
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్‌కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది.
దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్‌లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment