కసితో రగిలిపోతోన్న స్నేక్ బాయ్ | Known as 'Snake Boy', this is 13-year-old Aditya Kumar Jangum eyes on the Guinness World Records | Sakshi
Sakshi News home page

కసితో రగిలిపోతోన్న స్నేక్ బాయ్

Published Tue, Jun 21 2016 7:58 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Known as 'Snake Boy', this is 13-year-old Aditya Kumar Jangum eyes on the Guinness World Records

ఈ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో వాళ్లాంతా కుదురుగా కూర్చుని కాఫీ సేవిస్తున్నారు. ఒక్కడు మాత్రం విచిత్ర భంగిమలో తాగుతున్నాడు. కాఫీ తాగేసి బయటికి రావడమే ఆలస్యం.. చుట్టుపక్కలవారంతా ఆ బాలుడి చుట్టూచేరి.. 'వెయ్ రా.. ఒక్కటి వెయ్ రా..' అని ప్రేమగా అడుగుతారు. ఆ ఉత్సాహంలో వాడొక ఆసనం వేసి అందర్నీ ఆనందింపజేస్తాడు. వీడి పేరు స్నేక్ బాయ్. అసలు పేరు ఆదిత్య కుమార్ జంగం కంటే 'స్నేక్ బాయ్'గానే ఫేమస్ అయిన ఈ కుర్రాడిది మహారాష్ట్రలోని రత్నగిరి.

13 ఏళ్ల ఆదిత్య కాంటోర్షియన్(శరీరాన్ని వంకరతిప్పే కళ)లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దుస్సాధ్యమైన భంగిమలతో స్థానికుల మతిపోగొడుతున్నాడు. గత ఎనిమిదేళ్లుగా కోచ్ మంగేశ్ కోప్కర్ శిక్షణలో అంతకంతకూ రాణిస్తున్నాడు. లోకల్ గా పాపులారిటీ సంపాదించాడుకానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనవాణ్ని గుర్తించినవారేలేరు. అందుకే త్వరలోనే ఓ అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాలని కసిగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ టు స్నేక్ బాయ్ ఆదిత్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement