టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి | Woman dies of electric shock | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి

Jul 16 2024 6:16 AM | Updated on Jul 16 2024 8:27 AM

Woman dies of electric shock

చిత్తూరు జిల్లా కేపీ బండలో విషాదం

వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయ­కు­డి­కి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్‌ జాన్‌ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్‌కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.

దానికి  చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్‌ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సర­ఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడి­కక్కడే మృతిచెందారు. స్టార్టర్‌కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తు­న్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవా­లని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement