‘నా మేనకోడలిని కావాలని చంపలేదు’ | Crime News: Thane Missing Child Case Tragic End | Sakshi
Sakshi News home page

‘నా మేనకోడలిని కావాలని చంపలేదు’.. థానే మిస్సింగ్‌ కేసు విషాదాంతం

Published Fri, Nov 22 2024 10:29 AM | Last Updated on Fri, Nov 22 2024 10:41 AM

Crime News: Thane Missing Child Case Tragic End

ముంబై: మహారాష్ట్ర థానేలో దారుణం చోటు చేసుకుంది.  మేనమామతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి చనిపోగా.. ఆ మరణాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని కాల్చేశాడా వ్యక్తి. మిస్సింగ్‌ కాస్త విషాదంతంగా ఈ కేసు మారిన వివరాల్లోకి వెళ్తే..

థానే ఉల్లాస్‌నగర్‌లో ప్రేమ్‌నగర్‌ కాలనీకి చెందిన మూడేళ్ల బాలిక నవంబర్‌ 18వ తేదీ నుంచి కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. 

పోలీస్‌ ఇంటరాగేషన్‌లో ఆమె మేనమామ.. పొంతన లేని సమాధానాలిచ్చాడు. దీంతో తమ శైలిలో పోలీసులు విచారించగా.. అసలు విషయం చెప్పాడు.  కావాలని తాను తన మేనకోడలిని చంపలేదని కన్నీరు పెట్టుకున్నాడతను. 

మేనకోడలితో ఆడుకుంటున్న టైంలో.. సరదాగా ఆమెను చెంప దెబ్బ కొట్టాడట. ఆ దెబ్బకు కిచెన్‌ శ్లాబ్‌కు తగిలి ఆమె కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయిందట. ఆమె చనిపోవడంతో భయంతో  శవాన్ని కాల్చేసి.. ఊరికి దూరంగా పొదల్లో పడేసినట్లు చెప్పాడు. సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారంతో చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement