Alligator
-
పెద్దోడా ఎలా ఉన్నావ్? చిన్నోడా ఏం తింటావ్?
ఫ్రాన్స్‌లోని కౌరాన్ అనే ఊళ్లో ఉన్న 72 ఏళ్ల ఫిలిప్ గిల్లెట్ ఇంటికి వెళితే దాదాపు 400 రకాల జంతువులు, కీటకాలు, పక్షులు, జలచరాలు ఉంటాయి. వాటన్నింటిని సాకడం ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. మనం పలకరించడానికి వెళితే ‘పెద్దోడా... ఇంటికి ఎవరొచ్చారో చూడు’ అనంటే మనం దడుచుకుని చస్తాం. ఎందుకంటే ఆయన పెద్దోడా అని పిలిచింది పెద్ద మొసలిని. మొసలి మూతి యు ఆకారంలో ఉండి సైజు భారీగా ఉంటే దానిని ఎలిగేటర్ అంటారు. అలాంటి ఎలిగేటర్లు రెండు ఉన్నాయి ఆయన ఇంట్లో. ఆడుకోవాలన్నా కష్టం సుఖం చెప్పుకోవాలన్నా అవే ఆయనకు దిక్కు. పెద్దోడు, చిన్నోడు ఇల్లంతా తిరుగుతూ ఫిలిప్‌తో గారాలు పోతుంటాయి. ఇలాంటి పెద్దాయన మన ఇంటి పక్కన లేడు లక్కీగా. లేకుంటే ‘అంకుల్... ఒక కప్పు కాఫీ పోడి ఉంటే ఇస్తారా’ అని కాలింగ్‌బెల్ నొక్కి ‘పెద్దోడు’ వచ్చాడనుకోండి. ఏం చేస్తాం. హరీమనడమే. సరదాలు ఎలా ఉన్నా సృష్టిలోని ప్రతి ్ర ణిని కాపాడుకోవడం పర్యావరణ బాధ్యత. అందరితో పాటు మనం. మనతో పాటు అన్నీ. కాలుష్యం, వేట బారిన పడి ఇవి నశించి΄ోకుండా చూసుకోవాలి. -
మొసలితో కుక్క విన్యాసాలు.. నోట్లో చేయిపెట్టినా మింగదట!
కుక్క అయినా మరో పెంపుడు జంతువు అయినా మనిషితో మచ్చిక ఏర్పడినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తప్పుతున్నాడు. ఇది చూసినవారంతా షాక్‌కు గురవుతున్నాడు. ఈ ఉదంతాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఆ మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే అతనితో పాటు మొసలిని తీసుకువచ్చిన కారణంగా అతనికి మ్యాచ్ చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు. తన మొసలిని ఎవరైనా తాకవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదన్నాడు. దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు. ఈ ఉదంతానికి సంబంధించిన ఈ వీడియో పెన్సిల్వేనియాకు చెందినది. @NewsAlertsG హ్యాండిల్ పేరుతో పోస్ట్ అయ్యింది. పిట్స్బర్గ్ పైరేట్స్ గేమ్ టోర్నమెంట్ చూసేందుకు హెన్నీ సిటిజన్స్ బ్యాంక్ పార్క్‌కు వచ్చాడు. అయితే హెనీ ఒంటరిగా కాకుండా తన పెంపుడు జంతువు మొసలిని తీసుకుని వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది వీడియో తీశారు. హెనీ 2015లొ ఈ మొసలిని దత్తత తీసుకున్నాడు. దానికి వాలీ అనే పేరు పెట్టాడు. దానిని ‘వాలిగేటర్’ అని కూడా పిలుస్తుంటాడు. దీని పొడవు 56 అడుగులు. హెనీ, వాలిగేటర్లు యార్క్ కౌంటీలోని అతని ఇంటిలో కలసిమెలసి ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? A man, Joie Henney from Jonestown, Pennsylvania, tried to bring his "emotional support" alligator, Wally, to Citizens Bank Park for a Phillies vs. Pirates game but was denied entry. He claims Wally even sleeps in his bed with him.#alligator #pet #Pennsylvania pic.twitter.com/1onCLcsL0f — NewsAlerts Global (@NewsAlertsG) September 28, 2023 -
మొసలిని పెళ్లి చేసుక్ను మేయర్! ఎందుకో తెలుసా!
మొసలిని పెళ్లి చేసుకున్నాడు ఓ మేయర్. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో ఆ మొసలిని పరిణయమాడేందుకు సిద్ధయ్యాడు. ఆ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా చేయారు. పెద్ద ఊరేగింపుగా ఊరు ఊరంతా ఉత్సాహంగా పాల్గొని మరీ చేస్తారు. ఈ వింత ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఎందుకిలా చేస్తున్నారు. దీని వెనకున్న రీజన్ ఏమిటంటే.. మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. మధ్య అమెరికాలోని మెక్సికోలో అనాదిగా వస్తున్న ఆచారం ఇది. రెండు స్వదేశీ సముహాలు శాంతికి వచ్చిన రోజుకి గుర్తుగా మనిషి మొసలిని పరిణయమాడటం అనేది అక్కడి ఆచారం. ఇలా చేస్తే తమకు మంచి జరుగుతుందని అక్కడి వారి విశ్వాసం. ఇది 230 సంత్సరాల నాటి నుంచి వస్తున్న ఆచారం. దీన్ని అక్కడి ప్రజలు ఇప్పటికి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. అందులో భాగంగానే మేయర్ హ్యూగో సోసా ఈ మొసలిని పెళ్లిచేసుకున్నాడు.. భూమాత సస్యమాలంగా ఉండేలా సకాలంలో మంచిగా వర్షాలు పడతాయనేది చరిత్రకారుల నమ్మకమని, అందుకే తాము ఇలా చేస్తుంటామని మేయర్ హ్యూగో సోసా చెబుతున్నాడు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా రెడీ చేస్తారు. అలాగే ఆ మొసలి ఆ తంతులో ఎవరిపైన దాడి చేయకుండా ఉండేలా దాని నోటికి తాళం వేస్తారు. ఆ తంతులో మేయర్ ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసి మరీ మొసలిని పరిణయమాడతాడు. ఆ తర్వాత మేయర్ ఆ మొసలితో కలిసి నృత్యం చేయడమే గాక చివరిగా దాని ముద్దాడటంతో పెళ్లి తంతు ముగుస్తుంది. స్థానిక జాలర్లు తమ మేయర్ ఇలా చేయడం కారణంగా తమ వలకు అధిక సంఖ్యలో చేపలు పడతాయని, తమ జీవితాలు మంచిగా మారతాయని ఆనందంగా చెబుతున్నారు. 👰🐊 Como parte de una #tradición, el alcalde de San Pedro Huamelula, #Oaxaca, Víctor Hugo Sosa, se casó con un lagarto llamado princesa Alicia, esto para simbolizar la unión del hombre con lo divino. #México pic.twitter.com/Us8COaHYeL — Luis Gabriel Velázquez (@soyluisgabriel1) July 2, 2023 (చదవండి: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!) -
మొసలిని అమాంతం మింగేసింది కొండచిలువ..పాపం ఆ తర్వాత..
ఓ కొండచిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది. ఆ తర్వాత అదిపడ్డ బాధ అంతా ఇంతా కాదు. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి.. విగతజీవిగా మారింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన బర్మాలో చోటు చేసుకుంది. కానీ వైద్యులు ఆ రెండు జీవుల్లో ఒక్కదాన్నైనా రక్షించాలనుకున్నారు. అందులో భాగంగానే వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేశారు. ఐతే అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనకు మించి భారీగా ఉన్నవాటిని మింగితే వాటిని కొండచిలువలు ఉమ్మేస్తాయని కొందరూ చెబుతున్నారు. మరికొందరూ కొండచిలువ అలా చేయగలిగే అవకాశం ఉన్న చేయలేక చనిపోయిందని ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
-
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
మొసళ్లకు సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. అవి ఎంత క్రూరంగా దాడి చేస్తాయో కూడా చూశాం. అంతెందుకు సరదాగా చూడటానికి వచ్చిన ఒక పర్యాటకుడిపై మొసలి ఎలా దాడి చేసి గాయపరిచిందో వంటి పలు ఘటనలు చూశాం. అయినా సరే కొంతమంది నిర్లక్ష్యంగానే ఉంటారు. అచ్చం అలానే ఇక్కడొక జంట ఎంత నిర్లక్ష్యంగా అంటే.. ఆ మొసళ్లు ఉన్న నదిలోకే వెళ్లి వాటిని పిలిచి మరీ ఆహారం పెడుతున్నారు. ఏదో పెంపుడు కుక్కకు పెట్టినట్లుగా పెట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బుచ్, పెగ్గి అనే ఒక జంట నదిలో కూర్చొని దూరం నుంచి వస్తున్న మొసళ్లును పిలుస్తూ చేతులూ ఊపాడు. ఆ తర్వాత వాటికి పంది మాంసంతో తయారు చేసిన శాండ్విచ్లు నేరుగా చేతితో తినిపిస్తున్నాడు. ఒకవేళ దాడి చేసి ఉంటే పరిస్థితి ఇక అంతే. పైగా వారు నీళ్లలోనే ఉన్నారు తప్పించుకునే అవకాశం కూడా లేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు.. ఏం భయ్యా మరి ఇంత బలుపేంటి అంటూ ఫైర్ అయ్యారు. అయినా ఫ్లోరిడాలో ఇలాంటివి నేరం దుష్ప్రవర్తన కింది పరిగణించి చర్యలు తీసుకుంటుందని తెలిసి కూడా ఇలా చేస్తారా మీరు అంటూ తిట్టిపోశారు. View this post on Instagram A post shared by Only In Florida (@onlyinfloridaa) (చదవండి: పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్) -
ఏందిరా నీలొల్లి.. నీటిలో నుంచి ఒక్కసారిగా ఎగిరి డ్రోన్‌ను..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు దర్శనమిస్తాయి. అయితే, కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుని రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక, కేటగిరిలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, వన్యప్రాణుల ఫొటోలను, వీడియోలను తీసేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది వినూత్నంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్స్ విజయవంతంగా అయ్యారు. మరికొందరు ఫేయిల్ అయ్యారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి డ్రోన్ సాయంతో స్పెషల్ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఓ నదిలో ఉన్న ఎలిగేటర్‌ను ఎందుకున్నాడు. దీంతో, రంగంలోకి దిగిన ఫొటోగ్రాఫర్‌కు చేదు అనుభవమే ఎదురైంది. కాగా, వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న ఎలిగేటర్ కదిలికపై ఫొటోగ్రాఫర్ ఫోకస్ పెట్టాడు. ఓ డ్రోన్ సాయంతో ఎలిగేటర్‌కు సమీపం వరకు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించాడు. డ్రోన్ కాసేపటి వరకు వీడియో తీసింది. దీంతో, డ్రోన్ సౌండ్‌కు చిర్రెత్కుకుపోయిన ఎలిగేటర్.. డ్రోన్ తన వద్దకు రాగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. డ్రోన్‌ను నోటితో పట్టుకుని నీటిలోకి దూకింది. ఎలిగేటర్ దాడిపై ఒక్కసారిగా షాకైన ఫొటోగ్రాఫర్.. చూస్తూ నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022 -
భయానక దృశ్యం.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు!
నీటిలో దిగినప్పుడు చిన్న పురుగు కనిపించినా భయంతో ఒడ్డుకు చేరతాం. అలాంటిది భారీ ఆకారంతో మొసలి దాడి చేస్తే.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది. చెరువులో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఓ భారీ మొసలి(ఎలిగేటర్) అతడిపై దాడి చేసింది. చేతిని పట్టి లాగింది. అయితే, దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరాడు ఆ వ్యక్తి. స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ‘ద సన్’ అనే యూట్యూబ్ ఛానల్లో 2021లో పోస్ట్ చేయగా.. 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి వైపు వేగంగా దూసుకొచ్చిన మొసలి అతని చేతిని పట్టి లాగేందుకు యత్నించింది. ఒడ్డుకు వేగంగా ఈదేందుకు బాధితుడు ప్రయత్నించగా చేతిని కరిచింది. దాని నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఒడ్డుకు చేరుకున్నాక తన చేతిని పరిశీలించి చూడగా.. రక్తం కారుతూ కనిపించింది. ఇదీ చదవండి: మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ -
Viral Video: కొండచిలువ పాలిట క్రొక‘డై’ల్
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్‌కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది. దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్‌లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో -
రేయ్.. అది పెళ్లామో.. గర్ల్ ఫ్రెండో కాదు!
పుర్రెకో బుద్ధి.. మనిషి తీరు ఒక్కోసారి బహు విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదుగానీ.. కొన్ని పనులు మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అలాంటిదే 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఓ ట్విట్టర్ వీడియో. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇలా మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ చేసినట్లు విపరీతంగా వైరల్ అవుతోంది. విచిత్ర ధోరణితో ఫ్లోరిడా ప్రజలు వార్తల్లోకి ఎక్కుతారనే ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో సరదాగా వైరల్ అవుతుంటుంది. ఆ కోవకు చెందిన ఓ వ్యక్తే.. అంటూ బోర్న్ఏకాంగ్ అనే ట్విట్టర్ థ్రెడ్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయ్యింది. అంతేకాదు.. ఈ వీడియో గతంలోనూ వైరల్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్‌లోకి వచ్చింది. నమ్మశక్యంగా అనిపించని ఆ సరదా వీడియోను మీరూ చూసేయండి.. Florida man strikes again pic.twitter.com/MAgGnFkymk — Lance🇱🇨 (@BornAKang) October 18, 2022 వీడియో ఒక ఎత్తయితే.. ఆ వీడియో కింద కనిపించే కామెంట్లు మరో ఎత్తు. అది పెళ్లామో .. గర్ల్‌ఫ్రెండో కాదని, మొసలికి నీళ్లలో బలం ఎక్కువని, తేడా వస్తే పని అంతేఅని కొందరు.. ఆ మొసలికి అతను బాగా నచ్చి ఉంటాడని మరికొందరు.. ఇలా కామెంట్ల పర్వం హిలేరియస్‌గా ఉంది. -
అనకొండతో మొసలి జీవన పోరాటం.. వీడియో వైరల్
బ్రెసిలియా: అనకొండ పాములు భారీ ఆకారంతో పొడవుగా ఉంటాయి. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయి. గ్రీన్ అనకొండలు సుమారు 30 అడుగుల మేర పెరుగుతాయి. సుమారు 550 పౌండ్ల బరువు ఉంటాయి. ఏదైనా జీవిని వేటాడేందుకు దానిని పూర్తిగా చుట్టేసి చంపేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ భారీ ఎలిగేటర్(మొసలి)ని భారీ అనకొండ బంధించింది. మొసలికి ఊపిరిసలపకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సంఘటన బ్రెజిల్లో జరిగింది. అనకొండ బారినుంచి తప్పించుకునేందుకు ఎలిగేటర్ చేసిన ప్రయత్నాన్ని ఇండియానాకు చెందిన కిమ్ సులివాన్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కుయాబా నదిలో మొసలి, అనకొండలు పోరాడాయి. సుమారు 40 నిమిషాల పాటు వాటి పోరాటం సాగినట్లు కిమ్ తెలిపారు. పూర్తిగా చుట్టేయటం వల్ల ఎలిగేటర్ ఊపిరితీసుకునేందుకు ఇబ్బందులు పడింది. పాము నుంచి తప్పించుకునేందుకు మొసలి నీటి అడుగునకు వెళ్లిందని, దాంతో పాము గాలి తీసుకోలేకపోయిందని చెప్పారు. కొద్ది సమయం తర్వాత మొసలి బయటకు వచ్చిందని, అయినప్పటికీ అనకొండ వదలకుండా అలాగే పట్టినట్లు చెప్పారు కిమ్. దీంతో మరోసారి మొసలి నీటి అడుగుకు చేరుకుని కొన్ని నిమిషాల తర్వాత పైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అనకొండ కనిపించలేదన్నారు. ఊపిరి పీల్చుకున్న మొసలి తన చోటుకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ వీడియోను ఆఫ్రికా వైల్డ్‌లైఫ్1 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Wildlife | Africa | Lodges | Photography | Videography (@africanwildlife1) ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు -
మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు
శని ఉందని చెట్టుతోనో, పుట్టతోనో ముందు పెళ్లి చేస్తే... అది పోతుందనే సంప్రదాయం మనదగ్గరా ఉంది. కానీ మొసలిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని అనుమానంతో చూడకండి. ఈ మెక్సికన్ మేయర్ చేసుకున్నాడు. వందల ఏళ్ల పాత సంప్రదాయంలో భాగంగా అతను మొసలిని పెళ్లి చేసుకోవడమే కాదు... దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కప్పల పెళ్లిళ్లు చేస్తే, వరదపాశం వండి బండమీదపోసి తింటే.. వరదలు పారే వర్షాలు కురుస్తాయని మన దగ్గర కొన్ని నమ్మకాలున్నాయి కదా! అలా మెక్సికోలోనూ ఓ పాత పద్ధతి ఉంది. అక్కడ గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే... వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం. ఇంకేముంది.. ఈ ఏడు కూడా అలాగే జరగాలని సాన్ పెడ్రో హామెలుల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు కూడా మొసలితో పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూతురు మొసలిని... పెళ్లి దుస్తుల్లో అందంగా అలంకరించారు. తెల్లని ముసుగును కూడా కప్పారు. సంప్రదాయ సంగీతం, మేళ తాళాలు, నృత్యాల మధ్య వధువును వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వరుడు మేయర్, వధువు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్రామం అన్నింటా సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేశాడు. ఇక వేడుక మొత్తం ఆ మొసలి పెళ్లికూతురిని ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆ మేయర్. మరి ముద్దులు పెడుతుంటే ఆ మొసలి అతడిని ఏమీ అనలేదా అన్న అనుమానం వస్తోంది కదూ! ఫొటో జాగ్రత్తగా చూడండి దాని మూతిని తాడుతో కట్టేశారు. చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu — Reuters (@Reuters) July 1, 2022 -
వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!
ఇటీవలకాలంలో తమ పెంపుడు జంతువులను కౌగిలించుకుంటున్నట్లు లేదా ముద్దు పెడుతున్నట్లు ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటాం. పైగా అలాంటి చిలిపి పనులు చేసే సందర్భాలలో కొంతమంది చేదు అనుభవాలను కూడా చవిచూశారు. అయితే మరికొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి మరింత ప్రమాదకరమైన జంతువులను లేక పెంచుకునేందుకు వీలుకాని జంతువులను సైతం పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వికృతి చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ఇక్కడొక జూ సంరక్షకురాలు చేస్తుంది. (చదవండి: ఇదే ఆఖరి రోజు!....బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) అసలు విషయంలోకెళ్లితే... కాలిఫోర్నియాలోని రెప్టైల్ జూ సంరక్షకురాలు ఒక పెద్ద మొసలిని కౌగిలించుకుంటుంది. పైగా ఆ మొసలి తన స్నేహితురాలు అంటూ పరిచయం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ మొసలి ఒక్కసారిగా సదరు సంరక్షకురాలి కౌగిలి నుంచి బయట పడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలే ఏమైంది దీనికి అన్నట్లుగా ఆమె ఆ మొసలిని పరిశీలనగా చూసేటప్పటికీ ఆ మొసలి కాస్త నెమ్మదిగా టాయిలెట్‌కి వెళ్లిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురై ఎంత పనిచేశావ్ డియర్ అంటూ నవ్వుతుంటుంది. ఈ మేరకు సదరు సంరక్షకురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు" ఇవి పెంపుడు జంతువుల మాదిరి పెంచడం చట్టవిరుద్ధం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!) View this post on Instagram A post shared by The Reptile Zoo (@thereptilezoo) -
వజ్రాల సీతాకోక చిలుకల బ్యాగు.. విలువెంతో తెలుసా!
రోమ్: సాధారణంగా ఓ హ్యాండ్ బ్యాగు ఖరీదు 500 రూపాయల నుంచి ప్రారంభమై వేలల్లో ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్స్‌కు చెందిన ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగుల విలువ లక్షల్లో ఉంటుంది. కానీ ఇటలీకి చెందిన ఓ బ్యాగుల కంపెని ఇటివల తయారు చేసిన బ్యాగు విలువ తెలిస్తే అందరూ నోళ్లు వెల్లబెట్టాల్సిందే. అలిగేటర్(మొసలి జాతికి చెందిన) చర్మంతో తయారు చేసిన ఈ చిన్న బ్యాగు విలువ రూ. 53 కోట్లు అంట. దీంతో ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అంత్యంత ఖరీదైన బ్యాగు అయ్యింది. అయితే దానికి ఎందుకు అంతా ఖరీదు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాగును వజ్రాలు, మరకత మాణిక్యాలతో పాటు విలువైన రాళ్లతో అలంకరించారు. దీనిని బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్ హ్యండ్ బ్యాగుల కంపెనీ తయారు చేసింది. చూడగానే కళ్లు చెదరిలా తయారు చేసిన ఈ బ్యాగును అలిగేటర్ చర్మంతో తయారు చేసిన ఈ బ్యాగుపై తెల్లరంగు బంగారంతో తయారు చేసిన 11 సీతాకోక చిలుకలను అమర్చారు. (చదవండి: నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!) ఈ సీతాకోక చిలుకలపై మొత్తం 30 క్యారట్ల వజ్రవైఢూర్యాలు, అరుదైన మరకత మాణిక్యాలను పొదిగారు. అయితే ఈ బ్యాగు తయారు చేసేందుకు దాదాపు 1000 గంటలకు పైగా సమయంలో పట్టిందని ఈ సంస్థ వెల్లడించింది. దీనితోపాటు ఇలాంటివే మరో రెండు బ్యాగులను కూడా ఈ సంస్థ తయారు చేసింది. కాగా ఖరీదైన ఈ హ్యాండ్ బ్యాగులను మహాసముద్రాల కాలుష్యంపై అవగాహన కలిగించేందు కోసమే తయారు చేసినట్లు బోరిని మిలానేసి సంస్థ తెలిపింది. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు వినియోగిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. అయితే దీనిని ఇంతవరకు ఎవరూ ఖరీదు చేయలేదని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచలోనే అంత్యంత ఖరీదైన ఈ బ్యాగును ఏ సంపన్నులు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి. (చదవండి: అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా) -
మొసలి అతని సరదా తీర్చేసింది
-
పాపం.. మొసలి అతని సరదా తీర్చేసింది
సరదాగా ఈత కొడుదామని బీచ్‌లో దిగాడు. ఈత కొట్టి అలసిపోయానని భావించిన అతను తన బోటుకు ఆనుకొని ఉన్న చెక్కపై నీటిలో తేలియాడుతూ విశ్రాంతి తీసుకున్నాడు. కానీ సడెన్‌గా ఒక మొసలి అతని వైపు దూసుకొచ్చింది. మొసలి వచ్చిన విషయాన్ని మొదట గమనించిన ఆ వ్యక్తి తర్వాత దానిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. నీళ్లలో ఉంటే మొసలిని ఎదుర్కోవడం కష్టమే.అప్పటికే మొసలి అతని భూజాన్ని గాయపరచడానికి సిద్దంగా ఉంది. కాస్త నిర్లక్ష్యం వహించినా మొసలి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు మొసలి అలా పక్కకు జరిగిందో లేదో మనోడు ఒక్కసారిగా లేచి బోటులోకి దూకేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియదు గాని వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడచడం మాత్రం ఖాయం. ఇప్పటివరకు ఈ వీడియోనూ 10లక్షలకు పైగా వ్యూస్ రాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్: మొసలిని చుట్టేసిన భారీ అనకొండ
బ్రసిలియా: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం. భారీ అనకొండ మొసలిని చుట్టేసి మింగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన బ్రెజిల్‌లోని కండొమినియంలో గతవారం చోటుచేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఓ సంస్థ ఈ వీడియోను శుక్రవారం షేర్ చేసింది. ఈ ట్వీట్లో దాదాపు ఆరడుగుల పొడవు ఉన్న అనకొండ మొసలిని పూర్తిగా చుట్టేసినట్లు కనిపిస్తోంది. అది గమనించిన స్థానికులు తాడుతో ఆ రెండింటిని విడిపించే ప్రయత్నం చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు వేల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’) ‘ఇది ప్రకృతి సహజం.. ‘అనకొండ, ఎలిగేటర్‌ను మింగడం వాటి ఆహార గొలుసులో భాగం’, ‘అనకొండ దాని పని అది చేసుకుంటుంది’, ‘ప్రజలు ప్రకృతిని గౌరవించడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక దీనిపై స్థానిక వ్యక్తి వివరణ ఇస్తూ.. ‘అనకొండ దాదాపు 6 అడుగుల పొడవు ఉంది. అది మొసలిని మింగుతుంటే కొంతమంది కలిసి తాడుతో రెండింటిని విడదీశాము. అనంతరం ఈ రెండు సరిసృపాలు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయాయి’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు) Ê CAROÇO! 😳 Uma sucuri foi flagrada tentando engolir um jacaré na área de um condomínio na Ponta Negra. 🐍🐊 pic.twitter.com/d3JlCQm3Ey — Manaus POP A 911🏳️🌈 (@manaus_pop) August 17, 2020 -
చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు
-
మొసలిని ఎత్తుకుని రెస్టారెంట్‌కు వెళ్లి..
ఫ్లోరిడా: పామును పట్టాలంటే ధైర్యం ఉండాలి, మరి మొసలిని పట్టాలంటే.. అంతకు రెట్టింపు గుండె ధైర్యం అవసరం. అలాంటిది.. ఓ వ్యక్తి చంటిపిల్లాడిని చంకనేసుకుని వెళ్లినట్లుగా మొసలిని భుజానికేసున్నాడు. ఓ టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. అందంగా కనిపించేందుకు ఎల్లో టీ షర్ట్ కూడా వేసాడండోయ్. దాన్ని ఎత్తుకోగానే అది కూడా ఆనందంగా తోకూపుతూ బుద్ధిగా నడుచుకుంది. అనంతరం అతడు దాన్ని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్లాడు. (బర్త్‌డే: కిటికీలో నుంచి దూకుతూ) కాగా ఈ స్వీటీ అడవిలో గాయపడ్డ స్థితిలో మోర్ హెడ్ అనే వ్యక్తి కంట పడింది. దీంతో అతడు దాన్ని రక్షించి సాయం అందించాడు. అదే సమయంలో మొసలికి కళ్లు కనిపించవు అని తెలిసింది. అలాంటి దీన స్థితిలో మొసలిని అడవిలో వదిలిపెట్టడానికి అతనికి మనసొప్పలేదు. దీంతో దాన్ని ఇంటికి తీసుకు వచ్చి కన్నబిడ్డలా పెంచుకుంటున్నాడు. టిక్‌టాక్‌లో లైకుల వర్షం కురిపిస్తున్న ఈ వీడియోను చూసి కొందరు అబ్బురపడుతుంటే మరికొందరేమో భయంతో వణికిపోతున్నారు. (హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?) -
రెండో ప్రపంచ యుద్ధం నాటి మొసలి..
-
హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?
మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం ఉదయం మరణించింది. ఈ మేరకు జూ అధికారులు ట్విటర్ వేదికగా సాటర్న్(మొసలి) మరణాన్ని వెల్లడించారు. గౌరవించే వయసులోనే చనిపోయిందని పేర్కొన్నారు. కాగా సాటర్న్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించింది. 1936లో దీన్ని జర్మనీలోని బెర్లిన్ జూకు బహుమానంగా ఇచ్చారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనన మయంలో జర్మనీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో బెర్లిన్ జూపైనా బాంబు దాడులు జరిగాయి. (ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..) ఎన్నో జీవులు బాంబు ధాటికి నేలకొరిగినప్పటికీ ఈ మొసలి మాత్రం చాకచక్యంగా తప్పించుకోగలిగింది. సుమారు మూడేళ్ల తరువాత బ్రిటీష్ సైన్యానికి కనిపించింది. దీంతో దాన్ని బ్రిటన్ తన మిత్రదేశమైన రష్యాకు బహుమానంగా అందించింది. అలా అది చివరికి మాస్కో జూకు చేరింది. అక్కడే 74 ఏళ్లు జీవించింది. అది చనిపోవడంతో జూ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. సాటర్న్‌ను తమ చిన్ననాటి నుంచి చూస్తూ వచ్చామని దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇది నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన మొసలిగా ప్రాచుర్యం పొందినప్పటికీ అవన్నీ వుట్టి పుకార్లేనని జూ అధికారులు స్పష్టం చేశారు. (మొసలి నోట్లో తల పెట్టింది..) -
‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మొసలి’
సాధారణంగా అరుదుగా కనిపించే ఓ అతి పెద్ద మమొసలి రోడ్డు సమీపంలో తిరుగుతూ కనిపించింది. ఫ్లోరిడాలోని కోలియర్ కౌంటీ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అంతర్జాతీయ రహదారి 75 పక్కన ఉన్న ఆర్మీ కంచె వద్ద మొసలి చక్కర్లు కొడుతూ స్థానికంగా ఉన్న సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కంచెకు ఆనుకొని మోసలి సంచరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దాదాపు 7వేల మంది దీన్ని వీక్షించారు. (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు) Troopers met this large🐊on Alligator Alley in Collier County this morning! Way to atleast stay in the grass shoulder and out of the travel lanes! pic.twitter.com/L9SsC63mDI — FHP SWFL (@FHPSWFL) April 26, 2020 ‘కోలియర్ కంటి సమీపంలో ఈ అలిగేటర్ కనిపించింది. రోడ్డుపై వాహనాలకు అడ్డురాకుండా గడ్డిలో వెళ్లుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తోంది.’ అంటూ అధికారులు మొసలి వీడియోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది మోసలిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మొసలి భారీ స్థాయిలో ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఫ్లోరిడా అధికారులు మోసళ్లను వెతకాలని పౌరులను హెచ్చరించారు. ‘ఇది మోసళ్లకు సంభోగం కాలం. ఈ సమయంలో అవి చాలా చురుకుగా ఉంటాయి’ అని తెలిపిన అధికారులు తొమ్మిది అడుగుల పొడవైన మోసలి ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.(నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్) -
వైరల్: మొసలి నోట్లో తల పెట్టింది
-
మొసలి నోట్లో తల పెట్టింది..
ఫ్లోరిడా: సాహసం చేయరా ఢింభకా అంటున్నారు ఓ మహిళ. అయితే ఆమె చేసిన సాహసం మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు చాలామంది జనాలు. అష్లే లారెన్స్ అనే మహిళ మైదానంలో అడుగుపెట్టింది. చుట్టూ కొంత దూరంలో జనాలు గుమిగూడి ఉన్నారు. ఆమె ఎదురుగా ఓ మొసలి ఉంది. ఆమె దానికి చేరువగా వెళ్లింది. గోరుముద్దలు తినిపించడానికి అన్నట్లుగా మొసలి నోరును తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ మొసలి అందుకు సహకరించలేదు. దీంతో అతి కష్టంగానే రెండు చేతులతో దాన్ని అదిమిపట్టుకుని నోరును తెరిచింది. వెంటనే నేరుగా ఆమె తలను మొసలి నోట్లోకి పోనిచ్చింది. ఇది చూసిన మనకు క్షణంపాటు గుండె కొట్టుకోవడం ఆపేసినట్లనిపిస్తుంది. అసలే కౄర జంతువు. పైగా దాని నోట్లో తలకాయ పెట్టడం అంటే మృత్యువుకు ఎదురెళ్ళడమే. కానీ అదృష్టవశాత్తూ కొన్ని సెకన్ల తర్వాత ఎలాంటి ప్రమాదం బారిన పడకుండానే దాని నోట్లో నుంచి సురక్షితంగా తల బయటకు తీసింది. ఇంతకూ ఇది ఫ్లోరిడాలో జరిగిన మొసళ్లతో కుస్తీపోటీలో జరిగింది. ఈ మొసలి 8.5 అడుగుల పొడవు, 90 కిలోల బరువు ఉండగా దాని నోట్లో తలపెట్టిన అమ్మాయి నాలుగడుగుల 11 ఇంచుల పొడవు, 50 కిలోల బరువు ఉండటం గమనార్హం. ఈ ఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ఈ పోటీలోకి దిగిన తొలి వ్యక్తిని నేనే. ఈ సాహసానికి పూనుకున్నందుకు నాకు ప్రేక్షకుల నుంచే కాక పోటీదారుల నుంచి కూడా ప్రేమానురాగాలు అందాయి. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండానే దాని నోరు తెరిచా’నని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అలాంటి ప్రయోగం చేసి చావును దగ్గర నుంచి చూసేంత ధైర్యం చేయలేమంటున్నారు. -
వామ్మో.. గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా?
ఫ్లోరిడా : రాక్షస బల్లుల జాతికి చెందిన గాడ్జిలా గురించి హాలీవుడ్ చిత్రాల్లో చూసుంటారు. అయితే పరిమాణంలో ఆ సైజులో కాకపోయినా.. కాస్త భయానకంగా ఉన్న మొసలి ఒకటి గోల్ఫ్ కోర్టులో చక్కర్లు కొట్టింది. ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోప్ గోల్ఫ్ మైదానంలో ఈ మధ్య బఫెల్లో క్రీక్ గోల్ఫ్ కోర్స్ పోటీలు జరిగాయి. ఫిబ్రవరి 14న గేమ్ ప్రారంభానికి ముందు అక్కడే ఓ కొలనులో ఉన్న భారీ మొసలి ఒకటి హఠాత్తుగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మైదానంలో పని చేసే వ్యక్తి ఒకతను తన మొబైల్ తో వీడియో తీయటం ఆరంభించాడు. అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లటంతో వారు స్పందించారు. సుమారు పాతికేళ్ల క్రితం ఓ మొసలి ఇదే ప్రాంతంలో కనిపించిందని.. బహుశా ఇప్పుడు కనిపించింది కూడా అదే అయి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. 2016లో కూడా ఇది ఓసారి కనిపించగా.. దానికి ‘చబ్స్’ అని పేరు పెట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటిదాకా అది ఎవరి మీద దాడి చేసిన సందర్భాలు లేవనే వారంటున్నారు. మైదానంలో అది ఠీవిగా వెళ్తుంటే.. పక్షులు దాని వెనకాలే వెళ్లటం ఆసక్తికరంగా ఉంది. ఫ్లోరిడాలో ఈ పరిణామంలో ఉన్న మొసలి ఇదేనని జంతు సంరక్షణ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా గాడ్జిల్లా మళ్లీ పుట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు ఈ వీడియోతో మైదానంలో అడుగుపెట్టేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది.