నీటిలో ఉండే ప్రాణి ఏదంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది మొసలి. వీటిని ఎప్పుడు నీటిలో లేదా, భూమిపై పాకడం మాత్రమే చూశాం. కానీ ఫెన్సింగ్ ఎక్కడం ఎప్పుడైన చూశారా.. లేదంటే వెంటనే ఫేస్‌బుక్ తెరవండి మరి. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టీనా స్టేవర్ట్ అనే మహిళ, జాక్స్‌న్ విల్లేలోని నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఓ భారీ మొసలి(ఎలిగేటర్) ఫెన్సింగ్(కంచె)ను అలవోకగా ఎక్కుతుండటం చూసి తన మొబైల్‌లో వీడియో తీసింది. వీటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.
‘మొసళ్లు అంటే నీటిలో లేదా నేల మీద పాకడం మాత్రమే చూశాం. కానీ ఈ రోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ భారీ మొసలి కంచెను ఎక్కడం చూసి నేను ఆశ్యర్యానికి గురయ్యాను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో, ఫొటోలకు ఇప్పటివరకు వేలల్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో ‘ఇది అరుదైన ఘటన.. భయంగా ఉన్నా బాగుంది’ అని ‘దూరం నుంచి చూసినప్పటికి..ఇది మంచి అనుభవం’ అంటూ ఒకరు.. నేను ఈ జాతి జంతు ప్రేమికున్ని కానీ.. నాకు ఇప్పటి వరకు తెలియదు ఇవి అలా ఫెన్సింగ్ ఎక్కగలవని!’ అంటూ అశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment