సాక్షి, హైదరాబాద్: విత్తన ప్రాసెసింగ్ ప్లాం ట్లకు కోడ్ నంబర్లు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ వ్యవసాయశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థకు ఈ అధికారాన్ని కల్పిం చింది. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్త ర్వులో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రమా ణాలు పాటించకుండా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు నడుస్తున్నాయన్న అంశం వ్యవసా య శాఖ దృష్టికి వచ్చింది.
వాటిల్లో ప్రాసెస్ అయిన విత్తనాలు నాణ్యంగా ఉండటం లేదు. పైగా రిజిస్ట్రేషన్ లేకుండానే అనేక విత్తన ప్రాసెస్ ప్లాంట్లునడుస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది వాటిని నియంత్రించేం దుకు రిజిస్ట్రేషన్, కోడ్ నంబర్ తప్పనిసరి చేస్తున్నాము’అని ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ‘సాక్షి’కి తెలిపారు. కోడ్ నంబరు ఉన్న విత్తనాన్నే కంపెనీలు రైతుల కు విక్రయించాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.