
ఇటీవలకాలంలో తమ పెంపుడు జంతువులను కౌగిలించుకుంటున్నట్లు లేదా ముద్దు పెడుతున్నట్లు ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటాం. పైగా అలాంటి చిలిపి పనులు చేసే సందర్భాలలో కొంతమంది చేదు అనుభవాలను కూడా చవిచూశారు. అయితే మరికొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి మరింత ప్రమాదకరమైన జంతువులను లేక పెంచుకునేందుకు వీలుకాని జంతువులను సైతం పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వికృతి చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ఇక్కడొక జూ సంరక్షకురాలు చేస్తుంది.
(చదవండి: ఇదే ఆఖరి రోజు!....బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..)
అసలు విషయంలోకెళ్లితే... కాలిఫోర్నియాలోని రెప్టైల్ జూ సంరక్షకురాలు ఒక పెద్ద మొసలిని కౌగిలించుకుంటుంది. పైగా ఆ మొసలి తన స్నేహితురాలు అంటూ పరిచయం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ మొసలి ఒక్కసారిగా సదరు సంరక్షకురాలి కౌగిలి నుంచి బయట పడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలే ఏమైంది దీనికి అన్నట్లుగా ఆమె ఆ మొసలిని పరిశీలనగా చూసేటప్పటికీ ఆ మొసలి కాస్త నెమ్మదిగా టాయిలెట్‌కి వెళ్లిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురై ఎంత పనిచేశావ్ డియర్ అంటూ నవ్వుతుంటుంది. ఈ మేరకు సదరు సంరక్షకురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు" ఇవి పెంపుడు జంతువుల మాదిరి పెంచడం చట్టవిరుద్ధం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: బాప్‌రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!)
Comments
Please login to add a commentAdd a comment