Ratnagiri
-
నీళ్లలో మత్తు మందు ఇచ్చి.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
ముంబై: మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్‌కతా ఘటన తరువాత ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు నమోదు కాగా.. తాజాగా మరో నర్సింగ్ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్‌ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.చంపక్ గ్రౌండ్ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు. -
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
తెగిన ఆనకట్ట..23 మంది మృతి!
సాక్షి, ముంబై : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిప్లున్ తాలుకాలోని తెవరీ ఆనకట్ట తెగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 23 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. తెవరీ ఆనకట్టకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉండగా, మంగళవారం రాత్రి తెగిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆనకట్ట కింద ఉన్న ఏడు గ్రామాల్లో వరదలాంటి పరిస్థితి ఏర్పడింది. 12 ఇళ్లు కొట్టుకుపోయాయి. రత్నగిరి అదనపు ఎప్పీ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు 11 మృతదేహాలను బయటకు తెచ్చాం. ఆయా గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాం’ అని చెప్పారు. మరణించిన వారి బంధువులకు ప్రభుత్వం రూ. 4 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వరద నీటి ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లు ముందే చెప్పినా పట్టించుకోలేదు: ఆనకట్టకు పగుళ్లు ఉన్నట్లు గతేడాది నవంబర్లోనే గుర్తించి జిల్లా అధికారులకు చెప్పి మరమ్మతులు చేయించమన్నామనీ, అయినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తివరే ఆనకట్ట చిప్లున్, దపోలీ తాలూకాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ ఆనకట్ట ఏ తాలూకా పరిధిలోకి వస్తుందనే విషయంపై వివాదం ఉండటంతో రెండు తాలూకాల అధికారులూ పట్టించుకోలేదని చనిపోయిన వ్యక్తి బంధువు ఒకరు చెప్పారు. మరో వ్యక్తి మాట్లాడుతూ ‘అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇలా జరిగింది. నా తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర వయసున్న బిడ్డ గల్లంతయ్యారు. నా సోదరుడు తన వాహనం తెచ్చుకోడానికి వెళ్లి తిరిగిరాలేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. గల్లంతైన వారి కోసం జాతీయ విపత్తు స్పందన దళం గాలింపు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఆనకట్టకు మరమ్మతులు చేయాల్సిందిగా తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆనకట్ట గోడలకు పగుళ్లు ఉన్నాయని అధికార యంత్రాంగానికి చెప్పామనీ, అయినా వారు ఏ చర్యలూ తీసుకోలేదని ప్రజాప్రతినిధులు నిందించారు. -
రత్నగిరి డ్యామ్‌కు గండి, ఆరుగురు మృతి
సాక్షి, ముంబై : ఆర్థిక రాజధాని ముంబయిని కుండపోత వర్షాలు వీడటం లేదు. గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంత అయ్యారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా రత్నగిరిలోని తివారీ డ్యామ్‌కు గండిపడింది. దీంతో సమీపంలోని ఏడు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ఆరుగురు మృతి చెందగా, 23మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి కాగా థానేలో ఓ హోటల్లో వరద నీరు చేరటంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. వరద నీరు ఒక్కసారిగా కిచెన్‌లోకి రావడంతో... ఫ్రిజ్‌నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్రిజ్ స్విచ్ ఆపేందుకు విద్యుత్ వైరును పట్టుకోవడంతో వీరేంద్ర దాస్ బనియా (27), రాజన్ దాస్ (19) మృతి చెందినట్లు థానే రూరల్ పోలీస్ అధికారి యువరాజ్ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రేపటి (గురువారం) వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. -
రత్నగిరి ప్రాజెక్టులోకి ‘అబుదాబి ఆయిల్’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో 44 బిలియన్ డాలర్లతో (రూ.3 లక్షల కోట్లు) 2025 నాటికి ఏర్పాటు చేస్తున్న 60 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన రిఫైనరీ, 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులో సౌదీ అరామ్కో నుంచి కొంత వాటా తీసు కునేం దుకు వాటా తీసుకునేందుకు అబు దాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనితో ప్రాజెక్టులో సౌదీ అరామ్కో, ఏడీఎన్‌వోసీ మొత్తంగా 50 శాతం వాటా తీసుకుంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత ఇంధన మార్కెట్, రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అవకాశంగా ఏడీఎన్‌వోసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన 50%వాటా ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పంచుకుంటాయి. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన విని యోగ మార్కెట్ భారత్‌లో సౌదీ అరేబియా, యూఏఈలకు ఇది వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడిగా సౌదీ అరామ్కో సీఈవో, ప్రెసిడెంట్ అమిన్ హెచ్ నాసర్ పేర్కొన్నారు. కాగా ప్రతిపాదిత ఉమ్మడి 50 శాతం వాటాలో ఎవరెంత కలిగి ఉండాలన్న దానిపై చర్చించాల్సి ఉందని నాసర్ తెలిపారు. -
అల్ఫొన్సో మామిడికి ఎండల ఎఫెక్ట్!
సాక్షి, ముంబై : ఈ సారి అల్ఫొన్సో మామిడి పళ్ల సరఫరా 30 నుంచి 60 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది కొంకణ్ రీజియన్‌లో జనవరిలో మామిడి పూత గణనీయంగా రాలిపోయింది. ఈ ప్రభావంతో పంట దిగుబడి తగ్గే అవకాశముందని మామిడి తోటల నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అలాగే మార్చి మధ్య కాలం నుంచి పండ్ల సరఫరా కొంతమేర పెరుగుతుందని తెలిపారు. ఎండలు మండుతుండటంతో మామిడి ఉత్పత్తిపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో అల్ఫొన్సో మామిడి ధరలు పెరగడంతో పాటు వినియోగదారుడికి దూరమయ్యే అవకాశం లేకపోలేదు. మండే ఎండలతో.. గత కొన్ని రోజుల నుంచి మామిడి పూత గణనీయంగా చెట్ల నుంచి రాలిపోతోంది. దీని ప్రభావం మార్చిలో నగరానికి ప్రవేశించే మామిడి పండ్లు, నాణ్యత, పరిమాణంపై పడనుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే రత్నగిరిలో 35 డిగ్రీల కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండలు మండిపోవడంతో మామిడి పండ్లు చిన్న దశలోనే చెట్ల నుంచి కిందకు రాలిపోతున్నాయి. అంతేకాకుండా హ్యుమిడిటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీని వల్ల మామిడి పండ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మామిడి ఉత్పత్తిదారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌కు మామిడి సప్లై తగ్గిందని.. ప్రస్తుతం తాము 4 నుంచి 5 పెట్టెలు మాత్రమే పొందుతున్నామని వ్యాపారులు అంటున్నారు. కాయలు రాలిపోతున్నాయి వేడి అధికంగా ఉండటంతో మామిడి కాయలు కూడా చెట్ల నుంచి గణనీయంగా కిందకు రాలుతున్నాయని రత్నగిరిలోని 700 ఎకరాల మామిడి తోట యజమాని మందర్ దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 10 తర్వాత మామిడి పండ్ల సరఫరా మామూలుగానే ఉంటుందన్నారు. పగలు వేడి, రాత్రి చల్లని గాలులతో వాతావరణం విరుద్ధంగా మారడంతో మామిడి కాయలు రాలుతున్నాయన్నారు. మధ్యాహ్న వేళలో వేడి తాపం అధికంగా ఉండటంతో పండు పక్వానికి రాకముందే మగ్గిపోతోందని వివరించారు. నల్ల మచ్చలతో పాడైపోతున్నాయి వేడికి మామాడి పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని దేవ్‌గఢ్ తాలూకా మ్యాంగో గ్రోవర్స్ కోఆపరేటివ్ సొసూటీ లిమిటెడ్ డైరెక్టర్ విద్యాధర్ జోషి అన్నారు. అకస్మాత్తుగా ఎండలు పెరిగిపోయి వేడి పెరగడంతో మామిడి పండ్లు త్వరగా పాడైపోతున్నాయన్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ముందుగానే సాధారణం కంటే అధికంగా పెరిగిపోయాయని వెల్లడించారు. -
తవ్వేకొద్దీ అవినీతి
రత్నగిరి వాటర్‌షెడ్‌లో అక్రమాలు ఎన్నెన్నో రూ.79 లక్షల అవినీతి జరిగిందని మొదట్లో ఫిర్యాదు ప్రాజెక్ట్ అధికారులపై క్రిమినల్ కేసులు..అరెస్ట్ మొత్తం రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు తాజాగా బహిర్గతం గుడ్డగుర్కి పంచాయతీలోనే రూ.1.67 కోట్ల అవినీతి అనంతపురం టౌన్ : రొళ్ల మండలంలోని రత్నగిరి మెగా వాటర్‌షెడ్‌లో తవ్వేకొద్దీ అవినీతి బయటపడుతోంది. సామాజిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి మొత్తం రూ.1.80 కోట్లు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి రికవరీ చేసేందుకు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం రూ.79 లక్షలు. తాజాగా ఈ ‘లెక్క’ మారింది. ఏకంగా రూ.2.02 కోట్లు దుర్వినియోగమైనట్లు డ్వామా అధికారులు రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. 2009–10 ఆర్థిక సంవత్సరంలో మొదటి బ్యాచ్ కింద రత్నగిరి మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీన్ని ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు కాల వ్యవధి ఏడేళ్లు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముగిసింది. ఈ ప్రాజెక్టు కింద రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీల్లో మైక్రో వాటర్‌షెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం రూ.10.52 కోట్లు ఖర్చు చేశారు. పనుల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. కూలీలతో చేయించాల్సిన ఫారంపాండ్లను యంత్రాలతో తవ్వించారు. చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు దిగమించారు. పండ్లతోటల పెంపకం చేపట్టకుండానే నిధులు స్వాహా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటర్‌షెడ్ కమిటీల ముసుగులో తెలుగు తమ్ముళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఇందుకు అధికారులు సైతం ‘మామూలు’గా సహకరించారు. 2014–16 మధ్యకాలంలో ప్రాజెక్టు పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి. గుడ్డగుర్కి పంచాయతీలో రూ.60 లక్షలు, రత్నగిరి రూ.60 లక్షలు, దొడ్డేరి రూ.30 లక్షలు, కాకి పంచాయతీలో రూ.30 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. దీనిపై నివేదిక అప్పటి కలెక్టర్ కోన శశిధర్ వద్దకు చేరగా ఆయన సీరియస్‌గా పరిగణించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ప్రాజెక్ట్ ఆఫీసర్ బదరీష్, ఏపీఓ లక్ష్మణమూర్తి, వాటర్‌షెడ్ సిబ్బంది మహాలింగప్ప, బాలాజీ, నరసింహమూర్తిపై రొళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. రూ.1.80 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో తేలినా.. ఫిర్యాదులో మాత్రం రూ.79 లక్షలు పేర్కొన్నారు. అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చాక నిందితులు పరారయ్యారు. వారిని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. తాజాగా రూ.2.2 కోట్లు.. రత్నగిరి వాటర్‌షెడ్ పరిధిలో అవినీతిపై సమగ్ర విచారణ చేస్తే పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం వెలుగులోకి వస్తుందని పేర్కొంటూ ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాంలు, చెక్‌డ్యాం మరమ్మతులు, టీడీపీ నేతలు చేపట్టిన పనులపై ఇచ్చిన ఈ కథనాలు సంచలనం సృష్టించాయి. నిందితులను కాపాడేందుకు జరుగుతున్న లోగుట్టు వ్యవహారాన్ని కూడా ఎత్తిచూపింది. ఇందుకు స్పందించిన అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ఏకంగా సదరు సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే 2014–15 బ్యాచ్ కింద ‘ఫోర్డ్’ సంస్థకు అగళి మండలంలో మంజూరైన ‘రావుడి’ వాటర్‌షెడ్ ప్రాజెక్టును రద్దు చేసి మడకశిర డబ్ల్యూసీసీ (వాటర్‌షెడ్ కంప్యూటర్ సెంటర్)కు బదలాయించారు. ఈ నేపథ్యంలోనే ‘రత్నగిరి’ అక్రమాలపై ఇంటెలిజెన్స్ సైతం దృష్టి పెట్టింది. కలెక్టర్ ప్రత్యేకంగా విచారణ చేయించారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం అవినీతి ‘లెక్క’ను పెంచారు. గతంలో రూ.79 లక్షలు దుర్వినియోగమైనట్లు పేర్కొన్న అధికారులు దానికి మరింత జోడించి రూ.2.02 కోట్ల అవినీతి జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రత్నగిరి మైక్రో వాటర్‌షెడ్‌లో రూ.68,683, కాకిలో రూ.20,28,407, దొడ్డేరిలో రూ.14,06,186, గుడ్డగుర్కిలో రూ.1,67,31,170 దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా రూ.2,02,34,446 దుర్వినియోగమైందని తేల్చారు. -
విజయనగరం భక్తులకు సత్యదేవుని ‘దివ్యదర్శనం ’
అన్నవరం: హిందూ నిరుపేద భక్తులను ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లి ఆయా దేవతామూర్తుల దర్శనం చేయించి స్వగృహాలకు చేర్చే ‘దివ్యదర్శనం’ పథకం రెండు నెలలుగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకంలో ఐదో విడతగా విజయనగరం జిల్లాకు చెందిన 200 మంది భక్తులు మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకొని పూజలు చేశారు. నాలుగు బస్సులలో వీరు సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుని ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు వారికి సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేదపండితులు వారికి వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు విజయవాడ వెళ్లారు. -
కూల్.. కూల్‌గా..
రత్నగిరి భక్తులకు ఎండ నుంచి రక్షణ ఆలయప్రాంగణం, వ్రతమండపాలవద్ద కూల్ పెయింట్ అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలో కాళ్లు కాలుతుండగా పరుగంటి నడక కష్టాలు తొలగాయి. వారికి ఎండ నుంచి రక్షణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఎండదెబ్బతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం ‘సాక్షి’ లో‘ ‘వేడి’ంపులు’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. దానికి స్పందించిన ఈఓ కె. నాగేశ్వరరావు ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, పార్కింగ్ స్థలం వద్ద కూల్ పెయింట్ వేయించారు. దేవస్థానం డీఈఈ రామకృష్ణ ఈ పనులను పర్యవేక్షించారు. ఆలయప్రాంగణం, రథంపాత్, ఇతర ప్రదేశాలలో వారం రోజుల్లో షామియానాలు వేయిస్తామని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకూ వేసవిలో చలువపందిర్లు వేస్తున్నారని, వాటిని వేసవి అనంతరం తొలగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అలా కాకుండా శాశ్వతప్రాతిపదికన ఇనుపగొట్టాలు పాతి అవసరమైనప్పుడు ఆ గొట్టాల ఆ«ధారంగా షామియానాలు వేసుకొని, అవసరం తీరాక ఆ గొట్టాలను తీసి భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
రత్నగిరిపై మొదలైన పెళ్లిసందడి
సత్యదేవుని సన్నిధిలో 40 వివాహాలు స్వామివారిని దర్శించిన 15వేల మంది భక్తులు ఆదాయం రూ.15 లక్షలు అన్నవరం: రెండు నెలల విరామం అనంతరం రత్నగిరిపై వివాహాల సందడి నెలకొంది. మాఘమాసం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముహూర్తాలలో సుమారు 40 వివాహాలు జరిగాయి. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా వివాహాలు చేసుకున్న పెళ్లి బృందాల వారు కూడా నవదంపతులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిస్తున్నారు. ఈ నెలలో ఐదో తేదీ, తొమ్మిదో తేదీ, 13, 15, 16, 18 తేదీల్లో వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు తెలిపారు. సత్యదేవుని దర్శించిన 15 వేల మంది భక్తులు రత్నగిరికి భక్తులతోపాటు వివాహ బృందాల రాక కూడా పెరిగింది. దీనికి తోడు శుక్రవారం రథ సప్తమి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించి పూజలు చేశారు. ప్రతీ వ్రతమండపంలోను నవదంపతులు వ్రతాలాచరించడంతో మండపాలకే కళ వచ్చింది. సత్యదేవుని దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,622 జరుగగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.15 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
రత్నగిరిపై ఆయుష్ హోమం ప్రారంభం
ఈవో, ఛైర్మన్లు ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి అన్నవరం(తొండంగి) : కంచికామకోటి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనల మేరకు రత్నగిరిపై తలపెట్టిన ఆయుష్ హోమం కార్యక్రమం శనివారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానంపై ప్రధానాలయం సమీపంలోని దర్బారు మండపంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక ఆశీనులను చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణతో ఆయుష్ హోమం కార్యక్రమాన్ని రుత్వికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ట్రస్టుబోర్డు ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్ ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయుష్ హోమం పూజల్లో పాల్గొన్నారు. ఘనంగా గోపూజ మహోత్సవం... రత్నగిరి కొండపై శనివారం దేవాదాయ ధర్మాదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు రాజగోపురం సమీపాన ఉన్న శ్రీగోకులం వద్ద ఈ కార్యక్రమాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్‌లు ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి మార్గశిర మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి అధిక సంఖ్యలో వివాహాలు జరగడంతో రత్నగిరిపై శనివారం నూతన దంపతులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూతన జంటలు సత్యదేవుని వ్రతం ఆచరించారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
మూడు రోజుల్లో 50 వేలమంది రాక దేవస్థానానికి రూ.40 లక్షల రాబడి అన్నవరం : సత్యదేవుని సన్నిధికి గత మూడు రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణంగా భాద్రపదమాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు కనుక భక్తులు పెద్దగా ఆలయానికి రారు. అయితే ఈసారి వరుసగా సెలవులు రావడం, దానికి తోడు ఆదివారం, సోమవారం దశమి, ఏకాదశి కలిసి రావడంతో స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో స్వామివారి ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు భక్తులతో నిండిపోయాయి. శని, ఆది, సోమవారాల్లో సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, దేవస్థానానికి సుమారు రూ.40 లక్షల ఆదాయం లభించింది. వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. ఈ మూడు రోజులూ తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయానికి రావడం ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి రద్దీ పెరిగింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో భక్తులు రత్నగిరిపై ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
తీరానికి కొట్టుకొస్తే.. సముద్రంలోకి లాక్కెళ్లారు!
మహారాష్ట్రలో తీరానికి కొట్టుకొచ్చి అల్లాడుతున్న ఓ భారీ తిమింగళాన్ని (బ్లూ వేల్) అటవీశాఖ అధికారులు కాపాడారు. 47 అడుగుల పొడవు, 20 టన్నుల బరువు ఉన్న ఈ తిమింగళం రెండురోజుల కిందట రత్నగిరి జిల్లాలోని మద్బన్ గ్రామ సమీపంలోని తీరానికి కొట్టుకువచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్షీరదమైన తిమింగళం తీరంలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం రెండు బోట్లలో 50మంది సహాయంతో ఈ భారీ జలచరాన్ని తిరిగి మహాసముద్రంలో విడిచిపెట్టారు. తిమింగళాన్ని భారీ తాళ్లతో కట్టి.. కెరటాల పోటు అధికంగా ఉన్నా అతికష్టం మీద దానిని నడి సముద్రంలోకి లాక్కెళ్లి వదిలేశారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులకు స్థానిక మత్స్యకారులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయం అందించారు. 'నలుగురు అటవీశాఖ అధికారులు ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. స్థానిక మత్స్యకారులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయంతో ఆదివారం మధ్యాహ్నం కల్లా తిమింగళాన్ని నడిసముద్రంలో విడిచిపెట్టాం' అని మహారాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఎన్ వాసుదేవన్ తెలిపారు. #BlueWhale was rescued by two boats that pulled mammal back to deep waters. 50 ppl involved in rescue ops pic.twitter.com/CjzBisPHnP — Badri Chatterjee (@ChatterjeeBadri) September 11, 2016 -
గోమాతా! నమోస్తుతే!
రత్నగిరిపై ఘనంగా గోపూజా మహోత్సవం అన్నవరం : కృష్ణాష్టమి సందర్భంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుని ఆలయప్రాంగణంలో సామూహిక గోపూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో దేవస్థానంలోని రామాలయం ఎదురుగా గల ఆలయప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని గోవులను పూజించారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్ద గల కళావేదిక వద్దకు తీసుకువచ్చారు. పండితులు స్వామి, అమ్మవార్లకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం గోశాల, రత్నగిరి సప్తగోకులం నుంచి తెచ్చి 25 గోవులను పూజించారు. గోవులో లక్ష్మీ,గౌరీ,సరస్వతీ మాతలు కొలువై ఉంటారని, మూడుకోట్ల దేవతలు. చతుర్దశ పురాణాలు నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పంచామృతాల్లో గోక్షీరం, నెయ్యి, పెరుగు గోవు నుంచి వచ్చేవేనని, వీటితో బాటు గోమూత్రం, గోమయం విశేష ప్రాధాన్యత కల్గినవని తెలిపారు. యజ్ఞ, యాగాదుల్లో గోవు నుంచి వచ్చే ఈ ఐదింటిని తప్పక ఉపయోగిస్తారని తెలిపారు. గోధూళి సైతం పవిత్రమైనదని వివరించారు. వ్యవసాయంలో కూడా గోవుకున్న ప్రాధాన్యత గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారన్నారు. పండితులు గోవు శరీరంలోని ఏ భాగంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడో వివరిస్తూ గోవులకు ఈఓ నాగేశ్వరరావు దంపతులతో, భక్తులతో పూజలు చేయించారు. అనంతరం వేదపండితులు గోమాతలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. బియ్యం, బెల్లం, ఆవుపాలతో చేసిన క్షీరాన్నాన్ని తినిపించారు. తరువాత ఆ క్షీరాన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. నేడు రత్నగిరిపై సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజ శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని నిత్యకల్యాణ మండపం, దాని పక్కనే గల వాయవ్య, నైరుతీ మండపాలలో సామూహిక ఉచిత వరలక్ష్మీ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ గురువారం విలేకర్లకు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి పూజలు ప్రారంభిస్తారని, 9 గంటలకే మహిళలు మండపాల వద్దకు చేరుకోవాలని సూచించారు. వచ్చిన వాళ్లందరితో పూజలు చేయిస్తారన్నారు. రెండు వేల మందికి పైగా పూజలాచరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాల్గొనే మహిళలు కొబ్బరికాయ, అరటిపళ్లు, రాగి లేదా ఇత్తడి చెంబు, పూలు, గాజులు తెచ్చుకోవాలని తెలిపారు. పూజకు అవసరమయ్యే పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, జాకెట్టుముక్క, అమ్మవారి రూపు, తోరం దేవస్థానం అందచేస్తుందని తెలిపారు. పూజలనంతరం మహిళలకు, వారితో వచ్చిన వారికి స్వామివారి దర్శనం, ఉచిత భోజనసౌకర్యం కల్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ దేవస్థానంలో వరుణ జపాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి హైదరాబాద్‌కు చెందిన వైవీ రామారావు దంపతులు రూ.1,00,116 విరాళాన్ని ఈఓ నాగేశ్వరరావుకు గురువారం అందచేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా జూన్ 11న వైవీ రామారావు, వి.భవానిల పేరుతో అన్నదానం చేయమని కోరినట్లు అధికారులు తెలిపారు. -
వనదుర్గకు ఘనంగా పూజలు
తొలిరోజు లక్ష్మీదేవిగా అలంకరణ రత్నగిరిపై 18 వరకూ శ్రావణ సందడి చండీహోమానికి అంకురార్పణ అన్నవరం : రత్నగిరిపై వనదుర్గ అమ్మవారి శ్రావణమాస పూజలు శ్రావణ శుద్ధ దశమి శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు మంగళవాయిద్యాల నడుమ విఘ్నేశ్వరపూజతో పండితులు కార్యక్రమాలు ప్రారంభించారు. తొలిరోజున నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణలు, 33 కోట్ల అధిపతులకు ఆహ్వానాలు, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, లక్ష్మీగణపతి హోమాలు, శివపంచాక్షరి జపాలు, శ్రీసూక్త, పురుషసూక్త పారాయణలు, లింగార్చన, బాల, కుమారీ, సువాసినీ పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు దంపతులు కార్యక్రమానికి విచ్చేసి రుత్విక్కులకు వరుణలు ఇచ్చి పూజాసామగ్రి సమర్పించారు. 44 మంది రుత్విక్కులు, అర్చకస్వాములు, పండితులకు వారు దీక్షా వస్త్రాలను అందచేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకులు కృష్ణమోహన్, వ్రత పురోహితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలిరోజున లక్ష్మీదేవిగా.. తొలిరోజు అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో అలంకరించి పూజించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించిన రుత్విక్కులు పూజలనంతరం వేదస్వస్తి పలికారు. మధ్యాహ్నం అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. చండీహోమం ప్రారంభించారు. అర్చన, హోమాలనంతరం నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు నిర్వహించారు. ఏఈఓ వైఎస్ఆర్ మూర్తి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈనెల 18న జరిగే పూర్ణాహుతితో పూజలు ముగుస్తాయి. రుత్విక్కులకు చిరిగిన దీక్షావస్త్రాలు : సరఫరాదారునిపై ఈఓ ఆగ్రహం ఈఓ పంపిణీ చేసిన దీక్షావస్త్రాలలో కొన్ని చిరిగిపోయి ఉండడంతో వాటిని ధరించిన రుత్విక్కులు అసంతృప్తి వ్య క్తం చేశారు. ఈ పంచెలను తునిలోని ఒక వస్త్రదుకాణం నుంచి కొనుగోలు చేశారు. చిరిగిన పంచెలను ఈఓ పరిశీలించి కొత్తవి ఇవ్వాలని వస్త్రదుకాణానికి కబురు చేయమని ఆదేశించారు. -
అంత్యపుష్కరాలకు రత్నగిరిపై ఏర్పాట్లు
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దర్శనాలు భక్తుల రాక పెరిగితే దర్శనం వేళలు పెంచే యోచన: ఈఓ అన్నవరం : ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి అంత్య పుష్కరాలకు అన్నవరం దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన సాక్షి తో మాట్లాడుతూ ఆది పుష్కరాలతో పోల్చితే అంత్య పుష్కరాలలో దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుందని గత అనుభవాల ద్వారా తెలిస్తోందన్నారు. అందువలన సత్యదేవుని ఆలయంలో స్వామివారి దర్శన వేళల్లో కాని, వ్రతాలు, నిత్య కల్యాణం విషయంలో కానీ పెద్దగా మార్పులు చేయడం లేదన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు, వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనాలు రాత్రి తొమ్మిది గంటల వరకూ, వ్రతాల నిర్వహణ సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటుందన్నారు. కొండమీద ఉదయం నుంచి రాత్రి వరకూ, కొండదిగువన 24 గంటలూ ప్రసాదాల విక్రయానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక వేళ భక్తుల రాక అధికంగా ఉంటే స్వామివారి వ్రతాలు, దర్శనం, ప్రసాదం విక్రయాల వేళలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. -
కసితో రగిలిపోతోన్న స్నేక్ బాయ్
ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో వాళ్లాంతా కుదురుగా కూర్చుని కాఫీ సేవిస్తున్నారు. ఒక్కడు మాత్రం విచిత్ర భంగిమలో తాగుతున్నాడు. కాఫీ తాగేసి బయటికి రావడమే ఆలస్యం.. చుట్టుపక్కలవారంతా ఆ బాలుడి చుట్టూచేరి.. 'వెయ్ రా.. ఒక్కటి వెయ్ రా..' అని ప్రేమగా అడుగుతారు. ఆ ఉత్సాహంలో వాడొక ఆసనం వేసి అందర్నీ ఆనందింపజేస్తాడు. వీడి పేరు స్నేక్ బాయ్. అసలు పేరు ఆదిత్య కుమార్ జంగం కంటే 'స్నేక్ బాయ్'గానే ఫేమస్ అయిన ఈ కుర్రాడిది మహారాష్ట్రలోని రత్నగిరి. 13 ఏళ్ల ఆదిత్య కాంటోర్షియన్(శరీరాన్ని వంకరతిప్పే కళ)లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దుస్సాధ్యమైన భంగిమలతో స్థానికుల మతిపోగొడుతున్నాడు. గత ఎనిమిదేళ్లుగా కోచ్ మంగేశ్ కోప్కర్ శిక్షణలో అంతకంతకూ రాణిస్తున్నాడు. లోకల్ గా పాపులారిటీ సంపాదించాడుకానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనవాణ్ని గుర్తించినవారేలేరు. అందుకే త్వరలోనే ఓ అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలని కసిగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ టు స్నేక్ బాయ్ ఆదిత్య. -
చిరంజీవి 150వ సినిమా విజయం సాధించాలని..
సత్యదేవునికి కోడలు ఉపాసన పూజలు అన్నవరం : ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదల మూవీస్ పతాకంపై ప్రారంభమైన మెగాస్టార్ 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ ఘన విజయం సాధించాలని కోరుతూ చిరంజీవి కోడలు, ఆ సినిమా నిర్మాత, హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన శనివారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. కొద్దిమంది అభిమానులతో ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంవద్ద ఆమెకు పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవునికి ఉపాసన ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అనివేటి మండపంలో పండితులు ఆమెకు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట దేవస్థానం ఉద్యోగి గంటా విష్ణు, చిరంజీవి అభిమాని కత్తిపూడి బాబీ తదితరులున్నారు. -
రత్నగిరివాసునికి ‘లక్ష్మీ’కటాక్షం
2015-16లో సత్యదేవునికి రూ.118.95 కోట్ల ఆదాయం గత ఏడాదికంటే రూ.26 కోట్లు అధికం వ్రతాల ద్వారా ఎక్కువ రాబడి ప్రసాదం, హుండీలది తరువాతి స్థానం అన్నవరం : రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని సన్నిధి లక్ష్మీకటాక్షంతో అలరారుతోంది. స్వామివారి ఆదాయం ఏటేటా పెరగడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తొలిసారిగా సత్యదేవుని ఆదాయం రూ.వంద కోట్ల మార్కును దాటి.. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.118.95 కోట్లుగా నమోదైంది. పదేళ్ల కిందటి వరకూ వార్షికాదాయం రూ.25 కోట్లు మాత్రమే ఉండగా.. చూస్తూండగానే రూ.వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. రూ.26 కోట్ల పెరుగుదలతో 28 శాతం వృద్ధి అన్నవరం దేవస్థానానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో కె.నాగేశ్వరరావు మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. దీని ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరంలో స్వామివారికి రూ.118.95 కోట్ల ఆదాయం వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ.92.92 కోట్లతో పోల్చితే.. ఈ ఏడాది రూ.26 కోట్ల పెరుగుదలతో 28 శాతం వృద్ధి నమోదైందని ఈఓ తెలిపారు. 2013-14లో రూ.72 కోట్లు మాత్రమే ఉన్న ఆదాయం.. 2015-16 నాటికి సుమారు 60 శాతం పెరుగుదలతో రూ.118.95 కోట్లకు చేరింది. 2016-17లో రూ.135 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుత వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.140 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు. ఆపరేషనల్ ఆదాయం రూ.82.55 కోట్లు దేవస్థానంలోని వివిధ షాపుల లీజులు, తలనీలాల విక్రయం, టోల్గేట్ వసూళ్లు, సత్రాల అద్దెలు, హుండీల ఆదాయం, ప్రసాదాల విక్రయం, వ్రతాలు, అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలు, కేశఖండన ద్వారా ఆదాయం, ట్రాన్స్‌పోర్టు, డిపాజిట్ల మీద వడ్డీలు తదితర పద్దుల ద్వారా దేవస్థానానికి రూ.82.55 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిని ఆపరేషనల్ ఆదాయంగా పేర్కొంటున్నారు. కేపిటల్ ఆదాయం రూ.36.40 కోట్లు కేపిటల్ ఆదాయంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, భూ సమీకరణ ద్వారా ఆదాయం, ఇతర డిపాజిట్లు, వివిధ స్కీముల కింద విరాళాలు తదితర పద్దుల కింద వచ్చిన మొత్తం రూ.36.40 కోట్లుగా పేర్కొన్నారు. తగ్గుతున్న వ్రతాల ఆదాయం సత్యదేవుని ఆలయంలో ప్రధాన క్రతువు అయిన వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయం తగ్గుతోంది. వ్రతపురోహితుల వ్యవహారశైలి మీద తరచూ వస్తున్న విమర్శల ప్రభావమో లేక ఇతర కారణమో తెలియదు కానీ వ్రతాల ఆదాయం మాత్రం ఆశించినంతగా రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో వ్రతాల ఆదాయం రూ.19.19 కోట్లు రాగా, 2015-16లో ఆదాయం రూ.21.75 కోట్లు వచ్చింది. వాస్తవానికి రూ.2.50 కోట్లు పెరుగుదల కనిపిస్తున్నా 2015 జనవరి నుంచి వ్రతాల టిక్కెట్లు 33 శాతం పెరిగాయి. ఇందువల్లనే ఈ పెరుగుదల నమోదైంది తప్ప వ్రతాలు పెరగడంవల్ల కాదు. దీనిపై అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది. అంతరాలయం టిక్కెట్లతో కనకవర్షం సత్యదేవుని అంతరాలయంలోకి వెళ్లేందుకు స్పెషల్ దర్శనం పేరుతో విక్రయిస్తున్న రూ.100 టిక్కెట్లు దేవస్థానానికి కనకవర్షం కురిపిస్తున్నాయి. 2014-15లో ఈ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.95 కోట్లు రాగా 2015-16లో అది రూ.5.02 కోట్లకు పెరిగింది. ఆశించినట్టుగానేఆదాయం 2015-16లో ఆశించినట్టుగానే దేవస్థానానికి ఆదాయం సమకూరింది. వ్రతాల ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నించాల్సి ఉంది. 2016-17లో రూ.135 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాం. దీనిని రాబట్టేందుకు సిబ్బంది, పురోహితులు సమష్టిగా కృషి చేయాలి. భక్తులతో అందరూ స్నేహభావంతో మెలగాలి. వారికి ఏ ఇబ్బందీ కలగకుండా సేవలందించాలి. - కె.నాగేశ్వరరావు, ఈవో, అన్నవరం దేవస్థానం -
అన్నవరానికి మచ్చ తెచ్చిన అపచారం
అన్నవరం : సత్యదేవుని సాక్షిగా వధూవరులు ఒక్కటైతే వారి కాపురం కలకాలం చల్లగా ఉంటుందన్న నమ్మకంతో రత్నగిరిపై వందేళ్లుగా వివాహాలు జరుపుకుంటున్నారు. ఆడంబరాలకు పోతున్న కొంత మంది ధనవంతులు వివాహాల్లో తమ స్టేటస్‌ను ప్రదర్శించుకొనేందుకు స్వామివారి సన్నిధిలోనే అపచారాలకు పాల్పడుతున్నారు. దానికి శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహ వేడుకల్లో ప్రదర్శించిన అశ్లీల నృత్యాలే సాక్ష్యం. రత్నగిరిపై ఏటా ఐదు వేల వివాహాలు అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదువేల వివాహాలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు వేల వరకూ పేదలు, మధ్యతరగతికి చెందిన వారివే. మిగిలిన వేయి వివాహాలలో మహా అయితే 50 వరకూ ధనవంతులు, రాజకీయ, ఇతర ప్రముఖులవి ఉంటాయి. ప్రముఖమైన వివాహ ముహూర్తంలోనే వీరు ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్‌హెడ్స్‌పై గదుల కోసం దేవస్థానం అధికారులకు సిఫార్స్ చేయిస్తారు. వీఐపీ సత్రంలో సగానికి పైగా గదులు వీరే ఆక్రమిస్తుంటారు. సత్యగిరి ఖాళీ స్థలంలో ఖరీదైన వివాహాలు మూడేళ్ల క్రితం సత్యగిరిపై హరిహరసదన్ సత్రం ప్రారంభం కావడంతో ఆ సత్రం ఎదురుగా గల ఎకరం విస్తీర్ణంలోని స్థలంలో ధనవంతులు వివాహాలను నిర్వహించుకుంటున్నారు. 125 గదులున్న హరిహరసదన్ సత్రంలో 50 గదులు రిజర్వ్ చేసుకుని ఆ స్థలంలో వివాహం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి అద్దె రూ.20 వేలు, సత్రం గదులకు మరో రూ.50 వేలు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. రూ. పది లక్షల నుంచి 30 లక్షల వరకూ వివాహానికి ఖర్చు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్స్‌ను తలపించే సెట్టింగ్స్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, హోరెత్తించే మ్యూజిక్, ఆర్కెస్ట్రా సంగీతానికి డ్యాన్స్‌లు చేసే డ్యాన్సర్లను కూడా తీసుకువచ్చి ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చి భక్తులకు నిద్ర కరువు చేస్తున్నారు. ఈ వేడుకల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను సత్యగిరి ఆవరణలోనే పారేస్తున్నారు. సెక్యూరిటీ తక్కువ దేవస్థానంలో సుమారు 150 మంది వరకూ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ సత్యగిరిపై ఉండేది కేవలం ఇద్దరే. ఈ వివాహాలకు ప్రముఖులు హాజరవుతుండడంతో నిర్వాహకులను ఎవరూ ఏమనలేని పరిస్థితి నెలకొంది. శనివారం జరిగిన వివాహ వేడుకల్లో.. శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేసి అపచారం చేశారని మాత్రమే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. ఖాళీ ప్రదేశాలలో వివాహాలకు అనుమతించం : ఈఓ సత్యగిరిపై ఖాళీ స్థలాలలో వివాహాలు చేసుకోవడానికి ఇకపై అనుమతించబోమని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 25న ఒక వివాహానికి ఆ స్ధలం రిజర్వ్ చేశారని. దాన్ని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. శనివారం రాత్రి జరిగి వివాహ వేడుకలో అశ్లీల నృత్యాలు చేయకుండా ఎందుకు నిరోధించలేదని సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా తమ మాట నిర్వాహకులు వినిపించుకోలేదని చెబుతున్నారన్నారు. అయినప్పటికీ వారి నిర్లక్ష్యం కారణమని భావించి హరిహరసదన్ గుమస్తా ఎన్. గోవింద్, సెక్యూరిటీ గార్డు బహుదూర్‌ను సస్పెండ్ చేశామన్నారు. -
రాహుల్‌గాంధీకి మరో షాక్!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ. 3,650 కోట్లతో ఏర్పాటుచేయనున్న పేపర్ మిల్‌పై కేంద్ర క్యాబినెట్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మొదట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియోజకవర్గమైన అమేథిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని భావించారు. కానీ శివసేన డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్టును మహారాష్ట్రకు తరలించారు. ఈ ప్రాజెక్టు విషయమై కేంద్ర ఆర్థికశాఖతోపాటు వివిధ మంత్రిత్వశాఖలకు లేఖలు రాశామని, వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనలు పెడతామని భారీ పరిశ్రమల శాఖమంత్రి, శివసేన ఎంపీ అనంత్ గీతె తెలిపారు. ఈ పేపర్ మిల్లు ఏర్పాటుద్వారా స్థానికంగా 900 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దీని ఏర్పాటును ముమ్మరం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి తరలించిన మరో ప్రాజెక్టు ఇది కావడం గమనార్హం. గతంలో యూపీఏ ప్రభుత్వం అమేథిలోని జగదీశ్‌పూర్‌లో ప్రతిపాదించిన శక్తిమాన్ మెగాఫుడ్ పార్క్ ఏర్పాటును ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. యూపీఏ హయాంలో పెట్రోలియం శాఖ ఈ ప్రాజెక్టుకు సబ్సిడీపై గ్యాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేశాని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. వెనుకబడిన నియోజకవర్గమైన అమేథికి గత యూపీఏ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించినా ఏవీ ఆచరణరూపం దాల్చలేదు. -
రెండో రోజు 2,500 మందికే
అన్నవరం: ప్రభుత్వ పథకాల అమలు తీరుకు రత్నగిరిపై గురువారం ప్రారంభమైన ఐదువేల మందికి అన్నదానపథకం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. రెండో రోజున ఈ పథకం తగినంత మంది భక్తులు లేక 2,500 మందికే పరిమితమైపోయింది. ఉదయం 10.30 గంటలనుంచి భక్తులకు ఉచిత భోజనం కూపన్లు పంపిణీ చేశారు. దేవస్థానానికి వచ్చిన ప్రతీఒక్కరికీ ఈ కూపన్లు పంపిణీ చేసినప్పటికీ మధ్యాహ్నం 2,200 మాత్రమే భోజనాలు పెట్టారు. రాత్రికి మరో 300 మందికి భోజనాలు పెట్టారు. మొత్తం మీద 2,500 మందికి మాత్రమే భోజనాలు పెట్టారు. వీరిలో దేవస్థానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది 300 మంది ఉన్నారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన అన్నదానం పథకం అధికారులు రెండుపూటలూ కలిపి 2,500 మందికి మాత్రమే వంటలు చేయించారు. ఆషాఢమాసమంతా ఇలాగే ఉంటుందని, మంగళ, శుక్రవారాలలో, అమావాస్య వంటి తిథులలో 1500 మంది భక్తులు భోజనాలు చేయడమే కష్టమని అంటున్నారు. కాగా గురువారం పాత అన్నదానం హాలుతో బాటు కొత్త అన్నదానం హాలులో కూడా భక్తులకు భోజనాలు పెట్టారు. ఐదువేల మందికి భోజనం కొన్ని రోజుల్లోనే సాధ్యం ప్రతి రోజూ ఐదువేలమంది భక్తులకు అన్నదానం చేయడం సాధ్యం కాని పని అని దేవస్థానం అధికారులు అంటున్నారు. వైశాఖం, శ్రావణం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, మాఘ మాసాలలో, మిగిలిన నెలల్లో శని, ఆదివారాలు, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలలో మాత్రమే ఐదువేలమందికి భోజనం పెట్టేందుకు సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. భక్తులు రాకపోవడం వల్లే గురువారం 2,500 మంది భక్తులకు మాత్రమే భోజనం పెట్టినట్టు దేవస్థానం ఈఓ వేంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా ఉండగా అన్నదానపథకంలో భోజనాలు ఐదువేల మందికి విస్తరించినందున సిబ్బందిని కూడా పెంచారు. ఆలయ సూపరింటెండెంట్‌గా ఉన్న పెండ్యాల భాస్కర్‌ను అన్నదానం-2 సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయనతో బాటు మరో ఏడుగురు సిబ్బందిని కూడా నియమించారు. ఎస్టాబ్లిష్మెంట్ సూపరింటెండెంట్‌గా ఉన్న బలువు సత్యశ్రీనివాస్‌కు ఆలయ సూపరింటెండెంట్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. -
డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పలేకే...
బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు పలకలేకే కొన్ని సినిమాల్లో వేషాలను వదులుకున్నానని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తెలిపారు. సతీసమేతంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘సంప్రదాయం’తో అరంగేట్రం సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1996లో వచ్చిన సంప్రదాయం నా తొలి సినిమా. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నా మిమిక్రీ ప్రదర్శనను కృష్ణారెడ్డి, ఆ సినిమా నిర్మాత అచ్చిరెడ్డి చూశారు. వెంటనే ఆ సినిమాలో వేషం ఇచ్చారు. ఆ సినిమాకు నాకు ఇచ్చిన పారితోషకం రూ.70వేలు. అదే పదిలక్షలుగా ఫీల్ అయ్యాను. అగ్రహీరోలందరితోనూ నటించా మొత్తం 586 సినిమాలలో నటించాను. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, నితిన్...ఇలా అందరితోనూ నటించాను. సింహాద్రి, దిల్, సంప్రదాయం నాకు కమెడియన్‌గా మంచి పేరు తెచ్చాయి. చార్లీచాప్లిన్, రాజబాబు, బ్రహ్మనందం బాగా ఇష్టమైన హాస్యనటులు. ప్రస్తుతం నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు చిత్రం, అల్లరి నరేష్ లడ్డుబాబు, ఈ సత్తిబాబు దర్శకత్వంలో అల్లరినరేష్ నటిస్తున్న చిత్రం, నట్టికుమార్ దర్శకత్వంలో వస్తున్న యుద్ధం, చిరంజీవి మేనల్లుడు వరుణ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న రే చిత్రం, శివాజీ హీరోగా వస్తున్న చిత్రాలకు క మిట్ అయ్యా. ఆడపిల్లలను వేధించే వారిని, హింసించేవారిని కఠినంగా శిక్షించాలని సత్యదేవుడిని వేడుకున్నా. కాగా.. సత్యదేవుని ఆలయం వద్ద వేణుమాధవ్ దంపతులకు ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు ఘనంగా స్వాగతం పలికారు.