వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ | Alligators Bottle Cap Challenge Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌

Published Fri, Aug 9 2019 5:09 PM | Last Updated on Fri, Aug 9 2019 5:27 PM

Alligators Bottle Cap Challenge Viral - Sakshi

సినిమా నటులు, క్రీడాకారులు ఇలా చాలా మందే తమదైన స్టైల్లో ఈ ఛాలెంజ్‌ స్వీకరించారు. ఇప్పుడు..

ఫ్లొరిడా : ప్రతి రోజూ ఓ కొత్త ఛాలెంజ్‌తో సోషల్‌ మీడియా మొత్తం హోరెత్తిపోతూ ఉంటుంది. నిన్నటి వరకు బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ సత్తా ఏంటో చూపించారు. సినిమా నటులు, క్రీడాకారులు ఇలా చాలా మందే తమదైన స్టైల్లో ఈ ఛాలెంజ్‌ స్వీకరించారు. ఇప్పుడు మొసళ్ల బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారింది. ఆర్లాండోలోని థీమ్‌ పార్క్‌ గేటర్‌ల్యాండ్‌కు చెందిన కొన్ని మొసళ్లకు సంబంధించిన బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ వీడియోలు తెగ వైరలవుతున్నాయి. పార్క్‌కు చెందిన సిబ్బంది బాటిల్‌ను పట్టుకుని ఉండగా మొసళ్లు క్యాప్‌ను తమ తోకతో కొడతాయి. ఇలా కొన్ని మొసళ్లు బాటిల్‌ క్యాప్‌ను కిందపడేయగా మరికొన్ని అలా చేయలేకపోయాయి. కొన్ని మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement