నీళ్లలో మత్తు మందు ఇచ్చి.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం | Nursing Trainee Raped In Maharashtra Ratnagiri, Auto Driver Had Spiked Her Drink | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్ అఘాయిత్యం..నర్సింగ్ విద్యార్థినికి నీళ్లలో మత్తు మందు ఇచ్చి

Published Tue, Aug 27 2024 12:13 PM | Last Updated on Tue, Aug 27 2024 1:54 PM

Nursing Trainee Raped In Maharashtra Auto Driver Had Spiked Her Drink

ముంబై: మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్‌కతా ఘటన తరువాత ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు నమోదు కాగా.. తాజాగా మరో నర్సింగ్‌ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. 

మార్గమధ్యలో డ్రైవర్‌ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి  ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

చంపక్‌ గ్రౌండ్‌ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement