ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబయి : దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలపై ఆందోళన వెల్లువెత్తిన క్రమంలో మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. కర్జాత్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో ఇద్దరు మూగ, చెవిటి విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. వీరిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య పరీక్షల అనంతరం వెల్లడైంది. దీంతో స్కూల్‌లోని ఇతర విద్యార్థినులపైనా ఇలాంటి వేధింపులు జరిగాయా అనే కోణంలో మరికొందరు విద్యార్థినులకూ వైద్య పరీక్షలు నిర్వహించారు.
బాధిత విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల పర్యవేక్షకులు రాం శంకర్ బెంబ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మార్చ్ 30న కేసు నమోదైనట్టు సమాచారం. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏడుగురు బాలికల స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి మరికొందరితో విచారణ నిర్వహిస్తున్నారు. తమపై స్కూల్ కేర్‌టేకరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలంతా విచారణ సందర్భంగా చెప్పారని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో పాఠశాలకు మూతపడింది. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణతో సామాజిక న్యాయ శాఖ నిధులతో నిర్వహిస్తున్న పాఠశాల గుర్తింపు కోల్పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment