alligators
-
Viral Video: కొండచిలువ పాలిట క్రొక‘డై’ల్
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్‌కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది. దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్‌లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో -
ఫెన్సింగ్ ఎక్కిన మొసలి!
నీటిలో ఉండే ప్రాణి ఏదంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది మొసలి. వీటిని ఎప్పుడు నీటిలో లేదా, భూమిపై పాకడం మాత్రమే చూశాం. కానీ ఫెన్సింగ్ ఎక్కడం ఎప్పుడైన చూశారా.. లేదంటే వెంటనే ఫేస్బుక్ తెరవండి మరి. ఫ్లోరిడాకు చెందిన క్రిస్టీనా స్టేవర్ట్ అనే మహిళ, జాక్స్‌న్ విల్లేలోని నావల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఓ భారీ మొసలి(ఎలిగేటర్) ఫెన్సింగ్(కంచె)ను అలవోకగా ఎక్కుతుండటం చూసి తన మొబైల్లో వీడియో తీసింది. వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ‘మొసళ్లు అంటే నీటిలో లేదా నేల మీద పాకడం మాత్రమే చూశాం. కానీ ఈ రోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ భారీ మొసలి కంచెను ఎక్కడం చూసి నేను ఆశ్యర్యానికి గురయ్యాను’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో, ఫొటోలకు ఇప్పటివరకు వేలల్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యంతో ‘ఇది అరుదైన ఘటన.. భయంగా ఉన్నా బాగుంది’ అని ‘దూరం నుంచి చూసినప్పటికి..ఇది మంచి అనుభవం’ అంటూ ఒకరు.. నేను ఈ జాతి జంతు ప్రేమికున్ని కానీ.. నాకు ఇప్పటి వరకు తెలియదు ఇవి అలా ఫెన్సింగ్ ఎక్కగలవని!’ అంటూ అశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. -
వైరల్ : మొసళ్ల బాటిల్ క్యాప్ ఛాలెంజ్
ఫ్లొరిడా : ప్రతి రోజూ ఓ కొత్త ఛాలెంజ్‌తో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతూ ఉంటుంది. నిన్నటి వరకు బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ సత్తా ఏంటో చూపించారు. సినిమా నటులు, క్రీడాకారులు ఇలా చాలా మందే తమదైన స్టైల్లో ఈ ఛాలెంజ్ స్వీకరించారు. ఇప్పుడు మొసళ్ల బాటిల్ క్యాప్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఆర్లాండోలోని థీమ్ పార్క్ గేటర్ల్యాండ్కు చెందిన కొన్ని మొసళ్లకు సంబంధించిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వీడియోలు తెగ వైరలవుతున్నాయి. పార్క్‌కు చెందిన సిబ్బంది బాటిల్‌ను పట్టుకుని ఉండగా మొసళ్లు క్యాప్‌ను తమ తోకతో కొడతాయి. ఇలా కొన్ని మొసళ్లు బాటిల్ క్యాప్‌ను కిందపడేయగా మరికొన్ని అలా చేయలేకపోయాయి. కొన్ని మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించాయి. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
-
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
-
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
న్యూయార్క్ : అమెరికాలో విపరీతంగా ఉన్న చలి జనాలనేకాదు.. జంతుజాలాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో గత వారం వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని మునుపెన్నడూ లేనంత భయంకరంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి ధాటికి అక్కడి వాగులు, వంకలు, చిన్నచిన్న నీటి జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. పార్క్లల్లో ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా గడ్డకట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు నరకం చూశాయి. అందుకు సాక్ష్యంమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మొసళ్లు 40 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉండే నీటిలో జీవిస్తాయి. కానీ, విపరీతమైన చలికారణంగా గడ్డ కట్టుకుపోయిన స్వామ్ పార్క్‌లోని ఓ నీటి గుంటలో మొసళ్లన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు తమ బాడీ మొత్తం నీటిలో పెట్టి కేవలం శాసేంద్రియాలు బయటకు ఉండేలా తలపైకెత్తి రక్షించండి మహాప్రభో అన్నట్లుగా చూస్తున్నాయి. ఆ నీటి గుంటల్లో కేవలం అవి తల పైకి పెట్టిన చోట తప్ప మిగితా మొత్తం కూడా గాజు ఫలకలా నీరు గడ్డకట్టుకుపోయింది. వాటి పరిస్థితి ఏమిటో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
మనిషి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి..
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణప్రాంతంలో పోలీసులకు భయంకరమైన దృశ్యం కనిపించింది. మొసలి జాతికి చెందిన రెండు ఎలిగేటర్లు ఓ మనిషి మృతదేహాన్ని పీక్కుతింటున్నాయి. పోలీసులు అతికష్టమ్మీద వాటిని అక్కడ నుంచి తోలేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి జాలర్లు మొదట ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్కడ నీటిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉందని డేవీ పోలీస్ అధికారులు పాబ్లో కాస్తనెడా, కెప్టెన్ డేల్ ఈంగల్ చెప్పారు.