
సాక్షి, కోదాడ : సూర్యాపేట జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా కమెడియన్ వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా...ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు.
దీంతో సోమవారం ఆయన మరో మారు కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేయాలని వేణుమాధవ్ భావించారు. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తన అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.