Caretaker
-
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాక్ జరిపిన చర్చలు సఫలం అయ్యారు. ఈ ఇద్దరూ బెలూచిస్తాన్‌కు చెందిన సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో.. పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 9వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. దీంతో ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ ఎంపికలో ప్రతిపక్ష నేత రజా రియాజ్దే ముఖ్యభూమిక అయ్యింది. ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి ఉండాలనే నిర్ణయంతో కాకర్ పేరును ప్రతిపాదించగా.. అందుకు షెహబాజ్ సైతం అంగీకరించారు. దీంతో ఈ పేరును పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వికి పంపించగా.. ఆయన ఆమోద ముద్ర వేశారు. చిన్న ప్రావిన్స్ అయినా.. బెలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ గురించి పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే.. ఆ ప్రాంతమంతా తిరుగుబాట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది కాబట్టి. కాకర్ తొలినాళ్లలో విదేశాల్లో ఉంటున్న పాక్ ప్రజల సంరక్షణ, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్పై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్కమిటీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత బెలూచిస్తాన్ అధిరాకప్రతినిధిగా పని చేశారు. 2018లో బెలూచిస్తాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై.. అటుపై బెలూచిస్తాన్ ఆవామీ పార్టీలో చేరారు. ప్రస్తుతం సెనేట్‌లో పార్లమెంటరీ లీడర్‌గా ఉన్నారాయన. ఎన్నికలు మరింత ఆలస్యం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, జనాభా పెరుగుదల కారణంగా.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాకే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ఎన్నికలకు నాలుగు నుంచి ఐదు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
వామ్మో! మొసలిని కౌగిలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!
ఇటీవలకాలంలో తమ పెంపుడు జంతువులను కౌగిలించుకుంటున్నట్లు లేదా ముద్దు పెడుతున్నట్లు ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటాం. పైగా అలాంటి చిలిపి పనులు చేసే సందర్భాలలో కొంతమంది చేదు అనుభవాలను కూడా చవిచూశారు. అయితే మరికొంత మంది ఇంకాస్త ముందడుగు వేసి మరింత ప్రమాదకరమైన జంతువులను లేక పెంచుకునేందుకు వీలుకాని జంతువులను సైతం పట్టుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి వికృతి చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ఇక్కడొక జూ సంరక్షకురాలు చేస్తుంది. (చదవండి: ఇదే ఆఖరి రోజు!....బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) అసలు విషయంలోకెళ్లితే... కాలిఫోర్నియాలోని రెప్టైల్ జూ సంరక్షకురాలు ఒక పెద్ద మొసలిని కౌగిలించుకుంటుంది. పైగా ఆ మొసలి తన స్నేహితురాలు అంటూ పరిచయం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆ మొసలి ఒక్కసారిగా సదరు సంరక్షకురాలి కౌగిలి నుంచి బయట పడటానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలే ఏమైంది దీనికి అన్నట్లుగా ఆమె ఆ మొసలిని పరిశీలనగా చూసేటప్పటికీ ఆ మొసలి కాస్త నెమ్మదిగా టాయిలెట్‌కి వెళ్లిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురై ఎంత పనిచేశావ్ డియర్ అంటూ నవ్వుతుంటుంది. ఈ మేరకు సదరు సంరక్షకురాలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు" ఇవి పెంపుడు జంతువుల మాదిరి పెంచడం చట్టవిరుద్ధం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!...ఎంత పెద్ద భయానక దృశ్యం!) View this post on Instagram A post shared by The Reptile Zoo (@thereptilezoo) -
కేర్‌టేకర్ హల్చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ
సాక్షి, నాగోలు: ఇంట్లో ఉన్న వృద్ధుడికి సేవ చేసేందుకు కేర్ టేకర్‌ను నియమించుకుంటే గంజాయి మత్తులో ఇంటి యజమానిపై దాడి చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ నాగార్జున కాలనీలో ఉండే దామోదర్‌రావు, గిరిధర్ల తండ్రి రంగారావు (96). ఆయనకు సేవలందించడానికి సోదరులు కుత్బుల్లాపూర్ హరికృష్ణ హోమ్ కేర్ అండ్ సరీ్వసెస్ నిర్వాహకుడు వెంకటరమణకు సంప్రదించారు. అతడు కుత్బుల్లాపూర్ రాజీవ్‌గృహకల్పకు చెందిన సూర్యపవన్ను వారి ఇంటికి పంపాడు. సోదరిలిద్దరూ కుటుంబంతో పై అంతస్తులో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వారి తండ్రి రంగారావుకు సూర్యపవన్ సేవలు అందిస్తున్నారు. ఈనెల 27వ తేదీన సాయంత్రం సూర్యపవన్ గట్టిగా కేకలేస్తూ నగ్నంగా తిరుగుతుండగా సోదరిలిద్దరూ కిందకు వచ్చారు. ఎందుకు అలా చేస్తున్నావని వారు ప్రశ్నించగా అతడు వారిపై దాడి చేయడంతో పాటు పిచ్చిపిచ్చిగా సమాధానమిచ్చాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యపవన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. అతడి వద్ద పోలీసులు గంజాయి ప్యాకెట్, చిన్న మద్యం బాటిల్ స్వాదీనం చేసుకున్నారు. అతడు గంజాయి సేవించడంతో అలా ప్రవర్తంచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం అతడు పోలీస్స్టేషన్లోనూ కేకలేస్తూ హల్చల్ చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం. దామోదర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్.. -
కోవిడ్ సేవలకు కేర్ టేకర్స్!
హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలు, వారి కుమారుడికి ఒకేసారి కరోనా సోకింది. భర్త, కొడుకు ఇంటివద్దే ఉండి మందులు వాడుతున్నా.. భార్యను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. భర్త, కొడుకు ఆ మహిళతో ఉండలేని పరిస్థితి. ఆమెను చూసుకొనేందుకు అయినవారెవరూ ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూనే.. కేర్ టేకర్‌గా సేవలందిస్తున్న ఒక యువతి ముందుకొచ్చింది. ఆ మహిళ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యేవరకు అండగా నిలిచింది. కోవిడ్ కేర్ టేకర్స్.. కుటుంబంలో అందరూ కరోనాబారిన పడి, బాధితులకు తోడుగా ఎవరూ లేని పరిస్థితుల్లో అన్నీ తామై సేవలు చేస్తున్న సహాయకులు. పేషెంట్‌తోనే ఉండి.. సమయానికి మందులు ఇవ్వడం, అవసరమైన సేవలు చేయడంతోపాటు త్వరగా కోలుకునేలా ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం రోజుకు ఇంత అని చార్జీలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఖర్చయినా.. దగ్గరుండి, సొంతవారిలా శ్రద్ధతో చూసుకోవడంతో మంచి ప్రయోజనం ఉంటోందని కరోనా బాధిత కుటుంబాలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జాగ్రత్తలతో.. తమ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని కేర్ టేకర్ సేవలు అందించే సంస్థలు చెప్తున్నాయి. మందులు, భోజనం వంటివి ఇస్తూ రోగి అవసరాలను కనిపెట్టుకోవడం, ఆక్సిజన్, రక్తపోటు, షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం, ఊపిరితిత్తులకు బలాన్నిచ్చే ప్రత్యేక వ్యాయామాలు చేయించడం, ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సె లింగ్ ఇవ్వడం తమ విధులు అని.. అవసరానికి అనుగుణంగా ఫీజులు ఉంటా యని తెలిపాయి. వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని కనిపెట్టుకొని ఉండేందుకు.. 24 గంటలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నట్టు మహిమ హోం హెల్త్‌కేర్ ఎండీ ప్రమీల చెప్పారు. ఇంటివద్ద అయితే రూ.6 వేల చొప్పున తీసుకుంటున్నట్టు తెలిపారు. రోగుల బాధలేమిటో తెలియడం వల్లే.. ‘‘కోవిడ్ రోగులకు సపర్యలు చేసే క్రమంలో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ మాకూ సోకే ప్రమాదం ఉంటుంది. నేను గత ఏడాది కోవిడ్ బారినపడ్డాను. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచి్చంది. ఆ ఒంటరితనం బాధ మాకు తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉంటూ సరీ్వసులు అందజేస్తున్నాం’’ అని ప్రమీల పేర్కొన్నారు. కేర్ టేకర్స్ అవసరమైన వారు 8919072177 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. తాము సేవను దైవంగా భావిస్తామని, రోగుల్లో భయాన్ని పోగొట్టి, భరోసాను కలి్పస్తామని.. వారు త్వరగా కోలుకోగలుగుతారని కేర్ టేకర్లు కవిత, కృష్ణవేణి చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డవారు కోలుకోవడం, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటం ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. –సాక్షి, హైదరాబాద్ సొంత బిడ్డలా సేవ చేశారు ఐదు రోజుల పాటు కోవిడ్ కేర్ టేకర్ల సరీ్వసు తీసుకున్నామని, సొంత బిడ్డల్లా శ్రద్ధగా చూసుకున్నారని హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన రుక్మిణి చెప్పారు. రాత్రింబవళ్లు దగ్గరుండి, జాగ్రత్తగా చూసుకున్నారన్నారు. కేర్ టేకర్లు గంట గంటకూ తన అవసరాలు చూసుకున్నారని, వారు చెప్పే మాటలతో భయం పోయి ధైర్యంగా ఉండగలిగానని సికింద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మి చెప్పారు. -
ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఏడ్చేసిన వృద్ధుడు
ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.. ఉన్నంతకాలం మనిషి తన చుట్టూ జ్ఞాపకాలను కూడగట్టుకుంటాడు. దగ్గరివాళ్లను కోల్పోయాక వాటితోనే కాలం వెళ్లదీస్తాడు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా తన భార్యను కోల్పోయాడే కానీ ఆమె జ్ఞాపకాలను కాదు. బ్రిటీష్ యుద్ధంలో పాల్గొన్న కెన్ బెంబో అసిస్టెడ్ అనే వృద్ధుడు ఇంగ్లండ్‌లోని ప్రిస్టన్‌లో నివసిస్తున్నాడు. అతను ప్రతిరోజూ మంచంపై నిద్రకు ఉపక్రమించేముందు తన భార్య ఫొటోను కళ్లారా చూసుకునేవాడు. ఇది గమనించిన ఇద్దరు మహిళా కేర్‌టేకర్స్(వారి సంరక్షణ చూసుకునేవాళ్లు) అతన్ని సంతోషపెట్టాలనుకున్నారు. (ఇవి మొండి చిరుత పిల్లలు..) వెంటనే అతని భార్య ఫొటోను సంపాదించి దాన్ని దిండుపై ముద్రించి అతనికి బహుమతిగా ఇచ్చారు. అది చూసిన అతను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఊహించని బహుమతికి ఆనందభాష్పాలు రాల్చాడు. భార్య అదా గుర్తుకు వచ్చి తనివితీరా ఏడ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతనికి సంతోషాన్నందించిన కేర్టేకర్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. "ఇది నా మనసును చలింపజేసింది", "ఇది చూస్తున్నంతసేపు నాకు తెలీకుండానే కన్నీళ్లు వస్తున్నాయి" అంటూ ఎమోషనల్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
33 ఏళ్ల తర్వాత నియామకాలు : మంత్రి విశ్వరూప్
సాక్షి, తాడేపల్లి : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత కేర్ టేకర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలియజేశారు. బుధవారం ప్రిన్సిపాల్, కేర్టేకర్లుగా నియమితులైన వారికి మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా కేర్ టేకర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పారదర్శకంగా శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 552 టీజీటీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. నాడు, నేడు కింద విద్యాలయాలు, గురుకులాలను అభివృద్ధి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామంటూ.. వసతి గృహాల్లో మెరుగైన విద్య, ఆహారం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
నాలుగేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకం...
ముంబై : లింగ బేధం లేదు, వయసు తేడా లేదు.. పసివాళ్లన్న జాలి, దయ ఏమాత్రం లేకుండా మానవ మృగాలు రెచ్చిపోతుంటే భద్రతకు తావేది..? గుడి కన్నా బడి పదిలం అన్నారు. కానీ బడిలోనూ రక్షణ లేదు. ఓ వైపు చిన్నారులపై అకృత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని చట్టాలు తెస్తుంటే మరో పక్క పసివాళ్లపై జరిగే దారుణాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఉన్నత వర్గాల వారు నివసించే మజగావ్ ప్రాంతంలోని ఓ కిండర్‌గార్డెన్ స్కూల్లో ఆయాగా పని చేసే 60 ఏళ్ల మహిళ నాలుగేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిండర్‌గార్డెన్ స్కూల్లో చదువుతున్న ఓ చిన్నారి గత రెండు నెలల నుంచి పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. బడి అంటేనే వణికిపోతుంది. నిన్న ఆదివారం రాత్రి పాప తల్లిదండ్రులు చిన్నారిని బుజ్జగించి కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ చిన్నారి చెప్పిన విషయాలు వారికి వణుకు పుట్టించాయి. వైద్య పరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి పరిక్షించగా చిన్నారి వ్యక్తిగత శరీర భాగాల వద్ద గాయాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాప తల్లిదండ్రులు పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలికి ఫోను చేసి విషయం చెప్పారు. దాంతో సోమవారం విధులకు హజరయిన ఆయను అదుపులోకి తీసుకుని బైకుల్లా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నది. పోలీసులు ఆ మహిళ మీద కేసు నమోదు చేశారు. -
మహారాష్ట్రలో మరో దారుణం
సాక్షి, ముంబయి : దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలపై ఆందోళన వెల్లువెత్తిన క్రమంలో మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. కర్జాత్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో ఇద్దరు మూగ, చెవిటి విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. వీరిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య పరీక్షల అనంతరం వెల్లడైంది. దీంతో స్కూల్లోని ఇతర విద్యార్థినులపైనా ఇలాంటి వేధింపులు జరిగాయా అనే కోణంలో మరికొందరు విద్యార్థినులకూ వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధిత విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల పర్యవేక్షకులు రాం శంకర్ బెంబ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మార్చ్ 30న కేసు నమోదైనట్టు సమాచారం. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏడుగురు బాలికల స్టేట్మెంట్ను నమోదు చేసి మరికొందరితో విచారణ నిర్వహిస్తున్నారు. తమపై స్కూల్ కేర్‌టేకరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలంతా విచారణ సందర్భంగా చెప్పారని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో పాఠశాలకు మూతపడింది. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణతో సామాజిక న్యాయ శాఖ నిధులతో నిర్వహిస్తున్న పాఠశాల గుర్తింపు కోల్పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!
-
ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసిన కేర్ టేకర్
పంజగుట్ట: ఓ ఉన్నతాధికారి వద్ద కేర్ టేకర్‌గా నమ్మకంగా ఉండే వ్యక్తి అతను మరణించిన అనంతరం కూడా చెక్కులపై ఫోర్జరీ సంతకాలు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నాడు. బండారం బయటపడి పోలీసులకు చిక్కాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.నరేష్ రెడ్డి (28) వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే ఓ రిటైర్ ఉన్నతాధికారి ఎన్.వి. నాగేశ్వర్రావు వద్ద కేర్ టేకర్‌గా పనిచేసేవాడు. నాగేశ్వర్రావు గత ఏడాది అనారోగ్యంతో చనిపోయారు. నరేష్ రెడ్డి వద్ద నాగేశ్వర్రావుకు చెందిన వివిధ బ్యాంకుల చెక్కులు ఉన్నాయి. ఇటీవల వాటిపై సంతకం ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుంటున్నాడు. నాగేశ్వర్రావు పింఛను డబ్బు సోమాజిగూడలోని సిండికేట్ బ్యాంకులో ఉండడంతో అతని కొడుకు వెంకటేశ్వర్రావు గత నెల 29వ తేదీన తన తండ్రి అకౌంట్‌కు సంబంధించి స్టేట్మెంట్ తీసుకున్నారు. తండ్రి చనిపోయిన అనంతరం కూడా చెక్‌ద్వారా నగదు డ్రా చేసినట్లు అందులో ఉండడంతో బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 4వ తేదీన కూడా నరేష్ రెడ్డి మరో చెక్కుపై రూ.21,500 రాసుకుని ఫోర్జరీ సంతకంతో బ్యాంకుకు రాగా బ్యాంకువారు పట్టుకునేందుకు యత్నించారు. అక్కడ నుండి తప్పించుకోవడంతో సిండికేట్ బ్యాంకు ఛీఫ్ మేనేజర్ వీరారెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఫోర్జరీ చెక్కులతో మొత్తం 5 లక్షల 39 వేలు డ్రా చేశారని, నాగేశ్వర్రావు మృతి చెందిన రోజు కూడా 40 వేలు డ్రాచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నరేష్ రెడ్డిని నాగే శ్వర్రావు సొంత కొడుకులా చూసుకునేవారని, అతనికి ఏదైనా చేయాలని తపించేవారని త్వరలో వారు ప్రారంభించే ఓ సంస్థలో వాటా ఇచ్చేందుకు కూడా సిద్ధ్దమయ్యారని ఆయన బందువులు తెలిపారు. అలాంటి వ్యక్తిని మోసం చేయడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. -
భూ దందా!
⇒ పేదల భూముల చుట్టూ ఓ ఉన్నతాధికారి ‘చక్ర’బంధం ⇒ ‘అనంతసాగర్’లో కేర్ టేకర్ పేరుతో దళారీకి కబ్జా బాధ్యతలు ⇒ బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో 300 ఎకరాల విక్రయం ⇒ అమ్మకానికి సిద్ధంగా మరో 300 ఎకరాలు ⇒ సాగు భూముల నుంచి గిరిజనుల గెంటివేత సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆయన ఒక అత్యున్నతస్థాయి అధికారి. అధికార బలాన్ని, వారసత్వంగా వచ్చిన కొంత భూమిని అడ్డం పెట్టుకొని మరో 700 ఎకరాలకు ఎసరు పెట్టారు. కేర్ టేకర్ పేరుతో ఓ దళారిని సృష్టించి పట్టా భూముల మీదకు ఉసిగొల్పారు. సదరు అధికారి తండ్రి నుంచే భూములు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులనూ వదల్లేదు. బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో ఇప్పటికే 300 ఎకరాలు అమ్మివేశారు. మరో 300 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. కొంత కాలంగా మెదక్ మండలం అనంతసాగర్ భూముల్లో టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు ఉసిగొల్పిన కేర్‌టేకర్ రఘు సాగిస్తున్న కబ్జా కాండపై ‘సాక్షి’పరిశీలనాత్మక కథనం. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామంలోని హఫీజా బేగం అనే మహిళ నుంచి 1 నుంచి 51 సర్వే నంబర్లలోని 845 ఎకరాల భూమిని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావుతోపాటు మరో ఐదుగురు కలసి కొనుగోలు చేశారు. వీరు ఏనాడు భూమిని సాగు చేయలేదు. వీరిలో కొందరు తమ వాటా భూములను గిరిజనులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న వారిలో టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు తండ్రి జనార్దన్‌రావు కూడా ఉన్నారు. అక్రమాల ‘పట్టా’..: 2012లో జీవీ రమణారావు సర్వే నంబర్ 23ఉ, 1ఉ, 2ఉ, 19ఉ, 27ఈ, 28ఉ, 35ఉ, 43ఉ, 50ఉ, 51ఉ, 36ఉ లోని 103.16 ఎకరాలు తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని తనకు పౌతీ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి రమణారావుకు అనువంశికంగా సంక్రమించే భూమి అంత ఉండదు. ఆయన తండ్రి జనార్దన్‌రావు సంపాదించిన 104 ఎకరాల భూమిలో ఆయనే 1975 నుంచి 1986 వరకు దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమిని దళిత, గిరిజనులకు అమ్ముకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు వెచ్చించి శేరిశంకర్ తాండా, తిమ్మాయిపల్లి రైతులు కొనుక్కున్నారు. క్రయవిక్రయాల రశీదులు, భూ విక్రయ పత్రాలు గిరిజనుల వద్ద ఉన్నాయి. అయితే అక్షరజ్ఞానం పెద్దగాలేని వారు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొంతమంది అసలు పట్టానే చేయించుకోలేదు. కానీ తరతరాలుగా అదే భూమిని దున్నుకొని బతుకుతున్నారు. అత్యున్నత స్థాయి ఉద్యోగిగా ఉన్న రమణారావు విలువలకు కట్టుబడి తన తండ్రి నుంచి భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా భూమిని అంతా ఆయన పేరుతో పట్టా చేయించుకున్నారు. రమణారావు ఉసిగొల్పిన దళారి... 2012లోనే రమణారావు తన భూమికి పి.రఘు అనే వ్యక్తికి కేర్‌టేకర్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే ఆయన అక్రమానికి తెర లేపారు. తన భూమితోపాటు చిన్నాన్న గండ్ర సూర్యారావు భూమికి కూడా రఘు కేర్‌టేకర్‌గా ఉంటారని రాసిచ్చారు. సూర్యారావుకు కూడా 104 ఎకరాల వాటా ఉంది. ఆయనకు 4 కుమారులు, ఒక కుమార్తె ఉండగానే వారికి తెలియకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించడంతో రమణారావు ఉద్దేశం బట్టబయలు అయింది. ఇక రఘు ఫోర్జరీ సంతకాలతో 854/14 2253/14, 3304/2014, 2254/2014, 2027/2014, 1127/2014 డాక్యుమెంట్ నంబర్లతో జై భారత్‌రెడ్డి ఆయన బంధువులకు 199 ఎకరాలు విక్రయించారు. ఇందులో 854/14, 3304/14 డాక్యుమెంట్లలో మాత్రమే రమణారావు సంతకాలు ఉన్నాయి. రఘు చేసిన ఫొర్జరీ పత్రాలను ‘సాక్షి’ సేకరించింది. 0168 పట్టా నంబర్‌తో మరో పాసు పుస్తకాన్ని సృష్టించి మరికొంత భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 1, 2, 50లలో ఆయనకు సంబంధంలేని 14 ఎకరాల భూమిని రమణారావు పేరు మీద పట్టా చేయించి, ఆ మొత్తం భూమినీ విక్రయించారు. తాజాగా రఘు మరో 250 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేయించాడు. జనార్దన్‌రావుతోపాటు హక్కుదారులుగా ఉన్న వారి భూములను మింగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఫెన్సింగ్ వేసిన భూమి రమణారావుదేనని, ఆయన చెప్తేనే ఫెన్సింగ్ చేయించానని రఘు చెబుతున్నాడు. విచిత్రం ఏమిటంటే రమణారావు వంశానికి సంబంధంలేని పల్లె పోచమ్మ తల్లి గుడి మాన్యాన్ని కూడా ఇటీవల రఘు విక్రయించారు. దీనిపై వివాదం చెలరేగటంతో రమణారావు.. స్థానిక నేతకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరినట్టు తెలిసింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం. గొల్లుమంటున్న గిరిజనులు: భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్‌లో ప్రొసీడింగ్ నంబర్ సీఆర్/6497/1978తో సర్వే నంబర్ 24లో 6.46 ఎకరాలను ఐదుగురికి, 1985లో 2394/ఎస్జీడీ/75 ప్రొసీడింగ్ సీసీ నంబర్‌తో సర్వే నంబర్ 27లో 42.36 ఎకరాలను 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసీడింగ్ నంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాలను 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తం 71.02 ఎకరాల్లో దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. అంతకుముందే 30 మంది రైతులకు 13/బి కింద అధికారులు ఒక్కొక్కరికి 1:10 గుంటల చొప్పున పట్టాలిచ్చారు. ఇవే పాసుపుస్తకాలను రైతులు ఏడీబీ బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకొని బోర్లు వేయించి, సాగు కూడా చేస్తున్నారు. తాజాగా వారిని భూముల నుంచి వెళ్లగొట్టారు. బోర్లు పూడ్చి వేయిం చారు. గత రబీ సీజన్లో పొట్టకొచ్చిన మొక్కజొన్న, పూతకొచ్చిన పత్తిని పూర్తిగా ధ్వంసం చేయించారు. ఈ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన శేరిశంకర్ తండాకు చెందిన కాట్రోత్ జమ్ల, కాట్రోత్ బద్రు గుండె పగిలి చనిపోయారు. అదే భూమిలో జమ్లి, బద్రుల మృతదేహాలను ఖననం చేయగా వాటిని బయటకు తీయించి అడవిలోకి విసిరేయించినట్లు మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గూండాలతో కొట్టించారు మా కండ్ల ముందే పంటను దున్నేశారు. పంట పోయిందని మా అయ్య బద్రుకు గుండెపోటు వచ్చి చనిపోయిండు. మాది పట్టా భూమి. మమ్ములను గూండాలతో కొట్టించి సాగు చేసుకుంటున్న భూమి నుంచి తరిమేశారు. - కాట్రోత్ బలరాం, శేరిశంకర్ తండా మేం దున్నుకున్నది మా పట్టా భూములే మేం దున్నుకుంటున్నది మా పట్టా భూములే. ఎక్కడి నుంచి వచ్చాడోకానీ మా పంటచేలను దున్నేసి మా భూములను గుంజుకున్నడు. ఈ భూములను గుంజుకుంటే మాకు బతుకుదెరవు లేదని కాళ్లమీదపడ్డా కనికరించలేదు. - రనుజ, శేరిశంకర్ తండా నా భూమి నేను అమ్ముకుంటున్నా: రమణారావు ఈ వ్యవహారంపై జీవీ రమణారావును వివరణ కోరగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకున్నానని, స్థానికంగా ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. గుడి భూమి అమ్మినట్టు తెలియదన్నారు. మీ చిన్నాన్న భూమికి మీరు ఎలా వారసులవుతారని అడగ్గా ఉన్నతాధికారినైన తనను ప్రశ్నించడం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. దీనిపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేర్‌టేకర్ రఘుతో మాట్లాడగా... తాను అమ్ముతున్న భూమి జీవీ రమణారావుది మాత్రమేనని, ఆయన కేర్‌టేకర్‌గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రమణారావుకు 104 ఎకరాలే ఉండగా 250 ఎకరాలు ఎలా విక్రయించారని ప్రశ్నించగా నర్సింహారెడ్డి భూములు అమ్మినట్లు చెప్పారు.