fence
-
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
కోట గేట్లు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న జీహెచ్ ఎంసీ కార్మికులు
-
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
కోతులతో కష్టాలు కనుమా.. కొండెంగలను తెచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది. కొండెంగలను తెచ్చినా.. కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్‌లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి? – గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్ -
ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె!
అడవుల్లో పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ ఏనుగులు ఆహారం కోసం కొత్త ప్రాంతాల్లోకి చొరబడాల్సిన పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణుల ప్రాణాలతోపాటు పంటలకు, పశువులకు రక్షణ కొరవడుతున్నది. ఏనుగులు–మనుషుల సంఘర్ణణను నివారించేందుకు కంచె పంటగా మల్బరీ మొక్కలను సాగు చేయటం, తేనెటీగల పెట్టెలతో కంచెను ఏర్పాటు చేయటం సత్ఫలితాలనిస్తున్న విషయమై గత వారం చర్చించుకున్నాం. ఈ వారం మరో బయోఫెన్స్ గురించి పరిశీలిద్దాం. పంట పొలాలు, గ్రామాల చుట్టూ నిమ్మ చెట్లతో దట్టమైన కంచెను ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల బెడద నుంచి బయటపడిన అస్సాం రైతుల అనుభవం గురించి తెలుసుకుందాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని శివసాగర్ జిల్లాలో గతంలో ఏనుగులు–మనుషుల ఘర్షణ. ప్రాణనష్టంతో పాటు పంట నష్టం సంఘటనలు తరచూ వినిపిస్తూ ఉండేవి. ఏనుగుల గుంపులో 150–200 నుంచి నాలుగైదు వరకు ఏనుగులు ఉంటాయి. అయితే, గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడుల బాధ తప్పిందని సౌరగూరి ప్రాంత రైతులు సంతోషిస్తున్నారు. నిమ్మ చెట్లతో బయోఫెన్స్లు నిర్మించుకోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అరణ్యక్ వీరికి అండగా నిలిచింది. నిమ్మ కంచెలపై అవగాహన కల్పించటంతోపాటు మొక్కలను సైతం అందించింది. జిగ్‌జాగ్ పద్ధతిలో మూడు వరుసలుగా నిమ్మ మొక్కలను దగ్గర దగ్గరగా నాటుకోవాలి. రెండు మూడు ఏళ్లు పెరిగేటప్పటికి నిమ్మ మొక్కల కొమ్మలు కలిసిపోయి ఏనుగులు దూరి రావటానికి వీలుకాదు. నిమ్మ చెట్లకుండే ముళ్లు, నిమ్మకాయల వాసన.. ఈ రెండిటి వల్ల ఏనుగులు నిమ్మ కంచెలు దాటి రాలేకపోతున్నట్లు అరణ్యక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి రక్షించడంతో పాటు రైతులకు నిమ్మకాయల విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది. నాలుగేళ్ల క్రితం నిమ్మ మొక్కల కంచె నాటిన హజారికా అనే రైతు వారానికి వెయ్యి వరకు నిమ్మకాలను కోసి విక్రయిస్తున్నారు. ఆఫ్సీజన్లోలో నిమ్మకాయ రూ.5 కి అమ్ముతున్నారు. సీజన్లో అయితే రూ.2–3కు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానిక వాతావరణం, పర్యావరణం, మట్టి స్వభావాన్ని బట్టి బయోఫెన్స్ రకాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ‘తేనెటీగ పెట్టెలతో కూడిన కంచెలు వర్షపాతం తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తేనెటీగలు మనుగడ సాగించలేవు. వెదురు మొక్కలతో కంచెలు స్వతహాగా వెదరు పెరిగే ప్రాంతాల్లో పర్వాలేదు. ఇతర ప్రాంతాల్లో వెదురు కంచెలు ఏర్పాటు చేస్తే.. ఇతర చెట్లను పెరగనీయకుండా ఇవే విస్తరించి జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయి. నిమ్మ చెట్లు, మొగలి ఆకారంలో ఉండే కిత్లలి (అగవె) జాతి తుప్పలతోనూ బయెఫెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతానికి ఏది అనువైనదో గ్రహించాలి. ఏనుగుల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఘర్షణలు నివారించి సహజీవన సూత్రాన్ని పాటించడానికి ‘కంచె తోటలు’ ఉపకరిస్తుండటం విశేషం. -
ఫెన్సింగ్ ఎక్కిన మొసలి!
నీటిలో ఉండే ప్రాణి ఏదంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది మొసలి. వీటిని ఎప్పుడు నీటిలో లేదా, భూమిపై పాకడం మాత్రమే చూశాం. కానీ ఫెన్సింగ్ ఎక్కడం ఎప్పుడైన చూశారా.. లేదంటే వెంటనే ఫేస్బుక్ తెరవండి మరి. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టీనా స్టేవర్ట్ అనే మహిళ, జాక్స్‌న్ విల్లేలోని నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఓ భారీ మొసలి(ఎలిగేటర్) ఫెన్సింగ్(కంచె)ను అలవోకగా ఎక్కుతుండటం చూసి తన మొబైల్లో వీడియో తీసింది. వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ‘మొసళ్లు అంటే నీటిలో లేదా నేల మీద పాకడం మాత్రమే చూశాం. కానీ ఈ రోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ భారీ మొసలి కంచెను ఎక్కడం చూసి నేను ఆశ్యర్యానికి గురయ్యాను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో, ఫొటోలకు ఇప్పటివరకు వేలల్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో ‘ఇది అరుదైన ఘటన.. భయంగా ఉన్నా బాగుంది’ అని ‘దూరం నుంచి చూసినప్పటికి..ఇది మంచి అనుభవం’ అంటూ ఒకరు.. నేను ఈ జాతి జంతు ప్రేమికున్ని కానీ.. నాకు ఇప్పటి వరకు తెలియదు ఇవి అలా ఫెన్సింగ్ ఎక్కగలవని!’ అంటూ అశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. -
భారత్, బంగ్లా మధ్య ‘కంచె’ హిట్టా, ఫట్టా?
సాక్షి, న్యూఢిల్లీ : అవాంఛనీయ వలసలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎత్తైన గోడలను నిర్మించాలని నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు భారత్ సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ట్రంప్ జాతి పేరిట మెక్సికోలను అడ్డుకోవాలనుకుంటే ఇక్కడ భారత్‌లో మతం పేరిట వలసలను అడ్డుకోవాలనుకుంటోంది. మెక్సికోలు రేపిస్టులు, నేరస్థులు, మాదక ద్రవ్యాల వ్యాపారులని ట్రంప్ ఆరోపిస్తుండగా, ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలను చొరబాటుదారులని, భూ ఆక్రమణదారులని, ఆవుల స్మగ్లర్లని, వారి నుంచి టెర్రరిస్టుల ముప్పు కూడా పొంచి ఉందని భారత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న హిందువులను మాత్రం శరణార్థుల క్యాటగిరీ కింద చూస్తోంది. అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎనిమిది అడుగుల ఎత్తైన గోడ ఉండాలని, అక్కడక్కడ కరెంట్ షాక్ కొట్టే వ్యవస్థ ఉండాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఇలాగే ఉండాలని మన భారత దేశం ఇదివరకే నిర్ణయించింది. భారత్‌కు, బంగ్లాదేశ్ మధ్య 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది కొండలు, గుట్టలతోపాటు దట్టమైన అడవులు, సుడులు తిరిగే నదీ నదాలతోని కూడి ఉంది. ఇందులో 70 శాతం సరిహద్దు ప్రాంతం భారత్‌కు చెందిందా లేదా బంగ్లాదేశ్‌కు చెందిందా? లేదా అక్కడే స్థిరపడిన స్థానికులదా? అన్నది స్పష్టంగా తేల్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మొదటి విడత కింద 854 కిలోమీటర్ల వరకు సరిహద్దు గోడ లేదా కంచె నిర్మించాల్సిందిగా 1989లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడత కింద 2,502 కిలోమీటర్లు కంచె నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇప్పటికే 1930 కిలోమీటర్లు పూర్తయిందని కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కంచె నిర్మాణం వల్ల ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలు కంచెకు ఇటు ఉండగా, వారి భూములు కంచెకు అవతల ఉండిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లాలంటే కంచె గేటులో నుంచి సైనికుల అనుమతి తీసుకొని వెళ్లాలి. అనుమతి తీసుకొని రావాలి. ఆలస్యమైతే గేటు మూత పడుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలి. గేటుకు అటూ, ఇటూ ఉండే బంధువుల పరిస్థితి మరీ దారణంగా ఉంది. సైనికుల చేతులు తడిమితేగానీ వారు ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదు. ఇక 48 కిలోమీటర్ల మేర పారుతున్న బ్రహ్మపుత్ర నదిని కలుపుకొని పలు ఉప నదుల వెంట 1,100 కిలోమీటర్ల సరిహద్దు కంచెను నిర్మించాల్సి ఉంది. దిగువ అస్సాంలోని ధూరి జిల్లాలో 300 కిలోమీటర్ల మేర సుందర్ బాన్ అడువులు ఉన్నాయి. ఈ అడవుల్లో భౌతిక కట్టడం నిర్మించడం అసాధ్యం. ఇన్ఫ్రా కిరణాల పిల్లర్లు, స్మార్ట్ సెన్సర్లను ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు ఇదివరకే తేల్చారు. దాని వల్ల కూడా పూర్తి ప్రయోజనం నెరవేరదని చెప్పారు. ఒక లేజర్ కిలోమీటరుకు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రయోగాత్మకంగా నాలుగు కిలోమీటర్లు నిర్మించారు. మిగిలిన 296 కిలోమీటర్ల పొడవున ఈ జనవరిలోగా పూర్తి చేయాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు ఏ మేరకు పనులు జరిగాయో ప్రభుత్వం చెప్పడం లేదు. ఇక నదులు, కొండలు ఉన్న 1100 కిలోమీటర్లలో సరిహద్దు కంచెను నిర్మించడం పూర్తిగా అసాధ్యం. ఆ ప్రాంతంలో నదుల సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ‘ఇది ఇరుదేశాల మధ్య సరిహద్దు’ అన్నది తేల్చడం కష్టం. ఆ ప్రాంతాల్లో జనావాసా ప్రాంతాలు కూడా నదులు సరిహద్దులు మారినప్పుడల్లా తమ నివాస ప్రాంతాలను ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు మార్చుకుంటారట. అక్కడి ప్రజలకు ఏది భారత్ సరిహద్దో, ఏది బంగ్లా సరిహద్దో తెలియదట. ఇలాంటి ప్రజావాస ప్రాంతాలను ‘అంతర్జాతీయ పరివేష్టిత జనావాస ప్రాంతాలు లేదా బంగ్లాదేశ్ చుట్టూరా ఉన్న భారత ప్యాకెట్స్’ అని పిలుస్తారని డచ్ చరిత్రకారుడు విల్లెమ్ వ్యాన్ షెండెల్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని జనావాస ప్రాంతాల మధ్య ఒకే రకమైన సంస్కృతి ఉంటుందని, పైగా సరిహద్దుకు ఇవతలి గ్రామం ఉత్పత్తులను అవతలి గ్రామం, అవతలి గ్రామం ఉత్పత్తులను ఇవతలి గ్రామం కొనుగోలు చేస్తోందని, ఈ గ్రామాల మధ్య కంచె నిర్మిస్తే ఆ గ్రామాల ప్రజలు ఏమవుతారని షెండెల్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017–18 ఆర్థిక బడ్జెట్లో బంగ్లా సరిహద్దులో ఫ్లడ్ లైట్ల కోసం 1327 కోట్లు, మౌలిక సౌకర్యాల కోసం 2,600 కోట్లు, 383 అదనపు ఔట్ పోస్టుల కోసం 15,569 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇంత సొమ్మును ఖర్చు పెట్టిన ఆశించిన ఫలితం ఉండదని షెండెల్ అంటున్నారు. బంగ్లా, భారత్ దేశాల మధ్య భౌతిక సరిహద్దులుకాదని, సామాజిక సరిహద్దులు బలంగా ఉన్పప్పుడే ఆశించిన ఫలితాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. -
గోడ దూకిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్‘ గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్ పెట్టారు. అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ గదిని సందర్శించాలని కిరణ్ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్ కలెక్టర్ ఆర్. కేశవన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీజే చంద్రన్, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్లోకి వెళ్లారు. -
కేసీ..ప్రాణాలు తోడేసి..!
♦ కర్నూలులో 6 కి.మీ మేర కేసీ కాలువ ♦ కంచె ఏర్పాటులో శాఖల మధ్య సమన్వయ లోపం ♦ ఏటా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు ♦ వారంలో ముగ్గురు చిన్నారుల గల్లంతు ♦ కన్నపేగు కన్నీరు తుడిచే వారేరి? కర్నూలు సిటీ: నగరం నడి మధ్యలో వెళుతూ నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే కేసీ కాలువ అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చిన్నారుల ప్రాణాలు తోడేస్తోంది. ఏటా కాలువలో చిన్నారుల గల్లంతవుతున్నా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిండుకుండలా.. ఇటీవల తుంగభద్ర నది జిల్లా సరిహద్దులో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు రావడంతో రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కేసీ కాలువ నిండు కుండలా ప్రవహిస్తోంది. నీటి ఉధతి ఎక్కువగా ఉండడంతో కాలువ గట్టుకు సమీపంలోని నివాసాలకు చెందిన వారు తమ పిల్లలను అటు వైపు పోకుండా కాపలాగా ఉంటున్నారు. కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివిధ పార్టీల నాయకులు ప్రతి సందర్భంలోనూ చెబుతూ వస్తున్నా ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో చిన్నారుల ప్రాణాలు కాలువలో కలిసిపోతున్నాయి. అంచనాల్లోనే జాప్యం.. నగరంలో సుమారు 6 కి.మీ కేసీ కాలువ ప్రయాణిస్తుంది. స్టాంటన్‌పురం దగ్గర మొదలై, ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గత ప్రభుత్వం హయాంలో 1.75 కోట్లతో కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి బంగారుపేట వరకు నేటికీ కంచె ఏర్పాటు చేయలేదు. కాలువకు కుడి వైపున కంచె లేకపోవడంతోనే గురువారం కాలేబు అనే విద్యార్థి కాలువలోకి దిగి కొట్టుకుపోయాడు. కాలువకు ఇరువైపులా 3 కి.మీ కంచె ఏర్పాటుకు రూ.71 లక్షలతో కేసీ ఇంజనీర్లు అంచనాలు వేశారు. అయితే అంచనాల్లో తప్పులు దొర్లడం, వాటిని సరిదిద్దడంలోనే కాలం కరిగిపోతోంది. జూలైలోనే ఈ పనులు కొలిక్కి వచ్చుంటే గత నెల నాటికే పూర్తయ్యేవి. వీరి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు హేతువుగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయండిజిల్లాకలెక్టర్తో చర్చించినఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీకెనాల్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. శుక్రవారం సాయంత్రం ఎంపీ జిల్లాకలెక్టర్ సత్యనారాయణను ఆయన ఛాంబరులో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీకాలువ నగరంలోని జనావాస ప్రాంతాల గుండా వెళుతుందని, చిన్నపిల్లలు తెలిసీ తెలియక వెళితే ప్రమాదకరమని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీ వెంట వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.కె.రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. కంచె ఏర్పాటు చేయండి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీ కాలువకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. పిల్లలు కేసీ కాలువలో గల్లంతైన సంఘటనకు నిరసనగా శుక్రవారం జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 200 కోట్లతో నగరాన్ని అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్న నాయకులకు కేసీ కెనాల్‌కు కంచె వేయాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాలువకు కంచె లేకపోవడంతో పొరుగున ఉండే కాలనీలకు చెందిన ఎంతోమంది పిల్లలు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెంటనే కంచె ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు చేపడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య హెచ్చరించారు. పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు కటారి సురేశ్, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సాంబశివారెడ్డి, ధనుంజయాచారి, చంద్రశేఖర్‌గౌడ్, జీవరత్నం, అశోక్, అశోక్‌కుమార్, సంజు, ఫైజాన్, మంగమ్మ, ఉమాబాయి పాల్గొన్నారు. -
వినూత్న ఆచారం
► ఊరి చుట్టూ కంచె ! ► 13 నుంచి ఊరమ్మ జాతర దావణగెరె : జాతర సందర్భంగా మొత్తం ఊరు ఊరే తొమ్మిది రోజుల పాటు తన చుట్టు తానే కంచె వేసుకుంటుంది. నేటి ఆధునిక యుగంలోనూ ఇలాంటి విచిత్రమైన ఆచారంతాలూకాలోని కక్కరగొళ్ల గ్రామంలో మూడేళ్లకొకసారి జరిగే శ్రీఊరమ్మ దేవి జాతర సందర్భంగా ఆచరిస్తారు. జాతర సందర్భంగా మొత్తం గ్రామం చుట్టూ ముళ్లకంపలు వేస్తారు. ఇందుకోసం నాలుగు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. గ్రామం చుట్టూ సుమారు 3 కి.మీ.ల పొడవునా ముళ్లకంపలను ఏర్పాటు చేస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు మొత్తం ఊరుకి ఒకే ద్వారం ఉంటుంది. అదే ఊరు వాకిలి. ఎవరు వచ్చినా, వెళ్లినా కూడా ఇదే దీని గుండానే రావాలి, వెళ్లాలి. ముళ్లకంపలు వేసిన తర్వాత జాతర ప్రారంభమవుతుంది. ముళ్ల కంపలు వేసిన తర్వాత గ్రామంలోకి వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ వెలుపలికి తీసుకెళ్లరాదు. దీనిపై నిఘా ఉంచేందుకు యువకులు, పెద్దల బృందం తొమ్మిది రోజుల పాటు ముఖ్య ద్వారం వద్ద కాపలా కాస్తుంది. అయితే కళ్లజోడు, బంగారు ఆభరణాలు, రంగు లేని చట్ట సంచి, పెన్సిల్‌తో రాసిన కాగితం, నాణాలు, నోట్లకు మినహాయింపు ఉంది. మిగతా వస్తువులను లోపలకు తెస్తే మళ్లీ వాటిని బయటకు తీసుకెళ్లేందుకు తొమ్మిది రోజుల పాటు వేచి ఉండాల్సిందే. పచ్చి వస్తువులు, పదార్థాలు, దుస్తులు, చేతికి కట్టిన దారం, పసుపు కుంకుమ వంటి వస్తువులను గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లరాదు. ఇలాంటి ఎన్నో నియమాలు ఉన్నాయి. వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఏర్పాట్లు ప్రారంభం: ఈనెల 13 నుంచి జరిగే జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులంతా కంచె వేయడంలో నిమగ్నమయ్యారు. ఈసారి ‘నమ్మ జాతర–నమ్మ ఆట–2017’ పేరిట వివిధ రకాల క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ జాతరలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. -
‘నయీమ్ భూముల’కు కంచె
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో నయీమ్ పెద్దఎత్తున స్థలాలను కబ్జాలో పెట్టుకున్నాడు. కొన్నిచోట్ల సొంతదారులను చంపుతానని బెదిరించి తక్కువధరకే కొనుగోలు చేయగా, మరికొన్ని చోట్ల నయాపైసా ఇవ్వకుండా ఆక్రమించాడు. ఈ కోవలో కొన్నిప్రాంతాల్లో ప్రభుత్వ భూములనూ స్వాహా చేశాడు. దీనికి రాజకీయ నేతలు, పోలీసు, రెవెన్యూ అధికారులు నయీమ్‌కు సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులో దాదాపు 1,500 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలను గుర్తించింది. నయీమ్ కుటుంబసభ్యుల పేరునే దాదాపు 800 ఎకరాలున్నట్టు సమాచారం. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని భూముల వివరాలు వెలుగు చూసే అవకాశముంది. నయీమ్ కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి చట్టపరంగా ఉన్న ఇబ్బందులను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఆ భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. వీటిలో ప్రభుత్వ భూములను నేరుగా స్వాధీనం చేసుకోనుండగా, పట్టా భూముల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు పడక గదుల ఇళ్లకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల పథకం ఇంకా ముందుకు కదలటంలేదు. ఒకటి, రెండుచోట్ల మినహా ఎక్కడా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దీనికి స్థలాల కొరత ఉంది. ఈ నేపథ్యంలో నయీం కబ్జాలో ఉన్న భూముల్లో రెండు పడక గదుల ఇళ్లకు యోగ్యంగా ఉన్న వాటి వివరాలను అందించాల్సిందిగా ము ఖ్యమంత్రి కార్యాలయం నుంచి రెవె న్యూ అధికారులకు ఆదేశం అందింది. స్థానిక అధికారులు ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్లో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో కనిపించిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మందితోపాటు ఆవుకు గాయాలయ్యాయి. కుక్కదాడిలో ఒంటెల యశోద అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా.. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అరుణ్‌సాయి, ఆదిత్య, శ్రీలత, సుహాసిని, నరేందర్‌లను 108 సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. గ్రామస్తులు పిచ్చికుక్కను చంపివేశారు. -
రైలుపట్టాలపై కూలిన ప్రహరీ
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై రక్షణ గోడ కూలి పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ బాగా నానడంతో సోమవారం అర్థరాత్రి ఆ గోడ దాదాపు 400 మీటర్ల మేర కూలి పట్టాలపై పడింది. దీంతో అధికారులు ఆ ప్లాట్‌ఫాంపైకి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గూడ్స్ రైళ్లు మాత్రమే ఆ ప్లాట్‌ఫాంపైకి వస్తాయి. -
1, 2, 3.. జంప్..
చూశారుగా.. అచ్చంగా మనుషుల్లాగే ఈ మొసలి కూడా ఫెన్స్ ఎక్కి జంప్ చేసింది. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో ఇటీవల ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ రామ్‌కిషన్ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. ‘మొసలిని చూడగానే.. ఫొటోలు తీయడం ప్రారంభించా. అయితే.. అకస్మాత్తుగా అది ఫెన్స్ ఎక్కడం ప్రారంభించింది. అది దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మనుషుల్లాగే అలవోకగా ఎక్కేయడం ఆశ్చర్యం కలిగించింది’ అని చెప్పారు. ఆ మొసలి గురించి కిషన్ ఆరా తీయగా.. గత మూడు రోజులుగా అది సరస్సు నుంచి బయటకు వచ్చి తచ్చాడుతోందని.. గుడ్లు పెట్టడానికి బయటకు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. గుడ్లు పెట్టాక.. దారి తప్పి.. ఇలా వచ్చి ఉండొచ్చని.. సరస్సు కనిపించగానే.. అందులోకి జంప్ చేసినట్లుందని కిషన్ చెప్పారు. -
'చనిపోదామనే అలా చేశాడు'
వాషింగ్టన్: అమెరికా జాతీయ జెండాను కప్పుకొని ఓ వ్యక్తి ...వైట్‌హౌస్ ఫెన్సింగ్‌ను దూకిన ఘటన గురువారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు పాల్పడిన జోసెఫ్ ఆంథోనీ క్యాపుటో చనిపోదామని నిర్ణయించుకొనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కోర్టుకు తెలిపింది. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా చనిపోదామని నిర్ణయించుకొని ఫెన్సింగ్ దాటాలని నిర్ణయించుకున్నట్లు క్యాపుటో రాసిన సూసైడ్ నోట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ విధంగా తన మరణాన్ని ప్రపంచానికి తెలపాలని అతడు భావించినట్లు తెలుస్తోంది. స్టాన్ఫోర్డ్లోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన క్యాపుటో ఫెన్సింగ్ దాటిన సమయంలో అధ్యక్షుడు ఒబామా వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో క్యాపుటో 'ఐ లవ్ మై కంట్రీ' అంటూ నినాదాలు చేశాడు. అయితే క్యాపిటో మానసిక స్థితి సరిగా లేదని భావించిన కోర్టు అతని మానసిక స్థితిని అంచనా వేయాలని సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రికి పంపింది. నిషిద్ధ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడినందుకు కోర్టు అతనికి గరిష్టంగా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రూ.కోట్ల విలువైన భూములకు రక్షణ కరువు
* కలెక్టర్ చొరవ తీసుకోవాలి * కంచె ఏర్పాటు చేయాలని ప్రజల వినతి యాచారం: కోట్లాది రూపాయల విలువైన భూములకు రక్షణ లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. భూములు మళ్లీ అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరానికి చేరువలోని నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై సమీపంలోని యాచారం మండలంలోని పలు గ్రామాల్లో భూములు ధరలు రూ. లక్షల్లో పలుకుతున్నాయి. వీటిని పరిరక్షించే విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కాగా.. ఇటీవల రెవెన్యూ అధికారులు యాచారం, మాల్, గాడ్లగూడెం, గునుగల్, తాడిపర్తి తదితర గ్రామాల్లో ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి పీఓటీ యాక్టు కింద స్వాధీనపర్చుకున్నారు. కానీ ఇవి కబ్జాకు గురి కాకుండా చుట్టూ కంచె నిర్మించడంలో మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూముల విలువ రూ.10 కోట్లపైనే.. తహసీల్దార్ వసంతకుమారి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక చొరవ కనబర్చారు. రూ. 10 కోట్లకు పైగా విలువ జేసే భూములను కాపాడారు. యాచారం రెవెన్యూ పరిధిలోని 242, 191, 225 సర్వే నంబర్లల్లోని రూ. 2 కోట్ల విలువైన 5 ఎకరాలు, గాడ్లగూడెంలోని సర్వే నంబర్ 300లో 2 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిలో గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకోగా 120 గజాల లోపు ఉన్న 20 మంది పేదలకు క్రమబద్ధీకరణలో సర్టిఫికెట్లు ఇప్పించారు. మిగితా రూ. 40 లక్షల విలువైన భూమిని గుర్తించి, ఆక్రమణదారులకు హెచ్చరికలు చేశారు. తాడిపర్తి గ్రామంలోని 155 సర్వే నంబరులోని దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎకరాకు రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షల చొప్పున డిమాండ్ ఉంది. గునుగల్ రెవెన్యూ పరిధిలో రూ. 60 లక్షలకుపైగా విలువైన ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి- మహబూబ్‌నగర్- నల్గొండ జిల్లాల సరిహద్దులోని యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి ధర పలుకుతోంది. ఈ భూమికి హద్దులు గుర్తించకపోవడంతో రియల్ వ్యాపారులు కబ్జాలు చేసి రూ.లక్షల్లో ప్లాట్లను అమ్ముకుంటున్నారు. కంచెల ఏర్పాటుకు డబ్బులు లేవట.. రూ. కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు వాటి పరిరక్షణకు రూ.వేలల్లో ఖర్చయ్యే కంచెల ఏర్పాటుతో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల యాచారంలో పర్యటించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇక్కడి పలు సర్వేనంబర్లలో స్వాధీనం చేసుకున్న భూముల రక్షణ నిమిత్తం కంచె ఏర్పాటుకు రూ.2 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూముల రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్‌కు నివేదిక పంపాం ఆయా గ్రామాల్లో గుర్తించిన భూముల రక్షణ నిమిత్తం నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదిక అందజేశాం. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిధులు మంజూరు కాగానే కంచెలు ఏర్పాటు చేస్తాం. - వసంతకుమారి, తహసీల్దార్, యాచారం -
ముళ్లపొదలో బంగారు తల్లి..!!
పుట్లూరు: బంగారు తల్లిని ముళ్లపొదలో విసిరేశారు. అప్పుడేపుట్టి.. కనీసం నిండుగా శ్వాసైనా పీల్చుకోని ఆడశిశువు చెట్ల పొదల్లో కనిపించిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పుట్లూరులోని కస్తూర్భా పాఠశాల విద్యార్థినులు ఈ రోజు తెల్లవారు జామునే పాఠశాల భవనానికి సమీపంలోని చెట్ల పొదల్లో ఒక శిశువు పడిఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులకోసం గాలిస్తున్నారు. -
వందెకరాల ప్రభుత్వ భూమికి కంచె
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని మాల్కారం సమీపంలో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా భూపరిరక్షణ విభాగం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ విఠల్ తెలిపారు. ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ దేవుజానాయక్లతో కలిసి శుక్రవారం ఆయన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వస్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల సర్వే చేసిన జవహర్‌నగర్‌లోని రాజీవ్‌స్వగృహ సమీపంలోని మల్కారం పరిధిలో గల 100 ఎకరాల ప్రభుత్వ స్థలానికి కంచె ఏర్పాటు చేయనున్నామన్నారు. మల్కారం, అంబేద్కర్‌నగర్, చెన్నాపురం చెరువులను పరిశీలించి మండలంలోని అన్ని చెరువుల పరిరక్షణ కోసం కంచెను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట మండల సర్వేయర్ శ్రీనివాసచారి, జవహర్‌నగర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాజు, వీఆర్ఓలు ఆనంద్, వెంకటేష్‌లతో పాటు రెవిన్యూసిబ్బంది పాల్గొన్నారు.