
మొక్కలతో ర్యాలీగా వెళ్తున్న కొల్లు లక్ష్మీనారాయణ
సాక్షి, కోదాడ : తనకు ఓటు వేస్తే పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని, ప్రజలకు మెరుగైన జీవన విధానానికి అవకాశం కల్పిస్తానని హమీ ఇస్తున్నాడు కోదాడకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ. సోమవారం మొక్కలను చేత పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ ప్రేమి కులు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణం, గ్రామాల్లో హరిత వనాలు పెంచడంతో పాటు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment