి అని వ్యాఖ్యానించడంతో మరికొన్ని శాఖల అధికారులు ఇచ్చిన లక్ష్యం కన్నా ఎక్కువగా మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. పోలీస్, డ్వామా, ఎక్త్సెజ్ శాఖలు ఇతర శాఖలతో పోలిస్తే ముందంజలో ఉన్నాయి. ప్రధానంగా డీఆర్డీఏ, అటవీ, ఉద్యానవన, పరిశ్రమల శాఖలు లక్ష్యానికి దూరంగా ఉండడం గమనార్హం. దేవాదాయ, సింగరేణి, ఐటీడీఏ పరిధిలో మొక్కలను విస్తతంగా నాటుతున్నారు. + పలు శాఖలు హరితహారం కింద ఇచ్చిన టార్గెట్.. నాటిన మొక్కల సంఖ్య (బుధవారం వరకు )ఇలా ఉంది. శాఖ టార్గెట్ నాటింది అటవి 54 లక్షలు 33.53 లక్షలు డీఆర్డీఏ 60 లక్షలు 22.70 లక్షలు మున్సిపాలిటీలు 10 లక్షలు 8 లక్షలు ఉద్యానవన 2.23 లక్షలు 77 వేలు పరిశ్రమలు 3.5 లక్షలు 78 వేలు విద్యాశాఖ 25 లక్షలు 23 లక్షలు కార్యాలయాలు 3.8 లక్షలు 2.57 లక్షలు ఎక్త్సెజ్ 40 వేలు 40 వేలు డ్వామా 25 లక్షలు 28 లక్షలు పోలీస్ లక్ష 7.45 లక్షలు ఇంకా పలుశాఖలు, సంస్థలు లక్షల్లో మొక్కలు నాటాయి. వన సేవకులపై ప్రచారం ఏదీ..? హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు వన సేవకులను పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 400 మొక్కల సంరక్షణకు ఒక వన సేవకుడిని నియమించుకోవాలి. ఒక్కో మొక్క సంరక్షణకు ఇతడికి నెలకు రూ.5 ఇస్తారు... అంటే నెలకు రూ.2వేలు చెల్లించాలి. అయితే దీనిపై ప్రచారం పెద్దగా లేకపోవడంతో ఎక్కడా వన సేవకుల నియామకం జరగలేదు. దీంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా ఎండల ప్రభావం ఉంటే మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మొక్కల సంరక్షణకు వన సేవకుల అవసరం ఉంటుంది. మొక్క నాటిన నుంచే సేవకులను పెడితే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరనుంది. మొక్క సంరక్షణకు డ్వామా కింద రూ.80 చెల్లిస్తారు. తుమ్మ కంపను మొక్క చుట్టూ ఏర్పాటు చేయాలి. దీనిపై కూడా గ్రామాల్లో ప్రచారం లేదు. ఈ నిధులను ఉపయోగించుకుంటే నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం బతికే అవకాశముంది. -
హరితహారంలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే
కేతేపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. గురువారం కేతేపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందడి వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, వివిధ గ్రామాల సర్పంచులు కె.వెంకటరమణ, వి.రాము, కె.లింగయ్య, బి.కవితనరేందర్, నాయకులు బి.శ్రీనివాస్‌యాదవ్ కె.మహేందర్‌రెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, బి.దయాకర్‌రెడ్డి, బి.రామక్రిష్ణ, బి.నరేందర్, ఎ.వెంకట్‌గౌడ్, కె.మహేష్, కీర్తి వెంకన్న, కె.వీరన్న, టి.సాగర్, జె.వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం నాటిన మొక్కను పరిశీలించిన ఎమ్మెల్యే
గుండ్రాంపల్లి(చిట్యాల): మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులో హైవే పక్కన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్కను గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వేప మొక్కకు ట్రీ గార్డును ఏర్పాటు చేయాలని, హైవే పక్కన నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన స్థానిక అటవీశాఖ, ఇతర అధికారులను ఆదేశించారు. ఆయన వెంట నార్కట్‌పల్లి ఎంపీపీ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోమ్మనబోయిన సైదులు తదితరులున్నారు. -
చెట్టు నరికివేతపై అధికారి ఆగ్రహం
ఆర్మూర్ : మండలంలోని అమ్దాపూర్ గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు కంచె ఏర్పాటుకు వేప చెట్టును ఉపాధి హామీ కూలీలు కొట్టేయడంపై జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అధికారి సుధాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆర్మూర్ ఎంపీడీవో లింగయ్యతో కలిసి అమ్దాపూర్, దేగాం, ఖానాపూర్, మగ్గిడి, సుర్బిర్యాల్, మంథని తదితర గ్రామాల్లో హరితహారం పనులను పరిశీలించారు. మొక్కల రక్షణకు కంచెగా సర్కారు తుమ్మ చెట్టు కొమ్మలను మాత్రమే వాడాలని సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఆర్మూర్ ఇన్చార్జి ఏపీవో అల్తాఫ్, సిబ్బంది తదితరులున్నారు. -
హరిత తెలంగాణే లక్ష్యం
రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా నల్లబెల్లి: రాష్ట్రంలో విస్తృతంగా మొక్కలు నాటి హరిత తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో ప్రతి ఒక్కరూ భా గస్వాములు కావాలని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని రంగాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం హరి తహారం నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విరివిగా మొక్క లు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండలంలో రెంకరాల భూములు పోలీస్ శాఖకు అప్పగిస్తే ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పెం చుతూ మోడల్ నర్సరీలుగా తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు మహిళలు, గ్రామస్తు లు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డీ ఎస్పీ దాసరి మురళీధర్, రూరల్ సీఐ బోనాల కిషన్, ఎంపీపీ బానోత్ సారంగపాణి, సర్పంచ్ గొనే రాంబాబు, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట ఎస్సైలు మేరుగు రాజమౌళి, వెంకటేశ్వర్లు, పులి వెంకట్‌గౌడ్, పీఎస్సై ఆర్ స్వామి, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ఉప్పుల మొగిలి, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రవీంద్రకుమార్ తది తరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాలో ‘హరిత ప్రసాదం’
కడప కల్చరల్: జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అంతటా హరితప్రసాదం పేరిట భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ శాఖ అసిస్టెంట్‌కమిషనర్ శంకర్ బాలాజీ తెలిపారు.బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో ఎంపికచేసిన 136 దేవాలయాల ప్రాంగణాలు, ఆలయ భూములలో మొత్తం 13,600 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 మంది ఈఓలు ఇప్పటికే తమ పరిధిలోని ఆలయాలలో ఈకార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లలో ఉన్నారని, స్థానికుల సహకారంతో మొక్కలు నాటేందుకుఅవసరమైన వాటిని సిద్ధం చేశారన్నారు. వీలున్న ప్రతి ఆలయం వద్ద 50 నుంచి 500 మొక్కలనునాటాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా పాలకొండల్లో ఎక్కువ మొక్కలను నాటాలని భావిస్తున్నామని, పొలతలలో 400, సీకే దిన్నెలో 200, ఇంకా ఆరుబయలున్న ఆలయాల వద్ద భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పరిసరాలతోపాటు సమీపంలోఉన్న ఆలయ భూములలో కూడా మొక్కలు నాటుతామన్నారు. శుక్రవారం ఆయా దేవాలయాలకువచ్చే భక్తులకు కూడా మొక్కలను హరిత ప్రసాదంగా అందజేయనున్నామని తెలిపారు. ఆ తర్వాత కూడా భక్తులకు మొక్కలను అందజేసేందుకు నర్సరీలతో సంప్రదిస్తామని, అవసరమైతే తమ శాఖ ఆ«ధ్వర్యంలో నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇందులో భాగంగా తులసి, మద్ది,మారేడు, ఉసిరి, వేప, బిల్వ, జమ్మి మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. -
నాటిన మొక్క ఎండిపోకూడదు
– అటవీ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం చిత్తూరు (కలెక్టరేట్) : జిల్లాలో నాటిన మొక్కల్లో ఏ ఒక్కటీ ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖాధికారులపై ఉందని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, విద్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలు, పొలాల గట్లు, రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఇందులో విద్యార్థులను, ఉద్యోగులను, ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. 29న వనమహోత్సవ కార్యక్రమాన్ని నిబద్ధతతో నిర్వహించాలన్నారు. జిల్లాలో 11 లక్షల మొక్కలు నాటాలని, ప్రతి మొక్కనూ సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన ఎఫ్ఆర్వోలకు రూ.50వేలు క్యాష్ అవార్డు ఉంటుందన్నారు. డీఎఫ్‌వో చక్రపాణి మాట్లాడుతూ మొక్కలు నాటిన తర్వాత వాటిని ఫొటో తీసి అటవీ శాఖ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో అప్లోడ్ చేయాలన్నారు. వనమహోత్సవంపై విద్యార్థులకు వక్తత్వ, క్విజ్, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వోలు శ్రీనివాసులు, జగన్నాథసింగ్, ఫారెస్టు రేంజ్ అధికారులు, నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు. -
తిరుపతిలో లావా మొబైల్ ప్లాంట్
చెన్నై: మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ‘లావా’.. తమ ప్లాంట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయనున్నది. ఏపీలోని తిరుపతిలో 20 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ల్యూక్ ప్రకాశ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ ఏర్పాటైతే దక్షిణాదిన ఇదే తమకు తొలి ప్లాంట్ అవుతుందని వివరించారు. తిరుపతితో పాటు యమున ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కూడా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.2,615 కోట్ల పెట్టుడులు కేటాయించామని పేర్కొన్నారు. -
శ్రద్ధ పెట్టకుంటే చర్యలు
మొక్కల పెంపకంపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – మొక్కుబడిగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరిక కర్నూలు(అర్బన్): ‘మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి.. ఆశామాషీగా తీసుకుని మొక్కుబడిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను హెచ్చరించారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నెల 29వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో 89 శాఖల అధికారులతో కలెక్టర్ ‘వనం–మనం’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సామాజిక అడవుల డీఎఫ్ఓ సావిత్రీబాయి పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మైదానాల్లో 29వ తేదీన విద్యార్థులందరి చేత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని డీఈఓ, డీవీఈఓలను ఆదేశించారు. 30వ తేదీన తాను ర్యాండమ్‌గా ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శిస్తాన ని తెలిపారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం, నిర్దేశిత ప్రాంతాల్లో మొక్కలు నాటడం అనంతరం మొక్కల పెంపకంపై సమావేశం నిర్వహించాలని మండల నోడల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామపంచాయతీలో మొక్కలు నాటాలి
సూర్యాపేటరూరల్ : ప్రతి గ్రామపంచాయతీలో తప్పనిసరిగా 40 వేల మొక్కలు నాటాలని సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట మండల సమాఖ్య కార్యాలయంలో హరితహారంలో భాగంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్‌ప్లాన్‌కు సంబంధించి నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో రెండు లక్షల మొక్కలు నాటామని.. మరో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే, ఇళ్లలో నాటేందుకు ప్రజలకు కావాల్సిన మెుక్కలు అందజేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, వివిధ గ్రామాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా 2.30 కోట్ల మొక్కలు నాటాం
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్ వెల్లడి ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హరితహారం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల్లో మూడు కోట్ల లక్ష్యం సాధిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యవసాయశాఖ, డీఆర్డీఏ, అటవీశాఖల ద్వారా ఒక రోజు హరితహారం నిర్వహించి దాదాపు 30 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. చెరువు కట్టలు, నాగార్జునసాగర్ కాలువగట్ల పక్కన ఈత గింజలు వేసేందుకు ఏడు లక్షల విత్తనాలు తెప్పించినట్లు చెప్పారు. హరితహారంలో స్వయం సహాయక సంఘ సభ్యులను భాగస్వాములను చేసి అధికంగామొక్కలు నాటేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు పురపాలక సంఘాలలో నిర్దేశించిన స్ధాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదన్నారు. మెప్మా పీడీ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్లకు ఆ పురపాలక సంఘాలు లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. ప్రతి మండలానికి 6 వేల మామిడి,అన్ని పురపాలక సంఘాలకు 35 వేల మామిడి మొక్కలను పంపిణీæ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎస్ మాట్లాడుతూ హరతహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను విజిలెన్స్ అండ్మానిటరింగ్ కమిటీ విచారణ నిర్వíß స్తుందని, నాటిన మొక్క లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించే విధంగా సూక్ష్మస్థాయిలో ప్రణాళిక చర్యలు చేపట్టాలని, నీటి లభ్యత వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీసీలో ఎస్పీ షానవాజ్‌ఖాసీం, జేసీ దివ్య, హరితహారం ప్రత్యేకాధికారి రఘువీర్, జిల్లా అటవీశాఖాధికారి నర్సయ్య, సీఈఓ మారుపాక నాగేశ్ పాల్గొన్నారు. -
స్వచ్ఛందంగా మెుక్కలు నాటాలి
మెట్పల్లి : పర్యావరణ పరిరక్షణకోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. పట్టణంలోని ఖాదీ ప్రతిష్టాన్‌లో సోమవారం హరితహారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి ఉమారాణి, నాయకులు మర్రి సహదేవ్, ద్యావత్ నారాయణ, సోమిడి శివ, ఖాదీ జీఎం వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత : డీఎస్పీ
కట్టంగూర్ : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని నల్లగొండ డీఎస్పీ సుధాకర్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలినగర్‌లో ఆయన మొక్కలను నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, మర్రి రాజు, ఐతగోని నర్సింహ, నమ్ముల సత్యనారాయణ, కానుగు లింగయ్య, యాదయ్య, పోగుల నర్సింహ, నాగేష్, మల్లేష్, బాలన ర్సింహ, శిరిశాల శంకర్ పాల్గొన్నారు. -
బాధ్యతగా భావించి మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ టౌన్ : మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ఎంతో దోహదపడుతాయన్నారు. మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ విడుదల చేసి పర్యావరణాన్ని కాపాడుతాయన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, కమిషనర్ అలివేలు మంగతాయారు, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలురి గోవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, కౌన్సిలర్ జయశ్రీ, రైల్వే ఏఈ చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ రేంజ్లో 40 లక్షల మెుక్కలు నాటాం
డీఐజీ ప్రభాకర్‌రావు కాళేశ్వరం : రెండో విడత హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజ్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 40 లక్షల మెుక్కలు నాటామని డీఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు. మహదేవపూర్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ‘సైరన్ కూత–హరితం మోత’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మెుక్కలు నాటేవారిని ప్రోత్సహించాలని, నరికేవారిని సహించొద్దని ప్రజలు, అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12 లక్షల మెుక్కలు నాటామని తెలిపారు. మహదేవపూర్‌లో సైరన్ ఆన్ చేయగానే అందరూ కలిసి 22,600 మెుక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, డీఎఫ్‌వో రవికిరణ్, సర్పంచ్ కోట రాజబాబు, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనాబాను, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి బాపు, ఎంపీటీసీ చాగర్ల రమాదేవి, ఎంఈవో రాజయ్య, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వరారవు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల హెచ్ఎంలు, నాయకులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
లక్ష్యం 3 కోట్లు
జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటాం హరితహారం జిల్లా ప్రత్యేకాధికారి నారాయణఖేడ్: హరితహారంలో భాగంగా జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ విజిలెస విభాగం అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, మెదక్ జిల్లా హరితహారం ప్రత్యేక అధికారి రాకేష్ డిబ్రియాల్ తెలిపారు. శనివారం నారాయణఖేడ్ ప్రాంతంలో హరితహారాన్ని పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా మొత్తంలో 3కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 1.19కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 14కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని వివరించారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలమడుగు, నిజాంట్, హన్మంత్‌రావుపేట్, మాద్వార్, కాంజీపూర్ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు. నారాయణఖేడ్ రేంజి పరిధిలో 2.70లక్షల మొక్కలు అటవీ భూముల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించి నాటుతున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో రేంజ్ అధికారి గణేశ్, సబ్‌రేంజ్ అధికారి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం
కల్తీ కల్లును అరికట్టేందుకే.. ఈత వనాల పెంపకానికి ప్రోత్సాహం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్ని/బీర్కూర్ : నిజామాబాద్, మహబూబ్‌నగర్ కల్తీ కల్లుకు పేరొందాయని, కల్తీ కల్లును అరికట్టి స్వచ్ఛమైన కల్లును అందుబాటులోకి తీసుకొచ్చేందుకే హరితహారంలో ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. లక్ష్యం పూర్తయ్యే వరకూ హరితహారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం వర్ని మండలంలోని అక్బర్‌నగర్‌లో, అలాగే, బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. కల్తీ కల్లును నివారించేందుకు ఈత వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని పోచారం చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 3.75 లక్షల ఈత మొక్కలు నాటించామని, మరో 1.25 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ మొక్కలు పెరిగిన తర్వాత కల్లు ప్రియులకు స్వచ్ఛమైన కల్లు దొరుకుంతుదని తెలిపారు. తద్వారా గీతకార్మికుల జీవనోపాధి మెరుగవుతుందని, ఎక్సైజ్ అధికారుల దాడులు ఉండవని చెప్పారు. ఇటీవల కోటగిరిలో 700 గిలక తాళ్లు అనే కొత్త రకం ఈతమొక్కలు నాటించామని, ఒక్కో చెట్టు 30–50 లీటర్ల కల్లునిస్తుందని వివరించారు.